*సాధన - దైవానుగ్రహం*
దైవానుగ్రహం అనేది మనం చేసే సాధన మీద ఆధారపడి వుంటుంది...
సాధన అంటే పూజలు, యజ్ఞాలు, హోమాలు, తపస్సులు అనే కాదు.!!!
అడవులలో, గృహలలో కూర్చోవడమూ కాదు!!
సాధన ఎక్కడికో వెళ్లి చేయాల్సిన పనీ లేదు!...
_ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మనసు కొంచం మాధవునిపై పెట్టుకుంటే చాలు!!_
చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు భగవంతుని స్మరణ చేసుకోవచ్చు , అయన గూర్చి పాటలను పాడుకోవచ్చు...
ఖాళీ సమయాల్లో లేదా పని మీద బయటకు వెళ్లినపుడు ఎవరైనా యాచకులు లేదా దీనులు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు కనబడితే వాళ్లకి కావలసిన చిన్న చిన్న సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి, ఆకలి గొన్న వారికి ఏదైనా తినే పదార్థాన్ని సమకూర్చడం ద్వారా వారిని తృప్తి పరచాలి...
ఈరోజుల్లో ...
పెళ్లి రోజు, పుట్టిన రోజులంటూ ... పార్టీలు, పబ్భాల కోసం డబ్బు వృధా చేస్తున్నాము, అలా చేసే బదులు ... ఏ అనాధలకో లేదా ఇంకేదైనా సేవా కార్యక్రమాలకో వినియోగించడం చాలా ఉత్తమం, దీని వలన దేవునికి గొప్ప సేవ చేసినవాళ్లమవుతాము - నలుగురికీ ఉపయోగపడే అవకాశం దొరుకుతుంది...
దేవుడు కూడా ఎంతగానో సంతృప్తి చెందుతాడు, సాధన చిన్నదా పెద్దదా అని భగవంతుడు చూడడు!!...
ఏ భావనతో చేశామా అన్నది చూస్తాడు, దానికి తగ్గట్టుగా భగవత్ అనుగ్రహం పొందడానికి అవకాశం వుంటుంది...
No comments:
Post a Comment