Wednesday, November 8, 2023

త్రిగుణ తత్వాలు, గీతాచార్యుడు మనుషులను మూడు రకాలుగా వివరించాడు.

 1912.  1-6.  110323-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               *త్రిగుణ తత్వాలు*
                  ➖➖➖✍️

*గీతాచార్యుడు మనుషులను మూడు రకాలుగా వివరించాడు. యావత్ మానవవర్గాన్ని మూడు గుణాలలో విభజించాడు. అవి, సత్వ గుణం. రజో గుణం. తమో గుణం.* 

*సత్వ గుణమున్నవారిని సాత్వికులని అంటున్నాం. రజో గుణం కలిగిన వారిని అతనికేం రాజు అంటాం. తమో గుణం కలిగిన వారిని ఒట్టి తామసం అంటాం.* 

*ఈ మూడింటిలోనూ రూపం వేరు. ఆత్మ వేరు. కొందరి అభిప్రాయం ప్రకారం దేహానికి ఆత్మపై ఆధిక్యం ఉందంటారు. కానీ ఆత్మ దేహంపై ఆధిక్యం చెయ్యలేక తల్లడిల్లుతోంది.* 

*మొదటి రకమైన సత్వ గుణం కలిగిన మనిషి ఆత్మను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. మనిషి చేసే పనులు జ్ఞానంతో తేజోవంతమైనప్పుడు సత్వగుణం వృద్ధి చెందుతుంది.* 

*రజో గుణ మనిషి    ఆత్మ గురించి పట్టించుకోక     శారీరక ఇచ్ఛనే ప్రపంచమనుకుని జీవిస్తాడు. రజో గుణంతో కోరికలు అణచుకోలేం. క్రియాశీలత వృద్ధి చెందు తుంది.*

*ఇక తమో గుణమున్న మనిషికి ఆత్మ, దేహం రెండింటిపైనా ఎలాంటి ఆధిక్యం ఉండదు. అందరికీ సత్వ గుణముండటం అనేది కఠినమే.* 

*కంచి పరమాచార్యులవారికి కోపం తెప్పించలేం. ఏ స్త్రీ తమ దర్శనం కోసం వచ్చినా వారిలో ఆయన కామాక్షి స్వరూపాన్నే చూసేవారు. ఇలాంటివారు కోటి మందిలో ఒక్కరుంటారు.*

*దేహానికి విడిగా వ్యవహరించే శక్తి ఉంది. మనసుని అది నలప గలదు. వెళ్ళకూడని చోటికల్లా అది వెళ్ళమం టుంది. చెయ్యకూడని కార్యాలను అది చెయ్యమంటుంది. పట్టించుకో కూడని విషయాలను పట్టించుకోమంటుంది. దేహం సవ్యంగా ఉంటే మనసు బాగుంటుంది. దేహం చెదిరితే మనసు చెదిరిపోతుంది. మనసుకి మరొక రూపమే ఆత్మ. దేహానికి ఆత్మపై ఆధిక్యం ఉంది.* 

*ఈ ఆధిక్యాన్ని వేరు చేయగలవారు సాత్విక గుణం కలిగి ఉంటారు. దేహానికి ఆత్మపై ఆధిక్యం లేకుండా ఉన్న వారే ప్రపంచంలో ఉత్తములవుతారు. వారే సాధువులు. ఈ మూడు గుణాలకూ అతీతమైనవారు దైవత్వం నిండిన వారై ఉంటారు.*✍️
                   - యామిజాల జగదీశ్.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment