Monday, February 9, 2026

Beauty.. creates a sense of insecurity. || @sridevi_vlogs515

Beauty.. creates a sense of insecurity. || @sridevi_vlogs515

 https://youtu.be/t70FlMy23TA?si=RfZ2RaM36EL40cuV


https://www.youtube.com/watch?v=t70FlMy23TA

Transcript:
(00:01) హలో అండి ఈరోజు ఈ వీడియో మీ లైఫ్ కి కనెక్ట్ అవ్వచ్చు అసలు స్కిప్ చేయకండి. ఈరోజు వీడియోలో మగవాళ్ళ మైండ్సెట్ ఏంటి మొగుడు మైండ్సెట్ ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం. అయితే ఒక అందమైన భార్య భర్తకి శత్రువుగా ఎలా మారుతుందో కూడా మనం అర్థం చేసుకుందాం. ఒక మగాడి దృష్టిలో భార్య అందంగా ఉన్నా అదే భార్య గుణవతి అయినా అదే భార్య తెలివిగలదైనా కూడా ఆ భర్తకు నచ్చదండి అవునండి ఇది మాత్రం నిజం మాట ఎందుకు అంటే ఆ భర్త ఇగో హడ్ అవుద్ది.
(00:45) ఆ భర్తని ఆ భార్య డామినేట్ చేస్తది అన్నమాట. ఇంకా చెప్పాలంటే మగవాడి అహం దెబ్బ తింటది అని అర్థం అన్నమాట. కాబట్టి ఒక అందమైన పెల్లం ఒక మొగుడికి అస్సలు నచ్చనే నచ్చదు. పాతకాలం అవ్వనివ్వండి కొత్త కాలం అవ్వనివ్వండి అలాగే బాగా మన పూర్వీకులు అవ్వనివ్వండి. మగవాళ్ళ మైండ్సెట్ ఇలాగే ఉంటదిన్నమాట. బేసిక్ గా ఒక మగవాడు పెళ్లికి ముందు నుంచే తనకి అందమైన భార్య రావాలని అలాగే గుణంలో సీతమ్మ తల్లిని మించిపోవాలని అలాగే తన తెలివితాటలతో ఇల్లు చక్కబెట్టుకోవాలని కాపరాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఆరాటపడుతూ అదే భార్య అటువంటి స్త్రీ కోసమే వెతుకులాడుతూ వివాహం చేసుకుంటాడు. కానీ తన పెళ్లి అయిన
(01:31) తర్వాత మరనాడు నుంచే మగవాడ అహం దెబ్బ తింటది. ఆడవాళ్ళని ఒక మూల కూర్చోబెట్టడం అన్నమాట అంటే మన భారతీయ వ్యవస్థలో కచ్చితంగా ప్రతి కుటుంబంలో మగవాళ్ళదే పెత్తనం ఉంటది యజమాని కూడా మగవాడే ఉంటాడు. ఆడవాళ్ళు ఎంత నెట్టుకొద్దామన్నా ఎంత పెత్తనం చేద్దామన్నా తన తెలివితేటల్ని సలహాలని ఇద్దామన్నా ఆ భర్త తీసుకోలేడు అంగీకరించలేడు.
(02:02) మరి ఒక్కసారి పెళ్లయిన తర్వాత మగవాళ్ళు అంటే భర్తలు తమ ఆలోచనని అభిప్రాయాలకి గండికొడతారన్నమాట. ఎందుకు అంటే భార్య భర్తకి ప్రథమ శత్రువు అన్నమాట. భార్య అందం గాని గుణం గాని తెలివితేట్లు గాని భర్తకి నిదానంగా కాలక్రమేపి స్లో పాయిజన్ ఎక్కినట్టు శత్రువుగా భార్య మారుతుంది భర్తకి ఇదైతే ప్రతి ఒక్కరి లైఫ్ లో కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని సిచువేషన్స్ జరుగుతూనే ఉంటాయన్నమాట కాబట్టి మన లైఫ్ కి కనెక్ట్ అవుద్ది అని చెప్తున్నాను.
(02:38) అసలు పెల్లం ఎలా ఉంటే మొగుడికి నచ్చుద్ది ఏం లేదండి సింపుల్ మనకి వెనకటి రోజుల్లో తీసుకుంటే మన అమ్మమ్మలు గాని నానమ్మలు గాని వాళ్ళ అమ్మలు గాని వాళ్ళు ఎలా ప్రవర్తించేవారు భార్య అంటే ఎంత అమాయకంగా ఉంటే ఎంత నిదానంగా ఉంటే అంత నచ్చుతారండి భర్తలకి వాళ్ళు చిన్న పిల్లలా బుజ్జగిస్తారు అంటే మొగుళ్ళు పెళ్లాల్ని చిన్న పిల్లల్లా బుజ్జగిస్తారు ప్రతిదీ తనకే తెలుసు అన్నట్టు వాళ్ళకి వాళ్ళకి తెలియదేమో అనుకుంటూ వీళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళ నెత్తి మీద రుద్దుతూ ఉంటారు.
(03:13) కారణం ఏంటి అంటే హీరోయిజం అన్నమాట పోజు హీరోయిజం చూపించుకోవడానికి ఇదొక అవకాశం అలా అని చెప్పి తెలియని విషయాలు చాలా మట్టికి కొంతమంది స్త్రీలు భర్త దగ్గరే నేర్చుకుంటారు ఇది మాత్రం అక్షర సత్యం మాట కానీ భర్తలకు మాత్రం నచ్చదు ఎందుకంటే ఇల్లాలు అంటే ఎంతో గుట్టుగా సంసారం చేసుకుంటూ చక్కగా నిండుగా చీరకట్టులో ఉంటూ రూపాయి కాసంతా బొట్టు పెట్టుకొని తలనిండ మల్లెపూలు పెట్టుకొని ఇంటిని శుభ్రం చేసుకొని పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ అలాగే ఉండేవారండి ఇదివరకు ఆడవాళ్ళు వాళ్ళకి అలా ఉంటేనే నచ్చుద్దుమాట ఎందుకంటే ఇదివరకు ఆడవాళ్ళు ఇంకా మంచివాళ్ళ కింద మంచి పేరు తెచ్చుకునేవారు ఒక గౌరవం
(03:58) తెచ్చుకునేవారు ఇలా ఉంటే మొగుళ్ళు పెల్లాలకి మస్తు గౌరవం ఇచ్చేవారు అన్నమాట ఇంకా చెప్పాలంటే భర్త ఎక్కడో వాకిట్లో ఉండగానే భార్య మొగుడిని చూసి గడగడా వనికిపోయేది ఎదురుగా మంచి నీరు గ్లాస్ పట్టుకొని వచ్చి స్వాగతం పలికేది మాట ఇంకా ఏ మాట మాట్లాడేది కాదు ముద్దు ముచ్చట అనేది తర్వాత సంగతి ఆయనకి ఇష్టమైతేనే అది జరిగేది.
(04:26) ఏయ్ అన్నం పెట్టు ఏయ్ టీ తీసుకురా కాఫీ తీసుకురా ఇటువంటి మాటలకే ఆ వస్తున్నానండి లేకపోతే అంతే అలాగే సమాధానాలు అవే చెప్పేవారున్నమాట ఎదురు చెప్పటానికే వనికిపోయేవారు కాబట్టి ఆ రోజుల్లో ఉన్న మైండ్సెట్ే మగవాళ్ళకి ఇప్పటికీ అలాగే ఉంది కాబట్టి అలా ఉంటేనే ఇష్టపడతారు. మరి ఈ రోజుల్లో ఆడవాళ్ళు అలా లేరు కదా కాలం మారిపోయింది కదా మీరు ఏం చెప్తున్నారు మేడం ఇంకా అక్కడే ఉన్నారా శ్రీదేవి గారు మీరు అంటే నిజమేనండి మీరు చెప్పిందంతా నిజమే ఆ రోజుల్లో ఒక తీరు ఈ రోజుల్లో ఒక తీరు మనందరం చాలా మారాం సమాజం మారింది ఇంకా ఎక్కడికో ముందుకు వెళ్తున్నాం సైన్స్ పరంగా చూసుకుంటే కానీ నిజం చెప్పాలి అంటే
(05:15) ఆడవాళ్ళందరూ ఇలా ఉంటేనే సంసారాలు బాగుపడతాయి మో కాపురాలు నిలబడతాయేమో ఇది మాత్రం చాలా నిజమని మనం నమ్మాలన్నమాట. మన భారతదేశంలో స్త్రీలని ఒక విలువైన ఆస్తిగా చూస్తారు అలాగే ఒక విలువైన వస్తువుగా చూస్తారు. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక బంగారం వజ్రాలు వైడూర్యాలు దాచుకుంటున్నట్టు ఒక గనిల మాట దాన్ని నిరంతరం కాపాడుకుంటారు రక్షించుకుంటారు పరుల పాలు కానివ్వకుండా అవమానాల బారిన పడకుండా ఒక స్త్రీ మానాన్ని గౌరవాన్ని నిలబెడతారు అది ఎవరు అంటే ఒక మగాడు ఒక భర్త కాబట్టే ఆ స్త్రీకి ఒక నిండుతనం ఎలా వస్తుందో అంతులేని గౌరవం కూడా అలాగే ఉంటుందన్నమాట కానీ అలాగే ఉండాలి స్త్రీ
(06:05) అని ఈరోజు చెప్తుంటే అది ఆడవాళ్ళకి నచ్చట్లేదు ఎందుకు అంటే స్త్రీలు చీర కట్టుకోవాలి నిండుగా తలండా పూలు పెట్టుకోవాలి రూపాయి కాసంతో బొట్టు పెట్టుకోవాలి అని చెప్పా కదా మరి ఎవరు పెట్టుకుంటున్నారు ఇప్పుడు అంటే అలా పెట్టుకోవాలమ్మా పెట్టుకు కుంటేనే సంసారాలు నిలబడతాయి భర్తకి ఎదురు చెప్పకూడదు నోరు ఎత్తకూడదు కొట్టినా తిట్టినా పడుండాలి అలా ఉంటేనే సంసారాలు నిలబడతాయి అని నేను చెప్పాను అనుకోండి దానికి మీరు యాక్సెప్ట్ చేయరు కదా ఫెమినిజం ముందు మీరు అలా ఉండండి మీ మొగుడు కొట్టిన మీరు పడిఉండండి అలాగే మీరు రూపాయి కాసంతో బొట్టు పెట్టుకోండి మరి మీరు
(06:42) ఎందుకు చీర కట్టుకోవడం లేదు అని ఎదురు ప్రశ్నలు వేయడం తప్ప ఇంకేమీ ఉండదండి కాలం మారిపోయింది కాబట్టే అసలైన ప్రాబ్లమ్స్ స్త్రీలకు మొదలైన మాట ఎందుకు అంటే స్త్రీలు స్వేచ్ఛ పోరాటాలు చేస్తున్నారు స్వేచ్ఛ కావాలంటున్నారు సమానత్వం కావాలంటున్నారు పురుషులతో సమానమైన వాటాలు వంతులు వేస్తున్నారు కాబట్టే అసలైన ప్రాబ్లమ్స్ మొదలైనాయి ఇది అగౌరవంగా భావిస్తున్న భర్తకి భార్యలు నచ్చటం లేదు.
(07:13) అగౌరవం ఏముంది మేము చదువుకుంటున్నాం మేము సంపాదిస్తున్నాం మా జీతాలు కావాలి మా డబ్బు కావాలి గానీ మేము నచ్చమా అని చెప్పి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఒక ఉద్యోగం భర్తతో పాటు భార్య సమానంగా సంపాదించడం డబ్బు సంపాదించడం ఇది భర్త తీసుకోలేడు కానీ కాలక్రమేపి మగాడు మారినా సమాజం మారినా పరిస్థితులు మారినా అంటే వేడినీళ్ళకి చల్నీళ్లు తోడుండాలి అని చెప్పి భార్యలని ఉద్యోగాలకు పంపినా కూడా అది కొంతవరకే వాళ్ళ కుటుంబ పరిస్థితుల వరకే ఉంటుంది కానీ దాన్ని మనస్ఫూర్తిగా భర్త స్వీకరించట్లేదు అందుకనే ఇన్ని గొడవలు కాపురాలు కూలిపోవటాలు భార్యని శత్రువుగా చూడడం
(07:59) జరుగుతుంది. ఈ కారణాల చేతే భార్య అంటే భర్తలకి నచ్చడం లేదు తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. స్వేచ్ఛ కోసం ఆరాటపడుతూ అతి తెలివిదాటలు చూపిస్తున్నారు అని చెప్పి భర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి చాలామంది మగవాళ్ళకి జాబ్ చేసే ఆడవాళ్ళంటే అస్సలు నచ్చదండి కానీ నలుగురితో నారాయణ కాలంతో గోవిందో లేదా కులంతో గోవిందో ఏదో ఒకటి ఆడవాళ్ళు కూడా అన్నిటిలో పోటీ పడుతున్నారండి అంటే మంచి జాబ్ ఉంది మంచి శాలరీ ఉంది.
(08:37) ఈక్వల్ గా మగవాడితో పోటీ పడుతున్నారు అన్నమాట ఇదే భర్తకి నచ్చడం లేదు ఫ్యామిలీ మేటర్ లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నమాట అంటే సలహాలు ఇస్తున్నారు భర్త ఒకలా అంటే ఇది కాదు ఇంకోటి ఇలా చేద్దాం అని అనటం వలన ఆ మొగుడికి అవి నచ్చట్లేదు ఏమిటి అంటే ఆడ పెత్తనం బోడు పెత్తనం అని సింపుల్ గా కొట్టేస్తారు అన్నమాట. అలా అని చెప్పి మరి మన అమ్మలో నానమ్మలో వీళ్ళందరూ ఎంత అనుకువగా ఎలా ఉన్నారు భర్తకి ఎదురు చెప్పేవారు కాదు నోరెత్తేవారు కాదు ఇంకా చెప్పింది చేసేవారు అందుకేనేమో వాళ్ళ సంసారాలు బాగున్నాయని అన్నాను కదా ఇందాక మరి ఇప్పుడు వాళ్ళకి ఏ ఆసరా లేదు ఏ చదువు
(09:26) లేదు ఉద్యోగం లేదు వాళ్ళు అలాగే ఉంటారు భర్త మీద ఆధారపడ్డారు మేమఎందుకు పడతాం మాకు ఇప్పుడు ఇప్పుడు మా చేతిలో చదువు ఉంది ఉద్యోగం ఉంది బోల్డ్ డబ్బు ఉంది మాకు స్వేచ్ఛ ఉంది. ఇదే చెప్తున్నారు ఆడవాళ్ళు కాబట్టి రెండిటిని పోల్చుకోవడానికి అసలు కుదరదు అని నేను చెప్తున్నా అన్నమాట ఏమి తెలియకపోతే కామ్గా ఉంటాం ఒక మూలపడి ఉంటాం.
(09:48) అన్ని తెలిసినప్పుడు మనం కూడా చిన్న సజెషన్ ఇద్దాం అని చూస్తాం అంటే ఆడవాళ్ళు అంటే చదువుకుంటారండి నాలెడ్జ్ పెరుగుద్ది అలాగే మంచి జాబ్ ఉంటుంది భర్తకి సలహాలు ఇస్తుంటే నచ్చట్లేదు ఈక్వాలిటీ చూపిస్తున్నావా నన్నే క్వశ్చన్ వేస్తున్నావా అని చెప్పి గొడవలు ఇంకా రెట్టింపు అవుతున్నాయి అనమాట ఫ్యామిలీలో దీనంతటికీ కారణం ఏంటి అంటే నువ్వు డబ్బు సంపాదిస్తున్నావని పొగరు చూపిస్తున్నావా ఏ తగ్గు నీకు అంత లేదు ఏదో నువ్వు ఏడు చేస్తున్నావని నేను జాబ్కి పంపుతున్నా అని అనటం జరుగుతుంది.
(10:23) ఇక్కడ గమనించవలసినది ఏంటి అంటే స్త్రీలు ఎంత చదువుకున్నా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా అంటే ఒక డాక్టర్ గాని ఒక లాయర్ అమ్మ గాని ఒక కలెక్టర్ అమ్మ గాని అలాగే పెద్ద పోలీస్ ఆఫీసర్లు గాని ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక స్త్రీ గాని భర్తకి భయపడుతూనే ఉంటది. ఎక్కడున్నా కూడా టైం టు టైం తన కాలు రాకముందే ముందు మొగుడికి భయపడి ఇంటికి చేరుకుంటది అన్నమాట కాబట్టి ఆడదానికి ఎప్పటికీ స్వేచ్ఛ లేదండి అది మీరు బ్రమలో బతుకుతూ సంసారాలు పాడు చేసుకుంటూ భార్యా భర్తలు గొడవపడుతూ ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతూ సమాజంలో ఒక చెడ్డ ముత్ర వేసుకుంటున్నారు తప్ప మిగిలేది ఏమీ లేదు పాతకాలాన్ని ఫాలో అవితే
(11:05) ఎంతో అనుకువైన సంసారం భార్యా భర్తల మధ్య ఆప్యాయిత అనురాగాలు ఇంకా ఇంకా ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడానికి గొప్పగా అవకాశాలు ఉంటాయి. మనల్ని చూసి ఇంకా కొంతమంది దాన్ని ఫాలో అవుతారు కానీ ఆడవాళ్ళు అనుకుంటారు ఎంత సంపాదించినా తన భర్త కోసం పిల్లల కోసం ఇంటి కోసమే అని చెప్పి వాళ్ళు ఎంత బాధ్యతనైనా ఎంత కష్టాన్నైనా సరే స్వీకరిస్తారు అంటే ఇటు ఇంటిని మేనేజ్ చేసుకొని బయట ఆ జాబ్ ని మేనేజ్ చేసుకొని ఎన్నో పరిస్థితులను తట్టుకుంటూ నిలబడతారు వాళ్ళు హెల్త్ ఖరాబ్ అవుతున్నా కూడా పట్టించుకోరు ఎందుకు అంటే అంటే ఆడవాళ్ళకి అంత ఓర్పు ఉంటది కానీ ఇందులో ఉన్న మర్మం ఆ
(11:52) భర్తకి అర్థం కాదు అంటే భర్తకి భార్య మొదటి శత్రువు అవ్వడానికి కారణం భార్య జాబ్ అండి ఇదే ప్రథమ కారణం ఎందుకు అంటే మగవాడు ఎప్పుడు ఒక నిదానమైన స్త్రీని అనుకువగా ఉన్న స్త్రీని అందులో చాలా అందగెత్తి రావాలి నాకు బెల్లంగా అని అనుకుంటాడు కానీ అందం తక్కువ అయినా సరే గుణం అనుకువ భర్తకి ఇచ్చే గౌ గౌరవం బట్టి ఆ ఇల్లాలు భర్త గుండెల్లో చిరస్థాయిగా ఎప్పుడో నిలిచిపోద్దని మీకు తెలుసండి.
(12:23) ఎక్కువ శాతం పల్లెటూర్ల వాళ్ళని నాలెడ్జ్ లేని వాళ్ళని మగవాడు భార్యగా చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా మొత్తం ఉల్టా అయింది ఏంటి అంటే ఇదివరకు జాబ్ చేసేవాళ్ళు కావాలి పెళ్లాల కింద రావాలి అని వెనకటి రోజులు కావడా కాదు 20 ఇయర్స్ బ్యాక్ చెప్పేవారు ఇప్పుడు పెళ్లిల్లే అవ్వట్లేదు అయిన వాటిల్లో కూడా ఇది సూపర్ కండిషన్ ఏంటి అంటే అమ్మాయి చదువుకోపోయినా పర్వాలేదు జాబ్ చేసే అమ్మాయి నాకు అస్సలు వద్దు అని చెప్తున్నారు.
(12:56) ఎందుకు అంటే మళ్ళీ మన జనరేషన్ గాని మన సొసైటీ గాని మారుతుందని అర్థం కాబట్టి మనం మీరు అనుకున్న అభిప్రాయాలని ఫాలో అవ్వాలా వెనకటి రోజుని ఫాలో అవ్వాల అన్నది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. ఇక్కడ కొన్ని కుటుంబాలకే ఆడవాళ్లే మర్రి చెట్టులా నీడనిస్తారు అంటే మరి వృక్షం మీకు తెలుసు కదండీ అది ఎంతటి నీడనిస్తుందో బాధ్యతలు ఒక్కటే కాదండి ఆడది కొన్ని నిర్ణయాలు మంచి తెలివిగా ఆలోచించి తీసుకుంటారు ఆ కుటుంబాన్ని ఎంతో లోతైన కష్టం నుంచి బయట పడేస్తారు.
(13:33) ఆ ఆడవాళ్ళ శక్తి ఆ భర్తలకి తెలియదు కారణం ఏంటి అంటే ఒక్క ఈగోనే అండి అహం అడ్డు వస్తది. మరి బయట ఆడవాళ్ళు ఇలాగా అలాగా అబ్బో వాళ్ళు అలా చేశరంటే ఇలా చేశారంట మన ఇంట్లో కూడా ఇలాంటి పెల్లం ఉంటే బాగును ఇలాంటి అక్క ఉంటే బాగును చెల్లి ఉంటే బాగున్నా అని అనుకుంటాం కానీ తన పెల్లాన్ని గుర్తించలేడు ఆ భర్త ఇదే అసలైన దరిద్రం అన్నమాట మంచి సజెషన్లని మీ భార్య ఎటువంటి సలహాలు ఇస్తదో అవి కూడా మీరు స్వీకరించాలని మనవి ఈరోజు వీడియోలో తెలివైన భార్యని భర్త శత్రువుగా చూస్తాడు అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఒక తెలివి తక్కువ భార్యని అంటే ఒక తింగర బుచ్చిని
(14:12) చదువు అన్ని ఉన్నా కూడా జ్ఞానం ఉన్నా కూడా కొంతమంది ఆడవాళ్ళకి ధైర్యం ఉండదు అదే ధైర్యాన్ని ఒక భర్త నూరి పోస్తాడు ఆ తింగర పుచ్చనే ఒక వజ్రానికి సాన పెట్టినట్టుగా సాన పెడతాడు సమాజంలో ఒక గౌరవమైన స్థానం ఇస్తాడు ఒక హుందా అయిన జీవితం కల్పిస్తాడు తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు తనకి ఒక గర్వాన్ని అలాగే ఒక తెలివితేటల్ని సమాజంలో నిలబడే అంత కసిని ఆ భర్తే నేర్పిస్తాడు.
(14:46) ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి మన సమాజంలో ఇటువంటి భర్తలు కూడా ఉన్నారు కాబట్టి ఎంతో మంది వీర వనితలు వీర నారలు మన దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలబడ్డారు. వాళ్ళందరూని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ముందుకు వెళ్లొచ్చు. ఈరోజు వీడియోలో నేను భర్తలక ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే మీరు బయట పనులతో ఒత్తిడలతో టెన్షన్లతో ఉన్నప్పుడు ఇంటిని పిల్లల్ని సంసారాల్ని అన్ని చక్కబెట్టుకోవడం మీ వల్ల పావు వంతు కూడా అవ్వదండి కేవలం డబ్బు సంపాదన అన్నది జాబ్ అన్నది ఈరోజులో కష్ట సాధ్యమైన పని మనశశాంతి కావాలి అంటే అది మనకి ఇంట్లోనే దొరుకుద్దున్నమాట కీచులాడుకోకుండా అంటే
(15:28) భార్య ఇష్టాల్ని గౌరవిస్తూ మీరు ముందుకు వెళ్ళాలి భార్య తెలివైనది కాకపోతే ఆ ఇల్లు ఎలా రానిస్తది మీరు చెప్పండి ఫైనల్ గా భర్తకి తెంగరు బుచ్చి అయినా నచ్చదు ఒక తెలివిగల ఆడదైనా నచ్చదు గుణవతి అయినా నచ్చదు ఎందుకు అంటే ఇక్కడ అహం అడ్డ వస్తది. ఇది అనాదిగా ఆదిగా మన భారతదేశ వ్యవస్థలో మనం తెలుసుకుంటున్న నిజాలు అంటే ఒక తెంగరు బుచ్చయనా ఇల్లు చక్కదిద్దుకుంటది సంసారం కాపురం చక్కగా పైకి తీసుకొస్తది కానీ ఒక తెలివైన భార్యని మీరు ఇంకా మెచ్చుకుంటూ అప్రిషియేట్ చేస్తూ మీరు ఆ ధైర్యాన్ని ఇస్తే ఆ మనోధైర్యం ఇంకా పెరిగి ఆ కుటుంబం ఒక రాజవ్యవస్థల అంచలెం
(16:14) ఎదుగుద్ది ఆ కుటుంబ కుటుంబ సభ్యులు గాని ఆ పిల్లలు గాని సమాజానికి ఒక సంఘ సంస్కర్తలే నిలుస్తారని నా ఉద్దేశం అన్నమాట ఇక్కడ తెలివైన భార్య లేదని కొంతమంది మగవాళ్ళు నొచ్చుకుంటూ ఉంటారు ఎంతసేపు పక్కనోడు బెల్లం మీద ఏడుస్తూ ఉంటారు వాడు బెల్లం చూడు ఎంత తెలివిగా చక్కబెట్టుకుంటుందో నీకేం వచ్చింది ఎంతసేపు మాయరాగం రోగం రోగం అంటావ్ లేకపోతే తింగరేషాలు వేస్తావ్ అని చెప్పి తిడుతూ ఉంటారు.
(16:42) కానీ ఇలా చేయడం వల్ల భార్య ఇంకా కుశించిపోద్ది. తన ధైర్యం సరిపోదు ఏం చేసినా నచ్చదు ఏమన్నా తిడతారు నేను ఏ బిజినెస్ పెడదాం అన్నా నాకు సపోర్ట్ చేయరు. నేను ఏ జాబ్ కి వెళ్తా అన్నా వద్దంటారు నా మాటను అస్సలు వినరు నా అభిప్రాయాలని గౌరవించరు అని ఆ భార్య నొచ్చుకొని ఆఖరికి చేతకానిదాల ఉండిపోద్ది. దయచేసి ఎవరో భార్యల్ని ఇలా నొప్పించకండి.
(17:05) ఎవరితోనూ కంపేర్ చేయకండి. మీ ఎవరు ఆలోచనలు ఎవరి టాలెంట్ ఎవరు సొత్తు వాళ్ళ దగ్గరే ఉంటదిన్నమాట అది తీసుకొని వాళ్ళు ఏం చేయగలరు అని ఆ ప్రతిభను మీరు గమనించి వాళ్ళని ముందుకి నడిపించండి ఎందుకు అంటే ఇక్కడ కచ్చితంగా తెలివైన భార్య ప్రతి ఇంటికి కావాలి అలా ఉంటేనే ఆ సంసారాలు నిలుస్తాయి ఆ కాపురాలు బాగుంటాయి లేకపోతే ఆ సంసారాలు ఎదుగు బదుగు ఉండవని నా ఉద్దేశం మరి భార్యని ని శత్రువులా చూస్తారా తెలివైన భార్యని ఇంకా తెలివిగా తీర్చి దిద్దుకుంటారా అది మీ చేతుల్లోనే ఉంది.
(17:46) ఈరోజు వీడియో మీ లైఫ్ కి కనెక్ట్ అయిందా ఒక్కసారి చూసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి

No comments:

Post a Comment