Tuesday, July 22, 2025

 నుదుటున బొట్టు, కాళ్లకు మెట్టెలు, పట్టీల వలన ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 
ముత్తైదువ వేసుకునే గాజులంటే మట్టి లేదా బంగారంతో చేసినవి అయి ఉండాలి. అంతేకానీ ప్లాస్టిక్ గాజుల కాదు. చేతి మణికట్టు దగ్గర ఉండే నరం నేరుగా గుండె నరాలతో సంబంధాన్ని కలిగిఉంటుంది. వైద్యులు కూడా ఈ నాడి స్పందనే గమనిస్తారు. ఈ నరం దగ్గర గాజులుండడం వల్ల శరీరంలో రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అందుకే గాజులు వేసుకోవాలని చెబుతారు. పురుషులు సహజంగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు. వారిలో ఉండే కొవ్వు శాతం తక్కువకావడంతో రక్తపోటు సమస్యలు కూడా తక్కువ. కొందరిలో ఇలాంటి సమస్యలుంటే బంగారం లేదా రాగి కడియం ధరించమని అందుకే చెబుతారు. లోహంతో చేసిన కడియం శరీరంలో వేడిని గ్రహిస్తాయి.

కాళ్ళకు మెట్టెలు, పట్టీలు…

పెళ్లైన స్త్రీ కాళ్లు బోడిగా ఉండకూడదని మెట్టెలు, పట్టీలు తప్పనిసరిగా ఉండాలంటారు. దీనివెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే…కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా అని పిలుస్తారు. ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత బ్రాంచెస్ గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనుక మడమ వరకు వెళ్లి అక్కడ ఆగుతుంది. అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా గర్భాశయ, మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టెలు ఇవన్నీ టిబియా నాడిని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి. గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. పైగా మూత్రాశయ సమస్యలు కూడా రావు.

తలలో పూలు

పూలు ప్రేమకు, అదృష్టానికి, సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నాలు. స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె, ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉందని, వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా రాగుతోందని అర్థం. పూల సువాసనలు మనసుని ప్రశాంతంగా ఉంచడమే కాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. ఈ ఐదు అలంకారాలే కాకుండా సైనస్ రాకుండా ముక్కుపుడక, చెవిపోట్లు దరిచేరకుండా చెవిపోగులు ధరిస్తారు. ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే. 
ఇది చాదస్తం కాదు.

No comments:

Post a Comment