Monday, March 9, 2026

కోపాన్ని జయించే 4 సూత్రాలు 🧘‍♂️ | Buddha Story on Anger in Telugu | Telugu Motivation

కోపాన్ని జయించే 4 సూత్రాలు 🧘‍♂️ | Buddha Story on Anger in Telugu | Telugu Motivation

Author Name:Telugu real lesson tales

Youtube Channel Url:https://www.youtube.com/@Telugureallessontales

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BZ0Xhy1p46c



Transcript:
(00:01) నమస్కారం మిత్రులారా కోపం మన జీవితంలో ఎన్నో బంధాలను అవకాశాలను క్షణాల్లో నాశనం చేసే ఒక భయంకరమైన ఆయుధం కోపంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతామో ఏం చేస్తామో మనకే తెలియదు కానీ ఆ ఒక్క క్షణం చేసే తప్పుకు జీవిత కాలం బాధపడాల్సి వస్తుంది. మరి కోపాన్ని ఎలా జయించాలి? కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఏదైనా రహస్యం ఉందా? గౌతమ బుద్ధుడు జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ద్వారా కోపాన్ని జయించే నాలుగు గొప్ప సూత్రాలను ఈరోజు తెలుసుకుందాం.
(00:36) ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్ళాడు. బుద్ధుడి అమృత వాక్కులు వినడానికి ఆ గ్రామ ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు కానీ ఆ గ్రామంలో ఉన్న ఒక్క యువకుడికి మాత్రం బుద్ధుడు అంటే విపరీతమైన కోపం అతను ఒక మోసగాడు ఏ పని చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నాడు అనేది అతని అభిప్రాయం. బుద్ధుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్న ప్రదేశానికి ఆ వ్యక్తి కోపంతో ఊగిపోతూ వచ్చాడు.
(01:05) అందరి ముందు బుద్ధుడిని నానా మాటలు అనడం మొదలు పెట్టాడు. ఎన్నో అసభ్యకరమైన పదాలతో దూషించాడు. కానీ బుద్ధుడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. అదే చిరునవ్వు అదే ప్రశాంతత అది చూసి ఆ వ్యక్తికి కోపం కట్టలు తెంచుకుంది. ఏకంగా బుద్ధుడి ముఖంపై ఉమ్మివేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న బుద్ధుడి ప్రధాన శిష్యుడు ఆనందుడికి రక్తం మరిగిపోయింది.
(01:31) గురుదేవా ఒక్క మాట అనుమతి ఇవ్వండి వాడికి తగిన గుణపాఠం చెబుతాను అన్నాడు. కానీ బుద్ధుడు నవ్వి శాంతించు ఆనందా అతడు మనసులో ఏదో పెద్ద తుఫాను నడుస్తుంది. ఆ బాధను ఎలా వ్యక్తపరచాలో తెలియక ఇలా చేశాడు. అతడిపై మనం జాలి పడాలి కానీ కోపం తెచ్చుకోకూడదు అన్నాడు. ఇంటికి వెళ్ళిన ఆ వ్యక్తికి రాత్రంతా నిద్ర పట్టలేదు. నేను అంతలా తిట్టిన అవమానించినా ఆయన ఎందుకు స్పందించలేదు ఆ చిరునవ్వుకు అర్థం ఏమిటి అని ఆలోచించడం మొదలు పెట్టాడు.
(02:03) తన తప్పు తెలుసుకున్నాడు మరుసటి రోజు ఉదయం పరిగెత్తుకుంటూ వచ్చి బుద్ధుడి కాళ్ళపై పడి ఏడవడం మొదలు పెట్టాడు. నన్ను క్షమించండి నా అహంకారంతో నేను చేసిన తప్పుకు నాకు శిక్ష వేధించండి అని వేదుకున్నాడు. అప్పుడు బుద్ధుడు నిన్ను క్షమించడానికి నిన్నటి బుద్ధుడు ఇక్కడ లేడు. నిన్న నన్ను తిట్టిన వ్యక్తివి నువ్వు కాదు ప్రవహించే నది లాంటిది జీవితం ఏ క్షణానికి ఆ క్షణం మనం మారిపోతూ ఉంటాం.
(02:30) కాబట్టి గతాన్ని మర్చిపో అని కరుణతో అన్నాడు ఈ అద్భుతమైన సంఘటన నుండి మనం నేర్చుకోవలసిన నాలుగు గొప్ప సూత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సూత్రం బహుమతి నియమం ఎవరైనా మీకు ఒక బహుమతి ఇస్తే దాన్ని మీరు తీసుకోకపోతే అది ఎవరికీ చెందుతుంది తీసుకువచ్చిన వారికే కదా అలాగే ఎవరైనా మిమ్మల్ని తిట్టినా మీపై కోపగించుకున్నా మీరు దానిని స్వీకరించకపోతే ఆ కోపం వారి దగ్గరే ఉండిపోతుంది. బుద్ధుడు అదే చేశాడు.
(03:02) ఆ యువకుడి కోపాన్ని బహుమతిలా స్వీకరించలేదు. రెండవ సూత్రం ఆశాశ్వత తత్వం నిన్న ఉన్న వ్యక్తివి నువ్వు కాదు నిన్న ఉన్న నేను కాదు అని బుద్ధుడు చెప్పాడు అంటే మన ఆలోచనలు మన భావోద్వేగాలు అన్ని క్షణికమైనవి కోపం అనేది ఆకాశంలో వచ్చిపోయే మబ్బు లాంటివి అది శాశ్వతం కాదు ఆ ఒక్క క్షణం ఓపిక పడితే జీవితంలో ఎదురయ్యే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.
(03:32) మూడవ సూత్రం కోపం మీకు మీరే వేసుకున్న పెద్ద శిక్ష గౌతమ బుద్ధుడు చెప్పిన అద్భుతమైన మాట కోపం తెచ్చుకోవడం అంటే విషం తాగి ఎదుటివాడు చనిపోవాలనుకోవడం లాంటిది ఎదుటి వ్యక్తి మీపై కోపగించుకున్నప్పుడు మీరు కూడా తిరిగి కోపగించుకుంటే మీ మనశాంతినే మీరు కోల్పోతారు ఆ కోపాన్ని వదిలేయడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు.
(04:00) ప్రతిస్పందనకు బదులు కరుణ కోపంగా ఉన్న వ్యక్తి లోపల మానసికంగా చాలా బాధపడుతున్నాడని బుద్ధుడు గ్రహించాడు. వాళ్ళు ఎదుటివారిని కాదు తమలోని అశాంతినే అలా బయట పెడుతున్నారు అలాంటిది వారిని చూసి కోపం తెచ్చుకోవడం కన్నా వారి పరిస్థితిని అర్థం చేసుకొని కరుణ చూపించడం గొప్ప సంస్కారం. మిత్రులారా కోపం అనేది మన అంతర్గత బలహీనతకు నిదర్శనం. ప్రశాంతంగా ఉండగలగడమే మన నిజమైన బలం.
(04:29) తదుపరిసారి మీకు ఎవరిపైనైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు లేదా ఎవరైనా మీపై కోపగించుకున్నప్పుడు ఆ బుద్ధుడి కథను ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి మీ కోపం ఎలా మాయమవుతుందో మీరే చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లైతే ఒక లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో జీవిత పాఠాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(04:54) ధన్యవాదాలు.

No comments:

Post a Comment