Wednesday, March 8, 2023

కామదహన్

 కామదహన్
🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️
  ☯️ "అతి సర్వత్ర వర్జయేత్"
అతి ఆలోచన, అతి భావాలు (extreme emotions) అతి కోరికలు, అతి వ్యామోహాలు, అతి తిండి, అతి నిద్ర, అతి ఒత్తిడి, అతి లక్ష్యాలు, ఏదైనా అతి శారీరక, మానసిక, సామాజిక, ప్రాకృతిక ఆధ్యాత్మిక సమతాస్థితిని నాశనం చేస్తుంది.
"మధ్యే మార్గమే ఉత్తమం".

☯️ఆ అతి మీద నియంత్రనే 
     " కామ దహనం". 
దహనం జరుగాల్సినదంతా లోపల, అంతే గానీ బయట వస్తువులను కాల్చడం కాదు.

☯️ఆ నియంత్రణ, ఆ దహనం కేవలం "ఎరుక " ద్వారా ( awareness/observation/ధ్యానం/మెడిటేషన్ = శ్వాస మీద ఎరుక/ధ్యాస) మాత్రమే వస్తుంది. 
☯️ కాబట్టి అంతర్ దహనానికి చేయాల్సింది " ధ్యానం" మాత్రమే. అప్పుడే మధ్యే మార్గం (balance) ఏర్పడి జీవితం "రంగుల వసంతం"(హోలీ) గా మారుతుంది, ఒక పండుగగా (celebration) అవుతుంది.

   🧘‍♀️💃🔥అందరికీ 
 " కామ దహన పండుగ"
     శుభాకాంక్షలు🔥💃🧘‍♀️

No comments:

Post a Comment