క్షమ ..
ఒక రాత్రి విరామం..
కోపగించుకో.. అది నీ హక్కు
కానీ ఆ కోపాన్ని పాపంగా మార్చుకోకు.
సూర్యుడు అస్తమించేలోపే
నీ లోని ఆవేశాన్ని కూడా నిద్రపుచ్చు.
పగతో పక్కమీదకు చేరకు
ద్వేషాన్ని దుప్పటిలా కప్పుకోకు.
బంధాల మధ్య రేగిన చిన్న నిప్పురవ్వను
క్షమాగుణంతో చల్లార్చి కళ్ళు మూసుకో...
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు..
భార్యాభర్తలు, అత్తామామలు..
కన్నపిల్లలు, కడదాకా ఉండే స్నేహితులు..
వీరందరిపై నీకు అలక ఉండొచ్చు,
అగ్రహం ఉండొచ్చు..
కానీ అది సాయంత్రం ఐదు గంటల వరకే!
ఆ తర్వాత..
ఒకే ఒక్క మౌనంతో అందరినీ క్షమించు...
ఎందుకంటే...
నీ మనసు,
నీ ఆత్మ గాయపడకూడదు...
క్షమించిన రోజే
నీకు సుఖనిద్ర సొంతమవుతుంది..
బాధల సంకెళ్లు
తెంచుకుని,
నిరీక్షణతో
నీ గృహంలో అడుగుపెట్టు..
అప్పుడే..
నీ ఇంటికి ప్రశాంతత
ప్రాణవాయువు
అవుతుంది,
నీ ఆర్థికం,
నీ ఆరోగ్యం దైవికంగా
ఎదుగుతాయి...
నువ్వు తలపెట్టే ఏ
కార్యమైనా...
సందేహం లేని విజయమై నీ ముందు నిలుస్తుంది!
Bureddy blooms.
No comments:
Post a Comment