Friday, May 15, 2026

 🔔 *తెలుసుకుందాం* 🔔

*నవగ్రహాలకు గర్భాలయాలు వుండవు ఎందుకు ?*

నవగ్రహాలకు విడివిడిగా ఆలయాలు కట్టేటట్లయితే గర్భగుడి కట్టవచ్చు. తమిళనాడులో సూర్యనార్ కోయల్ దగ్గర నవగ్రహాలకు విడిగా గర్భాలయాలతో ఆలయాలున్నాయి. నవగ్రహాలు ఒక పీఠం మీద నిర్మాణం చేసినప్పుడు ఆ విగ్రహాలు అష్టదిక్కులకు అభిముఖంగా వుంటాయి. అలావున్నప్పుడు గర్భాలయ నిర్మాణం చేయరాదు. కారణం గర్భాలయంలో వున్న ఏవిగ్రహాన్ని అయినాసరే భక్తులు ఎదురుగా వుండి చూచునటుల విగ్రహాలు ఏర్పాటుఅవుతాయి. మరి నవగ్రహాలలో సూర్యశక్తులు మాత్రమే భక్తుడికి అభిముఖంగా వుండి మిగిలినవి వేరువేరు దిక్కులలో వుంటాయి. కావున వాటిని దర్శించుటకు భక్తుడు విగ్రహం దగ్గరకు వెళ్లాలి లేనిదే ఆ పీఠం మీద మిగిలిన విగ్రహాలు దర్శనీయంకావు. అందువలన భక్తులందరూ లోపలకు వెళ్ళాలంటే గర్భాలయంలాగా నిర్మాణం చేస్తే ఆగమ ధర్మాలకు విరోధం అవుతుంది. కావున ఒక పీఠం మీద తొమ్మిది విగ్రహాలు (నవగ్రహాలు) వుంచినప్పుడు గర్భాలయాలు పనికిరావు.🙏🏻

No comments:

Post a Comment