Tuesday, July 22, 2025

 *నూరేళ్ళ సంగతులు.. 7

*కాఫీవిత్..2370..'గణితబ్రహ్మ' 
 లక్కోజు సంజీవరాయశర్మ….!!

*అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు…!!.

*ఆయనో మానవ యంత్రం.‌సూపర్ 
  కంప్యూటర్.‌..!!

*ఆయనన అంధత్వం ముందు. అంకెలు
  ఓడిపోయాయి...!!

*జన్మతః అంధుడైనా..'గణితావధానాల్లో ' 
  ప్రపంచం లోనే మేటి….!!

*అంకెలు  ఎలా ఉంటాయో తెలియకుండానే  
  ఆయన"గణితబ్రహ్మ" అయ్యారు! 

*నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే
 క్యాలెండర్  సృష్టికర్త అయిన…!!

*నోబెల్ ' (Nobel) పురస్కారం కూడా  
  ఈయనకు చిన్నదే....!!

*గణితంలో నాకన్నాప్రతిభావంతుడు శర్మ  
  గారు "....శకుంతలా దేవి..!!…
 
కడప జిల్లాకు చెందిన 'గణితబ్రహ్మ' లక్కోజు
సంజీవరాయశర్మ గారి గురించి ఈ తరం వారికి అంతగాతెలీకపోవచ్చు.కానీ,ఇలాంటి ఓ అపర
మేధావి మన తెలుగు వాడైనందుకు గర్వించా
లి. సంజీవరాయశర్మ 1907 నవంబర్ 27 న... కడపజిల్లా ప్రొద్దుటూరు మండలంలోని 'కల్లూ
రు'లో జన్మించారు..19వ ఏట ఆదిలక్ష్మమ్మను పెళ్లాడాడు. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. అలా చెప్పినందు
కు రైతులు ఆయనకి కొంత సొమ్ము …చెల్లించే వారు.కేవలం గణితమే కాదు. ఆయన వయొ
లిన్ కూడా వాయించేవారు.!!

ఈయన పుట్టుకతోనే అంధుడు.అయితేనేం ఆత్మవిశ్వాసంతో ఎదిగాడు.ప్రపంచం నివ్వెర
పోయేలా చేశారు. ఆయనబడికి వెళ్ళిచదువు
కోలేదు..కనీసం బ్రెయిలీ లిపి కూడా తెలీదు.
తన అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర
గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తుంటే వాటిని గుర్తుపెట్టుకుని 'గణితం'లో అపార విజ్ఞానాన్ని సముపార్జించారు.లెక్కలకే‌లెక్కలు.సరిచేశారు.
సంవత్సరాలు, తిథులు, నెలలు, నక్షత్రాలు,…
వారాలు, పక్షాలు... గంటలు, నిముషాలు, సెకనులేవీ తెలియకున్నా, అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించిన అపర
మేధావి శర్మగారు..ఆరు వేల గణితావధానాలు
చేసి ప్రపంచంలో ఎవరూ చేయని, చేయలేని అరుదైన ఫీట్ సాధించారు..!!

*గణితావధానాలు..!!

అవధానమే కష్టం..అటువంటిది గణితావధాన
మంటే వేరేచెప్పాలా.? అయితే శర్మ గారు  గణి
తావధానాన్ని అవలీలగా చేసేవారు. 1928 లో 
తొలి గణితావధానం చేశారు.!

ఆయన ప్రతిభకు జనం అచ్చెరువొందారు..నాటి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు…దేశంలో
ని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక,మహారాష్ట్ర, 
బీహారు, ఢిల్లీ తదితరరాష్ట్రాల్లో ఆయన అవధాన
ప్రస్థానం కొనసాగింది. 1995 వరకు ఆయన ఎన్నో ప్రాంతాల్లో పర్యటించి తన అవధాన విద్యను ప్రద
ర్శించారు.ఒకటికాదు.రెండుకాదు.సుమారు 6000
కు పైగా గణితావధానాలు చేశారు.ప్రపంచంలోని గణితమేధావులందరూ ముక్కు మీద వేలేసుకొని శర్మగారిసహజ ప్రతిభను వేనోళ్ళ కొనియాడారు..!!

1928 నవంబర్ 15న నంద్యాలలోఅఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినపుడు శ్రీ సంజీవరాయ 
శర్మ గారి గణితావధానం చేశారు.ఆ సభల్లో శర్మ గారి  అవధానం ప్రధానాకర్షణ కావడం విశేషం .అప్పటి రాష్ట్రపతిడాక్టర్ రాజేంద్రప్రసాద్ శర్మ గారి  ప్రతిభకు
ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ములో కొంత మొత్తాన్ని మనియార్డర్ ద్వారా శర్మగారికి పంపడం విశేషం! అనీబ్‌సెంట్, నెహ్రూ, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్,మేధ్స్ విజార్డ్ శకుంతలా దేవి,
కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవ
ర్నర్ సర్ జార్జి స్టాన్లే,తదితరులంతా శర్మగారి గణితా
వధానాన్నిస్వయంగా తిలకించారు,శర్మగారి ప్రతిభ 
అసాధారణం..అనితర. సాధ్యమనిమెచ్చుకున్నారు..
వేనోళ్ళ కీర్తించారు..

*శర్మగారి అవధానం ఇలా..!!

గణితావధానంలో, పుట్టిన తేదీ ఇస్తే అది యే వార
మైందో చెప్పడం సర్వసాధారణం. కానీసంజీవరాయ శర్మగారు..అలా కాదు.ఆ పుట్టిన తేదీ యే వారమో చెప్పడమేకాదు.ఆనాటి పూర్తి పంచాంగంచెప్పేవారు. 
అంటే, పుట్టిన తేదీ, సమయం ప్రదేశం చెప్పగానే, దానికి సంబంధించిన  తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం, వర్జ్యం, రాశి కూడా చెప్పిఅదనంగా జాతకం
కూడా చెప్పి ఆశ్చర్యపరిచే వారు.గణితంలో మేటి గా,మానవ యంత్రంగా భావించే  శకుంతలా దేవితో సహా ప్రపంచంలోమరెవరూ కూడా ఇటువంటి ప్రతి
భను ప్రదర్శించలేదంటే అతిశయోక్తి కాదు.

*అనితర సాధ్యం
 ఆయన ప్రతిభ..!!

అది 1966, డిసెంబర్ నెల 7వ తేదీ..స్థలం హైద
రాబాద్.వేదిక..శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం.
కార్యక్రమం.శర్మగారి గణితావధానం.

* 2 power 103 ఎంత? ఓం పృచ్ఛకుడి ప్రశ్న ?

దానికి అవధాని శర్మగారి సమాధానం…

"ముప్పైరెండు అంకెలున్న సంఖ్య"..!!

'క' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, 'స, రి, గ, మ, ప, ద, ని'' అక్షరాల లబ్దం ఎంత? యాభై రెండు కోట్ల అయిదులక్షల 
ఆరువేలు... !

కలం, కాగితం చేతిలో వున్నాగంటల కొద్దీ సమయం
లో కూడా చెప్పలేని సమాధానం ఇది..ఇటువంటి క్లిష్టమైన,కష్టమైన ఎన్నో.. ప్రశ్నలకు ఆయన ఊపిరి
పీల్చుకొని వదిలిపంతం సులువుగా చకచకా సమా
ధానాలు చెప్పేవారు.!

ప్రశ్న అడగటమే తరువాయి, ఏమాత్రం తడుము
కోకుండా,  జాప్యం చేయకుండా ఠక్కున సమాధానం చెప్పేవారు..సంజీవరాయ శర్మ గారు..!!

ఆయనకు కళ్ళు లేవు.కళ్ళతో అంకెలు చూసిన వాడు…కాదు.పోనీ చదువుకున్నాడా ,! అంటే అదీలేదు.పారిజాతంసహజంగా విప్పారి పరిమ
ళించినట్లు శర్మగారి ప్రతిభ దశదిశలా గుబాళిం
చింది.

*మరో ఉదంతం చూడండి..!!

శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహు
మానంగా మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు,మూడో గడిలోనాలుగు,
నాలుగో గడిలో ఎనిమిది.ఇలా అరవై నాలుగు 
గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతే
నా?  అనుకొంటారు. తీరా ఎన్ని  వడ్ల గింజలో
తేల్చాల్సివచ్చేటప్పటికీ  అందరూ తలలు పట్టు
కుంటారు! 

దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధా
నం చూడండి.

*ఒక కోటి 84 లక్షల, 46 వేల 74 కోట్ల 40 లక్షల, 73వేల,70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట...(1,84,46,74,40,73,70,95,
51,615 )ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజ
లు పడితే... అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్ల ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదెపొడవు
మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు! అంత ధాన్యం ఈ భూమండలంపై వుంటుందా? వుండదు. కానీ… సంజీవరాయశర్మ గణితావధాన వివరణ మహిమ ఇది.

*ఒకటా రెండా? ఎన్నో ప్రదర్శనలు..!!

శర్మ గారు వివిధ  విశ్వవిద్యాలయాల్లో, అనేక కళా
శాలల్లో అవధాన విద్యను ప్రదర్శించి, విద్యార్ధుల్ని  ఉత్తేజితుల్ని చేశారు. అలాగే  పలు గ్రంథాలయాల్లో తమ గణితావధానాలు చేశారు.అలాగేమేథమేటికల్ 
సొసైటీల్లో ప్రదర్శనలిచ్చారు.ఆయన ప్రతిభ రాయల
సీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. వివిధ విశ్వవిద్యాలయాలు బంగారు పతకాలతో ఘనంగా 
 సత్కరించాయి.

దురదృష్టమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లోప్రయాణిస్తున్న సందర్భంలో.ఆయన 14 బంగారు పతకాలసూట్‌కేస్ 
తస్కరించబడింది.అలా...ఆయనకు లభించినబంగా
రు  పతకాలు కూడా దక్కకుండా పోయాయి.!

ప్రపంచంలో అంధులైన ప్రతిభావంతుల్లోజాన్‌మిల్టన్,
బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్,ద్వారం వెంకటస్వా
మి నాయుడు,కథకులు అందేనారాయణ స్వామి వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. కానీ..ఈ గణిత మేధావి 'లక్కోజు  సంజీవరాయశర్మ' గారికి వేంకటే
శ్వర యూనివర్సిటీ వారు మాత్రం గౌరవ డాక్టరేట్ ఇచ్చి తమ్ము తాము గౌరవించుకున్నారు.!

శర్మగారు..తమ చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వర 
స్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ,ఆ స్వామి
నర్చిస్తూ. గడిపారు.అక్కడే1997 డిసెంబరు రెండో
తేదీన ఆయన‌ అస్తమించారు.నోబెల్ బహుమతు
లు,  మెగ్‌సెసేలు,.. జ్ఞాన్‌పీఠ్‌లు శర్మగారి ప్రతిభా
పాటవాలముందు  ఎంతో చిన్నవి..!!

*చిత్రం…మొహమ్మద్ గౌస్, హైదరాబాద్

*ఎ.రజాహుస్సేన్..!!
Copied

No comments:

Post a Comment