* ముప్పై మూడు కోట్ల దేవతలు..*
ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే 33 రకాల
దేవతా సమూహములు.
ముప్పైమూడు కోట్ల దేవతలు అంటే సంస్కృతం లో
కోటి అంటే విభాగం అని అర్ధం.
మొత్తం ముప్పైమూడు రకాలయిన దేవతలు
అని అర్ధం వస్తుంది.
వైశ్వదేవ శాస్త్రము యొక్క దేవతా సంఖ్యను తెలిపే నివిత్తు అనే మంత్రముతో ఎంత సంఖ్య గల దేవతలు ఏర్పడుతున్నారో అంతమంది దేవతలున్నారు.
ఆ మంత్రము ద్వారా 303 దేవతలు,
3003 దేవతలు కలిసి మొత్తం 3306 మంది దేవతలు.
కాని 33 మంది దేవతల యొక్క విభూతులే ఆ మొత్తం దేవతలందరూ.
వారే ఆరుగురు దేవతలుగాను,
ముగ్గురు దేవతలుగాను,
ఇద్దరు దేవతలుగాను,
ఒకటిన్నర దేవత గాను
చివరగా ఒక్క దేవతగాను అయ్యారు.
అష్ట వసువులు,
ఏకాదశ రుద్రులు,
ద్వాదశ ఆదిత్యులు,
ఇంద్రుడు మరియు బ్రహ్మ (ప్రజాపతి) కలిపి
మొత్తం ముప్పైమూడు మంది దేవతలు.
అష్ట వసువులు:
అగ్ని,
పృథివి,
వాయువు,
అంతరిక్షము,
ఆదిత్యుడు,
ద్యులోకము,
చంద్రుడు,
నక్షత్రాలు
అనే ఈ ఎనిమిదిలోనూ సర్వమూ ఉంచబడింది.
అందుచే వారికి వసువులని పేరు.
(భూమిపై గల సమస్త పదార్ధములకు రంగు రుచి
వాసన గుణము ఆకారము (అస్థిత్వము) కల్పిస్తూ ప్రకాశించేవాళ్ళు వసువులు. భూమి యందలి ఏ రూపమైనా వసువులు లేకుండా ఏర్పడదు.)
ఏకాదశ రుద్రులు :
ఏకాదశ రుద్రులంటే పురుషునిలో ఉండే పంచప్రాణములు,
మనస్సు, జీవాత్మ కలిపి ఒకటి,
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు
మొత్తం పదకొండు రుద్రులు.
ఆత్మయే పదకొండవ రుద్రుడు.
ఈ ఆత్మ మర్త్య శరీరాన్ని వదలనని,
విడిచి వెళ్ళననిచెప్పడం మానవునికి దుఃఖ హేతువు.
ఆ రకంగా ఏడ్పించడం వల్లనే “రోదయంతి రుద్రః” – రుద్రులు అని పేరు వచ్చింది.
(ఆకాశంలో ఏర్పడే స్పందనలన్నీ రుద్రులు సృష్టించేవే. పంచభూతాత్మకమైన ప్రకృతిలో ఉండే మార్పులన్నీ వీరు సృష్టించే స్పందనలే కాబట్టి ప్రాణుల జీవనం వీరి దయపై ఆధారపడి ఉంది. మనలోని పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, మనస్సును శాసించేది ఈ రుద్రులే.)
ద్వాదశ ఆదిత్యులు :
సంవత్సరము యొక్క పన్నెండు మాసాలు..
పన్నెండు ఆదిత్య దేవతలు.
ఒక్కొక్క మాసంలో సూర్యకిరణాలు ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి. ఆదిత్యయోగీ.
ఆ పన్నెండు ఆదిత్యులు వేరు వేరు గా ఉంటారు.
ఆయా మాసములందు పరివర్తన చెందుతూ ప్రాణుల ఆయుస్సును కర్మఫలమును హరించుచుండడం చేత “ఆదదానః” ఆదిత్యులు అని పిలవబడుతున్నారు.
ఇంద్రప్రజాపతులు :
స్తనయిత్నువు అనేవాడే (మబ్బులు లేదా ఉరుములు) ఇంద్రుడు;
యజ్ఞమే ప్రజాపతి.
స్తనయిత్నువు అంటే వజ్రాయుధమే.
యజ్ఞమంటే యజ్ఞపశువే.
ఆరుగురు దేవతలు:
అగ్ని,
భూమి,
వాయువు,
అంతరిక్షము,
సూర్యుడు,
ద్యులోకము
అనే ఆరు ఆరుగురు దేవతలు.
ఇంతకు ముందు చెప్పిన ముప్పయి ముగ్గురు దేవతలు ఈ ఆరుగురే అవుతున్నారు.
ముగ్గురు దేవతలు:
భూమి,
సూర్యుడు,
ద్యులోకము
అనే ఈ మూడు లోకాలు ముగ్గురు దేవతలు.
సర్వ దేవతలు (ఆరుగురు దేవతలు) ఈ ముగ్గురిలో అంతర్భావాన్ని కలిగి ఉన్నారు.
ఇద్దరు దేవతలు:
అన్నము,
ప్రాణము
అనేవి రెండూ పూర్వోక్తమైన ఇద్దరు దేవతలు.
సగము అధికముగా గల దేవత:
వాయువే ఒకటిన్నర దేవత.
వాయువే అధ్యర్ధము అన్నారు.
ఒకటి వాయువు ఒక దేవత.
వాయువు చేతనే సమస్తము అభివృద్ధి చెందుతోంది, అంతే కాకుండా చరాచర ప్రాణికోటికి ఆధారము వాయువే కాబట్టి ఇంకొక అర్ధ భాగం గా పేర్కోని వాయువును ఒకటిన్నర దేవతగా వర్ణించేరు.
ఒకే ఒక్క దేవత :
ప్రాణమే ఒక్క దేవత:
సర్వ దేవతలు ఒక్క ప్రాణం లోనే ఉన్నారు.
అందువల్ల ప్రాణమే సర్వ దేవాత్మకమైన బ్రహ్మము గా అభివర్ణించేరు.ఆదిత్యయోగీ.
“జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి” అని నామాన్ని పొందిన
ప్రాణమే సర్వ దేవతా స్వరూపము.
ముప్పయి మూడు (3306) దేవతల యొక్క రూపమే
ఈ ప్రాణ దేవత.
అందుచేత ఆ ప్రాణమే బృహత్స్వరూపమైన
ఆ పరబ్రహ్మమని చెప్పబడుతోంది..*
.
*ఆవుపాల శ్రేష్ఠత:*
1. కొంచెము పలుచగా ఉంటాయి.
2. త్వరగా అరుగుతాయి.
3. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము
4. మనిషిలో చలాకీని పెంచుతుంది.
5. ఉదార సంబంధమైన జబ్బులు తగ్గుతాయి . ప్రేగులలో క్రిములు నశిస్తాయి .
6. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
7. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి.
8. మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయి.
9. సాత్విక గుణమును పెంచుతాయి.
10. సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు.
11. యజ్ఞమునకు, హోమమునకు ఆవుపాలను వాడుతారు.
12. దేవాలయములలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.
13. కార్తీక పురాణములో- ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పారు.
14. గోవు దేవతా స్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది.
15. ఆవుపాలలో – బంగారము ఉన్నది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పచ్చని పదార్ధాన్ని ఒదులుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉన్నది.
16. తెల్లఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
17. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి.
18. ఘృతేన వర్దేతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం, ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. ఆవుపాలు ఆయుష్షును పెంచును, ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.
19. చందోగ్య ఉపనిషత్ (6-6-3) మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరాలులోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది.
మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ) మంచి సాత్విక, శ్రావ్యమైన హక్కు కోసం ఆవు నేయ్యి, వెన్న తప్పక తినవలెను.
20.భారతీయ గోవులకు మూపురము వుండును. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది, అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి.ఆదిత్యయోగీ.
పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. యివి సూర్యశక్తిని గ్రహించలేవు.
అందువలన వీటి పాలు మంచివి కావు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మూపురము ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది. ఈ ఆవుపాలు చలాకిని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వగుణమును, బుద్ధిబలమును, ఒజస్సును పెంచును, ఓజస్సు మనిషి యొక్క తెలివికి, ఆకర్షణశక్తి, వ్యాధి నిరోధక శక్తిని ప్రధాన కారణము, నెయ్యి – ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చేయు మూలుగను, మంచి హక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్దిబలమును పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్టిరాల్ అయిన యల్.డి.యల్ cholesterol ను పెరగనివ్వదు.
ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తము ఉత్పత్తి అయి, వ్యాధికారక క్రిములను (Aids ను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపి వేసి, ఆరోగ్యమును కలుగజేయును.
స్త్రీలలో ఎముకలు బలహీనమై Osteoporosis, Arthritis అనే వ్యాధి రాకుండా ఉండటానికి , వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణి స్త్రీలు మంచి calcium పొందడానికి – Calcium మాటల కన్నా ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీ గర్భములోని బిడ్డకు ఎముక పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది.
ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో ఏర్పడే ‘మనస్సు, బుద్ధి’ రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుంది.
మన ఋషులు తపశ్శక్తితో చెప్పిన సూక్ష్మ విషయములు Scientists కొంతవరకే నిర్ధారించగలరు. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యము గురించిన వివరములు Science ఇంకనూ కనుగొనలేదు. వాటి గురించిన వివరములు తెలుసుకో గలిగినప్పుడే Scientists పై విషయములు చెప్పగలుగుతారు. ఆరోగ్యము మేధాశక్తితో కూడిన ప్రజలు మన దేశ భవిష్యత్తుకు మూలము....*
.
No comments:
Post a Comment