Friday, December 26, 2025

 "ఉప్పు" గురించి...


రుచుల రారాజు... ఉప్పు!
సముద్రపు గర్భాన పుట్టినా...
ప్రతి ఇగిరిన ప్రాణం ఉసురు తీయదు..
రుచిని ప్రాణంగా పోస్తుంది ఈ ఉప్పు!
తెల్లని ముత్యపు పలుకులా మెరుస్తూ..
కటిక పేదవాడి గంజిలో అమృతం కురిపిస్తుంది..
మహారాజు విందులోనైనా, మారుమూల పూరి గుడిసెలోనైనా
రాచమర్యాదలు పొందే అసలైన 'రుచి'కర్త!
నిరాడంబరమైన నేస్తం..
రూపం చూస్తే అతి సామాన్యం..
కానీ లోపం ఉంటే భోజనం అగమ్యగోచరం!
తన ఉనికిని తానే కరిగించుకొని..
పదార్థానికి పూర్ణత్వాన్ని ఇచ్చే త్యాగమూర్తి..
మనిషి రక్తంలోనూ, కన్నీటి బొట్టులోనూ
తను ఉన్నానని చాటిచెప్పే నిరంతర సాక్షి!
చారిత్రక చిహ్నం...
అది కేవలం రుచిని ఇచ్చే పదార్థం కాదు..
బానిస సంకెళ్లను తెంచిన ఆయుధం!
గాంధీ తాత చేతిలో చిటికెడు ఉప్పు..
సామ్రాజ్యాల పునాదులనే కదిలించిన సత్యం!
తినే ప్రతి మెతుకుపై తన సంతకం ఉంటేనే..
దానికి విలువ, గౌరవం, నిండుదనం!
విలువైన పాఠం..
ఎక్కువైతే రోగం.. తక్కువైతే వెలితి..
మితిమీరితే విషం.. మితంగా ఉంటేనే ప్రాణం..
జీవితం కూడా ఇంతే కదా.. సమతుల్యత ఉంటేనే అందం!
నమ్మకానికి, విశ్వాసానికి మరో పేరు..
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టని గుణవంతుడికి
నిలువెత్తు నిదర్శనం ఈ ఉప్పు!

Bureddy blooms.

No comments:

Post a Comment