Wednesday, November 8, 2023

ఇటువంటి ధర్మ సంపాదనయే జీవితానికి సార్థకత.

 1101.  2-7.  070323-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                      *సద్బోధ:*
                   ➖➖➖✍️


*అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః ।*
*నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః ॥*
       

*శరీరాలు శాశ్వతాలు కావు. వైభవములు కూడా  శాశ్వతములు కావు.*

 *కాబట్టి, వైభవములు సంపదల వలెనే శరీరములు శాశ్వతమైనవి కావు అని భావించి, మృత్యువు ఎల్లవేళలా ప్రక్కనే పొంచి ఉందని భావించి ధర్మ సంపాదనకై కర్తవ్యోన్ముఖులు కావాలి!*

*శరీరాలు అనిత్యమైనవి. ఐశ్వర్యం శాశ్వతం కాదు. మృత్యు దేవత ఎల్లపుడు ప్రక్కనే పొంచి ఉంది. అందుచేత ధర్మ సంపాదనం చేసుకోవాలి.*

*ధన సంపాదన, భౌతిక సుఖాలు మనం జీవించినంత వరకూ కావలసినవే. వాటికై ప్రయత్నించాలి, సాధించాలి. కానీ, అవియే శాశ్వతం అనే విధంగా ఎలాగైనా వాటిని సాధించాలని ఉచ్ఛ నీచాలు మానేసి వాటికై వెంపరలాడ కూడదు.*

*మనిషి శరీరం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. కాబట్టి ఉన్నంతలో, మన వైభవాలూ, సుఖాలూ మనం చూసుకుంటూనే కొంతలో కొంత ధర్మాచరణకి పూనుకోవాలి.*

*సంఘం లోనూ, సమాజం లోనూ అవసరం ఉన్నవారిక మనకి చేతనైనంత వరకూ సహాయ సహకారాలు అందించడమూ, పరోపకారానికై కొంత మన సమయాన్ని, ధనాన్ని వెచ్చించడమూ ఇవియే ధర్మాచరణలో భాగం.*

*ఇటువంటి ధర్మ సంపాదనయే జీవితానికి సార్థకత.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment