Friday, May 15, 2026

హనుమంతుడు మాట్లాడితే.... హనుమంతుడు శబ్ద బ్రహ్మ వేత్త

హనుమంతుడు మాట్లాడితే.... హనుమంతుడు శబ్ద బ్రహ్మ వేత్త

Author Name:Vyus

Youtube Channel Url:https://www.youtube.com/@Vyusin

Youtube Video URL:https://www.youtube.com/watch?v=O8l9ylMqeDU



Transcript:
(00:00) ఇక పోగా నీకు ప్రధానమైన సందేహం శబ్ద బ్రహ్మవేత్త అవునండి హనుమంతుల వారు మొట్టమొదట రామచంద్రుడు దర్శనానికి వచ్చి నమస్కారం చేశాడు. అయ్యా తమరెవరు ఏ పని మీద వచ్చారు మీరు వేసిన వేషం ఏమిటి ఈ వేసిన వేషానికి ధరించిన ఆయుధాలకి పొంతన కనబడడం లేదు అని మూడు మాటలు అడిగాడు. ఎవరు ఏమిటి వేషం ఈ ఆయుధాలు. మూడే మూడు మాటలు అడిగిన ఉత్తర క్షణంలో సర్వలోకేశ్వరుడు అయినటువంటి రామచంద్రుడు ఏమన్నాడు లక్ష్మణ ఇలా మాట్లాడగలిగిన కుర్రవాడిని నేను ఇంతవరకు చూడలేదయ్యా వీడే కనుక ఉన్నట్లయితే ముల్లోకాలను మనం జయించగలుగుతాం ఇటువంటి
(00:47) ఒక్క మంత్రి మన దగ్గర ఉంటే ఏమిటి ఆయన యొక్క విశేషం ఈ మాట్లాడుతున్నంత సేపు అపశబ్దం నోట్లో నుంచి రానివ్వలేదు తల తిప్పలేదు కనుబొమ్మలు ఎగరవేయలేదు ఎక్కడా ఏమి ఇబ్బంది పడకుండా ఇక మాట్లాడేటువంటి విద్య హనుమంతుడు ఒక్కడికే తెలుసు శబ్ద బ్రహ్మాన్ని తెలిసినవాడు ఈయన ఒక్కడే అంటూ ఒక తొమ్మిది శ్లోకాలు హనుమంతుడిని కీర్తిస్తూ మాట్లాడతాడు రామభద్రుడు ఆహా ఆ మాట్లాడడంలో నాయనా ఈ మాట్లాడే విద్యకి కావలసింది అవిస్తరం అసందిం అవిలంబితం అవ్యథం ఎప్పుడైనా సరే సరే ఎవరైనా సరే మాట్లాడుతున్నారు అంటే ప్రప్రథమంగా ఏరా
(01:32) వెళ్ళిన పని ఏమైందో అంటే తక్షణం ఏమైందో చెప్పాలి తప్ప నేను బయలుదేరానండి దారిలో లారీ బస్సు డీ కొన్న ఇవన్నీ చెప్పొద్దు అవిస్తరం అల్లా అన్నారు కదా అని నేను వెళ్తున్నాను చూస్తున్నాను సగం మింగేస్తాడు అక్షరాలు మింగకూడదు తాగకూడదు ఆ సందిగ్ధం అసందింగా అన్నారు అని చెప్పి గురువుగారు సరిగమ పాలు వేయకూడదు ఆ విలంబితం ఇంకా ఇవన్నీ బాగానే ఉన్నాయి అవ్యథం మనం మాట్లాడుతుంటే మన గుండెకాయలు బద్దలయి ఎదుటివాడి చెవులు బద్దలఅవ్వకూడదు చాలా హాయిగా ఉచ్చారయతి కళ్యాణిం వాచం హృదయహర్షిని చక్కనైనటువంటి మాటలు ఎదుటివాడి హృదయానికి ఆనందం కలిగించే రీతిలో మాట్లాడే శక్తి
(02:15) వీడు ఒక్కడికే తెలుసు వేదత్రయాన్ని అధ్యయనం చేసి నవ వ్యాకరణాలు కంఠపాఠం చేసి శిక్షా జ్యోతిష ఛంద కల్ప నిరుక్త వ్యాకరణాది సక్షాస్త్ర త్రాలు కరతలామలకం చేసుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు లక్ష్మణ కనుక కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అబ్బాయితో మాట్లాడవోయ్ అన్నాడు రాముడు అంతటివాడు తనంతవాడైనటువంటి లక్ష్మణ స్వామి రామాయణం మొత్తం 24వేల శ్లోకాలలో ఆ మూల నుంచి ఈ మూలకు ఎక్కడ తమ్ముడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకు ప్రవర్తించు అనే మాట ఆయన నోట అనవలసిన పని ఏనాడు రాలేదు ఒక మూడు మాటలు మాట్లాడాడు హనుమంతుల వారు ఆయన
(03:00) మాట్లాడినటువంటి మూడు మాటలకి ముచ్చటపడి శబ్ద తత్వం తెలిసినటువంటి హనుమంతుడు హనుమంతుడే అని రామచంద్రమూర్తి గ్రహించిన వాడై ఇంత మాట అన్నాడు అని వదిలేస్తే సరిపోదు ఇక్కడ అంతటి వాడు అవునో కాదో చూపించాలి ఈయన యొక్క మాట్లాడే తెలివి ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎంత ఎవరితో ఎలా మాట్లాడాలి ఈ ఐదు సూత్రాలని మనసులో పెట్టుకొని ఎలా నడిచాడు అనేది ఒక్క ఉదాహరణ మనం చెప్పేసుకుంటే అమ్మవారిని చూసి తిరిగి వచ్చాడు జాంబవంతుడు దగ్గరగా పిలిచాడు నాయనా ఎలా వెళ్ళావు ఏమిటి కథ ఎలా వచ్చావు అన్నాడు అక్కడ కూర్చుని 200 శ్లోకాలు పాడాడు ఓ అది చేశాను తాత ఇది చేశాను వాడిని కొట్టాను
(03:45) వీడిని కొట్టాను లంకకి నొప్పి పెట్టాను అది చేశాను ఇది చేశాను 200 పాడాడు రామచంద్రుడు దగ్గరికి వచ్చాడు నాయనా ఏమిటి కథ అన్నాడు లంకలో కాలు పెట్టాను అశోకవనంలో సింసుపా వృక్షఛాయలో మబ్బు క్రమ్మిన చంద్రబింబంలా మకిలి పట్టినటువంటి అద్దంలా ఎండిపోయిన అరటి మొవ్వులా ఉన్న అమ్మవారిని చూశాను అని చెప్పాడే తప్ప అక్కడ ఇలా మీసాలు కాలర్లు ఎగరేసి అది చేశాను ఇది చేశాను అని మాట్లాడలే అంటే సన్నిహితుడైన తాతగారి దగ్గర మాట్లాడేటప్పుడు తన ప్రతాపం అంతా చూపించాడు మహాయోధుడు అయినటువంటి రామచంద్రుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో ఎంత చెప్పాలో అంతే చెప్పాడు పర్యవసానంగానే
(04:25) ఏం తెలుస్తుంది అంటే నువ్వు ఆలయానికి వెళ్లి భజన చెయ్యి తప్పు లేదు హనుమంతుడికి కానీ మనిషివై పుట్టినందుకు ఏమిటి నేర్చుకోవాలి నువ్వు మాట్లాడడం ఒక్కటే ఆ మాట్లాడడాన్ని నేర్పినటువంటి మహనీయుడు హనుమంతుల వారు ఆ హనుమంతుల వారికి చేతులు జోడించి శబ్దబ్రహ్మ విద్యను ఉపాసించడానికి ప్రయత్నించు స్వస్తి

No comments:

Post a Comment