💖💖💖
💖💖 *"504"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"అజ్ఞాని కూడా ఆనందం, శాంతి పొందుతూనే ఉంటాడు కదా.. మరి జ్ఞాని, అజ్ఞాని పొందే వీటిలో తేడా ఏముంది ?"*
*"దైవం జ్ఞానిలోనే కాదు అజ్ఞాని లోనూ సచ్చిదానందంగానే ఉంది. కాకపోతే భావనలోనే తేడా ఉంది. జ్ఞాని ప్రపంచమంతా ఉన్న శాశ్వతమైన సత్ ను తెలుసుకుంటాడు. అజ్ఞాని అశాశ్వతమైన ప్రపంచాన్ని సత్ గా భావిస్తుంటాడు. జ్ఞాని సత్యం యొక్క ప్రకాశంచేత దాన్ని గుర్తిస్తుంటే, అజ్ఞాని కూడా సత్పదార్థం చేత ఏర్పడ్డ ప్రకాశం {చిత్ } తోనే ఈ ప్రపంచాన్ని గుర్తిస్తున్నాడు. జ్ఞాని సత్యంతో అనుసంధానమై అఖండానందాన్ని పొందుతుంటే, అజ్ఞాని ఈ ప్రపంచంతో మమేకమై తాత్కాలిక శాంతినిచ్చే సంతోషాన్ని పొందుతున్నాడు. జ్ఞానికి కలిగేది శాశ్వత సచ్చిదానందం కావటంవల్ల అది అఖండ శాంతిని కలిగిస్తుంది. అజ్ఞానికి ప్రపంచం ద్వారా కలిగే తాత్కాలిక సచ్చిదానందంవల్ల శాంతికూడా తాత్కాలిక సంతోషమే అవుతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment