Monday, February 9, 2026

Neighbor’s Wife Looked Perfect… But Inside Was Shocking 😱 | Aari | #shorts #telugu

Neighbor’s Wife Looked Perfect… But Inside Was Shocking 😱 | Aari | #shorts #telugu

 https://youtube.com/shorts/I9e_Fw5iX-8?si=ZFCFNDH2bflHsL9M


https://www.youtube.com/watch?v=I9e_Fw5iX-8

Transcript:
(00:00) కొందరు మగాలకి తన భార్య కంటే ఎదుటివాడి భార్యనే ఎక్కువ అందంగా పద్ధతిగా కనిపిస్తుంది. కానీ ఆ అందం వెనుక ఉన్న అసలు నిజాన్ని వివరిస్తూ ఒక చిన్న స్టోరీ చెప్తాను జాగ్రత్తగా వినండి. అజయ్ మరియు ప్రకాష్ ఇద్దరు పక్కింటి వాళ్ళు అజయ్ భార్య ఎప్పుడు వంటగదిలో ఉంటూ ఇల్లు సర్దుకుంటూ కొంచెం అలసిపోయినట్టు కనిపిస్తుంది.
(00:19) కానీ ప్రకాష్ భార్య మాత్రం ఎప్పుడూ నీట్ గా డ్రెస్ వేసుకొని మేకప్ తో ఒక మోడల్లా మెరిసిపోతూ ఉంటుంది. అజయ్ తన మనసులో ఎప్పుడూ అనుకునేవాడు. ప్రకాష్ ఎంత అదృష్టవంతుడు వాళ్ళ భార్య ఎంత అందంగా ఉంటుందో నా భార్య చూస్తే ఎప్పుడు ఆ పాత నైటీలు ఆ వంటగది వాసన తప్ప ఇంకేం లేదని తన భార్యను తక్కువ చేసి చూసేవాడు. ఒకరోజు ప్రకాష్ చాలా దిగులుగా అజయ్ దగ్గరికి వచ్చాడు.
(00:39) అప్పుడు అజయ్ అడిగాడు ఏంటి ప్రకాష్ అంత అందమైన భార్య ఉంది. నీకు ఏం తక్కువని ఎలా ఉన్నావు అని అప్పుడు ప్రకాష్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఒక మాట చెప్పాడు. అజయ్ నీకు నా భార్య బయటికి మేకప్ తో అందంగా కనిపిస్తుంది కావచ్చు కానీ ఆ అన్నం కోసం నేను సంపాదించేదంతా ఖర్చుఅవుతుంది. ఆఫీస్ నుండి నేను అలిసిపోయి ఇంటికి వెళ్తే నాకు కనీసం ఒక గ్లాసు మంచి నీళ్లు ఇచ్చే ఓపిక కూడా ఆమెకు ఉండదు.
(01:01) కనీసం పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఎప్పుడు ఫోన్ మేకప్ షాపింగ్ ఇదే ఆమె ప్రపంచం కానీ నీ భార్యను చూడు తను అందంగా కనిపించడం కంటే నీ కుటుంబాన్ని అందంగా తీర్చిదిద్దడం మీద దృష్టి పెడుతుంది. నువ్వు వెళ్లేసరికి వేడి వేడి అన్నం వడ్డిస్తుంది. నీ తల్లిదండ్రులను కన్న బిడ్డలా చూసుకుంటుంది. నీ ఇల్లు ఒక స్వర్గంలో ఉందంటే దానికి కారణం నీ భార్య త్యాగం రంగును చూసి మోసపోకు అజయ్ నిజమైన అందం మనసులో ఉంటుంది అన్నాడు.
(01:25) ఆ మాట విన్న అజయ్కి అప్పుడు అర్థమైంది. తాను ఒక రత్నాన్ని ఇంట్లో పెట్టుకొని బయట దొరికి రంగురాల కోసం ఆశపడుతున్నానని చూశారు కదా ఫ్రెండ్స్ పక్కవాడి కంచంలో అన్నం ఎప్పుడూ ముద్దగానే కనిపిస్తుంది. ఎదుటివారిని చూసి ఆశపడడం అంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని పడేసి పక్కవాడి దగ్గర ఉన్న ఇత్తడిని కోరుకోవడం లాంటిదే. మీ భార్య మీకోసం పడే కష్టాన్ని గుర్తించండి.
(01:44) ఆమె త్యాగాన్ని గౌరవించండి. బాధ్యత తెలిసిన ఆడది ఏ మేకప్ లేకపోయినా దేవతలాగే కనిపిస్తుంది. ఈ వీడియో మరియు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ భార్యను మీరు గౌరవిస్తే కామెంట్ బాక్స్ లో ఐ లవ్ మై వైఫ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్ సైనింగ్ ఆఫ్ టీమ ఆరి.

No comments:

Post a Comment