అనేకమంది మేము భగవంతునిలో చేరిపోవాలని,
మేము మోక్షము పొందాలి అని ఆశిస్తున్నారు!
ఇది ఎట్లా సాధ్యమౌతుంది?
భగవంతుడు రూపరహితుడు. శక్తిమయుడు.
నీరు నీరుతో చేరగలదు.అదే విధంగా రూపరహితుడైన భగవంతుని చేరాలంటే మనం కూడా రూపరహితులం కావాలి.
అనగా దేహాభిమానం విడాలి. దీనిని ధ్యానము అన్నారు.
దేనిలో మనం ఏకం కావాలి అని ఆశిస్తూన్నామో దానిస్వరూపాన్ని పొందాలి.
దేహాభిమానం వీడక దైవాన్ని ప్రార్థిస్తే ఫలసిద్ధి కలుగదు.
No comments:
Post a Comment