Power of silence | silence magic | మౌనంగా ఉంటే అపారమైన శక్తి మీదే
Author Name:Positive Lights
Youtube Channel Url:https://www.youtube.com/@positivelightsGowrishankar
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XDrSSHQr_bk
Transcript:
(00:00) మౌనంగా ఉండటం వల్ల వచ్చే శక్తిని తెలుసుకోండి. ఒక ఊరిలో భార్యా భర్తలు ఎప్పుడు గొడవపడుతూ ఉండేవారు. తన భార్య ఎప్పుడు అరుస్తూనే ఉండేది. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది. భర్తకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యలు తెలుసుకొని పక్క ఊరికి సాధువు వచ్చాడని ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడని చెబుతాడు.
(00:32) అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కరించి గురుదేవా నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవపడుతూ ఉంటుంది. నేను చాలా నచ్చ చెప్పా ప్రయత్నాలు చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను కానీ నా మాట అస్సలు వినడం లేదు.
(00:57) దాని వల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయని చెప్పాను. అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక కథ చెబుతాను విను అది విన్న తర్వాత మీకు [సంగీతం] బాగా అర్థంవుతుంది. ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా ఎక్కువ మాట్లాడేవాడు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు.
(01:25) అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్లి ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను. నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని [సంగీతం] కానీ నేను అన్నిటిని విడిచి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి.
(01:50) నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు. ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత సంకల్ప శక్తి పెరుగుతుంది. మీకు ఆత్మశక్తి కలుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి. నీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలని గురువుగారు అంటారు.
(02:21) ఇక అక్కడ ఉన్న శిష్యులందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు. గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను అది మీరే చెప్పండి.
(02:43) సంకల్పం ఏం తీసుకోవాలంటూ ఆ గురువుగారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు ఒక నవ్వు నవ్వి నాయనా నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యమవుతుందా కాదు అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు దాన్ని పూర్తి చేయలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని గురువుగారు అంటారు. అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవా మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దాన్ని తప్పకుండా పూర్తి చేస్తాను.
(03:10) మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు సరే [సంగీతం] అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇదే నీ సంకల్పం [సంగీతం] అని చెబుతాడు. అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా సులభం. ఒక నెల కదా మౌనంగా ఉండేది. ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటాడు.
(03:33) అప్పుడు ఆ గురువుగారు నాయనా ముందు నువ్వు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెబుతాడు. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలు పెట్టాడు. అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి మౌనంగా ఉండడం చాలా సులువుగా అనిపించింది. అతను ఒక రోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేసాడు. కానీ రెండవ రోజు మౌను అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది.
(03:53) మూడో రోజు అతని మనసు బరువయింది. ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆ ఆశ్రమంలో అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు. తాను కూడా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి.
(04:14) మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్య పాలయ్యాడు. అతని తల ఆలోచనలతో బరువెక్కింది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. అతని ఆలోచన కేవలం మాట్లాడుకుంటున్నాడు. ఇక [సంగీతం] అతను నేరుగా గురువు వద్దకు వెళ్లి ఒక కాగితం మీద రాసి చూపించాడు. గురుదేవా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడుకుంటే నాకు శ్వాస ఆడడం లేదు. మానసికంగా నేను ప్రశాంతంగా లేను.
(04:36) ఇప్పుడు నేను ఏం చేయాలి సంకల్పాన్ని వదిలేయాలంటే అని రాసి చూపించాడు. అది చదివిన గురువుగారు నాయనా ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది.
(04:59) నీ తోటి శిష్యుల్లో చాలా మంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలో సాగిపోతున్నారు. నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టం అని చెబుతారు. గురువుగారు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసుకు తగిలాయి ఏమి మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
(05:26) అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇలా 15 రోజులు గడిచాయి. ఆశ్రమంలోని శిష్యులు అందరి సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు. కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఎవరితో మాట్లాడటం లేదు. ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు.
(05:52) 15 రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్లి ఇలా రాసి చూపించాడు. గురుదేవా నేను బయటకి మౌనంగానే ఉన్నాను. కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వినబడుతున్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. నేను బయట ఎంత మౌనంగా ఉంటానో లోపల అంతగా అరుస్తున్నాను. గురుదేవా ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ అడుగుతాడు.
(06:15) అప్పుడు ఆ గురువుగారు అవును నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కానీ ఎప్పటివరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటివరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు బయటకు మౌనంగా ఉన్న లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు. గురువుగారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ శిష్యుడు ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి.
(06:40) సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది. కానీ అడవుల్లోకి వెళ్ళిన శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు. ఆశ్రమంలోని శిష్యులందరూ అతనిని అడవిలోని క్రూర జంతువులు చంపేసాయేమో [సంగీతం] అని అనుకున్నాడు. అందరూ అతన్ని చాలా వెతికారు కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు. ఇక అందరూ నిర్ధారించుకున్నారు. అతడిని అడవిలోనే క్రూర జంతువులు తినేసాయని.
(07:01) కానీ గురువు గారికి అలా అనిపించలేదు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవా అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే అతన్ని జంతువులు చంపేసాయా అసలు ఏం జరిగి ఉంటుంది అని గురువుగారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు నువ్వు చెప్పిందైనా అయి ఉండొచ్చు లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండొచ్చు.
(07:22) అతను దేనికోసమైతే అడవిలోకి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చని గురువుగారు అంటారు. అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఎక్కువగా మాట్లాడడం అంత ప్రమాదమా అని అడుగుతాడు. ఆ గురువుగారు నాయనా మానవునికి ఉండే అనేక దుఃఖాల్లో ఒక దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవడమే మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మనం అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు వస్తాయి.
(07:46) మనలో ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు. ఎదుటి వారికి తమ గురించి అన్ని చెప్పేయాలని అనుకుంటారు. తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటి వారికి అవసరం లేకుండా వారికి చెప్పాలనుకుంటారు. తాను చెబుతున్నది సరైనది అంటూ వాదిస్తారు. సరిగ్గా ఇలాగే ఎదుటి వారు కూడా ఆలోచిస్తారు. ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితంతో నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎవరికీ లాభం ఉండదు.
(08:08) అంతేకాదు వారి శక్తి విలువైన సమయం వాళ్ళ గౌరవం కోల్పోతారు అని చెప్తారు గురువుగారు. అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు నాయనా పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి. మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలని ఆ గురువుగారు చెబుతారు. ఆశ్రమానికి విడిచి మూడు నెలలు గడిచిపోయాయి.
(08:31) కానీ అతని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయం మర్చిపోయారు. [సంగీతం] కానీ ఒకరోజు అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతని కన్నుల్లో పూర్తిగా శాంతి కనిపిస్తుంది. ఆశ్రమంలోకి రాగానే శిష్యులందరూ అతన్ని చుట్టూ ముట్టారు. అందరూ అతనితో మాట్లాడుతున్నారు.
(08:52) అతను కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకుముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు. అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు. గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవా నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు.
(09:17) ఆ శిష్యుడు కన్నులను బాగా గమనించి నాయనా నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావ్. నువ్వు ఏమి మాట్లాడడం లేదు. నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా నేను ఆశ్రమం నుండి అడవులోకి వెళ్ళినప్పుడు బయటికి మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకాల శబ్దాలు అరుపులు వినిపించేవి. నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉండేవి.
(09:40) నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను అక్కడ మానవ మాత్రులు ఎవ్వరూ లేరు. నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను. నేను ఎంతో ఏకాంతంలోకి వెళ్ళాను. నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో నేను నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి.
(10:00) ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమయింది. చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి. కానీ మెల్లమెల్లగా ఒక్కొక్కడిగా నా మనసులో నుంచి పాత విషయాలన్నీ తొలగిపోయాయి. ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను. ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు. అక్కడ ఎవరూ లేరు. మెల్లి మెల్లిగా నాకు శాంతి లభించింది.
(10:20) ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి కానీ నేను వినలేకపోయాను. ఆ శబ్దాలు ఏమిటంటే గాలి వీస్తున్న శబ్దం, పక్షుల కిలకల శబ్దం, పారే నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది.
(10:43) నాకు ఇంతకుముందు ఎప్పుడూ ఇంత శాంతి లభించలేదు. ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను. గురుదేవా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను. కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను. నా మనసులో ఏ ఆలోచనలు లేవు. ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు. అప్పుడు ఆ గురువుగారు నాయనా మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల శాంతి ఉంటుంది.
(11:10) ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేము. లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి. మనం అవసరానికి మించి మాట్లాడదాం మనం ఎదుటివారు చెప్పేది వినం. ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం. దీనివల్ల మన విలువైన శక్తి సమయం రెండు వ్యర్థమైపోతాయని గురువుగారు చెబుతారు.
(11:32) ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెబుతాడు. చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారో ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారో అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి.
(11:54) మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి. అలా అని సన్యాసి చెప్తాడు. ఇక దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం [సంగీతం] మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఎవ్రీవన్ ఓం
No comments:
Post a Comment