నికోలో మాకియవెల్లి
ఇటాలియన్ దౌత్యవేత్త ...
తత్వవేత్త రాజకీయ సిద్ధాంతకర్త ...
ఆయన రాసిన
ఒక ప్రముఖ రాజకీయ గ్రంథం
యువరాజు (The Prince)
రాజకీయ తత్వశాస్త్రంలో
ఒక ముఖ్యమైన రచనగా భావిస్తారు దీనిని
ఆధునిక రాజకీయ వేత్తలు
********
ఒక యువరాజు
అధికారాన్ని ఎలా పొందాలి.
ఆ అధికారాన్ని
ఎలా నిలబెట్టుకోవాలి.
రాజ్యాన్ని ....
ఎలా స్థిరంగా ఉంచాలి
చారిత్రక అనుభవాలు
తన పరిశీలనల ఆధారంగా
ఇందులో వివరించాడు మాకియవెల్లి
*********
రాజకీయాల్లో
నీతి కంటే ఫలితాలే ముఖ్యమని
వాదించాడు మాకియవెల్లి ,
నాయకులు
తమ ప్రయోజనాల కోసం
అవసరమైతే అబద్ధాలు చెప్పడం,
మోసం చేయడం వంటివి చేయవచ్చని సూచించాడు
అందుకే ....
అతని సలహాలు వివాదాస్పదమయ్యాయి.
"మాకియవెల్లియన్" అనే పదం
దుష్ట ప్రణాళికలకు ప్రతీకగా మారింది.
*********
ఒక యువరాజు
యుద్ధ కళలో పరిపూర్ణతను సాధించడంపై దృష్టి పెట్టాలని
ఇది పాలనకు చాలా ముఖ్యమని
మాకియవెల్లి నమ్మాడు.
నాయకులకు ధైర్యం,
యుద్ధ కళ, వ్యూహాత్మక ఆలోచన,
అవసరమైతే క్రూరత్వం ...
ఈ అంశాలపై
తన పరిపూర్ణమైన దృష్టిని
కేంద్రీకరించాలంటాడు మాకియవెల్లీ

No comments:
Post a Comment