సిగ్గులేదా శివాజితో క్షమార్పణ చెప్పించారు?అబ్బాయిలు ఆలోచించండి,sunithakrishnan@nandurihemamalini
https://youtu.be/IyVJNcooTV8?si=xbdLV616JgRE9JYe
https://www.youtube.com/watch?v=IyVJNcooTV8
Transcript:
(00:00) శ్రీమాత్ర నమః మనం మన పిల్లలకి ఏదైనా చెప్పాము అని అనుకోండి ఎవరితోనో పోల్చి చెప్తాం నువ్వు ఇలా తయారవ్వాలి ఇలా తయారవ్వాలిని అదేం తప్పు కాదు కానీ ఇదే మాట సునీత కృష్ణన్ గారితో ఒక ఆవిడ అన్నారు నువ్వు మదర్ తెరసా లాగా తయారవ్వాలని వెంటనే ఆవిడకి కోపం వచ్చిందట నేను మదర్ తెరసా లా ఎందుకు తయారవుతాను సునీత కృష్ణన్ లాగే ఉంటాను అలాగే తయారవుతాను అన్నారట ఆ సమాధానం చెప్పాలి అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి చెప్పండి.
(00:26) చిన్న వయసు నుంచే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు చూసారా అలాగే సునీత కృష్ణన్ గారు కూడా ఆవిడ ఫిజికల్లీ డిసేబుల్డ్ అన్నమాట ఆవిడకి కాలు సరిగ్గా లేదు కాలు సరిగ్గా లేకపోతే ఆవిడకి చికిత్స చేసే ఆవిడ మళ్ళీ నడవడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టిందట ఎనిమిది సంవత్సరాల వరకు ఆవిడ నడవలేదు ఆవిడ కాలు పనిచేయలేదు ఎన్నో ఆవిడకి చికిత్సలు చేసిన తర్వాత అప్పుడు ఆవిడ నడవగలిగారు.
(00:50) చూసారా బ్రతుకు పోరాటం అంటారు చూసారా అలా ప్రతిదానికి ఆవిడ పోరాడారు. చిన్నప్పటి నుంచి ఆవిడకి సమాజ సేవ చేయాలని ఒక మంచి దృక్పదం ఎనిమిదేళ్ల వయసుకే ఇంకొకళ్ళకి చదువు చెప్పటం అలాగే సమాజంలో జరిగే అసమానతల్ని ఎదిరించడం అవి చేసేవారు. ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తున్నారు అని అనుకోండి ఆ మంచి పని చాలా మందికి నచ్చదు. ఆ మంచి చేసేవాళ్ళని ఏదో విధంగా దెబ్బ తీయాలని అనుకుంటారు అలాగే సునీత కృష్ణన్ గారి మీద కూడా దాడి చేశారు ఎలాగో తెలుసా ఎనిమిది మంది ఈ ఈ చిన్న పిల్లని 15 ఏళ్ల వయసులో ఉన్న ఈ పిల్ల మీద అందరూ ఎనిమిది మంది కలిసే ఆవిడ్ని చాలా ఇబ్బంది
(01:30) పెట్టారు. సరే అంతకుముందు వరకు ఈ సునీత కృష్ణన్ గారిని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఆ నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పిన వాళ్లే ఎప్పుడైతే ఈ దుర్ఘటన జరిగిందో ఆ తర్వాత నుంచి ఆమె అప్పుడే చెప్పాం కదా అలా రోడ్డు మీదకి పరిగెత్తొద్దు అని అలా చేయొద్దు అని అలా చేస్తే ఏదో ఒక రోజు ఇలాంటిదే జరుగుతుందని మేము కూడా చెప్పాం కదా అని సూటి పోటి మాటలు అనడం మొదలు పెట్టారు.
(01:54) ఇంట్లో అప్పటివరకు ఈవిడ్ని చాలా గొప్పగా చూసి ఎప్పుడైతే ఈ దుర్ఘటన జరిగిందో అప్పుడు వాళ్ళు మౌనంగా ఉన్నారు ఆవిడని ఏం తిట్టలేదు కానీ మౌనంగా ఉన్నారు. అలాని పూర్తిగా సపోర్ట్ చేయలేదు. అంత ధైర్యంగా ప్రతిదాన్ని ఎదుర్కున్న ఈవిడ ఎన్నో రోజులు బాధపడ్డారు. ఆవిడ బాధపడిన కారణం ఏంటంటే ఎవడో ఏదో అంటున్నారని కాదు అయ్యో నాకు కదా దెబ్బ తగిలింది దెబ్బ తగిలిన నన్నే ఎందుకు ఇలా అంటున్నారు దెబ్బ కొట్టిన వాడిని ఎందుకు మాట్లాడటం లేదు వాడు కనిపించలేదా అని సహజంగా సమాజంలో చేసేది ఇదే ఆ దెబ్బ తిన్న అమ్మాయి మీద జాలి చూపించం ఏ ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళింది ఒంటరగా
(02:31) ఎందుకు తిరిగింది అంటాం. ఎందుకు వెళ్ళినా ఎందుకు తిరిగినా ఈ మగ వెధవకి ఈ ఆడపిల్లని బాధ పెట్టాలని రూల్ ఏమైనా ఉందా చెప్పండి. ఇప్పుడు ఏదైనా గబుక్కున అత్యవసర పరిస్థితిలో బయటకి వెళ్ళవలసి వస్తుంది అంటే కాటేసేస్తారా ఈ దరిద్రపు వెధవలు అలా ఒక మంచి పని చేసే అమ్మాయిని ఆ మంచి పనులు చేయనివ్వకుండా అడ్డుపడాలని చేసిన పాసవిక చర్య అన్నమాట ఈ సునీత కృష్ణన్ మీద జరిగిన దాడి అంతవరకు ఆవిడ సమాజ సేవలు చేయలేదా చేశారు కానీ అప్పుడు ఆలోచన పుట్టిందట అరే దెబ్బ తిన్న నా మీద సానుభూతి చూపించకపోగా నన్ని తిడుతున్నారే చేసిన వాడిని ఏమ అనటంలేదే అని చెప్పి ఆవిడ
(03:12) బాధపడ్డారట సరే దురదృష్టవసాత్తు ఆవిడ మీద జరిగిన ఆ దాడి ఏదైతే ఉందో ఆ దాడి చేసిన వాళ్ళని ఈవిడ గుర్తుంచుకోలేకపోవడం వల్ల అది కేసు కొట్టివేయబడింది. అంత దౌర్భాగ్యం అంటే ఆడపిల్లల మీద ఏదైనా దాడి జరిగితే ఆ దాడి చేసిన వాడిని ఆ పరిస్థితుల్లో కూడా ఆడపిల్ల గుర్తుపట్టాలి అది దౌర్భాగ్యం అంటే సరే ఆ ఎప్పుడైతే ఈవిడ మీద దాడి జరిగిందో ఆవిడ తనకి దెబ్బ తగిలింది కదా అని అక్కడ ఆగిపోలేదు.
(03:42) నన్ను ఇలా చేశారు కదా అని చెప్పి ఆవిడ ఆగిపోలా ఆవిడ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈవిడ మలయాళి కేరళలో ఉంటారు. అయితే అక్కడ ఆ చుట్టుపక్కల జరిగే ఏదైతే ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయో అప్పటినుంచి అలాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కూడా దృష్టి సారించారు 15 ఏళ్ల వయసులో ఒక చిన్న పిల్ల ఇలాంటి పనులు చేయాలి అంటే ఆవిడకి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి చెప్పండి.
(04:09) నేనైతే అంటాను భగవంతుడు అనుగ్రహించి ఈ భూమి మీదకి పంపించిన ఒక గొప్ప వరంఏమో ఆడపిల్లల పట్ల ఆవిడ అని అనిపించింది నాకు ఆవిడ ఇంటర్వ్యూస్ అన్ని నేను చూసినప్పుడు సరే ఆవిడ ఆ తర్వాత చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అందులో ఈవిడకి జైలు శిక్షను కూడా విధించారు ఎందుకంటే ఒక అధికారి ఒక మంత్రి ఆ మంత్రి చేసిన పనులకి ఈవిడ ఏదో మాట్లాడారంట అందుకని రెండు నెలల పాటు ఈవిని తీసుకువెళ్లి జైల్లో పెట్టారు.
(04:35) ఆ రెండు నెలల పాటు ఈవిని చూడడానికి సొంత వాళ్ళు కూడా రాలా ఎంతోసేపు ఎదురు చూశారట కానీ వాళ్ళు రాలేదు సరే జైల్ శిక్ష అయిపోయింది ఇంటిక వచ్చారు ఇంట్లో వాళ్ళు నీకు ఇంకా ఫిజికల్ గా కూడా మిమ్మల్ని వదిలేస్తున్నాము అంటే ఇంకా ఆవిడ్ని వెళ్ళిపోమని చెప్పారు అలా ఆవిడ ఇంటి నుంచి బయటక వచ్చేసి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఎక్కి భాగ్యనగరం వచ్చారట అక్కడ ఆవిడ స్నేహితురాలు ఎవరో ఆవిడకి సహాయం చేశారట ఆ సహాయం చేసినప్పుడు ఒక స్లమ్ ఏరియాలో తొమ్మిది సంవత్సరాల పాటు జీవిత తాన్ని అక్కడే గడిపారు అప్పుడు ఆవిడకి ఆలోచన మొదలైంది. ఏంటంటే ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే
(05:12) ఏదైనా దెబ్బ తిని ఆవిడకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా ఉంటే ఎవరు రెస్క్యూ చేయడానికి రారు. అప్పుడు మొదలైన ఆలోచన ఏంటంటే ఎలా అయినా సరే ఇలా సమాజంలో ఎరి ఏ ఆడపిల్లల మీదైతే దాడులు జరుగుతాయో వాళ్ళని ఎలా సంరక్షించాలి ఎలా కాపాడాలి అనే ఆలోచన మొదలైంది. సరే ఈవిడ ఇలాగే కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉన్నారు అక్కడ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కూడా పాపం ఈవిడకి భోజనం అది పెట్టి తొమ్మిది సంవత్సరాల పాటు ఈవిడని కడుపులో పెట్టి చూసుకున్నారు ఈవిడ కూడా అదే విధంగా ఆడవాళ్ళని ఎలా సంరక్షించారు ఒక ఆడవాళ్ళనే కాదు ఈవిడ ఆపరేషన్స్ చేసినవి చాలా ఉన్నాయి. చాలా విషయాల్లో ఆవిడ పోరాడారు.
(05:51) 1997వ సంవత్సరం ఈవిడకి ఒక ఫోన్ వచ్చింది అదేంటంటే రైల్వే ట్రాక్ మీద నాలుగు సంవత్సరాల చిన్న ఆడపిల్లని పడేసారు ఎవరో రక్తపు మడుగులో ఉంది మీరు వెంటనే రండి అని వెంటనే ఈ సునీత కృష్ణన్ గారు వెళ్ళారు. ఆ పిల్లని చేతిలోకి తీసుకుంటే ఆ మర్మా అవయవాల నుంచి పేగులు బయటికి వచ్చేసాయట. వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు ఈవిడితో పాటు ఇంకొక ఇద్దరు కూడా సహాయానికి వచ్చారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు.
(06:19) 1997వ సంవత్సరంలో ఆ నాలుగేళ్ల పిల్ల మీద దాడి చేసింది ఎవరో తెలుసా లైంగికంగా దాడి చేసింది ఎవరో తెలుసా కన్న తండ్రి ఆ దరిద్రుడే చేశాడు ఆ చిన్న పిల్ల మీద వాడికి ఇంగితనం అంటూ లేదా తన కడుపున పుట్టిన బిడ్డ మీద అలా పాసవికంగా దాడి చేస్తాడా అంటే వీళ్ళు ఒక పశువులాగా మారిపోతున్నారు వాళ్ళకి ఇంకా ఆ సమయాల్లో ఏది తెలియదు వాడి కోరిక తీర్చుకోవడం కోసం అది ఆడదైతే చాలు కూతురా ఎవరా అవసర అవసరం లేదు వీళ్ళు కొంతమంది తల్లుల మీద కూడా ఇలాంటివి చేసేస్తున్నారు ఒక కొడుకు ఒక కొడుకు తన తల్లిని వాడు మందు కొట్టేసి వచ్చి ఆ తల్లిని పాడు చేశడట తల్లి ఏడిచినా సరే వదిలి పెట్టలేదు
(07:03) అంటే వాళ్ళు ఎంత పశువుల్లాగా మారిపోతున్నారు చూడండి. సరే ఆ అమ్మాయిని చదివించారు ఆ అమ్మాయి ఇప్పుడేమో లా చదువుతుందట. ఆ సమయంలో ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ మీద పడినప్పుడు ఆ చిన్న పిల్ల పడినప్పుడు ఈ సునీత కృష్ణన్ గారు కనిపించిందట దేవుడు ఉన్నాడా అసలు దేవుడు ఉండుంటే ఇలా జరిగి ఉండేదా అని కానీ ఆ తర్వాత అనిపించిందట దేవుడు ఉండబట్టే కదా ఆ అమ్మాయికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే నాకు ఫోన్ చేశారు నేను వెళ్ళాను నాతో పాటు వచ్చారు ఈ డాక్టర్ కూడా అతనికి అమ్మాయికి చికిత్స చేశారు అందువల్లే కదా ఆ అమ్మాయిని మేము రెస్క్యూ చేయగలిగాము ఇప్పుడు ఆ అమ్మాయి లా చదువుతోంది కదా అని
(07:40) అంతవరకు దేవుడు ఉన్నాడా అంటూ కొన్ని మూఢ నమ్మకాలని ఆవిడ వదిలేసి భగవంతుడు ఉన్నాడు అని ఆవిడ ఇంకాస్త భగవంతుడికి దగ్గరయ్యాట ఆవిడ చేసిన ఆపరేషన్స్ అన్ని ఇన్ని కావు తెలుసా ఆవిడ మాట్లాడుతుంటే ఇంటర్వ్యూలో కళ్ళలో నుంచి నీళ్లే వచ్చాయి. అసలు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఏదైనా ఒక అడ్డంకి వచ్చింది అని అనుకోండి మధ్యలోనే మనం వదిలేస్తాం కానీ ఆవిడ మధ్యలో వదలలేదు ఆవిడ మీద 18 సార్లు దాడి చేశారు ఒకచోట అంటే చెప్పాలి అంటే బ్రోతల్హౌస్ నేను ఈ మాట మాట్లాడకూడదు అక్కడ ఆడపిల్లల్ని బాధ పెడుతున్నారని విషయం తెలిసినప్పుడు వాళ్ళని రెస్క్యూ
(08:20) చేయడానికి వెళ్ళినప్పుడు ఈ రెస్క్యూ చేసే ఆపరేషన్స్ ఎంత ప్రమాదకరమైనవో తెలుసా ఈ మాదక ద్రవ్యాలు ఈ ఆడపిల్ల పిల్లలకి సంబంధించి దాంట్లో ఎవరైనా కలగచేసుకున్నారు అని అనుకోండి కలగ చేసుకున్న వాళ్ళని చాలా దారుణంగా బాధ పెడతారు. అలాగే సునీత కృష్ణం మీద కూడా ఇలా చెయ్యి పెట్టి ఒక వెధవ ఈ ఇయర్ డ్రమ్ మీద కొట్టాడట కొడితే ఈ ఇయర్ డ్రమ్ పగిలిపోయింది స్పాట్ లో ఆవిడకి వినిపించడం మానేసింది.
(08:46) ఎన్నో సంవత్సరాలు అసలు ఆవిడకి ఒక చెవి వినిపించకుండానే ఆవిడ కాలాన్ని గడిపేశారు తర్వాత ఆ మధ్య ఆపరేషన్స్ అవి చేయించుకున్నారట కొన్నాళ్ళేమో ఆ మిషన్ ఏదో పెట్టుకున్నారట తర్వాత అది కూడా తీసేసారు. అలా ఆవిడ మీద ఎన్ని సార్లు దాడి చేశారు ఒకతనైతే ఈవిడ ఇలా రెస్క్యూ చేస్తున్నారు కదా ఆడపిల్లల్ని కోపం వస్తుంది కదా దుర్మార్గపు వెధవలకి వాడు ఈవిడ ముఖం మీద యసిడ్ పోయడానికి వచ్చాడట వాడు మెట్లుఎక్కుతున్నాడు పైకి మెట్లుఎక్కుతున్నప్పుడు వాడి జేబులో యసిడ్ బాటిల్ ఉందిట ఆ యసిడ్ బాటిల్ ఉన్నప్పుడు వాడు ఆ మెట్ల మీద నుంచి జారి పడ్డాడట ఎందుకు జారిపడ్డాడో తెలియదు చూడండి ఒక
(09:25) భగవంతుడు మంచివాళ్ళ మీద ఏదైనా చేయాలని అనుకుంటే తాత్కాలికంగా మంచి వాళ్ళు బాధప పడొచ్చు గాక కానీ భగవంతుడు ఇలాంటి వాళ్ళని శిక్షిస్తాడు కాకపోతే సమయం తీసుకుంటుంది అంత ఓర్పు సహనం కూడా మనకు ఉండాలి వాడు ఆ మెట్ల మీద నుంచి పడినప్పుడు ఏమైందంటే ఈ కాలు విరిగిపోయిందట ఈ యసిడ్ బాటిల్ ఎవరి మీదైతే వేయాలి అని అనుకున్నాడో ఆ సునీత కృష్ణన్ గారే వీడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాడు చెప్పిన మాట ఏంటంటే నేను మీ ముఖం మీద యసిడ్ వేయడానికి వచ్చాను వాడు చెప్పిన మాట అది లేతే అంతవరకు వాళ్ళకి కూడా తెలియదు అప్పుడు ఒక్క క్షణం భయం వేసిందట ఆవిడికి
(10:00) నిజంగా వాడు ఇదే చేసి ఉంటే ఏమైపోయి ఉండేది నేను మొదలుపెట్టిన ఈ సమస్థ ఏమైపోయి ఉండేది ఈ ఆడపిల్లలందరూ ఏమైపోయి ఉండేవారు అని ఆవిడ చాలా భయపడ్డారట ఒక్కొక్కసారి అనిపించేదట ఆవిడకి కూడా నేను చేస్తున్నది కరెక్టేనా నేను చేస్తున్నది కరెక్టేనా అని కానీ అదే సమయంలో ఏ ఆడపిల్ల అయితే ఆ జీవితాన్ని రక్షించారో వాళ్ళని చూసినప్పుడు ఈవిడకి చాలా ఆనందం కూడా కలిగేదట ఎన్నో సంవత్సరాలు ఆవిడ మీద జరిగిన దాడికి కూడా ఆవిడ బాధపడ్డారు కానీ కానీ ఆవిడ బాధ అంతా ఏంటంటే తప్పు చేసిన వాడిని వదిలేసి ఆడపిల్లకి మాత్రమే ఎందుకు రెస్ట్రిక్షన్స్ అవన్నీ పెడుతున్నారు ఆడపిల్లకి మాత్రమే
(10:38) ఎందుకు చెప్తారు అందులో ఆడపిల్ల తప్పేముంది అంటారు. సరే ఇంకొక రోజు ఎవరో ఫోన్ చేశారట ఆ ఫోన్ సారాంశం ఏంటంటే మేడం మీకు ఒక విషయం చెప్పాలిటెలిగ్రమ అనే యాప్ ఉంది దాంట్లో మీరు ఏది కావాలని సెర్చ్ చేస్తే అది దొరికేస్తుంది అన్నాట ఆవిడకి ఆశ్చర్యం అనిపించిందట అదేంటిటెలిగ్రామ యప్ లో ఏదైనా సెర్చ్ చేస్తే అన్ని దొరికేస్తాయా అని అప్పుడు ఆవిడ ఏం చేశారు అంటే కొన్ని సెర్చ్ చేశారన్నమాట ఇలా ఆన్లైన్ల గురించి కొన్ని కొన్ని వ్యాపారాల గురించి అంటే ఎక్కడెక్కడైతే స్కామ్స్ జరగడానికి వీలు ఉంటాయో వాటన్నిటి గురించి నుంచి కొట్టారట కొడితే ఎలా చేయాలి ఎప్పుడు
(11:15) రావాలి ఎప్పుడు కలవాలి ఇవన్నీ వచ్చేసాయట ఇవన్నీ కొట్టిన తర్వాత ఆవిడ ఏం చేశరట ఈ చిన్న పిల్లల మీద జరుగుతున్న ఈ లైంగిక దాడి గురించి కొట్టారట అలాంటి సైట్స్ కోసం అప్పుడు రెండు సైట్స్ ఓపెన్ అయ్యాయట ఒక్కొక్క సైట్ లోనూ 35వ000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారట మొత్తం 70వేల మంది సబ్స్క్రైబర్స్ అన్నమాట రెండు సైట్స్ లో ఈవిడ ఏం చేశారు అంటే అప్పుడు ఇంకొంచెం ముందుకి వెళ్దాము అని చెప్పి ఆవిడ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళారు నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటి ఇప్పుడు ఆ సైట్స్ లో ఏంటంటే చిన్న పిల్లల మీద దాడి జరిగిన వీడియోస్ అన్నమాట దానికి సంబంధించిన
(11:49) వీడియోస్ ఉన్నాయట అందులో కొన్ని వీడియోస్ కావాలని చెప్పి ఈవిడ 532 రూపాయలు అంటే తొమ్మిదో ఎన్నో వీడియోస్ కావాలని చెప్పి ఆవిడ పెట్టినప్పుడు ఆ వీడియోస్ వస్తే అసలు అందులో చూసినప్పుడు ఎంత దారుణమైన విషయాలు ఉన్నాయి అంటే ఇంత సమాజం ఇంత దుర్భరమైన స్థితికి వెళ్ళిపోయిందా అని ఈవిడ ఎప్పుడైతే అందులోకి ఎంటర్ అయ్యారో వరసపెట్టి కాంటాక్ట్ అయిపోతుందట ఈవిడ కొన్ని సిడీస్ కొన్నారు అని చెప్పాను కదా అందులో ఒకడు మాత్రం ఈ డబ్బులు పంపించినా సరే సిడి పంపించట్లేదట సిడి పంపించకపోతే ఇంకా ఎందుకు సిడి పంపించలేదు అని చెప్పి అడిగితే అటు నుంచి వచ్చిన
(12:25) సమాధానం ఏంటంటే నేను చూషన్లో ఉన్నాను కొంచెం ఆలస్యం అవుతుంది అన్నా వెంటనే ఇతనకి ఈవిడకి ఆశ్చర్యం అనిపించిందట అంటే ఇప్పుడు ఈ సైట్స్ లో ఈ వీడియోస్ అన్నీ పెట్టినవి సిడీస్ అన్ని అమ్ముతున్నది చిన్నవాళ్ళా ఆడవాళ్ళా లేదు అంటే ఎవరు అని వాడు వాడు చూషణలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి చిన్న పిల్లాడు అనే కదా అర్థం ఏదో చదువుకుంటున్నాడు అనే కదా అర్థం అంటే చదువుకునే వయసులో వాళ్ళు ఎంత పర్వెటెడ్ అయిపోయారో చూడండి.
(12:51) అందులో ఆప్షన్స్ ఇచ్చారట చిన్న పిల్ల కావాలా ఎన్ని సంవత్సరాలు ఆడపిల్ల కావాలి సన్నగా ఉన్న అమ్మాయి కావాలా లావుగా అమ్మాయి కావాలి ఇంత దుర్మార్గంగా ఒక చిన్న పిల్ల మీద కూడా జరుగుతున్న దాడుల్ని వాళ్ళు వీడియోస్ తీసిపెట్ట దాడి ఏం కాదు చిన్న పిల్లల్ని అలా చేస్తూ ఉంటే ఆ వీడియోస్ అన్నీ తీసుకొచ్చి సామాజిక మాధ్యమంలో పెట్టేసి వాటిని అమ్ముకుంటున్న దరిద్రపు కొట్టు సమాజంలో మనం బతికి చస్తున్నాం.
(13:17) ఎంత దౌర్భాగ్యపు స్థితి చెప్పండి ఇది అంత దౌర్భాగ్యపు సమాజంలో ఉన్నాం. సరే ఆవిడ చాలా దీని మీద కృషి చేశారు ఆ సైబర్ ద్వారా కూడా ఈవిడ సలహాలు తీసుకొని వాళ్ళ సహాయం కూడా తీసుకొని ఒక టీం ని ఏర్పాటు చేసుకొని ప్రజ్వల అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ ప్రజ్వల సంస్థ ద్వారా కొన్ని వేల మంది ఆడపిల్లల్ని రెస్క్యూ చేసి ఆవిడ ఆ సంస్థలో కాపాడుతున్నారు.
(13:43) ఇప్పుడు ఎవరైతే ఈ వృత్తిని చేశారో శరీరాన్ని పాపం తప్పనిసరి పరిస్థితుల్లో శరీరాన్ని అమ్ముకున్నారో వాళ్ళ పిల్లల్ని ఈవిడ రెస్క్యూ చేసి వాళ్ళకి చదువు చెప్పారు ఇలా ఆవిడ చేసిన సామాజిక కార్యక్రమాలు ఒకటి రెండు మూడు కాదు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అందుకే కదా ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు అనేది ఇచ్చింది పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు కూడా నేనుేదో గొప్ప పని చేశాను కాబట్టి నాకు ఇచ్చారు అని ఆవిడ ఏమి సంతోష ించలేదు ఎందుకంటే ఆవిడ అసలు నామినేట్ చేసుకోలేదు ఏదైనా ఒక కావా తెచ్చుకోవాలిని అనుకుంటే నామినేట్ చేసుకోవాలి కానీ ఆవిడ నామినేట్
(14:19) చేసుకోలేదుట ఆవిడ ఒక్కొక్క మాట చెప్తుంటే అసలు గుండెల్లో గుణపాలు గుచ్చినట్టు అనిపించింది ఆమ్స్టర్డామలో లీగల్గా ఈ వ్యభిచారం చేసే కొన్ని స్థలాలు ఉంటాయట అక్కడ వరస పెట్టి పేర్లు అవన్నీ రాసి ఉంటాయట అసలు వయలెన్స్ తో కూడిన ఈ దుర్మార్గపు పని చేసేవాళ్ళకి కొన్ని ఆప్షన్స్ మీకు ఏ టైప్ కావాలి అంటే ఏ విధంగా మీరు అమ్మాయిని కావాలని కోరుకుంటున్నారు ఇవన్నీ లీగల్ గా ఉంటాయండి అక్కడ బెల్ట్తో కొట్టడం మీరు కొడతారు ఇలా ఎంత జుగుప్సాకరమైన పరిస్థితులను కూడా అక్కడ వర్ణించి మీకు ఎలా కావాలి ఏ టైప్ కావాలి అనేది లీగల్ అంట అక్కడ ఎంత దౌర్భాగ్యం చెప్పండి ఒక మగ వెధవ
(15:04) వాడు కోరిక తీర్చుకోవడం కోసం ఆడపిల్లని భోగ వస్తువుగా మార్చేసాడు వాడికి ఆ సమయానికి వాడి కోరిక తీరాలి అంతే అందుకని ఆడపిల్లని ఎంత నికృష్టంగా అయినా చేసేస్తారు. ఆడపిల్ల మీద ఎంత దాడి అయినా చేసేస్తారు. ఒకసారిట ఆవిడ చెప్తున్నారు ఆ ఏదో సంవత్సరం ఆ పేరు మర్చిపోయాను నేను అక్కడ ఒక ఆడపిల్లని బాధ పెట్టినప్పుడు ఆ బాధ పెట్టినవాడు ఎంత రెక్లెస్ గా ఇలా నవ్వుతూ ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా వాడు నవ్వాడట ఆ నవ్వు నేను మర్చిపోను ఆ వెధవ ఇంకొక చిన్న ఆవిడ వెధవ అనలేదు ఆవిడ చాలా బాగా మాట్లాడారు నాకే ఒళ్ళు మండిపోయి నేను అంటున్నాను వాడు అలా నవ్వాడు అంటే వాడికి
(15:51) ఎంత కండకావరం చెప్పండి అలా నవ్వాడంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని నశనం చేసేసి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకున్నట్టుగా నవ్వాడు అంటే వాడి ధైర్యం ఏంటి వాడి వెనకాలు ఉన్నది ఏంటి కొవ్వు కదా ఎంత కొవ్వు కాకపోతే ఈ వెధవలు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేస్తారు. మొన్న 13 సంవత్సరాల ఆడపిల్ల మీద నలుగురు వెధవలు నలుగురు వెధవలు లైంగిక దాడి చేశారు.
(16:22) ఎన్ని సార్లు చేశారో తెలుసా లెక్క లేనన్ని సార్లు చేశారు ఆ చిన్న పిల్ల మీద దాడి ఇప్పుడు వెంటనే అందులో ఒక మాట రాశరన్నమాట ఏంటంటే 10 గంటల సమయంలో ఆ అమ్మాయి స్నేహితురాలతో మాట్లాడుతూ ఉండగానే ఒక లైన్ ఉందన్నమాట ఆ సమయంలో ఎత్తుకుపోయారు అన్నమాట ఆ పిల్లని వెంటనే నాకు ఆ వీడియో చేయమన్నప్పుడు కింద కామెంట్ ఏం పెట్టారు అంటే ఆడపిల్ల ఆ సమయంలో స్నేహితురాలతో మాట్లాడడం ఏంటి తప్పు కదా అని అంటే ఇక ఏదైనా అవసరం వస్తే మాట్లాడకూడదా అలా మాట్లాడితే ఈ దరిద్రపు కొట్టు విధాలు ఎత్తుకుపోయి పాడు చేసేస్తారా అది తప్ప ఇంకా ఆడపిల్ల అంటే ఇంక వేరే దృష్టి ఏం రాదా వీళ్ళకి ఇంక ఏమ అనిపించదా
(17:02) ఆడపిల్ల కొన్ని కొన్ని పరిస్థితుల్లో బయటికి రావల్సి ఉంటుంది అలా వస్తే పాడు చేసేస్తారా అలా వస్తే ఆ అమ్మాయిని నాశనం చేసేస్తారా ఆవిడ అదే చెప్తున్నారు ఎప్పుడు గాయపడ్డ వాళ్ళకి మాత్రమే కాదు నీతులు చెప్పవలసింది ఆ వెధవలకి కూడా చెప్పాలి ఆ వెధవని బయటికి తీసుకురావాలి ఇప్పుడు ఈ 13 ఏళ్ల పిల్లని అలా చేసినప్పుడు నేను ఆ వీడియో చూశాను పందుల్లాగా ఉన్నారు వాళ్ళు దున్నపోతు వెధవల్లాగా ఉన్నారు వాళ్ళు అందులో ఈ అమ్మాయి మీద దాడి చేసింది నలుగురు అయితే అందులో ఇద్దరు తండ్రి కొడుకులు అన్నమాట తండ్రి కొడుకు అది అంటారు చూసారా ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేస్తుందా అని
(17:41) అంటారు చూసారా తండ్రి వెధవ అయితే కొడుకు కూడా వెధవలాగే అవుతాడు సామాన్యంగా అంటే అందరినీ కాదు కింద కామెంట్లు పెట్టేయకండి మళ్ళీ ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఆ పిల్ల జీవితాన్ని చిరిమేశారు. వాళ్ళు ముఖం దాచుకొని వస్తున్నారు అన్నమాట ముందుకి ఇప్పుడు వచ్చిందా సిగ్గు ఆ పిల్ల జీవితాన్ని చినిమేసాక వాడి మొహం కనిపించకూడదని ఇలా మొహం అడ్డు పెట్టుకుంటున్నారా నిజంగా అధికారులు ఏం చేయాలో తెలుసా వాళ్ళని ముఖాలు చేతులు అడ్డు తీసేయమని చెప్పి డైరెక్ట్ గా వీడియో తీసి మొత్తం ఆ ఊళలో అన్ని చోట్ల అంటించేయాలి వాళ్ళ ఫోటోస్ అలాంటి వాడికి కదా శిక్ష విధించాలి వాడు
(18:18) ముఖం దాచుకుంటున్నాడా వాడు వాడు మాత్రం ముఖం దాచుకొని వస్తాడు ఎందుకంటే వాడి గురించి ఎవరికీ తెలియకూడదని కానీ అన్యాయ అయిపోయిన ఆడపిల్ల జీవితాంతం ఆ బాధని భరిస్తూనే ఉండాలా ఆ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసిన అతను చెప్తున్నారు అమ్మ మీరు ఇలాంటివి చాలా చూశారు కదా మీరు ఏమఇస్తారు ఒక మెసేజ్ అడిగాడు అప్పుడు ఈ సునీత కృష్ణన్ గారు ఒక మాట అన్నారు ఇప్పుడు మీరు మొబైల్ తీసుకుని మీ సంతోషం కోసము ఆ కాసేపే కదా ఏదో చూద్దామని చెప్పి మీరు ఏదైతే స్క్రోల్ చేస్తున్నారో ఒకసారి మీరు చూస్తారు దానికి అలవాటు పడతారు దాన్ని చూస్తూనే ఉంటారు మీరు ఇచ్చిన ఒక
(18:56) వ్యూ ఎక్కడో ఒక అమ్మాయి జీవితాన్ని కాల రాసేస్తుందని గుర్తుపెట్టుకోండి మానవత్వంతో మెలగండి అలాంటివి చూడకండి మీరు ఆనందం కోసం మీరు ఆ సైట్ ని చూస్తున్నారు కానీ మీరు ఇచ్చిన వ్యూ ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసేస్తుందని గుర్తుపెట్టుకొని దయచేసి అలాంటి సైట్స్ చూడకండి అన్నారు. ఎవరైనా వింటారా మగపిల్లలు చెప్పండి ఖాళీ దొరికింది అని అనుకోండి ఈ మొబైల్ డేటా ఉంది అని అనుకోండి ఆ మొబైల్ తీసి ఆ కనిపించిన ఆ దరిద్రపు కొట్టు వీడియోలు చూడకుండా ఉండలేకపోతున్నారు.
(19:30) సిగ్గు శరము మానాభిమానము అన్ని వదిలేసిన వాళ్ళు కదా ఇలాంటి పనులు చేస్తారు. మీరు చూసిన ఒక్క వ్యూ మీరు సరదా కోసం మీ టైం పాస్ కోసం మీరు ఐదు నిమిషాలు మీకు కలిగే ఏదో ఆనందం కోసం మీరు చూసే ఆ ఒక్క వ్యూ ఇంకొక అమ్మాయి జీవితాన్ని చిదిమేస్తుంది అది గుర్తుపెట్టుకోండి చాలామంది కొంతమంది కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఇప్పటికీ అలాంటి దరిద్రపు కొట్టు సైడ్స్ చూస్తూ ఉంటారు.
(19:58) వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళ ఆనందం మాత్రమే ముఖ్యం కానీ వాళ్ళ ఆనందం కొంతమంది అమ్మాయిల జీవితాన్ని చిదిమేస్తుందని గుర్తుపెట్టుకుంటే అలాంటి సైట్స్ ఓపెన్ చేయరు నిజంగా మానవత్వం ఉన్న ఎవ్వడైనా సరే అలాంటివి చూస్తున్న ఎవడైనా సరే అలాంటివి చూడడం మట్టే కదా అవన్నీ ఇంకా సజెషన్స్ ఇస్తారు ఆ సజెషన్స్ మనం చిన్న ఎగ్జాంపుల్ చూడండి మనం ఏదైతే ఎక్కువగా చూస్తుంటామో మనకి మొబైల్ లో అవే ఎక్కువగా సైట్స్ వస్తూ ఉంటాయి ఆ బయటవాడు కూడా మనం ఏదైతే ఎక్కువ ఇష్టపడుతున్నాము అని అనుకుంటామో అవే వాటినే మనకి చూపిస్తూ ఉంటాడు అలాంటివే తీయాలని అనుకుంటాడు.
(20:30) లేకపోతే ఈ చైల్డ్ ఈ సిఎస్ఏఎం అంట దాని పేరు ఏదో దానిని ఓపెన్ చేస్తే రెండు సైట్లు ఓపెన్ చేస్తే ఒక్కొక దాంట్లోనూ 35వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఎంత దిగజారుడుతనం అంటే చిన్న పిల్లల మీద అలా జరిగితే చూసి ఆనందించాలని పాసవికత ఎంత ఉందో చూడండి. 70 వేల మంది డైరెక్ట్ గా అక్కడ సబ్స్క్రైబర్స్ కనబడుతున్నారు అంటే ఎంత పాసవికత చూడండి ఒకసారి మనలో కూడా మార్పు రావాలి ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి ఏ నువ్వు ఇలా తిరిగావు కాబట్టే నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టే నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే అని మనం ఆడపిల్లని నిందించక నించోబెడతాం కదా
(21:11) అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మగవాడికి కూడా నియమాలు చెప్తారో మగవాడిని కూడా సరిగ్గా ఉండమని చెప్తారో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అని అన్నారు ఆ అది నిజం అది అక్షర సత్యం ఆడపిల్లని తనని తాను కాపాడుకోవడం కోసం మీరేమో ఈ కుంఫు నేర్చుకోండి ఈ కరాటే నేర్చుకోండి అని అంటారు ఓకే ఆల్రైట్ నేర్చుకుంటారు కానీ ఆ ఆడపిల్ల మీద ఒకేసారి పది మంది పడిపోతే తను నేర్చుకున్న కుంఫు ఆవిడకి గుర్తుకొస్తుందో రాదో ఆ సమయంలో ఆ పది మంది మీద పడిపోతే ఆ అమ్మాయి ఏం చేయగలదో మార్పు మగవాడిలో రావాలి మగవాడిలో కూడా రావాలి అని ఆవిడ చెప్పారు అది నిజమే కదా అది అక్షర సత్యం కదా మనం చెప్పగలుగుతామా
(21:55) మగపిల్లవాడికి వాడు గుడ్డలు విప్పేసుకొని బయటకి తిరిగినా వాడిని అవసరం ఎవరు ఏమి అనం కదా ఒక్క మాట కూడా అనం పల్లెత్తు మాట కూడా అనం వాడికి సంస్కారాన్ని నేర్పిస్తే సమాజం బాగుపడుతుంది. ఆవిడ ఏమన్నారో తెలుసా నేను ఈ ప్రజ్వల ఈ ఫౌండేషన్ ని తీసేసే రోజు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని అన్నారు. నిజం కదా అది ఎంతమంది బాధపడిన ఆడపిల్లల్ని ఆవిడ సంరక్షిస్తున్నారో ఆ వాళ్ళని చూసిన ప్రతిసారి ఈవిడ మనసు క్షోభిస్తుంది కదా తర్వాత ఒక డైరెక్టర్ని వివాహం చేసుకున్నారు ఈవిడ అభిరుచిలు కలిసిన ఆవిడనే అతన్నే పెళ్లి చేసుకున్నారు పిల్లలు కూడా వద్దు అనుకున్నారు ఎందుకంటే
(22:38) పిల్లలు పుడితే మళ్ళీ నాలో ఎక్కడ స్వార్థం పెరిగిపోతుందో వీరందరూ నా పిల్లలే అని అడుగడుగున అడుగడుగున ఆటంకాలు 18 సార్లు ఆవిడ మీద దాడి చేశారు అంటే ఆవిడ ఎంత కృంగిపోయి ఉండాలి ఏదో ఒక స్టేజ్లో ఆవిడ చేసే పనిని ఆవిడ వదిలి పెట్టేసి వచ్చేసేయాలి కానీ రాలా నేను సాధిస్తాను నా లక్ష్యాన్ని నేను చేరుకుంటాను అదే ఆవిడ మనసులో స్థిరమైన నిర్ణయం ఆవిడ అంటారు పిల్ల కనిపించకపోతే వెంటనే కంప్లైంట్ ఇవ్వండి దాన్ని అందరికీ తెలిసేలా చేయండి ఈవెన్ మీ ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీకు ఇష్టపడకుండా మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకో మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోకుండా
(23:22) ప్రేమించిన వాడితో వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏం చేస్తోంది ఎక్కడ ఉంది అనే విషయాలు మీరు తెలుసుకోండి ఎందుకంటే ఈవిడ ఎక్కడికైతే వెళ్ళారో ఈ ఆడపిల్లల్ని అమ్మేసేవి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక 30 టు 40% ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటామని తీసుకొచ్చేసి అమ్మేసిన ఆడపిల్లలు ఉన్నారు అక్కడ చూడండి అంటే మగవాడు అనేవాడు ఆడపిల్లని ఎలా మోసం చేస్తాడు ప్రేమ అని ఆ ప్రేమ అని చెప్పి మనకి ఆ సమయంలో కళ్ళు పొరలు కప్పేస్తాయి ఎవడు ఏం చెప్పినా వినం తల్లిదండ్రుల్ని తన్నేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోతే చాలా వరకు జీవితాలు అంటే అందరూ ఇలాగే చేస్తారని నేను
(24:08) చెప్పడం లేదు కానీ చాలా వరకు ఆడపిల్లలు ఈ బ్రోతల్ హౌసెస్ లో ఉన్నారట ఎంత దుర్భరమైన జీవితం చెప్పండి అసలు నాకు కు ఆవిడ ఒక మాట అన్నప్పుడు గుండె తెవిల్చేసింది. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు వాడు వాడు షాప్ లో నుంచి ఎక్కువ వస్తువులని అమ్ముకోవాలని చూస్తాడు కదా అలాగే ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయితో ఎక్కువ వ్యాపారం జరగాలని అనుకుంటాడు అందుకని ఒక్కడికే ఇవ్వడం కాదు ఆ ఒక్క అమ్మాయిని ఎంతమంది ద్వారా సంపాదించాలో అంతమందిని ఆ అమ్మాయి దగ్గరికి పంపిస్తాడు అని అన్నప్పుడు నాకు వాంతి వచ్చేసింది నాకు అంతే కదా ఒక ఆడపిల్లని ఆట వస్తువుగా
(24:51) తీసుకున్నాడు ఒక వ్యాపార వస్తువుగా తీసుకున్నాడు ఒకడు వస్తే ఆ ఒక్కడు ఇచ్చిన డబ్బులు మాత్రమే వస్తాయి వాడికి కానీ 10 మంది వస్తే 10 మంది ఇచ్చిన డబ్బులు వస్తాయి కాబట్టి ఆ పిల్ల ఏమైపోతుంది అని అసలు కనీసం ఇంగిత జ్ఞానం మానవత్వం హుమానిటీ అనేది లేదు ఫస్ట్ అలా ఆడపిల్లని ఆట వస్తువుగా మార్చేస్తున్నారు. ఆడపిల్లకి చెప్పండి దాడి జరిగితే అదేదో ఆవిడ తప్పు వల్ల జరగలేదు నీ మీద ఒక దాడి జరిగింది అంతే దెబ్బ తగిలింది అంతే ఆ దెబ్బ తగిలిన దాన్ని పాజిటివ్ గా తీసుకో సమాజంలోకి బయటికి రా నీకు జరిగిన అన్యాయాన్ని చెప్పు చెప్పకపోతే నువ్వు చెప్పకుండా దాచిపెడితే
(25:30) అలాంటి వెధవలు ఇంకొక అమ్మాయి జీవితాన్ని కాటేసేస్తారు కాబట్టి జరిగిన నష్టాన్ని బయటికి చెప్పండి చెబితే కొన్ని రోజులు నిజంగానే అవమాన పడతాం నేనేం కాదని చెప్పట్లేదు కానీ ఇంకొక అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉంటుంది ఖచ్చితంగా దాడి జరిగిన అమ్మాయి మీద నిందలు వేస్తూ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసినట్లుగా గుచ్చి గుచ్చి పొడవకండి మీకు చేతన అయితే కౌన్సిలింగ్ ఇవ్వండి లేదు అంటే ఆ అమ్మాయి ఆ వేదన నుంచి బయటికి వచ్చేలాగా చేస్తూ తల్లి మృగాలు ఉన్నాయి ఆ మృగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటూ నువ్వేం తప్పు చేయలేదు అని చేతన అయితే ఆ అమ్మాయికి
(26:10) సహాయం చేయండి ఆవిడ ఈ విశ్వసుందరి పోటీలను కూడా వద్దు అని తీవ్రంగా ఖండించారట అలా ఖండించారు అని అనుకోండి వెంటనే మహిళా సంఘాలు వచ్చేస్తాయి ఏ విశ్వసుందరి పోటీలు వేస్తే తప్పేంటి ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా అంటారు నిన్న శివాజీ గారు అన్నారుగా ఆ మాట అన్నందుకు ఆయన చేత సారీ చెప్పించారు నిజంగా ఎంత దుర్మార్గమో చూడండి ఎంతటి దౌర్భాగ్యమో చూడండి స్త్రీని ప్రకృతితో పోల్చారు నిండుగా ఉండాలని అంతే కదా ఆ నిండుగా ఉండాలని చెప్పడం తప్పుటా ఏ ఆడవాళ్ళకి ఎలాంటి బట్టలు వేసుకుంటే మీరు చెప్పాలా మీ బుద్ధి అంతవరకే ఉండిపోయిందేమో మీరు కూడా మట్టెలు పెట్టుకోండి మీరు కూడా ధోవతి
(26:53) వేసుకోండి మీరు కూడా పంచి వేసుకోండి అని ఎగేసుకుంటూ వచ్చేసారు కొంతమంది పైగా అంట ఈ మహిళా కమిషన్ కలుగచేసుకుని సారీ చెప్పించిందట మరి అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కానీ మరి ఆయన మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా ఎవ్వడైనా ఏ హీరో అయినా సరే శివాజీ గారిలాగా మాట్లాడగలిగారా చెప్పండి హీరోయిన్లు మీరు చక్కగా ఉండండి అని ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తున్నారు చూసారా ఈ ఆడవాళ్ళు కొంతమంది మనం బుద్ధి తెచ్చుకోవాలి అదేంటంటే ఇలాంటి వాళ్ళ సినిమాలు ఇలా ఆడపిల్లల్ని చాలా నీచంగా చూపించే వాళ్ళ ఈ సీరియల్స్ గాని చూడకుండా
(27:30) ఉండాలని మనం బుద్ధి తెచ్చుకోవాలి మనం వాళ్ళని అవాయిడ్ చేసేయాలి. అలాంటి సినిమాల్లో ఏ ఒక్క చోటైనా సరే ఆడపిల్లకి బట్టలు సరిగ్గా వేయకపోతే ముందు ఆ సినిమాని బ్యాన్ చేసేసి మనం చూడకుండా ఉన్నామ అనుకోండి ఈ పరిస్థితి రాదు మంచిగా ఉండండి అని చెప్పడం కూడా ఒక పెద్ద తప్పు అయిపోయింది చూసే దృష్టిలో ఉంటుందండి నిజమే చూసే దృష్టిలో ఉంటుంది నేను కాదు అనో చూసే దృష్టిలో కూడా ఉంటుంది కానీ మనం వేసుకునే బట్టల మీద కూడా ఉంటుంది.
(28:01) అలా చెప్పినందుకు గాను ఎంత దుయ్యబెట్టి మాట్లాడుతున్నారో మగవాళ్ళు ఇప్పుకొని తిరగొచ్చా అని మగవాళ్ళు ఇప్పుకొని తిరిగితే మీరు చూస్తూ కూర్చుంటారు అలాగా మగవాళ్ళు ఇప్పుకొని రోడ్డు మీదకి వచ్చారు అని అనుకోండి వెంటనే మీరు మాట్లాడరా మాట్లాడతారుగా ఎందుకు ఇప్పుకొని తిరిగి వచ్చారు అని బట్టలు వేసుకోమనడం తప్పుయపోయింది అందుకని సారీ చెప్పించారు అంటే మంచి చెప్తే ఎక్కదు సునీత కృష్ణన్ గారు అంతే కదా మంచి చేశారు కాబట్టి కాబట్టే ఆవిడ మీద అంత దాడి చేశారు 18 సార్లు దాడి చేశారు.
(28:37) ఆవిడ చెప్పింది ఏంటంటే ఎవరికైనా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకూడదు నిజంగా ఏదైనా జరిగితే 100 కి గాని 181 కి గాని 1098 కి గాని మీరు ఫోన్ చేయండి. మీకు సరైన కౌన్సిలింగ్ ఇస్తారు మిమ్మల్ని రెస్క్యూ చేస్తారు మీరు ఏదైనా ఇబ్బందుల్లోకి మీరు చిక్కుకుపోతే దానినుంచి బయట పడేసే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తాను అని చెప్పారు ఆవిడ ప్రజ్వల ఫౌండేషన్ అనేదాన్ని స్థాపించారట నిజంగా ఆడపిల్లలకి ఏదైనా కష్టం వస్తే అది ఏ విధమైన కష్టమైనా సరే అది ఆడపిల్లల్ని మగవాళ్ళు కట్నం కోసం ఏడిపించిన ఇష్యూ అయినా సరే ఆ ఫౌండేషన్ కి గనుక ఫోన్ చేస్తే కావలసిన మెంటల్
(29:18) స్టెబిలిటీని ఆవిడ ఆ సంస్థ ద్వారా ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడే స్త్రీమూర్తులు ఉంటే ఆవిడని కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఆవిడ ఒక పుస్తకం రాశారు. కిండల్ ఎడిషన్ ఉంది మామూలు ఎడిషన్ ఉంది. ఐ యామ వాట్ ఐ యామ్ అనే పుస్తకం నేను కిండల్ ఎడిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంకా ఆర్డర్ పెడితే నాలుగు రోజులు అవుతుంది కాబట్టి ఆ కిండల్ ఎడిషన్ తీసుకుని చదివి అప్పుడు మీకు ఆ పుస్తకం గురించి మళ్ళీ చెప్పాలని అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఎవరినైనా బాధ పెట్టినట్లు గనుక మాట్లాడితే దయచేసి పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి కేవలం నా బాధ అంతా ఏంటంటే
(29:58) బాధపడిన ఆడపిల్లని ఇంకా బాధ పెడుతున్నారు. ఆ అలా బాధ పెట్టకుండా ఆ అమ్మాయికి సపోర్ట్ ని ఇవ్వండి అలాగే ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా బట్టలు వేసుకునే విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. ఆడపిల్లలకి బట్టలు వేసుకోమని ఎలా అయితే మనం చెప్తున్నామో మగపిల్లలకి కూడా సంస్కారంగా ఉండండిరా ఆడపిల్లని ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్ గా కాదు మీరు చూసేది మీకు ఆడపిల్ల చూడగానే అమ్మవారు గుర్తుకు రావాలి అని చెప్పి మీరు మగపిల్లలకి కూడా చెప్తే మాత్రమే ఈ సమాజంలో జరిగే ఇలాంటి దుశ్చర్యలు ఆగిపోతాయి లేదు అంటే ఇవి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇది నెవర్ ఎండింగ్ అన్నమాట ఎవరికైనా చూడాలి
(30:42) అని అనుకుంటే ఈ సునీత కృష్ణన్ గారు ఈ వీడియోస్ చూడండి ఆవిడ ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది అర్థంవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment