Friday, November 3, 2023

అన్ని జీవుల మీదా ప్రేమను చూపించగలవాళ్ళు కాషాయం ధరించని సన్యాసులే

 *సత్సంగం*

ఒక మనిషి ఒక కొండ శిఖరం మీదకి
 తేలికగా హాయిగా ఎక్కగలగాలంటే
 బరువు ఉంటే ఎక్కడం కష్టం

 తిరుపతి కొండని కాలినడకన ఎక్కేవారికి ఇది అనుభవమే
 కొంత దూరం వెళ్ళాక వెంటనే నీళ్ల సీసా కూడా బరువుగానే అనిపిస్తుంది 

అలాగే ఆధ్యాత్మిక శిఖరం ఎక్కాలనుకునే వారికి
 *తీరని కోరికలూ, తీరాల్సిన ఆశలూ* 
వాళ్ళు మోసుకెళ్ళే బరువులు అవుతాయి 
వీటిని వదిలించుకుంటేనే ఆధ్యాత్మిక ప్రయాణం సులువుగా సాగుతుంది 

అలాగే ఇతరుల నుంచి ఉచితంగా తీసుకునేవి కూడా బరువే అవుతాయి
 అది డబ్బు కావచ్చు ,సేవ కావచ్చు, వస్తువులు కావచ్చు, మరేదైనా కావచ్చు
 తగిన సొమ్ము చెల్లించకుండా ఏం తీసుకున్నా రుణానుబంధమే అవుతుంది ఈ రుణానుబంధం  ఆధ్యాత్మిక శిఖరం చేరుకోవటానికి ఆటంకం అవుతుంది.
 దీని బరువు దింపాలంటే అనుభవించడమే దారి 

అందుకే అనుభవానికి రాకమునుపే 
ఆధ్యాత్మిక మార్గంలో కర్మలని భస్మం చేసుకోవాలి 

రుణానుబంధ కర్మలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి
 చిక్కుకుంటే మాత్రం చాలా జన్మలూ, చాలా కాలమూ వృధా చేయవలసి వస్తుంది

మనిషి జీవన యాత్ర సాగటానికి ముఖ్యమైనది ఇంత నీడ 
అందుకే
సన్యాసులు చెట్ల కిందా, దేవాలయాల్లోనూ బస చేయాలని శాస్త్రం చెప్తుంది


సన్యాసులు సన్యాసాశ్రమం స్వీకరించాక గురుపరంపరను బట్టి ఆహార్యం నిర్ణయించబడుతుంది

 జుట్టును ముడి వేసుకోవటం
 లేదా 
జడలు కట్టేలాగా అలాగే వదిలేయటం
 లేదా 
ప్రతి పౌర్ణమికీ, అమావాస్యకీ గుండు చేయించుకోవటం
 కాషాయం ధరించటం
 సన్యాసి  లక్షణాలు.

 కాషాయాన్ని కట్టడంలో కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి

 కొందరు ఒకే బట్టని మెడ నుంచి మలుపు తిప్పి ముడి వేసుకొని శరీరం అంతా ధరిస్తారు తప్ప కుట్టిన దుస్తులను ధరించరు

పరంపర ని బట్టీ పద్ధతులు మారుతాయి

ఇవన్నీ
 ప్రపంచాన్ని భగవంతుడి  కోసం త్యజించిన  గుర్తుగా హిందూ సాంప్రదాయం ఏర్పాటు చేసింది

వీరిని పోషించవలసిన బాధ్యతను కూడా
 హిందూ సాంప్రదాయం గృహస్థుల మీద ఉంచింది

ఈ సంస్కృతిని అర్థం చేసుకోని దక్షిణ భారతదేశంలో
 సరైన సన్యాసిని కూడా
 బిచ్చగాడు లానే చూస్తారు

కానీ ఉత్తర భారత దేశంలో సన్యాసిని మహాత్మా అనీ మహారాజ్ అనీ సంబోధిస్తూ ఎంతో గౌరవంగా చూస్తారు

చిన్న టీ షాపు అతను కూడా సన్యాసికి టీ ఇచ్చి డబ్బు తీసుకోడు
ఉత్తర భారత దేశంలో వేలకొలది ఆశ్రమాలు వేలకొలది సన్యాసులను పోషిస్తున్నాయి

వేషానికి సన్యాసి గా
 వేషాలకు సంసారి గా ఉండే వారి అకృత్యాలు తరచూ మనకు టీవీల్లో కనపడుతూ ఉంటాయి

కోపిష్టి ఎక్కడైనా ఎలా కోపిష్టిగానే ప్రవర్తించి దొరికిపోతాడో
 దొంగ సన్యాసి కూడా అలాగే
 ఏ సందర్భంలోనైనా తన తప్పుడు ప్రవర్తనతో దొరికిపోతూ ఉంటాడు

అన్ని జీవుల మీదా ప్రేమను చూపించగలవాళ్ళు
కాషాయం ధరించని సన్యాసులే

No comments:

Post a Comment