Dr. Emani Siva Nagi Reddy about Gudimallam Lingam Temple in Andhra Pradesh | TOne News
https://m.youtube.com/watch?v=gJPndLZnd7c&pp=0gcJCU0KAYcqIYzv
https://www.youtube.com/watch?v=gJPndLZnd7c
Transcript:
(00:00) వెల్కమ్ టు తెలుగు వన్ ఆధునిక భారతదేశంలో తొలి శివాలయం తెలుగు నేల మీద ఉంది అనేది చారిత్రక పరిశోధకులు తేల్చిన నిజం ఆ నిజంలో నిజాలు ఏంటి అనేది మన ప్రేక్షకులకు తెలియజేయడానికి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు స్థపతి ఆర్కియాలజిస్ట్ రచయిత మనతో ఉన్నారు వెల్కమ్ నాగరెడ్డి గారు నమస్కారం అండి ఈ తొలి శివాలయం భారతదేశంలో తొలి శివాలయం మన తెలుగు నేల మీదే అనే దాంట్లో ఎంత నిజం ఉంది దాని చారిత్రక నేపథ్యం ఏంటి నాగిరెడ్డి గారు ఇది కూడా పురావస్తు ఆధారాల రీత్యా చెప్పవలసినటువంటి సమాధానం అసలు మన దేశంలో ఆలయాలు నిర్మించడం ఎప్పుడు ప్రారంభమైంది అంటే కూడా క్రీస్తు
(00:48) శకారంభంలోనే తయారైంది కొద్దిగా ముందు కొంచెం వెనుకగా అయితే తెలుగు నేలకును తొలి శివాలయానికి సంబంధం ఉంది అన్న విషయం అంతకు ముందు అంటే ఇప్పుడు ఇప్పుడే కాదు గత 150 సంవత్సరాలుగా జరుగుతున్న చర్చ మొట్టమొదట ఎప్పుడైతే బౌద్ధ పరిశోధన మొట్టమొదట ఎప్పుడైతే పురావస్తు పరిశోధనలు ఇక్కడ ప్రారంభమయ్యాయో ఆ పరిశోధకుల దృష్టి ఒక శివలింగం మీద పడింది ఏమిటి ఆ శివలింగం అంటే ఇప్పటి తిరుపతికి దగ్గర ఉన్న రేణిగుంట విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నటువంటి గుడిమల్లం అనే ఊర్లో ఒక శివలింగం ఉంది ఆ శివలింగం గుడిలోనే ఉంది ఆ గుడి ఇటీవల కాలం కట్టింది ఇటీవల అంటే
(01:28) క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుంచి నుంచి 16 వ శతాబ్దం వరకు కట్టినటువంటి గుడి కానీ అందులో ఉన్న శివలింగం అప్పటిది కాదు ఎప్పటిది అని ఆలోచిస్తే గతంలోనే మీకు శ్రీ శివరామ మూర్తి గారు మొదలైన పండితులంతా ఇది క్రీస్తుకు పూర్వం ఒకటి రెండు శతాబ్దాలకు చెందుతుంది అని చెప్పేసారు అప్పుడు అయితే 1972 73 ప్రాంతాల్లో డాక్టర్ ఐ కే శర్మ గారు అని ఆయన భారతీయ పురావస్తు సర్వేక్షణ సంస్థలో ఏఎస్ఐ అంటాం కదా ఆర్కలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా దాంట్లో ఆయన హైదరాబాదులో ఆ విభాగాధిపతిగా ఉండేవాడు ఆయన తవకాలు చేపట్టాడు అక్కడ తవకాలు చేపట్టినప్పుడు ఏమైందో తెలుసా ప్రపంచం విస్తుబోయే కొత్త
(02:08) నిజాలు వచ్చాయి ఏం వచ్చాయి శివలింగమే ఆ శివలింగం మీద ఒక రుద్రుడు ఉన్నాడు ఆ రుద్రుడు ఒక చిన్న జింకను పట్టుకొని ఉన్నాడు ఆయన ఇలా ఉన్నటువంటిది చుట్టూ దానికి ఒక సదరపు రైలింగ్ ఉంది ఆ రైలింగ్ మీద రైలింగ్ అంటే రాతి కంచె లాగా ఒక చిన్న బాక్స్ అది మనకు అప్పటివరకు ఉన్నటువంటి సుంగ సుంగులు అక్కడ బారహతులు స్తూపం నిర్మించారే అదిగో అలాంటి రైలింగ్ కి సంబంధించిన డిజైన్లే ఉన్నాయి అర్ధ పద్మం ఇలాంటివి అలాగే మూడు పలకలు ఎదురుగా ఇది ఆ నేపథ్యంతో అక్కడ ఉన్నది అని అనుకుని ఇంకా లోతుకెళ్తే ఏం చూస్తుంది అంటే మౌర్యులకు సంబంధించినటువంటి పాత్ర సామాగ్రి ఇంకా
(02:50) బుద్ధ భగవానుని ధాతు పీటలకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి వాటిని మనం ప్రస్తుతం పక్కన పెడదాం అయితే ఈ శివలింగం ఆ శివలింగం మీద చెక్కినటువంటి రుద్రుని బొమ్మ యక్షుడు అని కొంతమంది అంటారు ఆ బొమ్మకు ఉన్నటువంటి ప్రతిమా లక్షణాన్ని ఆలోచిస్తే ప్రతిమా లక్షణం అంటే శిల్పంగా తీర్చిదిద్దిన ఆకారం ఒక్కొక్క రాజవంశ కాలాల్లో ఒక్కొక్క ఆకారం ఉంటుంది రాను రాను మారుతూ ఉంటుంది కదా అది మనం ఇప్పుడు స్టైల్ అంటారా మౌర్యుల శిల్పకళ శాతవాహనుల శిల్పకళ యక్ష్వాకుల శిల్పకళ శాతవాహంలో యక్ష్వాకులది మనం అమరావతి శిల్పకళ అంటాం ఆ తర్వాత పల్లవ శిల్పకళ ఆ
(03:27) తర్వాత విష్ణు కుండిన్లు వెంగి చాణుక్యులు చాలికలు రాష్ట్రకోట్లు వచ్చినాయా లేదా సో దీన్ని బట్టి ఆ శిల్పం యొక్క ఏజ్ ని మనం చెప్పొచ్చు చెప్పొచ్చు అన్నమాట అది వాళ్ళు ఏం చేశారు ఒక పక్క ఏమో ఆ నేపథ్యాన్ని పురావస్తు ఆధారాల ద్వారా ఐకేయ శర్మ గారు వెలికి తెచ్చారు ప్రచురించారు కూడా ఈ శివలింగం మీద దృష్టి పడినప్పుడు ఇది ముమ్మూర్తుల క్రీస్తుకు పూర్వం రెండు ఒకటి శతాబ్దాలకు చెందినటువంటి ప్రతిమా లక్షణంగా తేల్చారు అయితే దాని అడుగును చూస్తే కూడా ఈ శివలింగాన్ని చక్కగా ఇటుకల మధ్య నిలబెట్టి దానికి నిర్మించుకోవడానికి ఈ రాతి కంచెను పెట్టారు దాని అర్థం ఏమిటి అంటే అప్పటికే
(04:07) ప్రజల మనోభావాల్లో శివున్ని ఆరాధించే తత్వం ప్రచారంలో ఉంది ప్రజలు కూడా ఒక ఆలయానికి వచ్చి శివుడికి ఇలా అంటే సకలం నిష్కలం సకల నిష్కలం అని ఈ ప్రతిమలు మూడు రకాలు సకలం అంటే అన్ని అంగాలతో కూడుకున్న ఒక బొమ్మ పూర్తిగా బొమ్మే అది దాని తర్వాత దాన్ని సకలం అంటాం అన్ని కళాలతో కూడింది నిష్కలం అంటే మనిషి అంటే ఏ రకమైన మానవ ఆకారం గాని దైవాకారం గాని ఉండదు అది ఒక సెహనం సెహన రూపంలో ఆరాధిస్తారు అదే లింగం కానీ శివలింగం మీద మళ్ళీ ముఖలింగం ఉంటుంది చూసారా ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ గుడిమలంలో శివలింగం లాంటి దాన్ని ఏమంటారు సకల నిష్కలం రెండు రకాలు దాంట్లో
(04:47) చూపించబడి ఉన్నాయి కదా ఇవి ఆలోచిస్తే ఇది క్రీస్తుకు పూర్వం రెండు ఒకటి శతాబ్దాలకు చెందిన భారతదేశ చరిత్రలోనే తొట్ట తొలి శివాలయంగా ఐకే శర్మ గారితో పాటు అందరూ ప్రావస్తు శాస్త్రవేత్తలు కూడా దాన్ని రూడి గావించారు అన్నమాట తద్వారా తెలియేది ఏమిటి అంటే తీరాంధ్ర దేశంలో తిసరణాలు మారుమోగుతున్న నేపథ్యంలో కొత్తగా శైవ మతం పల్లవించడం ప్రారంభించింది అని కూడా దీనివల్ల మనకి తెలుస్తుంది అంటే ఒక 2000 సంవత్సరాల క్రితం అనుకోవచ్చా 2200 సంవత్సరాలు అటు తర్వాత మళ్ళీ తెలంగాణలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తుంటే పెబ్బేరు దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్
(05:34) వస్తుంది ఆ బ్రిడ్జి బ్రిడ్జ్ రంగాపూర్ అంటారు దాన్ని ఆ బ్రిడ్జ్ పక్కనే ఎడమ వైపున జరిపిన త్రవకాల్లో 1978 లో జరిపిన త్రవకాల్లో ఇటుక రాతితో ఆలయం నిర్మించి మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించి ప్రతిష్టించిన ఆధారం దొరికింది అది శాతవాహనుల కాలం పూర్తిగా క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం అది క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్దం క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం ఈ రెండు కూడా తెలుగు నేల మీద ఉండటం ఆ చాలా ఆశ్చర్య పోవాల్సిన విషయం ఆ తరువాతే మన భారతదేశంలో మిగతా ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించుకోవడం ఊపు అందుకుంది అన్నమాట దాని అర్థం అంతకు ముందు ఆలయాలు లేవు అని
(06:14) కాదు అవి తాత్కాలిక ఆ మెటీరియల్ తో నిర్మించిన చెట్టు కింద కావచ్చు లేక చిన్న చిన్న కొయ్యతో నిర్మించినవి కావచ్చు అలా ఉండేవే కానీ ఇలా మీకు ఒక వ్యవస్థీకృతమైన ఆలయ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కావడం మాత్రం క్రీస్తుకు పూర్వం రెండు క్రీస్తు శకం ఒకటి నుంచి మాత్రమే ప్రారంభమైంది ముందుగా ఇటుక రాతితోను ఆ తర్వాత గుహాలయాలు మీరు చూశారు కదా గుహాలయాలు విజయవాడలో ఉన్నటువంటి అక్కన్న మాదన్న తర్వాత మొగలరాజపురం ఈ గుహలన్నీ ఆ క్రీస్తు శతకం నాలుగో శతాబ్దంలో వచ్చినాయి కదా ఇవి అలా ఆలోచిస్తే గుహాలయాలు ఆ తర్వాత ఏం చేశారు రాతిని తొలసి మలచిన అద్భుతమైన అలంకృత శిలా
(06:54) ఫలకాలతో విడిగా ఆలయాలు నిర్మించడం ప్రారంభమైంది ఇది ఆలయ నిర్మాణ ప్రారంభ వికాస దశలు మీరు ఆర్కియాలజిస్ట్ కాకముందు స్థపతి కాకముందు రచయిత కాకముందు మీరు ఒక శిల్పి ఈ చేతులు ఉలి చేతబట్టి శిల్పాన్ని చెక్కిని ఆ తర్వాత మీరు గుడి నిర్మాణాల్లో మీ శిల్ప ప్రావీణ్యాన్ని అస్ ఏ శిల్పిగా చేయాలి కానీ మీ అనుభవం నిర్మాణాలు కాకుండా గుళ్ళు ఊడదీయటానికి మీరు స్టార్ట్ చేసినట్టు మాకు సమాచారం ఉంది దాన్ని క్లుప్తంగా వివరిస్తారు అంటే ఏమైంది అంటే మేము తిరుపతి శిల్ప కళాశాలలో నిజం చెప్పాలంటే ఆర్థిక ఓనర్లు లేక టెన్త్ క్లాస్ లో నేను టాపర్ ని అయినా సరే నాతో పాటు చదువుకున్న
(07:46) విద్యార్థులంతా కూడా తెనాలిలోనూ విజయవాడలోనూ గుంటూరులోనూ రకరకాల కాలేజీలో అప్పటికే చేరి నెలన్నర కాలేజీకి వెళ్తూ వస్తూ ఉన్నారు నేను అలా చూస్తూ ఉన్నాను బాధపడటం తెలియదు అప్పటికి ఓహో బాధ అనేది తెలియదు వాళ్ళు డబ్బులు ఉన్నాయి చేరారు అనుకున్నాం మాకు తెలియదు అసలు అలా చేరాలని తెలియదు చేరితే ఏమవుతుందో కూడా తెలియదు ఆ నేపథ్యంలో అలా 40 రోజులు గడిచింది నేను ఎప్పుడు ఎనిమిదో తరగతిలో తొమ్మిదో తరగతిలో 10వ తరగతిలో క్లాస్ ఫస్ట్ రావడం గమనించిన రంగాచారి గారు అనే ఒక మా టీచర్ ఏం చేసాడంటే వీడేమిటి ఇక్కడే ఉన్నాడు అందరూ కాలేజీలకు వెళ్తున్నారు కదా అని చెప్పి
(08:20) ఆయన మా ఇంటికి వచ్చి ఆ నన్ను అడిగాడు ఒరేయ్ నీకు నేను తిరుపతిలో మీకు ఒకవేళ మీ అమ్మ నాన్న వాళ్ళు డబ్బులు లేక కాలేజీలో చేర్పించలేకపోతున్నారు నేను నిన్ను తిరుపతి తీసుకెళ్లి ఉచితంగా విద్య నేర్పి బస కూడా ఇస్తారు వాళ్ళు వసతి కూడా ఒక్క ఫుడ్ మాత్రం మీరు వండుకొని తినండి దానికి ఏం పెద్ద ఇబ్బంది కాదు అని మా అమ్మని అడిగితే మేము బియ్యం పంపిస్తాం అయ్యా అని చెప్పింది నన్ను తిరుపతి శిల్ప కళాశాలలో చేర్పించారు నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నాను చిట్టచివరికి అసలు ఈ శిల్పాలు చెక్కుతుంటే ఉద్యోగం వస్తుందారా ఉద్యోగం వస్తుంది అనేది లేదు ఆ నాలుగేళ్ళు
(08:51) కాలం గడిచింది ఆలయ నిర్మాణం శిల్పాలు చెక్కడం మాత్రం నేర్చుకున్నాం విజ్ఞానాన్ని సంపాదించుకున్నాం కానీ టిటిడి లో ఆరు రూపాయలకు నేను కూలిగా చేరాను అక్కడ ప్రతి రోజు సిక్స్ మంత్స్ పని చేశాను ఆ తర్వాత అనుకోకుండా ప్రభుత్వం నుంచి ఒక పిలుపు వచ్చింది ఏమిటి అంటే క్యాంపస్ సెలక్షన్స్ అని ఆశ్చర్యం అరే ఒక శిల్పికి క్యాంపస్ సెలెక్షన్ ఏమిటి అది కూడా ఎప్పుడు 1978 లో ఆశ్చర్యం కదా తెలియదు మాకు మాకు ఎవరో ఒక ఐవారు అయ్యా మీకు అయ్యవారు అంటే మేము టీచర్లని అక్కడ తిరుపతిలో అయ్యవారు అంటాం మీకు ఉద్యోగాలు వస్తున్నాయి ఏంటిరా రండి రండి అని పిలిచి మాకు ఒకసారి ఏదో ఫలానా
(09:24) గవర్నమెంట్ అడిగారు మీరు సిద్ధంగా ఉండండి రోజు కాస్త తయారై ఉండండి ఇంటర్వ్యూలో ఎన్నుకోవాలి అని అన్నారు అలా ఆ నేపథ్యంలో మన అప్పుడు గణపతి స్తపతి గారు చాలా ప్రఖ్యాత శిల్పి ఆ గణపతి స్తపతి గారి ఇంటర్వ్యూలో మాకు ఉద్యోగం దొరికింది ఆ ఉద్యోగం దొరకడం ఏ ఉద్యోగం కొత్త ఆలయాలు నిర్మించడం అని మేము అనుకున్నాం కాదు మీరు ఉన్న ఆలయాలను ఊడగొట్టండి అని పని పురమాయించారు ఏమిటిరా ఆలయాలను ఊడగొట్టడం ఇది అపప్రధ కదా మనం చానా చేయటానికి చేయకూడదు కదా అని అనుకున్నాం కానీ అది ఎందుకు ఊడదీస్తారు అంటే ఒక సదుద్దేశంతో అప్పటికీ శ్రీశైలం దగ్గర 1965 వ సంవత్సరం
(10:00) లో ఆ డ్యామ్ నిర్మాణానికి శంకు స్థాపన జరిగింది అలా నిర్మిస్తూ నిర్మిస్తూ శ్రీశైలం డ్యామ్ నిర్మాణంలో ఉంది 1975 వచ్చేసరికి కొన్ని ఊళ్ళు 102 ఊళ్ళు మునిగిపోతున్నాయి మునిగిపోయిన వాళ్ళలో నుంచి ఊళ్ళన్నీ ఖాళీ అయ్యి బయటికి వెళ్లి కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు పశువులను తీసుకెళ్లారు ఆస్తిపాస్తులను తీసుకెళ్లారు పొలాలు మునిగిపోయాయి వాటికి నష్టపరిహారం వచ్చింది కానీ నోరున్న మనుషులు కాబట్టి వాళ్ళ కోరికలు తీరాయి గట్టిగా గదయించారు కాబట్టి ప్రభుత్వం కూడా వారి కోరికలను అంగీకరించింది నష్టపరిహార విషయంలో పెంపుదలకు కానీ నోరు లేని దేవుళ్ళను
(10:38) గురించి పట్టించుకునే వారే లేక ఈ 102 గ్రామాల్లోని ఆలయాలు అలాగే ఉన్నాయి ఇల్లు శిధిలాలు అయ్యాయి రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి అంతకు ముందు ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో భాసిల్లిన ఆలయాలన్నీ గబ్బిలాల నిలయాలు అయ్యాయి ఇదిగో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అలా వదిలేయడం తప్పు కదా అందరి ఉమ్మడి వారసత్వ సంపదగా కీర్తికెక్కుతున్న ఈ వారసత్వ సంపదను మనం కాపాడుకోవాలి కదా అని ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ టెంపుల్స్ అనే ఒక స్కీమ్ ని ప్రతిపాదించింది చేయాలంటే ఎవరు ఇంజనీర్లు ఉన్నారు కోకొల్లలుగా కానీ ఇంజనీర్లు చేయలేని పని కదా మరి ఎవరు
(11:20) చేయగలుగుతారు అని ఆలోచిస్తే తిరుపతి శిల్ప కళాశాలలో మహాబలిపురంలో శిల్ప కళాశాలలో ఉన్నటువంటి తర్ఫీదు పొందిన శిల్పులను మనం ఈ పనికి వినియోగించుకోవచ్చు అది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి గణపతి స్థపతి గారి ఆధ్వర్యంలో అయితేనే బాగుంటుందని ప్రభుత్వం ఆ పనిని ఆయనకు పురమాయించగా ఆయన మమ్మల్ని అందరిని ఎంపిక చేసుకునే ప్రక్రియకి శ్రీకారం చుట్టి ఎంచుకున్నారు మాకు తర్ఫీదుని ఇచ్చారు అలా ఆలయాలన్నీ ఊడదీశాం మేము ఊడదీసిన తర్వాత అది ఒక గొప్ప విజ్ఞానం మేము క్లాసులోనేమో టెంపుల్స్ ఎలా నిర్మించాలి అనేది డ్రాయింగ్స్ వేసుకొని శ్లోకాల ద్వారా దాన్ని అలంకారాలు ఎలా
(11:56) తీర్చిదిద్దాలి గర్భాలయం అర్ధమండపం మహామండపం నృత్యమ మండపం సభా మండపం ధ్వజస్తంభం బలిపీఠం గోపురం ప్రాకారం ఆలయ పరివారాలు ఏకశాల పాకశాల ఇలా అన్ని విషయాలు మాకు ఇలా గ్రౌండ్ మీద వచ్చేది చెప్పారు అలాగే అధిష్టం ఉపపీఠం అధిష్టానం పాదవర్గం ప్రస్తరం శిఖరం శిఖరం అంటే విమానం అంటామే శిఖరం తర్వాత కలశం అలా గర్భగుడి మీద నిర్మించే దాన్ని విమానం అని గోపురం మీద నిర్మించే దాన్ని అంటే ప్రాకారం దగ్గర ప్రవేశం ఉంచే దాన్ని గోపురం అని అంటాం కదా ఈ విషయం అంతా మేము అక్కడ తెలుసుకున్నాం దానికి భిన్నంగా ఇక్కడ ఊడదీయడం ప్రారంభం పై నుంచి పై నుంచి మళ్ళీ ఊడదీయడం మేము కింద నుంచి
(12:36) కడతాం మామూలుగా పై నుంచి ఊడదీయడం ప్రారంభమైంది ఈ పై నుంచి ఊడదీసే ప్రక్రియలో మేము క్లాక్ వైస్ ఊడదీసుకుంటూ వస్తాం ఊడదీసుకుంటూ వచ్చినాక యాంటీ క్లాక్ వైస్ పునర్నిర్మిస్తా ఉంటాం సో ఊడదీయడంలో కూడా సైన్స్ ని ఫాలో అయ్యారు చాలా దానికి చాలా విషయం ఉంది కదా లేకపోతే దానికి ముందు ఏం చేశాం ప్రతి రాయి రాయి రాయిని ఊడదీసి సందుల్లో ఉండే దాన్ని అంతా చక్కగా ఒక్కొక్క రాయికి ఒక్కొక్క రాయి విడగొట్టి అంటే ఎలా కనిపించేట్టుగా చేసి దాని మీద నంబర్లు వేసి ఆ నంబర్లను మేము డ్రాయింగ్ లో వేసుకొని మళ్ళీ ఒక్కొక్క లేయర్ ఎలా ఉంటుంది పైన అనేక రాళ్ల పొందిక కదా ఆ
(13:12) పొందిక మళ్ళీ ఒక వరుస వర్డ్ తీసినప్పుడు రెండో వరుస పై నుంచి డ్రాయింగ్ ఎదురు డ్రాయింగ్లు పై నుంచి డ్రాయింగ్ ఎదురు డ్రాయింగ్లు వరుసలు తీయటం మళ్ళీ వేయటం అలా అది ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది అయితే దాని వెనుక చాలా బాధ ఉంది ఏమిటి బాధ ఆయా ఊళ్ళల్లో ఏ ఊళ్ళలో ఉన్న గుళ్ళు మేము ఊడదీయాలో ఊడదీసే ఊళ్ళల్లో కరెంటు లేదు రోడ్లు లేవు ఎందుకు అవన్నీ కూడా అబాండెంట్ విలేజెస్ కదా ఈ విలేజెస్ మరో చోట కొత్తగా నిర్మించబడుతున్నారు కాబట్టి ఇక్కడ సౌకర్యాలను కల్పించడం గాని మరమతులు చేయడం గాని లేదు కరెంటు అసలు లేదు నీటి సౌకర్యం లేదు అదిగో అలా అనేక బాధలకు పడి
(13:47) ఆలయాలన్నిటిని ఊడదీసి తరలించడం ఒక గొప్ప ప్రక్రియ ఎందుకు రోడ్లు సరిలేవు అయినా సరే తరలించి మళ్ళీ ఆధునిక పునాదులపై వాటిని పునర్నిర్మించడం అది ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది జీవితంలో అందరికీ దక్కని అనుభూతి కదా ఇది మిగతా ఉద్యోగులకు వారి వారి ఆ వృత్తుల్లో నైపుణ్యం పెంపొందించుకుంటారేమో కానీ ఈ అనుభవం ఎవరికీ దక్కని ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం ఏదైతే ఆ తొలి మీ అప్పాయింట్మెంట్ గణపతి స్థపతి ఇంటర్వ్యూ చేశారో మీ తొలి జాబ్ ఆ తర్వాత త్రివేండ్రంలో అదే గణపతి స్థపతి చేతుల మీదగా వాస్తు శాస్త్రం లో వాస్తు శిల్ప వాచస్పతి వాచస్పతి అనే అవార్డు ఇదే గణపతి
(14:34) స్థాపతి మీకు ఇచ్చారా ఆ ఈయన కాదు ఆయన పేరు ఈ గణపతి స్థపతి గారేమో పద్మశ్రీ గణపతి స్థపతి మన హుసేన్ సాగర్లో ఔ అంత ఎత్తున ఉన్నటువంటి బుద్ధ భగవానుని శిల్పానికి రూపకర్త భద్రాచల దేవాలయం శ్రీశైల దేవాలయం జీర్ణోద్ధరణ నిర్మాణ స్తపతి ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖలో పని చేశారు కానీ నాకు ఈ అంటే అప్పటికే సేకరించుకున్న కొద్దిపాటి విషయ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తే ఈ రంగం ఇతడు స్థిరపడతాడు అన్న ఉద్దేశంతో ప్రోత్సాహకంగా 1997 వ సంవత్సరం తిరువనంతపురంలో జరిగినటువంటి ఒక అంతర్జాతీయ శిల్పుల సదస్సులో వాస్తు శిల్ప వాచ్యస్పతి అన్న ఒక బిరుదుని ఇచ్చారు వారు ఆయన కూడా పద్మశ్రీ
(15:20) డాక్టర్ వి గణపతి స్థపతి ఆయన మహాబలిపురం శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ గా ఉండేవాడు మనకి ఈనాడు చెన్నై నుంగంబాకంలో ఉన్నటువంటి వల్వర్ కోటం ఆ తర్వాత కన్యాకుమారిలో నిర్మించినటువంటి తిరువర్ స్టాట్యూ ఆ స్టాట్యూ కృపకర్త కూడా ఆయనే అదిగో ఆ మహానుభావుడు నాకు అంతటి మహోన్నతమైనటువంటి ఆ బిరుదుని ఇచ్చాడు అయితే ఆ బిరుదుని గౌరవపూర్వకంగా ఆనాడు ఇచ్చిన దాన్ని అనునిత్యం స్మరించుకుంటూ మన బాధ్యత పెరిగింది ఇంకా మనం సేవ చేయాలి అన్నదానికే పరిమితమయ్యాం కానీ ఏదో అది వచ్చింది కదా అని ఆ దాన్ని ఏమంటాం మనం గర్వించడం కానీ అలాంటిది లేదన్నమాట థాంక్యూ వెరీ మచ్
(16:06) నాగరెడ్డి థాంక్యూ [సంగీతం] [ప్రశంస]
No comments:
Post a Comment