Monday, December 22, 2025

Are they insulting this generation..? || @sridevi_vlogs515

 Are they insulting this generation..? || @sridevi_vlogs515

https://youtu.be/c1ZfMYe6d9c?si=N4wpyV_e975zWXmA


https://www.youtube.com/watch?v=c1ZfMYe6d9c

Transcript:
(00:01) హాయ్ అండి ఓ బ్రదర్ కామెంట్ చేశారండి నేను మొన్నటి పెట్టిన వీడియోకి దానికి సమాధానంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకీ ఆ కామెంట్ ఏమని రాశారు అంటే మేడం మీరు ఈ తరం వాళ్ళని అవమానిస్తున్నారు అని కామెంట్ పెట్టారు. అయితే దీనికి ఆన్సర్ గా ఎందుకు వీడియో చేయాల్సి వచ్చింది అంటే ఈ తరం వాళ్ళు ఎలా ఉన్నారు? జనరేషన్ కి జనరేషన్ కి ఎంత పెద్ద మార్పులు వస్తున్నాయో అలాగే అవమానించడం ఏంటి అని నాకు అనిపించిందన్నమాట నేను రిప్లై అయితే ఇవ్వలేదు కానీ సరే వీడియోలో వివరంగా చెబుదాం అని చెప్పి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను నాకు వెంటనే కొన్ని
(00:42) సన్నివేశాలు గుర్తుకు వచ్చాయండి అవి ఏమిటి అంటే కార్తీక మాసంలో ఎక్కువ పూజలు స్వామిని దర్శించుకోవటం దీపాల అలంకరణ అలాగే గుడికి ఎందుకు వెళ్తామండి మనశశాంతి కోసం వెళ్తాము నేను కూడా ఎక్కువ గుళ్ళకి గోపురాలకి తిరిగాను. అక్కడ ఏం జరిగిందో మీకు చెప్తాను అన్నమాట ఇది యదార్థంగా జరిగింది ఇంతకీ ఈ తరం వాళ్ళ గురించే నేను నెమర వేసుకుంటూ మీకు చెప్తున్నాను అన్నమాట.
(01:13) గుడిలకి పుణ్యం కోసం కొంతమంది వస్తే కొంతమంది ఎంజాయ్మెంట్ కి వస్తారు అలాగే కొంతమంది షోయింగ్ చేయడానికి వస్తారు మరి ఈ యువత ఈ యూత్ మాట ఈ తరం వారు ఎలా వస్తున్నారు అంటే భక్తితో రావడం కాకుండా వాళ్ళ కోరికలు తీర్చుకోడానికి వస్తున్నారన్నమాట అంటే ఆ ఏజ్ లో వాళ్లకు తెలియదు కానీ తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరిది అని నేను ప్రశ్నిస్తున్నాను అన్నమాట అక్కడ కొన్ని సీన్స్ చూసాను నేను అందుకనే ఈ వీడియోలో ఈరోజు ఈ రోజు మాట్లాడుతున్నాను.
(01:42) గుళ్ళకి సంప్రదాయ వస్త్రాలతో వెళ్తాం మనం కానీ ఆడపిల్లలు ఎలా ఉన్నారు అని మనం చాలా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చేసింది. ఇన్నాలు ఏమనుకున్నాము అంటే ఆడపిల్లలు జుత్తులు విరగబోసుకొని వస్తున్నారు అలాగే టైట్ జీన్స్ వేసుకొస్తున్నారు. షేప్స్ కనిపించేటట్టు ఎక్స్పోజ్ చేస్తున్నారు. సగం సగం దుస్తులు ధరిస్తున్నారు. వస్త్రాల్లో ఇంత మార్పులు వచ్చేసినయి.
(02:05) కనీసం గుడి కన్నా మంచి దుస్తులు వేసుకొని అంటే ఫుల్ కవరింగ్ ఒక లంగా ఓని అది ఎప్పుడో మానేశారు పరికిని లంగా అంటే లంగా జాకెట్ అన్నమాట అది మానేశారు పంజాబీ డ్రెస్సులు అవి వేసుకొనిన్నా రావట్లేదు ఏంటి మరి ఇంత ఎటకారంగా మారిపోయారు ఇప్పుడు యువత అని చెప్పి చాలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాం దీని మీద కొన్ని వీడియోస్ కూడా చేసుకున్నాం కానీ కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే నాకు అంటబడింది అమ్మాయిలు ఇప్పుడు గార్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తో రావటం బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ తో రావటం ఇలా వచ్చి పోనీ ఏమైనా దైవ దర్శనం చేసుకుంటున్నారా అంటే లేదండి
(02:48) చేసుకోవట్లేదు. వాళ్ళు భగవంతుని దర్శించుకొని పోయేనా పిచ్చాపాటి మాట్లాడుకోవటం ఇలా ఏం చేయట్లేదు అక్కడ ఏం జరిగింది అంటే రెండు జంటలు చూశనండి నేను అమ్మాయి వడిలో అబ్బాయి చక్కగా పడుకొని అది ఆ వడిలో తల పెట్టుకొని కాళ్ళ మీద కాలువేసుకొని ముచ్చట్లు చెప్తున్నాడు అన్నమాట అమ్మా ఏమో చేతులు గట్టిగా పట్టుకొని అబ్బాయి చేతులు పిసుకుతూ మాట్లాడుతూ ఉంది ఊగొడుతూ ఉంది అలాగే ఈ విత్తులు విరబోసేసుకుంటున్నారు కదా దెయ్యాల్లాగా ఆ లూజు హెయిర్ ని వీడేమో నెమరటం అలాగే అబ్బాయి తల నెమరటం అమ్మాయి ఇవన్నీ చేయటం వలన నడి బజార్ లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నప్పుడు
(03:30) వాళ్ళకి అది తప్పు కానప్పుడు వాళ్ళకి అది సిగ్గుగా అనిపించినప్పుడు కానీ చుట్టూ ఉన్న సమాజానికి గాని ఆ చుట్టూ ఉన్న 10 మందికి గాని చూడ్డానికి ఎంత అసహయకరంగా ఉంటుంది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎంత సిగ్గు పడవలసిన విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా వాళ్ళు తిట్టడం జరుగుతుంది అన్నమాట అక్కడ అలాగే అంటున్నారు ఏమంటున్నారు అంటే తల్లిదండ్రులు ఇలాగే పెంచారు రా వీళ్ళని ఛి వీళ్ళకి సిగ్గు వదిలేశారు ఏం చెప్తాం మన కర్మ మనమే కళ్ళు మూసుకోవాలి అంటున్నారు అన్నమాట ఇవన్నీ విని మన పిల్లలు కాదు అని సంతోషపడాలా లేకపోతే వాళ్ళు ఎవరో పిల్లలు
(04:09) పాడైపోయారు అని మనం చంకలు గుద్దాలా లేకపోతే ఈ సమాజం ముందు ముందు వీళ్ళని చూసి చూసి ఏం నేర్చుకుంటది ఇటువంటి సీన్స్ చూసిన పిల్లలు కూడా ఇదే కల్చర్ అనుకొని ఎక్కడ పడితే అంటే రోడ్డు మీద పార్కులోనా గుళలోనా సినిమాలోనా ఇంట్లోనా అని బేధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏమైనా చేయొచ్చు అన్న ఒక అభిప్రాయంకి ఆ పసి హృదయాల మీద ముద్ర వేస్తున్నారండి మీ తరం పిల్లలు అది తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది.
(04:42) ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే భారతదేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఇదేమి ఎటకారం కాదు చిన్న విషయం కాదండి కానీ ఈ తరం యువతని ఎవ్వరు అవమానించట్లేదు బ్రదర్ మీరు కామెంట్ పెట్టినట్టుగా ఈ తరం యువతని అంటే మిమ్మల్ని మిమ్మల్ని మీరే అవమానించుకుంటున్నారు మీ పరువు మీరే తీసుకుంటున్నారు. మాకు ఎంత ఇబ్బందిగా ఉందో మేమే అక్కడ నలిగిపోయాం కానీ పెద్దవాళ్లైతే వాళ్ళ ఇబ్బంది చెప్పనవసరం లేదండి.
(05:10) వాళ్లైతే చచ్చిపోయారు అనమాట. వాళ్ళు జనరేషన్ కి జనరేషన్ కి మార్పు గమనిస్తూ ఉన్నారు చాలా పెద్ద వయసు వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి సీన్స్ చూసి అసలు మనిషిగా ఎందుకు పుట్టాము అసలు ఇది మనుషులు ఉన్న లోకమా లేకపోతే రక్కసులు తిరుగుతున్న లోకమా అన్నది కూడా వాళ్ళకి తెలియట్లేదు అన్నమాట. మన రోజులే ఎంత బాగున్నాయో బాబోయ్ ఈ ఈ దరిద్రం అంతా చూడాల్సి వస్తుంది అని ఒక పెద్దాయన అయితే అంటున్నారు.
(05:34) మరి ఏం చెప్పాలి ఈ తరం యువత గురించి మీరే చెప్పండి. అదంతా చూడలేక ఆ పిల్లలకి ఏమైనా చెప్దాం అంటే ఏమంటారు అనుకుంటున్నారు మీకెందుకు మా ఇష్టం ఆ అమ్మాయి అమ్మాయే చెప్తుందండి డైరెక్ట్ గా మాకు లేని నొప్పి మీకెందుకు మేము మేజర్లం మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటాం. మీరు చూడకపోతే కళ్ళు మూసుకోండి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటున్నారు అలాగే ఆలయంలో ఆలయాల్లో పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఖాళీ ప్రదేశాల్లో మండపాల్లో ఇటువంటి దుకాణాలు పెడుతున్నారు అన్నమాట మన హిందువుల పిల్లలే మన ఆలయాల్ని మన గుడుల్ని ఎంత దిగదార్చుకుంటున్నామో చూడండి ఇప్పుడు ఉన్న
(06:11) పరిస్థితులు మారిపోవటానికి ఇటువంటి మతపరమైన చర్యలు గాని విద్వేషాలు గాని గొడవలు గాని కక్షలు గాని దాడులు గాని ఇంతకీ ఇవన్నీ జరగడానికి కారణం కూడా మనలో ఐక్యత తగ్గిపోవడమే మనం చేసే పనులే మనం చూపించే చర్యలే అన్నమాట ఇన్నాళ్ళు బహిరంగ ప్రదేశాల్లో పార్కుల్లో సినిమాల్లో ఇటువంటివి చూసేవాళ్ళం ఇప్పుడు ఏకంగా గుళ్ళలోనే పెట్టేస్తున్నారన్నమాట ఆలయానికి ఎంతటి మచ్చ తీసుకొస్తున్నారో అన్నది చాలా బాధాకరమైన విషయం అండి.
(06:44) ఈ తరం యువత భారతమాతని నడి బజార్లో అవమానిస్తుంది. అలాగే ఈ తరం పిల్లలు మీ నుంచి ఏం నేర్చుకుంటారు రాబోయే భవిష్యత్తు ఉన్న తరం పిల్లలు మీ నుంచి ఏం తెలుసుకుంటారు మీ నుంచి ఏం కోరుతున్నారు? ఇది మీరు అసలు తెలుసుకోవట్లేదా? ఇదంతా మన కర్మ అండి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు దెబ్బ తింటాకే ఈ వెస్ట్రన్ కల్చర్ లు వచ్చినాయి. ఏమంటూ వెస్టర్న్ కల్చర్లు గాని పరి పరి మతాల వారు గాని అడుగు పెట్టారో అంతా నాశనం అయింది అన్నమాట ఇక్కడ ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు బాధపడవద్దు ఎందుకంటే మీరు మీ మతాల్ని ప్రోత్సహించుకుంటున్నారు మీ పడుకట్టు మీరు పాటిస్తున్నారు కానీ
(07:31) మాకేమైంది మా హిందువుల పిల్లలే ఎందుకు పక్కదారిన పడుతున్నారు ఇది నా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని విన్నపం అలాగే అలాగే తల్లిదండ్రులకి ఏమైంది మీ పెంపకం ఎందుకు ఇలా తగలాడింది మీరు పిల్లలకి ఏం నేర్పుతున్నారు పెద్దవాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వాలని చెప్పట్లేదా అలా చెప్పి పెంచలేదా పవిత్రమైన ఆలయంలోకి వెళ్లేటప్పుడు సంప్రదాయమైన వస్త్రాలు ధరించాలని అలాగే సంస్కారంతో వెళ్ళాలని ఆ భగవంతుని నిశ్చలమైన మనసుతో నిర్మలమైన మనసుతో వేడుకోవాలని మీరు ఏమి చెప్ప చెప్పట్లేదా ఎందుకు ఇలా తయారయింది అంటే ముందు లోపం మీ తల్లిదండ్రుల్లో ఉంది. అయితే మా చిన్నతనం
(08:19) నుంచి మేము నేర్చుకున్నవి ఏంటి అంటే ఎవరైనా ఇప్పటివరకు ఇలాగే వచ్చారు ఇటువంటి గౌరవ మర్యాదలు మాతోనే ఎండని చెప్పొచ్చు అండి గర్వంగా చెప్పచ్చు అనమాట ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మేము కుర్చీలో కూర్చున్నామ అనుకోండి టక్కమని లేచి నిల్చునేవాళ్ళం అలాగే చేతులు కొట్టుకొని నిల్చొని వాళ్ళని కూర్చోమని చెప్పేవాళ్ళం మాకు అంత గౌరవం నేర్పారు అన్నమాట తల్లిదండ్రులు నేర్పింది మాకు తక్కువే అయినా మాకు నాకు స్కూలల్లో మా పాఠశాలలో మా గురువులు మా టీచర్స్ మాస్టర్లు బాగా నేర్పేవరండి ప్రతి లెసన్ లో ఎలా ఉండేదంటే ఆ సంస్కారం ఆ లెసన్ కి సంబంధించిన పాఠం
(09:03) విశేషాలు అవశేషాలు చెప్పడమే గాక ఆ లెసన్ బట్టి బయట పరిస్థితులు ఏంటి బయట ఏం జరుగుతుంది ఇక్కడ మనం ఎలా బ్రతకాలి ఇంకా లెసన్ తో పాటు బయట జరుగుతున్న చర్యలు కూడా మాకు అవగాహనగా చూపించేవారు కళ్ళకు కట్టినట్టు చూపించేవారు అన్నమాట మాకు స్కూళ్లల్లోనే ఎక్కువ సంస్కారం లభించిందని నేను ఇది కూడా గర్వంగా చెప్తున్నాను.
(09:28) ముందుగా మన పెద్దవాళ్ళు సంస్కారం మిస్ అయితేనండి అదే అలవాట్లు పిల్లలకు కూడా వస్తాయన్నమాట. ముందు మనకు ఉండాలి కదా అది లేనప్పుడు వాళ్ళకు కూడా రాదు. అంటే మేము బతుకుతున్నాం కదా మేము అందరిలాగే బతుకుతున్నాం అని మీరు క్వశ్చన్ వేయొచ్చు కానీ ఎలాగో ఒకలాగా బతకడం వేరు విలువలతో బతకడం వేరండి ఇదైతే చాలా కరెక్ట్ అది జీవితంలో మనకి గమ్యస్థానానికి చేర్చుతుంది విజయం వైపు నిలబడుతుంది అలాగే గర్వంతో బ్రతికేటట్టు చేస్తుందన్నమాట మరి ఇక్కడ ఈ తరం పిల్లలది పొరపాటు ఏముందండి మీరు విలువలని గౌరవాలని సంస్కారాన్ని నేర్పనప్పుడు అది అది మీ దాకా వస్తది అంటే మనదాకా వచ్చేసింది అన్నమాట వచ్చినప్పుడు
(10:14) ఏమవుద్ది వాళ్ళు కూడా మీరు నేర్పిన గుణపాఠాలే వాళ్ళు మీకు నేర్పుతారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి అది వృద్ధాశ్రమంలో పడేయటం అదే కదా మీరు నేర్పుతున్నారు సంస్కారం లేకుండా విలువలు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారు. ఆఖరికి మొక్కై వంగనిది మానై వంగుద్దా అని చెప్పి వాళ్ళకి చివరి రోజుల్లో బుర్రక ఎక్కదున్నమాట.
(10:38) మనం తల పగలు కొట్టుకున్న అప్పుడు ఎందుకు పనికిరాని వ్యర్థమైన చర్యలు అయిపోతాయి అనమాట ఒక్కసారి ఆలోచించండి పిల్లలతో కొంత సమయం గడపండి వారికి మన సంస్కృతి సంప్రదాయాలు ముందుగా మన పుట్టుపూర్వతరాలు చరిత్రలో మన పురాణాల పురాణాల గురించి చెప్పండి. అలాగే మీరు డబ్బు మోజులో పడి డబ్బు తాపత్రయంతో ఇంకా ఏదో స్టేటస్ సంపాదించాలి పెద్ద పెద్ద జాబులని తీరిక లేకుండా మీరు ఇటువంటి దారిలో పయనించడం వలన మన సమాజంతో పాటు మన కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు అన్నమాట.
(11:18) ఇదైతే నేను మొఖం మీదే కొట్టాడినట్టు చెప్పగలను. మరి ఈ తరం యువతలో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు ఈ తరం యువతని నేను ఎలా అవమానించడం అయ్యింది? మీరు చెప్పగలరు బ్రదర్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చిన సమాధానం అండి మరి ఈ తరం యువత ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు మనం ఏ దారిన వెళ్తున్నామో అని ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే మీ కుటుంబం మీ భవిష్యత్తు సమాజం ఒకటే కాదు ఈ తరం వారి భవిష్యత్తు అంటే భారతదేశ భవిష్యత్తు అని మీరు తెలుసుకోవాలి.
(11:51) వీలుంటే అప్పుడప్పుడు పాత సినిమాలు అంటే మన ఓల్డ్ తెలుగు మూవీస్ చూడాలని నా మనవి మాట. ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేశాను. మీరు అన్యతగా భావించవచ్చు. మీ యువత భారతదేశ భవిష్యత్తు మీ యువత భారతదేశ సంపద. మీ యువత భారతదేశ వారసులు ఇది మర్చిపోకండి. ప్రతి ఒక్కరు ఇది తెలుసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్తారని ఒక ఆయుధం లాగా భారతదేశానికి అవసరానికి మించి ఉపయోగపడతారని ఈ వీడియో చేయడం జరిగింది.
(12:29) అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి పనికొస్తుంది

No comments:

Post a Comment