రాక్షస గురువు శుక్రాచార్యుడు, అతను చెడును కదా ప్రోత్సహించేవాడు,మరి బృహస్పతి వంటి గురువుల కోవలోకి ఎలా చేర్చారు?
" కవీనాం ఉశనా కవిః - భ.గీత 10:37 " - కవులలో శుక్రాచార్యుడను నేను అన్నారు కృష్ణపరమాత్మ గీతలో
కవులు అంటే ఏదైనా విషయంపై పూర్తిగా ఆలోచించగల సామర్థ్యం ఉన్నవారు. శుక్రాచార్యుడు రాక్షసుల ఆధ్యాత్మిక గురువు. అతను చాలా తెలివైన మరియు దూరదృష్టి గలవాడు. అందువలన శుక్రాచార్యుడు కృష్ణుడి ఐశ్వర్యానికి మరొక ప్రతినిధి.
దేవతలు రాక్షసులు కశ్యప ప్రజాపతి సంతానమే. తల్లులే వేరు.
శుక్రాచార్యుడికి మృతసంజీవనీ విద్య తెలుసు. మరణించిన రాక్షసులును బ్రతికించేవారు. బృహస్పతికి ఆ విద్య తెలియదు. దేవతలు ఎక్కువగా మరణించేవారు దేవ దానవ యుద్ధాలలో. అందుకని తన కుమారుడు కచుని శుక్రాచార్యుడి వద్ద శిష్యరికం చేసి ఆ విద్యను నే్ర్చుకుని రమ్మని పంపించారు బృహస్పతి. కచుడు చిరకాలం శ్రద్ధగా శుశ్రూష చేసి శుక్రాచార్యుడి నుంచి ఆ విద్యను నేర్చఃకున్నాడు. శుక్రాచార్యుడికి కచుడు బృహస్పతి కుమారుడు అని తెలంసు. కాని గురుధర్మం పాటించి విద్య నేర్పారు.
శుక్రాచార్యుడి కూతురు దేవయాని. అది కచ - దేవయాని అని వేరే కధ.
శుక్రాచార్యుడు తక్కువేమీ కాదు, పూజనీయులు.
శుభమస్తు
No comments:
Post a Comment