Saturday, April 25, 2026

Oka Yogi Athma Katha: Paramahamsa Yogananda Met a Yogi Who Had Two Bodies

Oka Yogi Athma Katha: Paramahamsa Yogananda Met a Yogi Who Had Two Bodies

Author Name:The Made Of Reality

Youtube Channel Url:https://www.youtube.com/@themadeofreality6499

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PQTzYcFmXWI



Transcript:
(00:00) ఎంతో కొంత పుణ్యం చేసిఉంటే తప్ప ఇలాంటి యోగుల కోసం మనం తెలుసుకోలేము. మరియు వారికి సంబంధించిన విషయాలు మనవరకు చెరవు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న యోగుల చరిత్ర వినడం చదవడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. పరమహంస యోగానంద గారు రాసిన ఒక యోగి ఆత్మకథలో కొన్ని అద్భుతమైన విషయాలను ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పరమహంస యోగానంద గారు చిన్నప్పుడు జరిగిన సంఘటన ఇది.
(00:27) ఇక్కడి నుండే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. ఆయన మొట్టమొదటిసారి రెండు శరీరాలు ఉన్న ఒక యోగిని కలుసుకోబోతున్నారు. మరియు తీవ్రమైన కన్ఫ్యూజన్ లో పడబోతున్నారు. పరమహంస యోగానంద గారికి ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. తాను చిన్నప్పుడే అనేకమైన ప్రదేశాలను చూశారు. ఈసారి కాశీ వెళదామని ప్లాన్ చేశారు. ఆయన తండ్రి గారైన భగవతి బాబు గారికి ఈ విషయం చెప్పారు.
(00:51) మన పరమహంస గారు బయటికి వెళితే మళ్ళీ ఇంటికి రావాలనిపించదు. ఈసారి వాళ్ళ నాన్నగారికి ఎలాగోలా రిక్వెస్ట్ చేశారు. అందుకు ఆయన కూడా అంగీకరించి ఒక ఫస్ట్ క్లాస్ రైల్వే పాస్ ఇచ్చారు. ఎందుకంటే పరమహంస యోగానంద గారి తండ్రి గారు రైల్వే ఉద్యోగి. ఆ ఫస్ట్ క్లాస్ రైల్వే పాస్ తో పాటుగా పరమహంస యోగానంద గారికి ఇంకో రెండు ఉత్తరాలను ఇచ్చి వీటిలో ఒకటి నా మిత్రుడు కేదార్నాథ్ కి రెండవది స్వామి ప్రణవానంద గారికి అందించాలని చెప్పారు.
(01:19) అయితే కేదార్నాథ్ అడ్రస్ నా దగ్గర లేదు. నువ్వు ప్రణవానంద స్వామి వారిని కలిసినప్పుడు కేదార్నాథ్ గారిని నువ్వు కలవగలవని అనుకుంటున్నానని చెప్పారు. ఇక ఆయన ప్రయాణం కాశీకి చేరుకుంది. ఆయన ప్రణవానంద స్వామి వారు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ప్రణవానంద స్వామి వారు ఇంకో అంతస్తులో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. ఆయన ముఖం ప్రశాంతంగా ముడతలుఏమీ లేకుండా ఏకవస్త్రంతో ఉన్నారు.
(01:45) ఆయన పరమహంస యోగానంద గారిని చూసి బాబా ఆనందని చిరునవ్వుతో ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నువ్వు భగవతి బాబు గారి కొడుకువి కదు అన్నారు. అయితే పరమహంస యోగానంద గారు తన జూబులో ఉన్న ఉత్తరాన్ని ప్రణవానంద స్వామి వారికి ఇంకా ఇవ్వలేదు. ఇంతలోనే ఆయన తనను ఎలా గుర్తుపట్టారో యోగానంద గారికి అర్థం కాలేదు. కొంచెం ఆశ్చర్యపడ్డారు. తర్వాత వెంటనే కేదార్నాథ్ ని కూడా నువ్వు కలుసుకుంటావు అని చెప్పారు.
(02:11) ఇప్పుడు యోగానంద గారు పూర్తి అయోమయంలో పడ్డారు. అరే నేను ఇంకా కేదార్నాథ్ గారిని కలవాలని చెప్పలేదు. కానీ ఆయనకి ఎలా తెలిసింది? ఆ యోగి పరమహంస యోగానంద గారి మనసులో ఏముందో వెంటనే చదివేస్తున్నారు. అప్పుడు ఆయన తన దగ్గర ఉన్న ఉత్తరాన్ని యోగానంద గారు ప్రణవానంద స్వామి వారికి ఇచ్చారు. ఆ ఉత్తరం తీసుకొని దాని వైపు చూస్తూ మీ నాన్నగారు మరియు పరమశివుడు వల్ల నేను రెండు పెన్షన్లు అనుభవిస్తున్నాను అన్నారు.
(02:36) అప్పుడు పరమహంస గారు అదెలా సాధ్యం శివుడు మీ ఊడిలో డబ్బులు వేస్తున్నారా అని అడిగారు. లేదు ఇక్కడ పెన్షన్ అంటే అపారమైన ప్రశాంతత అన్నారు. తర్వాత ఆయన మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయారు. అక్కడ వాతావరణం అంతా నిశబ్దం అలుముకుంది. అక్కడ ప్రణవానంద స్వామి వారు మరియు యోగానంద గారు మాత్రమే ఉన్నారు. ఆయన మౌనంలో ఉన్నప్పుడు యోగానంద గారు ఆ యోగి కూర్చున్న బల్ల కింద ఉన్న పావుకోళ్ళను చూశారు.
(03:01) అరగంట సమయం గడిచేసరికి కళ్ళు తెరిచి కేదార్నాథ్ వస్తున్నట్టుంది అన్నారు. అప్పుడు పరమహంస యోగానంద గారికి బూట్లతో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. అక్కడి నుండి పరుగున కిందకు వెళ్లి సన్నగా చామంచాయ రంగులో ఉన్న వ్యక్తిని చూసి కేదార్నాథ్ గారు అంటే మీరేనా అని వెంటనే అడిగారు అవును నేనే అన్నారు ఆయన ఇక్కడికి మీరెలా వచ్చారు అని ఆశ్చర్యంగా పరమహంస గారు కేదార్నాథ్ ని అడిగారు.
(03:26) ఈ గదిలో నేను ప్రణవానంద స్వామి మాత్రమే ఉన్నాము. ఇంకెవరితోను మేము మీకోసం కబురు పంపించలేదు అని పరమహంస యోగానంద గారు కేదార్నాథ్ గారితో అన్నారు. అదేంటి ఒక గంట క్రితం ప్రణవానంద స్వామి వారు స్నానాల రేవు దగ్గర నన్ను కలిసి నీకోసం భగవతి బాబుగారి అబ్బాయి ఎదురుచూస్తున్నారు నువ్వు మా ఇంటి దగ్గరికి రమ్మని చెప్పారు. మా ఇంటి దగ్గరికి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందంటే నేను ఒక అర్థ గంట పడుతుందని చెప్పాను.
(03:52) అప్పుడు ప్రణవానంద స్వామి వారికి ఏదో పని ఉందని పావుకోళ్ళని వేసుకొని నాకంటే వేగంగా నడుచుకొని వెళ్లి జనాల గుంపులో కలిసిపోయారు. అదిగో ఆయన కూర్చున్న బల్ల కింద ఉన్న పావుకోళ్ళనే ఆయన వేసుకొని నన్ను కలిశారు. ఆ వివరణ విన్న తర్వాత పరమహంస గారు మీరు ఇంతకుముందు ఆయనను ఎప్పుడు కలిశారు అని అడిగారు. అప్పుడు ఆయన కిందటి సంవత్సరం కొన్నిసార్లు కలుసుకున్నాము.
(04:13) మళ్ళీ ఇప్పుడు కలుసుకుందామ అన్నారు. పరమహంస యోగానంద గారికి ఇంకా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ఈయన కూర్చొని ఉన్నారు. ఆయనను గంట క్రితం ఎలా కలిశారు అని ఆలోచించి ఈయనకు రెండు శరీరాలు ఉన్నాయని అర్థం చేసుకున్నారు. తనలో ఉన్న ఆధ్యాత్మిక స్థితిని కదిలించడానికి ప్రణవానంద స్వామి వారు ఇలా చేశారని ఆయనకు అర్థమయింది. అప్పుడు ప్రణవానంద స్వామి వారు యోగానంద వారి వైపు చూస్తూ యోగులు దేనినైనా చూడగలరు.
(04:38) కలకత్తాలో ఉన్న నా శిష్యులతో ఇప్పటికీ నేను కలవగలను వారి మాటలను వినగలను అన్నారు. అప్పుడు పరమహంస యోగానంద గారు కాస్త ఆలోచనలో పడ్డారు. నేను నిజంగా ప్రణవానంద గారితో మాట్లాడుతున్నానా లేక ఆయన ప్రతిరూపంతో మాట్లాడుతున్నానా అని పరమహంస గారు యుక్తేశ్వర బాబా గారి ద్వారా తన ఆధ్యాత్మిక ప్రయాణం సాగించాల్సి ఉన్నందున ప్రణవానంద గారి పట్ల యోగానంద గారికి ఆసక్తి కలుగలేదు.
(05:03) పరమహంస యోగానంద గారిలో ఉన్న అయోమయ పరిస్థితిని తొలగించడానికి ప్రణవానంద స్వామి వారు తమ గురుదేవులైన లహారి మహాశయుల గురించి చెప్పారు. నాకు తెలిసినంతవరకు లహారి మహాశయులు గొప్ప యోగి భగవంతుడే ఆయన రూపంలో మానవ దేహాన్ని ధరించారు అన్నారు. అప్పుడు పరమహంస గారు ఒక శిష్యుడే సంకల్ప మాత్రం చేత శరీరాన్ని ధరించినప్పుడు ఆయన గురువు గారికి సాధ్యం కానిది ఏముంటుంది అనుకున్నారు.
(05:29) అప్పుడు ప్రణవానంద స్వామి వారు గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెబుతా విను అన్నారు. ప్రణవానంద స్వామి వారు రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్న సమయంలో గురువుగారి ఇంకో శిష్యుడితో కలిసి రోజు ఎనిమిది గంటలు ధ్యానం చేస్తూ ఉండేవారు. మళ్ళీ తన ఉద్యోగ విధులను నిర్వర్తించేవారు. అందుకుగాను ఆయనకు ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి. తాను పరమాత్మను దర్శనం చేసుకోగలనని నమ్మకం కలిగింది.
(05:53) ఒకరోజు సాయంత్రం ప్రణమానంద స్వామి వారు లహరీ మహాసయుల దగ్గరికి వెళ్లి బ్రతిమలాడారు. రాత్రి పగలు అదే పనిగా లహరీ మహాశయులకు విజ్ఞప్తి చేసుకున్నారు. అప్పుడు లహరీ మహాశయులు నేనేం చేయగలను నువ్వు ఇంకా ధ్యానం చేయాలి అన్నారు. అప్పుడు ప్రణవానంద గారు గురుదేవా భౌతిక రూపంలో ఉన్న మిమ్మల్ని నేను దర్శనం చేసుకోగలుగుతున్నాను. కానీ మీ అనంతమైన దివ్య రూపాన్ని దర్శనం చేసుకోలేకపోతున్నాను.
(06:16) దయచేసి నన్ను ఆశీర్వదించండి అన్నారు. అప్పుడు లహారి మహాశయులు ఆశీర్వాద ముద్రతో ఆశీర్వదించి నీ గురించి బ్రహ్మమునకు చెప్పాను నువ్వు వెళ్లి సాధన చేసుకో అని ప్రణవానంద స్వామితో అన్నారు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లి సాధన చేశారు. అప్పుడు ధ్యానావస్థలు తపించిపోయే తన జీవిత లక్ష్యాన్ని సాధించారు. అప్పటి నుండి ఇప్పటివరకు నేను నిత్యం పరమాత్మ దర్శనం చేస్తున్నాను అని ప్రణవానంద స్వామి వారు యోగానంద పరమహంస గారితో అన్నారు.
(06:44) అప్పుడు పరమహంస యోగానంద గారి మనసులో భయాలన్నీ మాయమైపోయాయి. ప్రణవానంద స్వామి వారు మాట్లాడుతూ కొన్నాళ్ళకు నేను లహారీ మహాశయులకు కృతజ్ఞతలు చెప్పి నేను పరమాత్మ మత్తులో ఉద్యోగం చేయలేకపోతున్నాను. ఈ బంది నుండి నన్ను విడిపించండి అన్నాను. అప్పుడు పెన్షన్ అప్లై చేయమని లహరీ మహాశయులు నాతో అన్నారు. అప్పుడు నేను లహరీ మహాశయులతో ఇంత తొందరగా పెన్షన్ కి అప్లై చేస్తే డాక్టర్ కారణం అడుగుతారు.
(07:08) అప్పుడు నేనేం చెప్పాలి అన్నాను. నీకు ఏది అనిపిస్తే అది చెప్పు అని లహారి మహాసయులు జవాబు ఇచ్చారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి పెన్షన్ అప్లై చేయాలని చెప్పాను. అప్పుడు డాక్టర్ గారు కారణం అడగగా నాకు వెన్నులో ఏదో ఒక తీవ్రమైన స్థితి కలుగుతుందని అన్నాను. అప్పుడు డాక్టర్ ఏమీ ఆలోచించకుండా నాకు పెన్షన్ రావడానికి సిఫారసు చేశారు. లహరి మహాశయుల అనుగ్రహం వల్ల డాక్టర్ మరియు మీ నాన్నగారి సిఫారసు వల్ల నాకు ఇప్పుడు పెన్షన్ వస్తుంది అని ప్రణవానంద స్వామి వారు యోగానంద పరమహంస గారితో అన్నారు.
(07:38) తర్వాత ఆయన మౌనంలోకి అలా వెళ్ళిపోయారు. అప్పుడు పరమహంస యోగానంద గారు ప్రణవానంద స్వామి వారి పాదాలను భక్తితో స్పృశించారు. అప్పుడు ప్రణవానంద స్వామి వారు నీ జీవితం యోగ మార్గంలో సాగుతుందని ఆశీర్వదించారు. తర్వాత యోగానంద గారు మరియు కేదార్నాథ్ గారు కాశీ వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న ఉత్తరాన్ని యోగానంద పరమహంస గారు కేదార్ నాథ్ గారికి ఇచ్చారు.
(08:04) ఆయన దీపపు వెలుగులో ఆ ఉత్తరాన్ని చదువుతూ మీ నాన్నగారు కలకత్తాలో ఉన్న రైల్వే లో ఉద్యోగం చేయమని చెప్తున్నారు అని అన్నారు. కానీ నేను కాశీని విడిచి వెళ్ళాలి అనుకోవడం లేదని చెప్పారు. మళ్ళీ తర్వాత ఎపిసోడ్ లో పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మ కథ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.

No comments:

Post a Comment