Tuesday, July 22, 2025

 తండ్రి #పరమేశ్వర ! అన్నింటికీ కాలమే సమాధానం చెప్పుతుంది. ప్రతిదీ ఆ కాలభైరవుడు పరిశోధన చేస్తూనే ఉంటాడు. అంటూ ఈరోజు మా అమ్మ భలే విషయాన్ని భోధన చెసింది. అది విన్న తరువాత తెలుసోచ్చింది. ఆ మాటలు వెనుక దాగున్న అద్భుతమైన విజయ రహస్యం. 

ఆది ఏమిటంటే ఉమామహేశ్వర ! దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుందట. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం సుత్తిలాగే ఉండిపోతుందట. భలే గమ్మత్తుగా ఉంది కదా. అలాగే జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడని, ఇతరులను ఇబ్బంది పెట్టినవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఎటువంటి ఎదుగుదల లేకుండా, సంతోషాన్ని దూరం చేసుకుంటూ కుళ్ళు కుతంత్రాలతో మనశ్శాంతి లేకుండా ఉండిపోతాడని వివరించింది.

కాలభైరవ నాలో కాలంతో పాటు వచ్చే చెడును తొలగించవయ్యా, ఎల్లప్పుడూ ఆ దేవదేవుని తండ్రి ఉమామహేశ్వరుడు పాద పద్మముల దగ్గర ఉండేటట్లు అనుగ్రహించవయ్యా. భోళా శంకరువై నాలో జ్ఞాన జ్యోతిని వెలిగించవయ్యా. ఓం నమఃశివాయ, నమో హార పార్వతి పతియే హర హర మహాదేవ శంభో శంకర🧎🏻‍♂️

No comments:

Post a Comment