Tuesday, July 22, 2025

 హ్యాంగ్ ఓవర్ వద్దు !
*1997 - 2024 : సాఫ్ట్ వేర్ స్వర్ణ యుగం !*
 ఇంటా బయటా ఉద్యోగాల సునామీ !
   బాగా చదువుకున్నవారు...  ఐఐటీ..  NIT..  లు .. 
 అవేరేజ్ విద్యార్థులు ... సాదా సీదా  ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకున్న వారు కూడా ...
 ... బెంగళూరు , మాదాపూర్ , అమెరికా , కెనడా,  యూరోప్,  ఆస్ట్రేలియా లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు ఉద్యోగాలు !
 ఈ రంగం లో ఉద్యోగాల వెల్లువ ఎలా ఉందంటే పదో తరగతి,  ఇంటర్ ఫెయిల్ అయినా వారు , ఇంజనీరింగ్ రెండో సంవత్సరం దాటని వారు కూడా కన్సల్టెంట్ లను పట్టుకొని దొంగ సర్టిఫికెట్ లతో డూప్లికేట్ లతో పరీక్షలు రాయించి..  ఇంటర్వ్యూ లు చేసి...  ఉద్యోగాలు సంపాదించి విదేశాల్లో సెటిల్ అయిపోయారు .
స్వర్ణ యుగం ముగిసింది !
 కృతిమ   మేధ  వచ్చేసింది !
 సోఫ్త్వేర్ రంగం లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను తినేసింది .
ఇక్కడో...  అక్కడో కాదు .. ప్రపంచమంతా !
 మనవాళ్ళు ఇంకా హ్యాంగ్ ఓవర్ లో ..
మజ్జిగ తాగండి ..
...  మత్తు వదలండి !
 ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఉండవని కాదు .
ఉన్నాయి.. 
వస్తాయి !
కానీ ..

మోటార్ సైకిళ్ళు .. స్కూటర్లు .. కార్లు ... షేర్ ఆటోలు వచ్చేసాక .. జట్కా బండి యాపారం నడుస్తుందా ?
 అదే హ్యాంగోవర్ లో ఉంటే .. బతుకు జట్కాబండి అయిపోదా ?

కృతిమ   మేధ  చేసే పని...  మాత్రమే చేసే ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉద్యోగాలు వస్తాయా ?
రావు .. 
ఎంత గింజుకున్నా రావు !
కృతిమ  మేధ    చేయలేని పని చేసేవారికే ఇక ఉద్యోగాలు .

క్రియేటివిటీ , క్రిటికల్ థింకింగ్ , కాలాబోరేషన్ స్కిల్స్ లాంటివి ఉన్న వారికే ఉద్యోగాలు .
  మనవారేమో  ఒకటో తరగతి నుంచి ఇంజనీరింగ్ దాక రోడ్డ కొట్టుడు .. బట్టీ చదువులు !
 ఇంజనీరింగ్ లో బ్రాంచ్ ఏదైనా చెప్పేది తమకు వచ్చిన నాలుగు ముక్కలే !
  CSE .. DS ..  AIML .. బ్రాంచ్ పేరు ఏదైనా ఆవు వ్యాసాలే !
    కాలం  చెల్లిన చదువులు చెప్పి ... కాపీ లు కొట్టించి...  డిగ్రీ లు ఇచ్చి బయటకే తోలేస్తే.. ఉద్యోగాలు వచ్చేయడానికి ఇదేమైనా సోఫ్త్వేర్ స్వర్ణ యుగమా?
 మనం వున్నది 2025 లో.. 
కృతిమ మేధ యుగం మొదలై పోయింది .

ఇప్పటి దాక చదివిన బట్టీ చదువులు వేస్ట్ !
 కాపీ కొట్టి  తెచ్చుకొన్న డిగ్రీ లు వేస్ట్!
 మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలెట్టాల్సిందే !

  బట్టీ    చదువుల మోడ్ లో..  ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్...  మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్స్ లు చదివినా ఉద్యోగాలు రావు . 
ఎందుకంటే బట్టీ  రాయిళ్ళు ... మహా అంటే రోబో లు చేసే పనే చేయగలుగుతారు .
 అదేమో వీరి కంటే లక్ష రెట్లు ఎక్కువ పని సామర్త్యం కనబరుస్తుంది  .

కింద బోసారు గా ..
..  ఇప్పుడు ఏరుకోండి !

 సృజన,  నాయకత్వ లక్షణాలు , సమిష్టి తత్త్వం , కుశాగ్ర బుద్ధి , మెరుగైన భావ వ్యక్తీకరణ శక్తి , భావోద్వేగ ..  సామాజిక తెలివి తేటలు .. ఇవీ ఒక నాటి చదువులు .

సాఫ్ట్ వేర్ స్వర్ణ యుగం లో వీటిని పట్టించుకొన్నవాడు లేడు.
ఒక మాదిరి కళాశాలలో ఇంజనీరింగ్ చేసినా లక్షల్లో జీతం వస్తుండే.
కాలం అలాగే ఆగిపోతే బాగుండేదేమో ..

 కానీ .. రోబో యుగం వచ్చేసింది . 

ఫండమెంటల్స్ మరిచిన వారికి అశనిపాతం అయ్యింది .

కార్పొరేట్ స్కూల్స్ .. ఐదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లు .. కోళ్ల ఫారాల ఇంజనీరింగ్ కళాశాలలు .. విదేశీ చదువుల ఉద్యోగాల కన్సల్టెంట్స్ .. వీరి .. మాయ నుంచి .. తెలుగు జాతి బయట పడేది ఎప్పుడు ?
డాల్లర్ల సంపాదన .. ఇండియా లో ప్లాట్స్ . ఫ్లాట్స్ కొనుగోలు .. సంవత్సరానికి ఒక్క సారి అమెరికా ప్రయాణాలు .. అక్కడ వాకింగ్ లో కబుర్లు .. తిరిగొచ్చాక అమెరికా గొప్పదనం గురించి డాంబికాలు ..
ఈ హ్యాంగ్ ఓవర్ పోయేదెలా ?

 రాత్రి తాగినప్పుడు..  మస్తు మజా.
.  ఇప్పుడు పొద్దు పుట్టింది .
 తలనొప్పి ..
 నాలుక డ్రై .. 
హ్యాంగ్ ఓవర్ పోయేదెలా ?
    ముదర  పెట్టుకొంటే కిడ్నీ లు పోతాయి ..
 ఫాటీ లివర్ వచ్చేస్తుంది .
మత్తు వదలరా .. తెలుగోడా !
శుభోదయం !

No comments:

Post a Comment