Albert Einstein చెప్పిన Success Secret | Value వెనుక పరిగెత్తు | Telugu Podcast
https://www.youtube.com/watch?v=KiURRZdk5Fo
Transcript:
(00:03) సాధారణంగా ఒక వయసు వచ్చాక నేను లైఫ్ లో సక్సెస్ అవుతానా నేను బతుకుతున్నానా లేక కనిపించడానికి బతుకుతున్నానా అన్న ప్రశ్నలు బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మన చిన్నతనం నుంచి చదువు, ఉద్యోగం, డబ్బు, పేరు ఇవే మన జీవితం అని సక్సెస్ అని చెప్పుకొచ్చారు. బట్ ఏం లాభం? జాబ్ కొట్టాక తెలుస్తుంది. డబ్బు బ్యాంక్ అకౌంట్ లో పడ్డాక అర్థంవుతుంది.
(00:27) ఇదా సక్సెస్ అంటే అని ఒకరోజు నిన్ను గుచ్చి గుచ్చి చంపేస్తుంది. రియాలిటీ ఏంటంటే ఏదైతే మనం కొంత డబ్బు ద్వారా వచ్చిన పేరు సంపాదిస్తామో దానికి మనం సక్సెస్ అని అంటాం. కానీ అందులో అర్థం పర్థం లేని బతుకు తప్ప మరొకటి ఏమీ లేదు. ఆ బతుకు ఓ నిశశబ్ద శిక్షలా మారుతుంది. ఇక్కడే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది.
(00:49) సక్సెస్ అవ్వాలని ప్రయత్నించకు విలువగల మనిషిగా మారాలని ప్రయత్నించు అని సక్సెస్ అంటే ఏంటి? పక్కోడు నీ గురించి ఏమనుకుంటున్నాడా? మరి వాల్యూ అంటే నువ్వు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అదే వాల్యూ ఈ రెండింటి మధ్య ఉన్న దూరమే చాలా మంది లోపల విరిగిపోయేలా చేస్తుంది. ఇది అర్థంఅవ్వాలంటే మీకు రెండు విత్తనాల కథ గురించి తెలియాల్సిందే.
(01:11) రెండు విత్తనాలు ఒకే మట్టిలో పడ్డాయి. మొదటి విత్తనం తొందర పడింది. నేను వెంటనే పైకి రావాలి అందరూ నన్ను చూడాలి అని అనుకుంది. మట్టి గట్టిగా ఉండడంతో అది పైకి వచ్చే గ్యాప్ లోనే పగిలిపోయింది. బట్ రెండో విత్తనం మాత్రం నిశశబ్దంగా ఉంది. పైకి రావాలనే తొందర లేదు ముందు వేరు బలంగా పెంచుకుంది. కాలం గడిచాక అది పెద్ద చెట్టు అయింది.
(01:34) చాలా మందికి నీడనిస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రెండో విత్తనం సక్సెస్ కోసం ఎదురుచూసిందా? లేదా వాల్యూ కోసం ఎదిగిందా? మనలో చాలామంది మొదటి విత్తనంలానే ఉంటాం. త్వరగా కనిపించాలని త్వరగా గుర్తింపు పొందాలని త్వరగా ఏదో అవ్వాలనే తపన తప్ప ఏమీ లేదు. కానీ లోపల వేర్లు బలంగా లేవు. అందుకే చిన్న దెబ్బకే ఆత్మవిశ్వాసం కూలిపోయింది.
(01:58) మన ఐన్స్టీన్ జీవితాన్ని చూస్తే అతను రెండో విత్తనం లాంటివాడు. స్కూల్లో పెద్దగా చదివేవాడే కాదు టీచర్స్ తనని సీరియస్ గా తీసుకోలేదు. స్టడీ అయిపోయాక కూడా ప్రొఫెసర్ కాలేకపోయాడు. బట్ పేటెంట్ ఆఫీస్ లో క్లర్క్ గా పని చేశాడు. అప్పుడు సమాజం దృష్టిలో అతను జాబ్ కొట్టి డబ్బు సంపాదిస్తున్నాడు అంటే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ లా నార్మల్ మెన్ లా కామన్ మ్యాన్ లా ట్రీట్ చేస్తారు.
(02:20) కానీ ఐన్స్టీన్ లోపల ఏముంది జాబ్ ఇంట్రెస్ట్ లేదు కానీ ప్రశ్నించే మనసు నిజాన్ని వదలని ఆలోచన తెలుసుకోవాలనే తపన ఉంది. ఇదే వాల్యూని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సక్సెస్ బయట నుంచి వస్తే విలువ మాత్రం లోపల నుంచి పెరుగుతుంది. ఈ రెండింటిని కలిపి చూడడం మనకు నేర్పించలేదు. అందుకే ఒకడే లైఫ్ ని చూస్తూ అతను సక్సెస్ఫుల్ అయ్యాడు అని కుళ్ళుకు చేస్తాం.
(02:46) కానీ అతని లైఫ్ లో నిద్ర లేని రాులు ఎన్నో భయాలు ఒంటరితనం మనకి ఇవేం కనిపించవు. అదే వాల్యూ ఉన్న పర్సన్ మాత్రం చాలాసార్లు సైలెంట్ గా ఉంటూ అతని ఉనికిని ఇతరుల లైఫ్ లో మార్పు తీసుకొస్తుంది. సైకలాజికల్ గా చూస్తే సక్సెస్ మీద ఆధారపడిన జీవితం కంపారిజన్ల మీద నడుస్తుంది. నాకు పోటీ ఎవరు వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలి అనే పోలికలు ఆగవు. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడూ ఎవరో ఒకరు నీకంటే ముందే ఉంటారు గనుక కాలం మారుతుంది పదవులు పోతాయి డబ్బు విలువ తగ్గుతుంది.
(03:17) కానీ నీకున్న విలువతో జీవితం కాలాన్ని దాటిలా చేస్తుంది. ఐన్స్టీన్ కి నోబెల్ ప్రైజ్ కూడా అతని గొప్ప పనికి వెంటనే రాలేదు. రిలేటివిటీని అప్పట్లో చాలా మంది నమ్మలేదు. అయినా అతను తన ఆలోచనను మార్చలేదు. ఎందుకంటే అతను ఆమోదం కోసం నిజాయితీని అమ్ముకోలేదు కనుక. ఇది చాలా మందికి సాధ్యం కాదు. సో ఇప్పుడు మన బతుకులు చూసుకుంటే మనమంతా ఒక దశలో ఈ రెండు దారుల మధ్య నిలబడతాం.
(03:43) ఒక దారేమో త్వరగా ఎదగాలి ఎలా అయినా సక్సెస్ అవ్వాలి డబ్బు సంపాదించాలి అది అందరికీ చూపించాలి. ఇంకో దారి మాత్రం సైలెంట్ గా నేర్చుకోవడం స్ట్రాంగ్ గా మారడం రిజల్ట్స్ లేట్ అయినా పర్వాలేదు అనుకోవడం. ఈ రెండో దారి చాలా ఒంటరిది చాలా నెమ్మదిగా ఉంటుంది. కానీ అది విరగదు. ఫైనల్ గా నా మాట ఏంటంటే మన సమాధి మీద రాసేది మన జీవితం కాదు మన పదవి కాదు మన పేరు కూడా కాదు మన విలువ మనకున్న విలువ ఎంతని చూస్తారు థాంక్యూ
No comments:
Post a Comment