*తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఇన్నిన్ని కాపురాలు కూలుతున్నాయంటే.,*
*ఇన్నిన్ని విడాకుల కేసులు వస్తున్నాయంటే..*
*అందుకు కారణం శోభన్ బాబు*
నిజ్జంగా...నిజం, శోభన్ బాబు ఈ రోజు మన మధ్య లేక పోవడమే అసలైన కారణం.
శోభన్ బాబు అంటే ఒక ఎమోషన్..
శోభన్ బాబు సినిమా అంటే ఓ ప్రమోషన్..
తెలుగు కుటుంబ వ్యవస్థ కు, ముఖ్యంగా మగవారికి, వారి భార్య(లు) కు శోభన్ బాబు చేసిన సేవలు మరిచి పోవడానికి అస్సలే వీల్లేనివి.
ఆయన సెట్ చేసిన expectations పుణ్యమా అని ఓ రెండు తరాల కుటుంబాలు విడాకులు, గొడవలు లేకుండా కాపురాలు చేశారు మన తెలుగు రాష్ట్రాల్లో.
--------------------------------
*శోభన్ బాబు సెట్ చేసిన (కాపురాలు నిల బెట్టిన) expectations" ( కొన్ని):
--------------------------------
1. పొద్దున్నే లేచి టిప్ టాప్ గా తయారై బయటికి వెళ్లి రావడమే భర్త పని.
2. భర్త నిద్ర లేచే సరికే భార్య ఇంటి పని, వంట పని చేసేసి, తల స్నానం చేసి, కాఫీ రెడీ చేయాలి.
3. వీలైతే ప్రతి వారం భర్త కి రొమాంటిక్ గా స్నానం కూడా చేయించాలి. సబ్బు రాసి, తలంటి ఇలా...
4. రెండో సెటప్ పెట్టడం భర్త యొక్క జన్మ హక్కు.
5. దాని మీద కాస్త ఏడ్చినా, చివరికి భార్య సర్దుకు పోవాలి లేదా అంగీకరించాలి.
6. రెండో భార్య కు కూడా ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇవ్వాలి.
7. ఇద్దరూ భర్త ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి. పాటలు కూడా పాడాలి.
8. తేడా వస్తే, తాగి రావడం కూడా భర్త జన్మ హక్కు. భార్య(లు) ప్రశ్నించ కూడదు. ఒంటరిగా కూర్చుని రాత్రంతా ఆలోచిస్తూ ఉండాలి.
9. కోర్టు, పోలీస్ స్టేషన్ లాంటివి దరిద్రపు ఆలోచనలు. ఏమో, ఆ రెండో భార్య పోలీస్ ఇన్స్పెక్టర్ కావచ్చు, కోర్టు లో లాయారూ కావచ్చు. ఖర్మ కాలితే, కాలేజీ లో "ఆయన" అభిమాని కూడా కావచ్చు. వద్దులే !
10. అవసరం పడితే ఇద్దరు భార్యలలో ఒకరు ప్రాణ త్యాగం అయినా చేసి భర్త జీవితాన్ని సుఖ మయం చేయాలి. లేదా అస్తమిస్తున్న సూర్యుని వైపు నడుస్తూ వెళ్లి పోవాలి. చీకటిలో కలసి పోవాలి.
ఇలాంటివి ఎన్నో. ఎన్నెన్నో.... బయటికి చెప్పీ చెప్పకుండా., సైలెంట్ గా ప్లాంట్ చెయ్యడం వలన నాడు కాపురాలు నిలబడ్డాయి. పిల్లలు చదువుకున్నారు నేడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు.
లేకుంటేనా.......అమ్మో, తలచుకోవడానికే భయం వేస్తుంది.
--------------------------------
*బెస్ట్ పార్ట్ ఏమిటంటే..*
ముక్కోటి తెలుగు ఆంటీల్లో, నాడు ఏ ఒక్కరూ శోభన్ బాబు ని తప్పు పట్టగా చూడ లేదు.
అయితే గియితే, తప్పు శోభన్ బాబు ని సరిగ్గా చూసుకోని మొదటి భార్య ది. కాదంటే శోభన్ బాబు ని వలలో వేసుకున్న రెండవ భార్యది. మరీ కాదంటే పరిస్థితుల ప్రభావమే తప్ప....
*తప్పు శోభన్ బాబు ది కానే కాదు*
------------------------------------/-//---//-----------------
ఎప్పుడైతే ఈ ఫెమినిజం/సమానత్వం పుణ్యమా అని ఈ expectations పక్కన బడ్డాయో.., అప్పటి నుంచి కుటుంబాల్లో గొడవలు మొదలయ్యాయి.
- ఇంటి పని నేనే ఎందుకు చెయ్యాలి? నువ్వూ సగం పనులు చెయ్యి.
- నేను మాత్రం సంపాదించటం లేదా? నేను చెయ్యను.
- మొగుడేనా తాగేది, నేనూ తాగుతాను.
నువ్వేనా అర్ధరాత్రి ఇంటికి వచ్చేది, నేనూ వస్తాను.
లాంటివన్నీ మొదలయ్యాయి అంటే, ఆదర్శ పురుషుడైన మన శోభన్ బాబు గారు మన మధ్యన లేక పోవడం వల్లనే.🤣🤣🤣
--------------------------------
*Highlight:*
కొడుక్కి శోభన్ బాబు లా తల దువ్వి.,
మొహం మీదికి ఓ రింగు లాగి.,
మురిసి పోని తల్లి ఆ రోజుల్లో ఎక్కడో తప్ప ఉండేదే కాదు
😂😂😂🙏సరదాగా మాత్రమే తీసుకోండి 😂❤️🙏
http://youtube.com/post/Ugkx4pqnYtVATtBOavGCPOro-ppOJeZHZIHe?si=4QwIp0FwvXlWk9MG
No comments:
Post a Comment