అరుణాచల శివ 🙏
ధ్యానం అంటే ?
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
శ్రీరమణమహర్షి : మనకు కలిగే స్వాంతనే ధ్యానం.
ఈ విషయాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా ఆలోచనలలో స్పష్టత, చేసే పనిలో స్వచ్ఛత వస్తాయి.
మనసుకు ఏర్పడే స్పష్టత, స్వచ్ఛతల నుండి కలిగే ఫలం ధ్యానం.
ధ్యానం అనేది ఒక ప్రక్రియ కాదు.
సత్యం అర్థమైన తర్వాత సమాధానపడ్డ మనసు పొందిన స్థితి.
వంటలో రుచిని మనం సృష్టించలేం.
చేసే విధంగా శ్రద్ధగా చేస్తే వంటకు మంచి రుచి వస్తుంది.
ధ్యానం కూడా మనం కావాలనుకొని పొందలేం. జీవితంలోని అనవసరమైన విషయాలను ఆలోచనల్లోనుండి, చేసే పనుల్లోనుండి తగ్గించుకుంటే మనసు స్వాంతన పొందుతుంది.
అదే ధ్యానంగా పరిణమిస్తుంది !
--శ్రీ రమణీయం నుండి...
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
No comments:
Post a Comment