[11/12, 06:20] +91 73963 92086: *🧘♂️65 - శ్రీ రమణ మార్గము🧘♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర*
*15-మూడవ భాగం*
ఆత్మవిచారణ తప్పక ఆత్మసిద్ధి కలిగిస్తుందన్నారు, భగవాన్ చాలా నిశ్చయంగా. ఎందుకంటే, అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకునే వారికి, విచారమార్గం సూర్యోదయం వంటిది. సూర్యునికి అభి ముఖంగా తిరిగిన వారందరిపై ఆ కాంతి పడునట్లు, భగవాన్ సూచించిన మార్గాన నడిచే వారందరికీ, సాధన సిద్ధిస్తుంది.
విచారమార్గం అగ్నిజ్వాలై, విషపూరితమై పెరిగే ఆలోచనల్ని కాల్చేస్తుంది. ఈ సాధన ముఖ్యోద్దేశం - పై పై సంగతుల్ని,
విషయాల్ని తోసెయ్యడం. అవన్నీ మనోకల్పితం గనుక జ్ఞానమే మనల్ని విముక్తి పరుస్తుంది. మోక్షానికి జ్ఞాన మొక్కపే, సూటైన మార్గం. జ్ఞానమంటే, తనని తాను తెలుసుకుని తాదాత్మ్యం చెందటమే కాని, రాయివలె కావడం కాదు. శూన్యమగుటా కాదు.
ఈ సాధనామార్గం, అనాదిగా వున్నదే. కాని, భగవాన్ దీన్ని మరింత వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది అద్వైత సిద్ధాంతం మీద ఆధారపడివుంది. దీనికి నియమ నిబంధనలు లేవు. కాని వర్క్ షాపులో, వంటింట్లో, గుహలో, గుడిలో, అడవిలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ సాధన చేయవచ్చు. దీనికి దేశ, కాలాలతో పని లేదు. దీనికి ఏ భేదమూ లేదు. ఇది కేవలం జ్ఞానమార్గం. అసలు మనం ఏమై వున్నామో, ఆ చిద్వస్తువు మీద ఏకాగ్ర చిత్తంతో దృష్టి నిలపడం కాని, దానికి బదులు మనం ఆ చిద్వస్తువును విషయాలతో, వస్తువులతో, సంగతులతో రోజు రోజుకీ విధాల దట్టంగా చెత్త చేర్చి కప్పేస్తాం. అదీ, మన - మామూలు జీవితం. ఆ విధంగా కాలంలో కప్పబడిన చెత్త గుట్టనంతా తవ్వి బైట పోస్తే, ఆ చోట ఖాళీ ఏర్పడుతుంది. అదే చిదాకాశం. అదే మహాశూన్యం. అదే నిరామయం.
ఆ మహాశూన్యాన్ని నింపుతో అసలు సత్యం ప్రకాశిస్తుంది. అంటే, ఆ సత్యాన్ని ఎప్పుడో, ఎక్కడో దర్శించడం కాక, అప్పుడే, అక్కడే - అదీ నీలోనే దర్శించవచ్చు. “కాబట్టి ముందు నిన్ను నీవు తెలుసుకో," అంటారు భగవాన్. భగవాన్. ఎందుకంటే తనని తాను తెలుసుకున్నప్పుడే శాంతి, ఆనందం, అదే వాస్తవం.
ఈ సాధనా మార్గంలో కర్మ - భక్తి యోగ మార్గాలూ వున్నాయి. జ్ఞానియై విశ్వాత్మలో ఐక్యమౌతాడు. యోగియై, విశ్వతేజస్సును దర్శిస్తాడు. భక్తుడు నిష్కామ యోగియై, ఆనందంలో తన్మయత్వం పొందుతాడు. కాని, అజ్ఞానం వల్ల మనుష్యులు జ్ఞాన మార్గం వదలి భక్తిమార్గం, తాంత్రికమార్గం, యోగమార్గం తదితర మార్గాలు చేపడతారు.
'తన నుంచి మినహా బైట ప్రపంచం నుంచి సత్యాన్ని తెలుసుకోదలిస్తే, అది నిజమైన జ్ఞానం కాదు. మనిషికి ఆ ఆనందాన్ని ఇవ్వదు. తనని తాను తెలుసు కోకపోతే, భయాల్లో - బంధాల్లో, చిక్కుకుపోతాడు. భయాలకూ, కోర్కెలకూ కారణం దేహం; తాను దేహం అనే భావన. దేహమే అంతా అయినట్లు నమ్మకం. అదే మొదటి తప్పు. ముందు మనం ఆ తప్పుడు ఆలోచనా విధానం నుంచి తప్పుకోవాలి. లేకపోతే, దేహం వెంబడిస్తుంది. దేహం మినహా మరో ఆత్మకు ఆస్కారం లేదు అంటారు కొందరు. కాని, ఆ దేహం జాగ్రత్- స్వప్నావస్థల్లో మాత్రమే వుంది కాని, నిద్రావస్థల్లో లేదు. నిద్రావస్థలో దేహం లేకపోయినా, "నేను" వుంటుంది. ఆ “నేనే" ఆత్మ. కాబట్టి ఆలోచనల్ని మన ఆలోచనలు, భావాలు, భయాలు, బంధాలు, అభిప్రాయాలు, తలపులూ. - అన్నీ, అంతా తప్పుడు తడిక. మన తప్పు మనం తెలుసుకుని, దాన్ని బైటికి లాగడం మంచి పని. కాని, మనమతం, నమ్మకం, సాంప్రదాయం, మనం చేసే సాధనా, దాన్నీ తీసి బైట పారేయనీయక వాటిని ఇంకా ఇంకా పొడిగిస్తాయి. మనసును పాడు చేస్తాయి. అందుచేత తనను తాను తెలుసుకోవాలంటే ముందు తనని తాను నిరాకరించుకోవాలి. జ్ఞాపకాలకు ఆటస్థలమైన గతాన్ని పూర్తిగా ఊడ్చేయ్యాలి. అలాగే, ఏ అరమరికా లేకుండా తనకి తాను భక్తి, ప్రేమలతో అర్పించుకోవాలి.
నిరంతర సాధన వల్ల అహంకారం అదృశ్యమై, ఆత్మ మిగులుతుంది. ఆ ఆత్మను మరవడమే, మరణం. దాని స్మరణే స్పురణే జీవనం. అసలు సత్యం - "నేనున్నాను” అనేది. అదే “వుండటం”. ఆ వుండటమే, ఆ అనుభవమే, ఎరుక. ఆ ఎరుకే, ఆనందం. -
“జ్ఞానికి, యోగికి తేడా ఏమిటి?” అని ఒకరు భగవాన్ని ప్రశ్నించారు.
భగవాన్:- జ్ఞానే యోగి, నిజమైన భక్తుడు అంటుంది గీత. యోగం, కేవలం సాధన. ఆ సాధనలో జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం సిద్ధించాక, యోగం అవసరం లేదు. అన్ని రకాల సాధనలనూ “యోగం” అనే పిలుస్తారు. భక్తి - జ్ఞాన - కర్మ - అష్టాంగ మొదలైనవి ఆయా యోగాల పేర్లు. యోగమంటే, కలయిక. వియోగం వున్నప్పుడే, కలయిక సాధ్యం. మనిషి సహజంగా ఎప్పుడూ "నేను వియోగిని”అనే భ్రాంతిలో వుంటాడు. ఆ భ్రాంతి తొలగి పోవాలి. దాన్ని తొలగించే విధానాన్ని, యోగమంటారు, "ఉన్నది ఒక్కటే ఆత్మ” అని తెలుసుకున్నవానికి, సంయోగ, వియోగాలతో పని లేదు.
"ఏ యోగ విధానం మంచిది?" అని మరొకరు ప్రశ్నించారు.
భగవాన్ :- అది వ్యక్తి అభిరుచి మీద ఆధారపడి వుంటుంది. ఒకరికి ఒక పద్ధతి, ఒక తీరు ఒక విధానం సులభంగా వుంటే, మరొకరికి మరొక పద్ధతి సులువుగా వుంటుంది. అంతా, అన్నీ ఒక టే, సమానమే.
[11/12, 06:21] +91 73963 92086: జీవుడు జనన - మరణ వలయం నుంచి విముక్తుడు కావడానికి చేసే కర్మాచరణే, కర్మయోగం. అంతా దైవమే అయినా తాను పరబ్రహ్మ నుంచి విడిపడ్డాననే తపనతో, నిజమైన భక్తి - విశ్వాసాలతో, ప్రేమతో, తిరిగి ఆ దైవంలో కలవాలనే తాపత్రయంతో, వుండుటే భక్తియోగం. అజ్ఞానంలో పడి కొట్టుకునే జీవుడు కాంతి కోసం, విమోచనకోసం చేసేదే జ్ఞానయోగం. జీవుని స్వభావం విచారణ ద్వారా తెలుసుకోవడమే, మహాయోగం. అదే భగవాన్ మార్గం. అది “నే నెవడను?” అను విచారమార్గం.
జ్ఞాని ప్రార్ధిస్తారా ?’’ అని ఒకరు భగవాన్ని అడిగారు.
భగవాన్ :- జ్ఞానికి ప్రార్ధనేమిటి? దేని కోసం, ఎవరిని ప్రార్ధించడం? ఎందుకు ప్రార్ధించడం? ప్రార్ధించడానికి తన నుంచి ఏది మాత్రం విడిగా వుంది? తనకు భిన్నంగా వున్న దాన్ని దేన్నో ఉద్ధరించడానికా, ఆ ప్రార్ధన ? “నేను” అనే వ్యక్తిత్వం వున్నప్పుడే, ప్రార్ధన. ఆ భేదభావమే, అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్లనే “నేను నిస్సహాయుణ్ణి, అజ్ఞానిని” అనే భావం కలుగుతుంది.
దేవుడికి తన ధర్మం, తన బాధ్యత తెలుసు. మధ్య మన మధ్యవర్తిత్వం దేనికి? నిన్ను నువ్వు తెలుసు కుంటే చాలు !
జ్ఞానికి కోర్కెలు, సంకల్పాలు వుండవు. వున్నా అవి శుద్ధ సాత్వికాలు. అవి ఆయన్ని ఏమాత్రం అంటవు. మనం బాధలు పడుతున్నట్లు, జ్ఞాని బాధలు పడడు. ఎందుకంటే ఆయన మనసు ఆత్మానందంలో లీనమైవుంటుంది. అంటే, దేహబాధ ఆయనకు కలలో బాధ మాదిరిగా వుంటుంది. అంటే, బాధ, దేహంలో లేదు. అది మనసులో వుంది. వారి దృష్టిలో బాధ కూడా ఆత్మలో ఒక భాగం మాత్రమే. కొందరు జ్ఞానులు బాధపడుతున్నట్లు కనుపించవచ్చు. కొందరు సమాధిస్థితిలో వుండవచ్చు. కొందరు మరణించ డానికి ముందు, అదృశ్యం కావచ్చు. అంతమాత్రం చేత, వారి జ్ఞానంలో భిన్నత్వం వుందనుకోకూడదు.
జ్ఞాని, సిద్ధుల కోసం చూడడు. కాని, సిద్ధులు నీడలాగ వారి వెంటనంటి వుంటాయి. జ్ఞాని దేహధారుడై ఇతరులకు సిద్ధులు, మహిషులు చూపించుకోవచ్చు. కాని, ఆత్మలో ఐక్యమైతే, ఇంక సిద్దులేమిటి ? సిద్దులు ప్రారబ్ధ కర్మానుసారం ప్రాప్తిస్తాయి.
కరెంటు ఆపేసిన తర్వాత కూడా నెమ్మదిగా తిరిగే FAN కదలికతో పోల్చారు, జ్ఞాని ప్రారబ్ధకర్మను, భగవాన్. ఫాన్ గత తీవ్ర చలనం వల్ల, ఆపేసిన తర్వాత కూడా కొంతసేపు నెమ్మదిగా తిరిగి, తిరిగి ఆగుతుంది. కాని, దానికి కొత్త కదలికలు పుట్టవు. పాత కదలికలు క్రమంగా తగ్గడం తప్ప. ప్రారబ్దవశాత్తు తన శరీరంతో ఏఏ పనులు చేయవలసి వుంటే, ఆ పనులన్ని చేసిగాని, జ్ఞాని దేహం చాలించరు. దేహం వున్నంతవరకు, జ్ఞానికి ప్రారబ్ధం తప్పదు. ప్రారబ్దం అనుభవించవలసిందే! దానికి భగవాన్ జీవితమే సాక్షి. ఆయన దేహం ఎటువంటి యాతనలు పడ్డా, ఆయనేమీ చలించలేదు, గొడవపడ లేదు.
కట్టెల దుకాణానికి వెళ్ళి, కట్టెలు కొని, వాటిని నెత్తిన పెట్టుకుని, త్వరగా ఇంటికి వచ్చి, ఆ కట్టెల్ని విసిరి పారెయ్య గలిగినంత త్వరగా విసిరి పారెయ్యాలని చూసినట్లు, జ్ఞాని తన దేహాన్ని వీలైనంత త్వరగా విసిరిపారెయ్యాలని చూస్తాడు. కాని, జ్ఞానికి దేహ స్ఫురణ వుండదు.
సర్వభూత సమభావన కలవాడే జ్ఞాని. కాని "జ్ఞానిని సేవించుకుంటూ, వారి చుట్టూవుండే వ్యక్తులు, ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం పొందినవారని కొందరు భావిస్తారు. జ్ఞాని అట్లాంటి ప్రత్యేకత చూపితే, ఆయన జ్ఞాని ఎట్లా అవుతాడు? కొలనులో పద్మం వికసిస్తుంది. దాని అడుగున నత్తలు, కప్పలు పడివుంటాయి ఎక్కడి నుంచో తుమ్మెద వచ్చి, దాని మకరందాన్ని తాగిపోతుంది,” అన్నారు భగవాన్. జ్ఞాని సన్నిధే ముక్తి. అది అన్నింటి కన్నా గొప్ప సంగతి. అసత్యాన్ని, అసత్యంగా తెలుసుకోవడం, తాను ఏదీ కాకుండా “నేను”గా వుండటమే, జ్ఞానం.
జ్ఞానికి శాస్త్రాలతో పనిలేదు. అజ్జానికి వాటితో పనిలేదు. ఒక్క ముముక్షువులే శాస్త్రాల్ని తాకేది.
జ్ఞానికీ కలలు వస్తాయి. కాని, ఆ కలా, ఆ కల తర్వాత వాస్తవం కూడా ఒక కలేనని ఆయనకు తెలుసు. జ్ఞాని ప్రపంచాన్ని అసత్యమని, తనకంటే వేరని తలచడు. నీళ్ళతో నిండిన కుండల్ని ఆడవాళ్ళు నెత్తిన పెట్టుకుని, దృష్టి అంతా ఆ కుండల మీద కేంద్రీకరించి, అవి కింద పడిపోకుండా మాట్లాడుతూ నడుస్తారు. అలాగే జ్ఞానులు లోక వ్యవహారాల్లో వున్నా, వారి మనసు పరబ్రహ్మంలో లీనమై వుంటుంది. వారి లక్ష్యం చెదరదు.
జ్ఞానమంటే, సత్యసిద్ధి
సంపూర్ణ సత్యమే, ఈశ్వరుడు. సమష్టి అయిన రజస్సే, జీవుడు. సమష్టి అయిన తమస్సే, జగత్తు. ఆ మూడూ అసలు వున్న దానికి, ఆత్మకూ భిన్నం కాదు, వేరూ
కాదు అనే ఎరుకే జ్ఞానం. అటువంటి జ్ఞానం కలగదు. సాధనా ఫలితంగా పరిపక్వమైన సంపూర్ణంగా ప్రకాశిస్తుంది. అలా ఒక్కసారిగా మరల తొలగదు.
భగవంతుడు ఒక వ్యక్తేనా ? అని ఒకరు అడిగారు.
భగవాన్ :- అవును. ఆయనే, మొదటి వ్యక్తి “నేను”. అది ఎప్పుడూ నీ ముందు నువ్వు ప్రపంచ విషయాలకు భగవంతుడు తెరవెనక్కి పోతాడ విసర్జించి, ఆయన్నే అన్వేషిస్తే, పరమేశ్వరుడుగా నిలుస్తాడు ఆయనే, ఆత్మ.
వ్యక్తిగత దైవం అంటూ ఒకరు వున్నా అమెరికన్ భగవాన్ని అడిగారు.
భగవాన్ :- వున్నారు. వారే ఈశ్వరుడు.
అమెరికన్ :.
వారే వున్నారు.
(ఆశ్చర్యంతో) ఏమిటీ, కాళ్ళు చేతులు చెవులు - వగైరాతో వున్నారా ?
[11/12, 06:21] +91 73963 92086: భగవాన్ :- అవును, వున్నారు. నీకు అవయవాలు ఉన్నపుడు.. ఆయనకు ఎందుకు వుండకూడదు
అంతలో కోహెన్ అందుకుని, “దైవానికి మాదిరిగా అవయవాలు వున్నాయని పురాణా నవ్వుకున్నాను” అన్నారు. దానికి భగవాన్, "అటువంటి అవయవాలే నీకూ వున్నప్పుడు నిన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుకోలేదు ?" అన్నారు.
“నాకు దేవుణ్ణి చూపించేవారెవరు ?" అని ఒక హిందువు భగవాన్ని అడిగాడు.
భగవాన్ :- ఎవరి సహాయంతో ఇదంతా చూస్తున్నారో, వారే ఆ దైవాన్నీ చూపుతారు. మీ ఆత్మే, మీకు మార్గదర్శి. అదే దారి చూపుతుంది.
ఒకరోజున ఒక ముస్లిం భగవాన్ని సమీపించి, చాలా నిజాయితీగా, తెలుసుకోవాలనే దృష్టితో “భగవంతునికి రూపం వుందా ?” అని అడిగాడు.
భగవాన్ :_ “భగవంతునికి రూపం వుందని ఎవరన్నారు?” అని ఎదురు ప్రశ్న వేశారు.
ముస్లిం:- భగవంతుడు నిరాకారుడైతే, విగ్రహారాధన పొరపాటు కాదా ?
భగవాన్ :- భగవంతునికి రూపం వుందని ఎవరూ అనలేదు. మీకు రూపం వుందా ?
ముస్లిం :- లేకేం ? వుంది ! కాని, నేను దేవుణ్ణి కాను.
భగవాన్ :- అయితే మీరు రక్త మాంసాదులతో కూడిన మనిషన్న మాట ? అందంగా దుస్తులు ధరించిన ఎముకలగూడు అన్నమాట ?
ముస్లిం :- అవును. ఈ దేహాకారంలో వున్న నా వునికికి ఎరుకలో వున్నాను.
భగవాన్ :- మీరు దేహానికి ఎరుకలో వున్నారన్నమాట ?మిమ్మల్ని మీరు దేహంగా ఎంచుకుంటున్నారు.
అవునా ? మీరు, ఆ దేహమా ? మరచి గాఢనిద్రలో వున్నప్పుడు...
ముస్లిం -:- అవును, నేనే. ఆ దేహం, నాదే !
భగవాన్ :- అయితే ఆ దేహం చనిపోయినప్పుడు.
ముస్లిం -:- చనిపోయిందని దాన్ని పూడ్చి పెడతాము.
భగవాన్ :- “నేను” అనే మీరు ఇంకా వున్నారు.
దేహం దీన్ని తీసుకుపోవద్దు. దీన్ని నేను గడించాను. దీని
మీద పట్టుబటీ
ఇవన్నీ నావి. నేను వాటితో ఇక్కడే
మీరెందుకు అనకూడదు ?
ముస్లిం :- నేను దేహంలో వున్న ప్రాణిని, కాని, నేను దేహాన్ని కాదు.
భగవాన్ :- ఇప్పటివరకు స్థిరనిశ్చయభావంతో నేను” అన్నారు. మీకో రూపం కూ ఆ అనుకోవడమే, అజ్ఞానం. ఆ అ లైన అనర్థాలకు, కష్టాలకు, మూలం ఆ అజ్ఞానం.అది అంతమయ్యే నిరాకారస్థితిని, మీ స్వభావాన్ని ఇదంతా తన ప్రజ్ఞ, ప్రతిభ, పాటవాలు చూపించుకోవడానికి చేసే తర్కం.
అంతటితో ఆ ముస్లిం మౌనం వహించాడు
"భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్ధించాలి ? అని ఒకరు భగవాన్ని అడిగారు. దానికి భగవాన్, "భగవంతుణ్ణి ప్రార్థించే “నేను” ఒకటి వుంటుంది కదా ? ఆ "నేను" ఎప్పుడూ నిశ్చలంగా, నిర్మలంగా, నిశ్చయంగా ఆ క్షణంలో భగవంతునికి బహు సన్నిహితంగా వుంటుంది.
“అదీ, ఇదీ, అన్నీ, అంతా చూసేవాళ్లు, భగవంతుని ఎందుకు చూడరు? అందరూ ఎప్పుడూ అంతటా ఆ భగవంతుణ్ణి చూస్తున్నారు. చూస్తారు. అయినా చూడలేరు. ఎందుకంటే, వాళ్ళకు భగవంతుడు తెలియదు. కనుక దైవమంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. భగవంతుడూ, భగవన్నామం రెండూ ఒకటే. భేదం లేదు. అందుకే ఎవరైనా, ఏ నామజపమన్నా చేసుకుంటామంటే, తప్పకుండా చేసుకోండి అని ప్రోత్సహిస్తాను.
ప్రార్ధన అంటే, మాటలు జపించడం కాదు, పరితపించడం. ఇతరుల కోసం ప్రార్ధించడంలో నీ సుఖం నీ క్షేమం ఇమిడివుంటుంది. అది స్వార్ధం. ఈశ్వరుడికి మనవంటి మధ్యవర్తులు అవసరం లేదు. ఆయన ధర్మమేమిటో ఆయనకు తెలుసు.”
“ఎంతకాలం మంత్రజపం చేస్తే, ఆత్మసిద్ధి కలుగుతుంది ?' అని ఒకరు భగవాన్ని అడిగారు. దానికి భగవాన్, "నేను మంత్ర జపం చేస్తున్నాను" అనే భావం వున్నంత వరకు, ఆత్మసిద్ధి కలగదు. అప్పుడు నువ్వే గుర్తిస్తావు “ఆ మంత్రజపం చేసేది, నేను కాదని మంత్రం దానికది జరిగిపోతూవుంటే, అదే సహజస్థితి. అదే సిద్ధి. "నేను" అదే విమోచన. “నేను” అనే స్ఫురణే, అహం స్ఫరణ. అనేది అన్ని మంత్రాల్లోకి గొప్ప మంత్రం. చివరికి ప్రణవం ఓంకారం కూడా కొన్ని అక్షరాల కలయికే !"
🕉️🌞🌍🌙🌟🚩
No comments:
Post a Comment