Thursday, December 25, 2025

🙏🕉️🙏

*గోదాదేవి వచ్చేనమ్మా...* 
               

గోదాదేవి వచ్చేనమ్మా...
మన ఆండాళ్ళు వచ్చేనమ్మా   
విల్లిపుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మా 
అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చెనమ్మ 
ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మా 
మనువాడ వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా  గోదాదేవి  మన ఆండాళ్ళు వచ్చేనమ్మా  
సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మా 
తిరుప్పావై ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మా 
మాలలు ధరియించి గోదాదేవి వచ్చేనమ్మా 
మహి లో వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మా   మన ఆండాళ్ళు వచ్చేనమ్మా 
కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చేనమ్మా 
కాళ్ళ పారాణి తోడా గోదాదేవి వచ్చేనమ్మా 
దయగల మా తల్లి గోదాదేవి వచ్చేనమ్మా   మన ఆండాళ్లు వచ్చేనమ్మా 
హారతులు అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మా 
పుణ్యాలన్నీ పండగా  గోదాదేవి వచ్చేనమ్మా 
సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మా 
రంగాని దరి చేరగా గోదాదేవి  మన ఆండాళ్ళు వచ్చేనమ్మా..🙏🙏
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

No comments:

Post a Comment