**సత్య నిర్ధారణ చేసుకుని
ఆచరించు.**
- మహనీయుడు
బుద్దుని గొప్ప బోధ.
**దేనినీ
గుడ్డిగా విశ్వసించకు,
గుడ్డిగా ఆచరించకు.**
నీ పూర్వీకులు చెప్పారని
అంగీకరించకు,
నువ్వు ఎంతో ప్రేమించే
నీ తాత తండ్రులు చెప్పారని
అంగీకరించకు,
నీకు అత్యంత ఇష్టమైన గురువు చెప్పాడని అంగీకరించకు,
నీ ప్రేమాస్పదుడయిన మితృడు చెప్పాడని
అంగీకరించకు,
ఒక గొప్ప ప్రముఖుడు చెప్పాడని అంగీకరించకు ,
నేను బుద్ధుడిని చెప్పాను అని
కూడా అంగీకరించకు;
ఆ విషయాన్ని సత్యం అనే కొలిమిలో కాల్చి ,
నీ స్వీయ నిర్ధారణ చేసుకో, అలా చేసుకున్న తర్వాత మాత్రమే ఆచరించు.
…..
No comments:
Post a Comment