*🌺🙏ఓం నమఃశివాయ 🙏🌺*
*_🌴 సంసార సాగరంలో మునిగిపోతూ మనశ్శాంతి లేకుండా నిత్యమూ ఏదో ఒక చింతతో సతమతమవుతూ ' మా పరిస్థితి ఇంతేనా! మేము ఇలా ఉండిపోవల్సిందేనా!! మాకు ఉద్దరింపబడే మార్గం లేదా!!? ' అని చింతించేవారు ఒకసారి తెలుసుకోండి.*
*పుష్కరాలు సమయంలో నదిలో స్నానం చేసినపుడు నది ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండడానికి నదిలో ఇనుప గొలుసులుతో పొడవాటి త్రాడువంటి నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు.*
*స్నానం చేసేవారు ఆ గొలుసులు పట్టుకుని స్నానం చేస్తారు. అలాగే సంసారము అనెడి నదిలో ఉండి కూడా వాటి బంధాలనే ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండడానికి భగవంతుడు భగవన్నామ స్మరణ అనే గొలుసు ఏర్పాటు చేశాడు.*
*ఈ గొలుసు గట్టిగా పట్టుకుని ఉన్నంత వరకూ ఈ సంసారపు చింతల ప్రవాహం మనల్ని ఏమీ చేయలేదు.*
*ప్రవాహం వేగముగా ఉన్నపుడు గొలుసును మరింత దృఢముగా పట్టుకోవాలి తప్ప వదిలేయకూడదు.*.
*ఎంత దృఢముగా పట్టుకుంటే అంత రక్షణ.*
*కనుక అనవసర చింతలు మానివేసి భగవంతున్ని స్మరిస్తుండండి.*
*సకల చింతలు రూపుమాపేది ఒక్క సర్వేశ్వర చింతనే అన్న సత్యమును మరువకండి.🌴_*
No comments:
Post a Comment