Saturday, April 25, 2026

ఆ 30 సెకన్లు మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో తెలుసా? || vNASHanam || Telugu Podcast

ఆ 30 సెకన్లు మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో తెలుసా? || vNASHanam || Telugu Podcast

Author Name:vNASHanam

Youtube Channel Url:https://www.youtube.com/@vnashanam3332

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QGBV0wHiIiY



Transcript:
(00:04) నీకు తెలియని ఒక చేదు నిజాన్ని నీ చెవుల లోపల కక్కితే ఎలా ఉంటుందో తెలుసా ఈ వీడియో పూర్తిగా చూసాక ఒక్కసారి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. రోజంతా కూర్చొనిఇస్గ లో రీల్స్ రాత్రంతా పడుకోకుండా YouTube లో షాట్స్ ఎందుకు చూస్తున్నావని నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? అసలు ఈ 30 సెకండ్ల వీడియోలు నాకెందుకు పిచ్చిగా నచ్చుతున్నాయి అని ఆలోచించావా గంటల తరబడి వీటిని చూడడం వల్ల నా జీవితానికి ఒరిగింది ఏంటి అని ఒక్కసారైనా మదన పడ్డావా లేదు కదా సాధారణంగా మన మెదడు ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక ప్రతిఫలం
(00:50) కోరుకుంటుంది. నువ్వు అదే పనిగా రీల్స్ స్క్రోల్ చేయడాన్ని సైకాలజీలో వేరియబుల్ రివార్డ్ స్కెడ్యూల్ అంటారు. అంటే రివార్డు వస్తుందని తెలుసు కానీ అది ఎప్పుడు వస్తుందో ఎంత వస్తుందో తెలియనప్పుడు మనిషి ఆ పనిని పదే పదే పిచ్చిగా చేస్తాడు. కాసినోలో జూదం ఆడేవాడు ఎందుకు ఆపలేడో తెలుసా నెక్స్ట్ వచ్చే ఛాన్స్ లో జాక్పాట్ తగులుతుందేమో అన్న ఆశ రీల్స్ కూడా సరిగ్గా అంతే ఒక రీల్ నచ్చదు స్క్రోల్ చేస్తావు.
(01:25) రెండోది నచ్చదు స్క్రోల్ చేస్తావు. మూడోది నీకు బాగా నచ్చిన కామెడీనో డాన్స్ వీడియోనో వస్తుంది. వెంటనే నీ మెదడులో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అది నీకు ఒక ఇన్స్టంట్ హ్యాపీనెస్ ని ఇస్తుంది. ఇప్పుడు ఆ పని నీ మెదడు కి ఒక అలవాటుగా మారిపోతుంది. ఇంకోసారి స్క్రోల్ చేస్తే ఇంకో కిక్ వస్తుంది అని. ఈ నెక్స్ట్ ఏంటి అనే సస్పెన్స్ మెథడుని ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది.
(01:55) అందుకే మీరు టైం మర్చిపోయి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. నిజానికి ఇది ఒక ఊబి ఈ 30 సెకండ్ల వీడియో పద్ధతిని ప్రవేశపెట్టడం వెనుకున్న అసలు కుట్ర కూడా ఇదే. నువ్వు ఎంతసేపు చూసినా అక్కడ కంటెంట్ అయిపోదు. కానీ ఆఖరికి మటాష్ అయ్యేది మాత్రం నువ్వే ఎందుకంటే నీ అటెన్షన్ స్పాన్ ఇప్పుడు ముక్కలు అయిపోయింది. ఒకప్పుడు గంటల తరబడి పుస్తకాలు చదివిన మనిషి ఇప్పుడు 10 నిమిషాల వీడియో చూడాలన్నా ఓపిక లేక స్కిప్ చేస్తున్నాడు.
(02:28) నీకు ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్ కి రావాలి షార్ట్ కట్ లో సక్సెస్ కావాలి. ఈ అడిక్షన్ పిల్లల్లో మరీ ఘోరంగా ఉంది. 30 సెకండ్ల రీల్స్ కి అలవాటు పడిన మైండ్ క్లాస్ రూమ్లో 45 నిమిషాల లెసన్ ని ఎలా వినగలుగుతుంది? మూడు గంటల పాటు రీల్స్ చూడగలవు కానీ మూడు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోలేవు. ఎందుకంటే నీ మెదడుకి ప్రతి 10 సెకండ్లకి ఒక కొత్త షాక్ కావాలి. ఒక కొత్త కిక్ ఇవ్వాలి.
(02:57) రీల్స్ చూస్తున్నంత సేపు నువ్వు ఆలోచించవు. కేవలం రియాక్ట్ అవుతావు ఆలోచింపజేయడం రీల్స్ ఉద్దేశం కాదు నిన్ను ఒక హిప్నాటిజం స్టేట్ లో ఉంచడం దాని పర్పస్ ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మానేస్తావో నీ మెదడు మెల్లిగా మొద్దు బారుతుంది. నువ్వు ఒక క్రియేటర్ గా కాదు కేవలం ఒక కన్స్ూమర్ గా ఒక డేటా ప్యాక్ లాగా మిగిలిపోతావు. నీ సెల్ఫ్ కంట్రోల్ ని ఎవడో కాలిఫోర్నియాలో కూర్చున్న ఇంజనీర్ రాసిన అల్గారిథం కి అప్పగించేసావు.
(03:30) వాడు ఏది చూపిస్తే అది చూస్తూ వాడు ఎక్కడ నవ్వమంటే అక్కడ నవ్వుతూ ఒక డిజిటల్ బానిసగా మారిపోయావు. ఆ రీల్స్ చేసే వాళ్ళని చూసి నీ లైఫ్ వాళ్ళకంటే చాలా చెత్తగా ఉందని వాళ్ళ లైఫ్ నీ లైఫ్ కంటే చాలా అద్భుతంగా ఉందని మదన పడిపోతుంటావు. నిజానికి అలా ఏమీ ఉండదు. నిన్న రాత్రి 100కి పైగా రీల్స్ చూసిఉంటావు కదా దాంట్లో ఒక్క రీల్ అయినా నీకు గుర్తుందా ఒక్క రీల్ అయినా నీ జీవితానికి ఉపయోగపడిందా ఒక్క రీల్ వల్లయినా ఏమైనా నేర్చుకున్నావా అస్సలు లేదు కదా అయినా అన్ని గంటల పాటు ఎందుకు చూస్తామంటే ఫ్రెంచ్ తత్వవేత్త బ్లైసే పాస్కల్ ఇలా అన్నాడు మానవాళ కష్టాలన్నీ మనిషి ఒక గదిలో ఒంటరిగా
(04:16) నిశశబ్దంగా కూర్చోలేకపోవడం నుండే మొదలవుతాయి అని మన లోపల ఉన్న శూన్యాన్ని ఒంటరితనాన్ని మనం భరించలేం అందుకే ఆ నిశశబ్దాన్ని చంపడానికి మనం చౌకగా రీల్స్ అనే శబ్దాన్ని ఆశ్రయిస్తున్నాం. ఇంత విన్నాక కూడా ఎవరూ మారరు అని నాకు తెలుసు కాబట్టి చూసేవాళ్ళు ఆ రీల్స్ చూస్తూనే ఆ పిచ్చిలోనే చావండి అప్పుడు మీ శవాల పైన ఖరీదైన అద్దాల మేడలు కట్టుకుంటారు ఆ సోషల్ మీడియా ఫౌండర్స్

No comments:

Post a Comment