*అద్వైత జ్ఞాన సూత్రాలు.* *ఈ కొంతే నేను అని ఉన్నప్పుడు నీవు కలలో ఉన్నట్టు.*
*అంతా నేనే అని ఉన్నప్పుడు నీవు మెలకువలో ఉన్నట్టు.*
కల ఉంటే తాను - సర్వసాక్షి, కల లేకుంటే తాను - కేవలసాక్షి.
ఎక్కణ్ణుండి ఏకంగా ఉన్న తాను మూడుగా అయినాడో, మళ్ళీ ఆ కేంద్రానికి చేరుకుని "ఒకటి" అయితేగాని ఆ "హాయి" అనేది, సుఖం అనేది అనుభవానికి రాదు. గాఢనిద్రే ఆ కేంద్రం.
మెలకువ అనేది పరిధి.
నువ్వు దేనినైతే మనస్సు అంటున్నావో అది సాక్షాత్తు ఆత్మయే.
*నువ్వు దేనినైతే ప్రపంచం అంటున్నావో అది సాక్షాత్తు బ్రహ్మమే.*
*నువ్వు మార్చవలసిందిగాని, రిపేర్ చేయవలసిందిగాని ఏమీలేదు.*
*నువ్వు పోగొట్టుకోవలసిందిగాని, పొందవలసిందిగాని ఏమీలేదు.*
*కలడు కలడు అనువాడు కలడో లేడో ఏమోగాని, కలడో లేడో అనేవాడు మాత్రం కలడు.,*
*గురుపరంపరగా వచ్చేదే గుప్తవిద్య.*
*అది చాప క్రింద పారే నీరు వంటిది.*
*పారేది తెలియకుండానే చేరే చోటికి చేరుతుంది.*
*తనతో తాను ఉంటే తాను దైవంతో ఉన్నట్లే.*
*ఉన్నదే దైవం.*
*నెరవేరేదే దైవ సంకల్పం.*
*స్వప్రయత్నముగా కనిపించినా కూడా*
*అది దైవ సంకల్పమే.*.
No comments:
Post a Comment