Tuesday, July 22, 2025

 [7/22, 11:09] +91 94918 93164: *_ధిక్..ఆ పలుకు చాలు!_*

***********************

అసమాన వాక్పటిమ..
అదే ఆయన మహిమ..
ఒక ప్రవాహం..
ఏ పాత్రయనా ఆవాహం..
ఆయన రావణుడైతే 
పది తలల భావాలు 
ఒక్క వికటాట్టహాసంలోనే..
సుయోధనుడైతే
పంచ పాండవుల
నటనా ప్రాభవం 
అడవి గాచినదే..!

భీముని పద విన్యాసం..
పద్యాల విహారం..
ధిక్ తో తీసిపోయే కథక్కే ..
రాక్షసరాజు హిరణ్యకశిపునిది
విశ్వనటచక్రవర్తి 
అంతటి భీకర రూపమా..
రోజారమణి ఎలా తట్టుకుందో
ఆరడుగుల గంభీరమూర్తిని..!
హిమాలయమంత 
ఎత్తుకు చేర్చలేదా 
ఆ రంగుల సినిమా 
ఎస్వీఆర్ కీర్తిని..!

నర్తనశాల కీచకుడు 
విదేశ ప్రధానినే
మెప్పించి 
కంట తడి పెట్టించిన
ఘనుడు..
నేపాలీ మాంత్రికుడిగా
చిత్రవిచిత్ర సంభాషణలు 
పలికి సినిమా ఢింభకుడై..
హిడింబి కుమారుడై
నటపృధివినెల్ల శాసించి
కోటి వీర తాళ్ళు వేసుకోలేదా..
నోటి మాటల బాణాలు 
సంధించ లేదా..!

దక్షుడై నిఠలాక్షునే
మించిన అభినయం..
భీష్ముడై కురుకుమారుల
అనునయం..
హరిశ్చంద్రుడై 
కష్టాల కాపరై..
పాత్రలు చరిత్రలై..
నటన పాఠమై..!

ఆయన సినిమారంగ పెద్ద..
సాంఘిక సినిమాల 
ఇంటి పెద్ద..
పండంటికాపురంలోని విషాదం..
విచిత్రబంధంలోని 
నిర్వేదం..
మంచిమనసులులో 
కూతురితో న్యాయవాదం..
కత్తులరత్తయ్య పిడివాదం..
ప్రతినాయకుడిగా 
హీరోలతో సంవాదం..
ఏం చేసినా 
రంగారావుకే చెల్లు..
హుంకరిస్తే చెవులు చిల్లు!
పిల్లలు భీతిల్లు..!!

ఆయన నటన అసమానం..
పాత్రపోషణ అద్వితీయం..
అందుకే అయినాడు
ఆ నట తపస్వి..
చిర యశస్వి..!
_______________________

*ఎస్ వి రంగారావు*
*వర్ధంతి సందర్భంగా* 
*ప్రణామాలు అర్పిస్తూ..*

************************

*_సురేష్ కుమార్ ఎలిశెట్టి.._*
       _9948546286_
       _9030296286_
       *విజయనగరం*
[7/22, 11:10] +91 94918 93164: *_అభినయమే ఐశ్వర్యమై.._*
*_అపురూప సౌందర్యమై..!_*
_______________________

   _సౌందర్య పుట్టినరోజు_
        18.07.1972



*_(ఎలిశెట్టి సురేష్ కుమార్)_*
       9948546286
       9030296286

✍️✍️✍️✍️✍️✍️✍️✍️

_ఏదో ఒక రాగం_
_పలికిందీ వేళ_
_నాలో నిదురించే_ 
_గతమంతా కదిలేలా.._

ఎంత అందమైనదో కదా
ఆ గతం..
పగలే వెన్నెల..
గోదారి గలగల..
కోయిలమ్మ కిలకిల..
నవ్వితే కురిసే నవరత్నాలు...
సంప్రదాయానికి చీరకట్టి
అందానికి పేరు పెట్టి..
చక్కగా బొట్టుపెట్టి..
వెండి తెరపై 
మెరిసిన సౌందర్య..
మురిపించిన ముగ్ధ..!

కన్నడ సీమ నుంచి
ఇటు తొంగి చూసిన ఇంతి
ఇక్కడ ఇంటింటి ఆడపడుచై..
ఆహార్యంతో ఆకట్టుకుంది..
అభినయంతో అలరించింది..!

ఈ తరంలో ఆనాటి పోకడలు
స్టెప్పులో..మేకప్పులో
అతికి వెళ్ళని అతివ..
పాత్రకు అతికినట్టు..
ఆ కట్టు బొట్టు..
అందులోనే రసపట్టు..
అదే సౌందర్య కనికట్టు..!

అపురూపమైనదమ్మ నాయికమ్మ..
ఆ పాత్రకు సరిపోలిక సౌందర్యమ్మ..
మెరుపులా వచ్చింది..
అందరికీ నచ్చింది..
వెంకీతో పవిత్రబంధంగా..
చిరు అన్నయ్యగా..
నాగార్జునేమో హలో బ్రదర్..
టాప్ హీరోతోనూ 
జతకట్టిందీ 
సినిమా అమ్మోరు..
చినుకు చినుకు అందెలతో
చిటపట చిరుసవ్వడితో
వాన జాణ ఆడింది వయ్యారంగా..
ఎంత నిగర్వంగా
బాబూమోహన్ తోనూ..
ఆలీతోనూ గెంతింది
వయ్యారంగా...
జుంబారే ఒ జుంబరే..
ఇలా సూపర్ స్టారునీ మెప్పించిన వయ్యారే..!

వినోదం పంచిన అందం...
అభినయ సుగంధం,.
అంతలోనే ఎంత విషాదం..
విహంగమే భుజంగమై 
కాటు వేసి  
మిగిల్చింది అదెంత విషాదం!
************************
[7/22, 11:12] +91 94918 93164: *_నిర్మలమ్మా..మజాకానా..!_*
_______________________
_జయంతి ప్రణామాలు_
    18.07.1920
_______________________
నడకకు దూరమైన
*_మయూరి_* ని నాట్యమయూరిగా
మలచిన బామ్మ..

అప్పుడామె అప్యాయతానురాగాల కలబోత..

దుండగుల దాడిలో
కాళ్ళు చచ్చుబడిన ఝాన్సీకి
*_కర్తవ్యం_* బోధించి
మళ్లీ వీరఖాకీగా మలచిన
అమ్మమ్మ..

అప్పుడామె ముదుసలి కాదు ఆవేశం నిండిన వీరమాత..

కాఫీ..రాగం పేరు కూడా
సరిగ్గా చెప్పలేకపోయిన
మనవడు శంకరానికి
బోలెడు డబ్బు పోసి
సంగీతం నేర్పించినందుకు
మదనపడిపోయిన నాన్నమ్మ..

అప్పుడామె *_శంకరాభరణం_* శంకరశాస్త్రి 
సంబంధం తప్పిపోయిన
బాధలో ఉన్న నిర్మలమ్మ..

వయసు ఎదిగినా మనసు ఎదగని *_స్వాతిముత్యం_* లాంటి మనవణ్ణి సాకి
అతడు తెలిసీ తెలియక 
చేసుకున్న పెళ్లిని
ఆమోదిస్తూ ఆ విభ్రమలో
కన్నుమూసిన పెద్దామె..

అప్పుడామె నటనలో
పరిపూర్ణత ప్రదర్శించిన
మరో కన్నాంబ..

సినిమా సుఖాంతం అయిపోతుందనుకున్న దశలో 
ముసుగు తీసి
*_సీతారామరాజు_* లో
విధ్వంసానికి కా'రణ'మైన
ఆధునిక పల్నాటి నాగమ్మ..

అప్పుడామె విభిన్న పాత్రలో
రాణించిన వెరైటీ అభినేత్రి..

తెలుగు సినిమా అమ్మమ్మ..
విభిన్న పాత్రల నాన్నమ్మ..
అనురాగం పంచే అమ్మ..
అప్పుడప్పుడూ గయ్యాళిగంప..
గాంగ్ లీడరైన మనవడు
ఫోటోలో తాతను చూపించి
వేషాలేస్తే మోసపోయిన 
ముసలమ్మ..
పాత్ర ఏదైనా నిర్మలమ్మ
వేస్తే పండినట్టే..
ఏ క్యారెక్టర్ కి 
ఎంత అవసరమో 
అంతే అభినయం..
అలాగే ప్రతి పాత్రకు
చేసింది న్యాయం..
కొన్ని పాత్రలు ఆమె చేతిలో
పడితేనే పండేది..
మరికొన్ని ఆమెకి 
కొట్టిన పిండి..
విలన్లకు డైలాగులతోనే
దబ్బిడిదిబ్బిడి..!

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
      9948546286
      9030296286

No comments:

Post a Comment