Monday, March 9, 2026

శరీరానికి నచ్చిన ఆహారం ఏంటో తెలుసా? | Food | Sadhguru

శరీరానికి నచ్చిన ఆహారం ఏంటో తెలుసా? | Food | Sadhguru

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_j2-DysHKX8



Transcript:
(00:00) శరీరాన్ని ఎలా చూసుకోవాలి? శరీరానికి నచ్చినట్టు చూసుకోవాలి. మీకు నచ్చినట్టో లేదా మీ మతానికి నచ్చినట్టో కాదు. లేదా ఎవరో చెప్పారని వాళ్లకు నచ్చినట్టో కాదు. ఈ శరీరానికి ఏది సరిపడుతుందో అదే తినాలి. దీనిపై చిన్న ప్రయోగం చేసి చూడండి. ఏది తింటే శరీరం చాలా చురుగ్గా తేలిగ్గా ఉంటుందో దాన్నే కదా తినాలి. అవునా అలా కాకుండా ఆ మీరు తిన్నాక కడుపులో కాంక్రీట్ నింపేసినట్లు ఉండి మత్తు ఆవహిస్తుంటే అటువంటి ఆహారం తింటే ఎలా? అది తిని ఆఫీస్ కి వెళ్లి ఎలా పని చేస్తారు ఆఫీస్ కి వెళ్లి కునుకు తీయడమే మీ ఉద్దేశం అయితే అటువంటివి తినొచ్చులేండి. కానీ ఏదైనా
(00:37) ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు చురుగ్గా ఉండాలి బిజినెస్ కి వెళ్ళడం ఉద్యోగానికి వెళ్ళడం లేదా ఇంట్లో పని చేయడం ఇవన్నీ జనాలకి ఒక హింసలాగా అనిపిస్తున్నాయి. సరికానివి తినేసి చురుగ్గా ఉండాలని ట్రై చేస్తున్నారు. అది చాలా చాలా కష్టం. ఇది రొంబా కష్టం రా ఇది ఎలా అంటే మీరు ఒక పెట్రోల్ బండి కొన్నారు డీజిల్ చావకని దాంతో ట్యాంక్ నింపి నడుపుతున్నారు. ఏదోలా నడుస్తుంది.
(01:00) కిరోసిన్ పోసినా నడుస్తుంది. కానీ సాఫీగా వెళ్తుందా ఈ శరీరం కూడా అంతే దీనికి ఏం కావాలో ఈ శరీరానికి ఏది వంటబడుతుందో ఆ ఆహారాన్ని గనుక తింటే ఇది ఉల్లాసంగా పనిచేస్తుంది. మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా పని చేస్తుంది. మెయింటెనెన్స్ తగ్గుతుంది రోజు వెళ్లి రిపేర్ షాప్ లో కూర్చునక్కర్లేదు.

No comments:

Post a Comment