*శ్రీ సరస్వతిదేవి కీర్తన*
🕉🌞🌏🌙🌟🚩
*వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే!!*
*వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే!!*
*వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే!!*
*వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే!!*
*భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే*
*సత్యార్ధ చంద్రికే*
*మాంపాహి మహనీయ* *మంత్రాత్మికే!!*
*మాంపాహి మాతంగి మాయాత్మికే*
*మాంపాహి మహనీయ మంత్రాత్మికే*
*మాంపాహి మాతంగి* *మాయాత్మికే!!*
ఆపాతమధురము సంగీతము
అంచిత సంఘాతము
సంచిత సంకేతము
ఆపాతమధురము సంగీతము
అంచిత సంఘాతము
సంచిత సంకేతము!!
శ్రీభారతీ క్షీర సంప్రాప్తము
అమృతసంపాతము
సుకృత సంపాకము
శ్రీభారతీ క్షీర సంప్రాప్తము
అమృతసంపాతము
సుకృత సంపాకము!!
సరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదినీ
సకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని
మాంపాహి మకరంద మందాకినీ
మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే!!
ఆలోచనామృతము సాహిత్యము
సహితహితసత్యము శారదాస్తన్యము
ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము!!
సారస్వతాక్షర సారధ్యము
జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము
సారస్వతాక్షర సారధ్యము
జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము
సరస వచోబ్ధిని సారసలోచని
వాణీ పుస్తకధారిణీ
వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణీ
మాంపాహి సాలోక్యసంధాయినీ
మాంపాహి శ్రీచక్ర సింహాసినీ!!
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మిక!!
🕉🌞🌏🌙🌟🚩
వాగ్దేవతగా మనశ్వాసలో సంచరించే శబ్ద బ్రహ్మస్వరూపాన్ని హంసవాహనంగా చెప్పారు. ఏ దేవతానుగ్రహం కావాలన్నా ఉండవలసి౦ది నిష్కపటమైన భక్తి. ఎవరు ఏ మేరకు ఆరాధనా చేస్తే వారిని ఆ మేరకు అమ్మవారు తప్పక అనుగ్రహిస్తు౦ది. ఆరాధనా పద్ధతులలో వారివారి నిష్ఠకి/శ్రద్ధకి తగ్గట్లుగా ఫలితం ఉంటుంది. కర్మ శ్రధ్ధతో కూడుకున్నప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుంది. చాలామంది ఒకేకర్మ చేసినప్పటికీ ఒకరు గొప్ప ఫలితాన్ని, మరొకరు పొందలేకపోతుంటారు. దానికి కారణం శ్రద్ధ. శ్రధ్ధ అంటే శాస్త్ర వాక్యములపై విశ్వాసం.
అకుంఠితమైన విశ్వాసంతో, భక్తితో సేవిస్తే తప్పక అనుగ్రహిస్తుంది. భక్తి శీఘ్ర ఫలప్రదాయిని. సరస్వతీ ఆరాధకులు సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉండాలి. సరస్వతి తత్త్వమే శుధ్ధ సత్త్వ గుణం. శుధ్ధ సత్త్వము అ౦టే రజోగుణ, తమోగుణ దోషాలు లేనటువంటిది.
సాత్విక గుణాలైనటువంటి సత్యము, శౌచము, అహింస వంటి పవిత్రమైన పధ్ధతులు పాటిస్తూ వాక్కును నిగ్రహించుకోవాలి. వాచక రూప తపస్సు సరస్వతీ ఆరాధనకు చాలా అవసరం.
*"అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియ హితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్ఛతే"*
మాట్లాడే మాట ఎదుటివారిని ఆందోళనకు, ఉద్రేకానికి గురిచేయరాదు. ప్రియంగా, హితంగా, సత్యంగా, మితంగా మాట్లాడాలి.
స్వాధ్యాయం చేయాలి అంటే పెద్దలు రచించిన ఉత్తమ గ్రంధాలను పఠి౦చాలి. దివ్యమైన శబ్దములు మన నోటితో పలకాలి. నిరంతరం నియమంగా ఆరాధన చేయాలి. తామసిక పదార్ధాలను విసర్జించాలి. మితంగా తీసుకోవాలి.
అది కూడా అమ్మవారికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలా చేస్తూ సాధన చేస్తే ప్రసాదభక్షణం వల్ల శరీర శుద్ధి, మనఃశుద్ధి ఏర్పడితే, వాక్నిగ్రహం వల్ల త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. అలాంటి శుద్ధితో శ్రద్ధతో అమ్మను ఆరాధిస్తూ -
*"సర్వ చైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్"* మంత్రాన్ని జపించితే శీఘ్రమైన ఫలం తప్పకుండా కలుగుతుంది.
No comments:
Post a Comment