కొన్ని
గమ్యాలను
చేరుకోవాలంటే ....
చేయాల్సిందే
సుదీర్ఘమైన ప్రయాణం
దారంతా ....
కంటక ప్రాయమే ...
అయినా సరే
వేయాల్సిందే
అడుగులు ముందుకు
*********
చుట్టేస్తారు
ప్రపంచమంతా ....
నిథి నిక్షేపాల కోసం కొందరు
కలలనూ
స్వప్నాలనూ ....
వెతుక్కొంటూ బయలుదేరేది
అతి కొద్ది మంది మాత్రమే
*********
స్వేచ్ఛ...
నిర్భయంగా ...
ఊపిరి పీల్చుకునేంత స్వేచ్ఛ
స్వాతంత్ర్యం ...
ఆత్మవిశ్వాసంతో..
నిఠారుగా నిలబడేంత స్వాతంత్ర్యం
ఇదిగో ఇదే
నెల్సన్ మండేలా ...
కల... స్వప్నం....
సుదీర్ఘమైన ...
ప్రయాణమే చేసాడాయన
ఈ స్వప్న సాకారం కోసం
అదీ ....
కంటకప్రాయమైన దారిలో
********
ప్రభావవంతమైన బాల్యం
సాయుధ పోరాట అనుభవం
రాటుదేలేలా చేసిన జైలు జీవితం
ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వం
దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం
ఇలా ....
ఆ సుదీర్ఘమైన పయనంలో...
ప్రతి మలుపూ ఉద్వేగ్నభరతమే
*******
మండే సూర్యుడి లాంటి మండేలా
మహాత్ముడి గా అవతరించిన క్రమాన్ని
కళ్ళకు కట్టినట్టు చిత్రిస్తుంది ఈ ఆత్మకథ
ఆ మహా నాయకుడు
తన అనుభవాల కార్ఖానాలో
తనని తాను ఆవిష్కరించుకున్న తీరు
ఈ ఆత్మకథలోని ప్రతి అక్షరంలో కానవస్తుంది
********
నిజమే
దశాబ్దం గడిచిపోయింది
మండేలా తుదిశ్వాస విడచి
కానీ ...
ఓ యోధుడి జీవితం
శతాబ్దాలు గడచిపోయినా
స్ఫూర్తిదాయకమే మరి
No comments:
Post a Comment