Friday, May 15, 2026

అమెరికా వెళ్లి ఇవేం పనులు ||అమ్మాయి దొరికితే చాలు కక్కుర్తి వేషాలు ||మారండి ఇంక...

అమెరికా వెళ్లి ఇవేం పనులు ||అమ్మాయి దొరికితే చాలు కక్కుర్తి వేషాలు ||మారండి ఇంక...

Author Name:sujatha goparaju

Youtube Channel Url:https://www.youtube.com/@sujathafunnytalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=aopjhMT3ytk



Transcript:
(00:01) ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిన మన తెలుగు పిల్లలు అక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే ఎంత అసయంగా ఉంటుంది చెప్పండి పిల్లలు ఎంతో కష్టపడి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందుల వల్ల ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్నాం అంటే కుటుంబ పరిస్థితి బాగుంటుంది అన్న ఉద్దేశంతోటి అమెరికాకి వెళ్తున్నారు అందరూ కూడా అయితే నిన్న ఒక అమ్మాయి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళ దగ్గరగా పాపం తన బాధను చెప్పుకుంటుంది.
(00:22) అమెరికాకి ఆ అమ్మాయి వెళ్లి చాలా రోజులు అయిందంట ఎంఎస్ పూర్తి చేసింది ఒక మంచి జాబ్ ని కొట్టిందంట తల్లి తండ్రి కూడా మగ్గాల మీద చీరలని నేస్తూ ఉంటారంట ఆ అమ్మాయికి వెనకాల ఇంకా తమ్ముడు చెల్లి ఇంకా ఇలా ఉండడం వల్ల ఆ అమ్మాయి బాగా చదువుకొని మొత్తానికి అప్పులు చేసుకొని అమెరికాకి వెళ్ళింది. ఇంకా పల్లెటూర్లో ఉన్న తర్వాత తల్లిదండ్రుల్ని అందరూ ఏమంటారు చుట్టుపక్కల వాళ్ళు గాని బంధువులు గాని ఆ అమ్మాయిని పంపించేసారు అమెరికాని ఏ ఇంకా పెళ్లి చేయరా అమ్మాయికి ఇంకా అక్కడే ఉంచుతారా అని చెప్పేసి ఇలా అమ్మాయి గురించి అందరూ అడగడం మొదలు పెట్టారు.
(00:48) అయితే తల్లిదండ్రులు ఏమని చెప్పారంటే అమ్మా ఇంకా సంపాదించావు కదమ్మా ఇంక వచ్చేసాయి పెళ్లి చేసుకుంది కానీ నీకు చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పిల్లలకి చేయాలి కదా మరి పెళ్ళ సంబంధాలు చూడమంటావా ఏంటని ఆ అమ్మాయిని అడిగేసరికి ఆ అమ్మాయి అంది నేను ఎలాగో ఇక్కడ మంచి జాబ్ చేసుకుంటున్నాను కదా ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది అబ్బాయిలు కూడా ఉన్నారు కదా ఇక్కడ సంబంధమే చూసుకుందాము చూసుకుంటే ఏదైనా దొరికిందా అని అంటే చక్కగా ఇక్కడే సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతోటి ఆ అమ్మాయి ఏం చేసిందంటే అక్కడ మన తెలుగు వాళ్ళ గ్రూపులు ఉంటాయి కదా ఆ గ్రూపుల్లోనూ
(01:13) ఈ అమ్మాయి ప్రొఫైల్ అంతా పెట్టడం మొదలు పెట్టిందంట ఎవరినన్నా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఈ అమ్మాయి ప్రొఫైల్ అంతా కూడా తెలుగు వాళ్ళ WhatsAppట్ గ్రూపుల్లో పెట్టడం మొదలు పెట్టింది. ఎవరైతే ఏంటి ఒక మంచి అబ్బాయి దొరికారుని అంటే పెద్దవాళ్ళతోటి మాట్లాడుకొని చక్కగా పెళ్లి చేసుకుందాం అన్న ఉద్దేశంతోటి ఆ అమ్మాయి నెంబర్ అది గ్రూపుల్లో పెట్టేసరికి ఇంకా మన పోకిరి వాళ్ళు ఇండియన్స్ అబ్బాయిలు అందరూ కూడా ఈ అమ్మాయి వెనకాల పడడం మొదలు పెట్టారు.
(01:38) 15 16 మంది అబ్బాయిలు ఈ అమ్మాయికి ఆ నెంబర్ కి మెసేజ్లు పెట్టడం అర్ధరాత్రి పూట అసభ్యకరంగా మాట్లాడడం నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాతోటి చాటించే అసలు నీ వివరాలు ఏంటి నీ చరిత్ర ఏంటని ఇంకా ఆ వాళ్ళు పెళ్లి చేసుకోకపోయినా సరే అనవసరమైన విషయాలన్నీ ఈ అమ్మాయితో మాట్లాడడం ఇంకా పరిచయాలు పెంచుకోవడం మొదలుపెట్టారంట మన తెలుగు వాళ్ళు అబ్బాయిలు ఈ గ్రూపుల్లో పెళ్లి అయిపోయి భార్యా పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఈ అమ్మాయి వెనకాల పడటం మొదలు పెట్టారంట మనం రిలేషన్షిప్ లో ఉందాము కొన్నాళ్ళు ఉన్న తర్వాత నచ్చిందనుకో అప్పుడు పెళ్లి చేసుకుందాము అని కొంతమంది
(02:07) అమెరికా కల్చర్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఈ అబ్బాయిలందరూ కూడా ఈ అమ్మాయి వెనకాల పడ్డారంట. అలా కొంతమంది అబ్బాయిల గ్రూపు ఈ అమ్మాయికి పరిచయం అయ్యారు. పాపం ఈ అమ్మాయి నిజమని నమ్మి పాపం వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టింది. అలా అలా ఈ అమ్మాయితోటి మెల్లగా ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి ఏమని చెప్పారని అంటే నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా మేమందరం స్టాక్ మార్కెట్ లో పెడతా ఉంటాం డబ్బులు మేము అదే బిజినెస్ చేస్తూ ఉంటాము.
(02:31) నీ డబ్బులు కూడా ఇచ్చావని అంటే మేము అందులో పెట్టుబడి పెడతాము చక్కగా బాగా లాభాలు వస్తాయి. అప్పుడు ఇంకా మనం డబ్బులు బాగా సంపాదించొచ్చని ఈ అమ్మాయితోటి ఒక ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి 16 లక్షల రూపాయలు ఈ అమ్మాయి దగ్గర నుంచి ఆ గ్రూప్ అబ్బాయిలు అందరూ తీసుకున్నారంట తీసుకొని వాళ్ళు స్టాక్ మార్కెట్ లో పెట్టారంట పెట్టిన తర్వాత ఒక రెండు నెలలు అయిన తర్వాత మార్కెట్ క్రాష్ అయిపోయింది నీ 16 లక్షలు పోయాయి మా డబ్బులు కూడా పోయాయి అని చెప్పేసి చేతులెత్తేసి నువ్వు ఏం చేస్తావో చేసుకో మేమేం చేయమో అక్కడ మార్కెట్ పోయింది అని చెప్పేసి 16 లక్షల రూపాయలు
(03:00) లాస్ ని వీళ్ళు చూపించారంట ఈ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలండి పైగా 16 లక్షల రూపాయలు పోయింది కాకుండా ఈ అమ్మాయిని అసభ్యకరంగా ఏడిపించడం అసభ్యకరంగా ఫోనుల్లో మాట్లాడు మెసేజ్లు చేయడం ఇలాంటివన్నీ చేశారంట. సరే ఇంక ఈ గొడవ కాదు ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు సరి కదా ఇక్కడ అమెరికన్ కల్చర్ లో లాగా అవసరానికి వాడేసుకొని వదిలేసుకుందాం అని అనుకుంటున్నారు.
(03:19) సరే ఇంక డబ్బులు పోతే పోయాయి అని చెప్పేసి ఇంక అనుకున్న తర్వాత సరే ఇంక ఇండియాకి వెళ్ళిపోదాం. అమ్మ నాన్నే పెళ్లి సంబంధం చూడమందాము. అక్కడే ఏదనా పెళ్లి చేసుకుందాం అన్న ఉద్దేశంతోటి తల్లిదండ్రులు వచ్చేయమన్నారు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి ఇండియాకి వచ్చేసింది. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఈ గ్రూప్ పిల్లలు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ అమ్మాయి గురించి చెప్పి ఈ అమ్మాయి వెనకాల పడడం మొదలు పెట్టారంట.
(03:38) అక్కడ ఉన్న వాళ్ళు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి ఈ అమ్మాయిని ఏడిపించింది కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా ఈ అమ్మాయి నెంబర్ ఇచ్చి ఈ అమ్మాయి ఇంకా అదో రకంగా అదో టైప్ అని అన్నట్టు ఈ అమ్మాయితోటి చాటింగలు చేయడం ఇష్టం వచ్చినట్టు ఏడిపించడం ఈ అమ్మాయిని వేదింపులు గురి చేయడం ఇలాంటివన్నీ చేశారంట ఒక పక్కన డబ్బు పోయింది నన్ను ఎవరు పెళ్లి చేసుకోలేదు పైగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నన్ను వేధిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి నా నెంబర్లు అన్ని ఇచ్చి నా గురించి చెప్పి నన్ను ఇలా వేధిస్తున్నారు అని చెప్పేసి ఇంకా చూసి చూసి అమ్మాయి పోలీస్
(04:04) స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిందంట చూడండి అమెరికాలో ఇలా జరిగి జరిగింది ఆ గ్రూప్ అందరూ నన్ను వేధించి 16 లక్షల రూపాయలు స్టాక్ మార్కెట్లో పెట్టి నన్ను లాస్ చేశారు. పగలు రాత్రి నన్ను గంటలు గంటలు మాట్లాడని ఈ రకంగా వేధిస్తున్నారు నేను ఇండియాకి వచ్చినా సరే వాళ్ళ వేదింపులు తగ్గలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నన్ను వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసులు ఎవరు కూడా ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోలేదు ఏది కూడా పట్టించుకోలేదు.
(04:26) ఇంకా ఆ అమ్మాయి చూసి చూసి ఒక మీడియా ఛానల్ వాళ్ళ దగ్గరికి వచ్చి పాపం తన బాధనఅంతా చెప్పుకుంది. అంటే మన వాళ్ళు చూడండి ఇక్కడి నుంచే వెళ్ళిన వాళ్ళు ఇండియాలో ఉన్నట్టే అదే బుద్ధులతోటి అమెరికాలో కూడా ఉందామని అంటే ఎలా కుదురుతుంది చెప్పండి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కష్టపడి సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతోటే వెళ్తారు.
(04:44) ప్రొఫైల్ తీసుకెళ్లి గ్రూప్ లో పెట్టినందుకు ఈ అమ్మాయిని నానా రకాలుగా నమ్మించి మోసం చేసి 16 లక్షల రూపాయలు తినేశారు. అది తిన్నది కాకుండా ఇంకా అమ్మాయికి వేదింపులు. ఒక ఆడపిల్ల అంటే అంత లోకం అండి ఆ అమ్మాయి ఆశకొద్ది ఎవరనా పెళ్లి చేసుకుంటారేమో అనిని పెట్టింది. మీకు నచ్చని వాళ్ళు వదిలేయాలి కానీ పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనకాల పెడ్డారు అనిఅంటే ఎంత దరిద్రంగా ఉన్నారో మన వాళ్ళు చూడండి పైగా అమెరికా వెళ్లి మళ్ళీ ఇలాంటి వేషాలు ఆ అమ్మాయి చెప్తున్న మాట ఏంటంటే అమెరికాలో పిల్లలు ఎంఎస్ చేయడానికి అని వెళ్ళిన వాళ్ళు ఇదే పరిస్థితిలో ఉన్నారండి
(05:14) అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరగడం వాళ్ళ ఎంజాయ్మెంట్ పెళ్లి అనే మాట ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రిలేషన్షిప్ లో ఉండొచ్చు వదిలేయాలనుకున్నప్పుడు వదిలేయొచ్చు నచ్చిన వాళ్ళతోటి తిరగొచ్చు అక్కడ అది ఆ కల్చర్ కి అలవాటు పడిపోయి ఈ పని చేసేది తప్పు అని అన్న ఆలోచన లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టం వచ్చినట్టు అలాంటి పనులు చేస్తున్నారండి అని ఆ అమ్మాయి చెప్తుంది.
(05:33) చూసారా అండి ఆ అమ్మాయి అంత డబ్బు సంపాదించి మన తెలుగు అబ్బాయిల దగ్గర మోసపోయి మళ్ళీ ఇండియాకి వచ్చినా సరే ఆ అమ్మాయిని ఆ రకంగా వేధిస్తున్నారు అని అంటే మన వాళ్ళ బుద్ధి ఎక్కడన్నా మారిందా మీకు నచ్చినప్పుడు ఆ అమ్మాయి జోలికి వెళ్ళడం ఎందుకో ఏదో పాపం ఆ అమ్మాయి పెళ్లి సంబంధం కోసం పెట్టింది నచ్చినప్పుడు వదిలేయండి ఆ అమ్మాయి వెనకాల పడి నువ్వు వస్తావా నువ్వు నాతో మాట్లాడు నాతో రిలేషన్షిప్ లో ఉంటావా అని చెప్పేసి ఈ రకంగా వేధిస్తారా ఎంత తప్పండి అది అంటే మనకి ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి వేరే ఇక్కడి నుంచి మన పిల్లలు వేరే
(06:01) దేశాలకు వెళ్ళినా సరే వాళ్ళ బుద్ధులు ఇలాగే ఉన్నాయి ఇండియాలో చేసినట్టే అక్కడ కూడా చేస్తున్నారు. ఎంత అసయం అండి అంటే మన పిల్లలు అక్కడికి వెళ్లి ఏదో ఉద్దరిస్తున్నారని తల్లిదండ్రులు అనుకుంటున్నారు కానీ ఎవ్వరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అక్కడికి వెళ్లి అమ్మాయిలు అబ్బాయిలు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు.
(06:16) మన ఇంట్లో పరిస్థితులు బాగోకే జీవితం సెట్ చేసుకుందామని అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి వేషాలు వేశారనుకోండి అక్కడ ఏదైనా ఎవరనా కంప్లైంట్ ఇవ్వడం కాానీ ఏదనా చేశారనుకోండి మీ పరిస్థితి ఏంటి మీ జీవితం ఏంటి మీరు ఏ పని గురించి వెళ్ళారో దాని మీద దృష్టి పెట్టుకొని చక్కగా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి.
(06:31) చూసినట్టే అమ్మాయిల వెనకాలు తిరుగుదాం అమ్మాయిలతోటి ఎంజాయ్ చేద్దాం తాగుదాం తిరుగుదాం అసలు ఇలాంటి మైండ్సెట్ తోటి ఎందుకు ఉంటారు చెప్పండి మీకు ఏదనా అయ్యిందని అంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఒక్క అమ్మాయి కోసం 15 మంది వెనకాల పడి పెళ్లిళ్లు అయిపోయిన వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనకాల పడి అసభ్యకరంగా మాట్లాడడం మన వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో చూడండి అమెరికా వెళ్ళినా కూడా మారండి ఇప్పుడైనా సరే ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి కాకపోతే బయటికి రావట్లేదు ఏ ఆడపిల్ల బయటికవచ్చి చెప్పుకోవట్లేదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చక్కగా మీ భవిష్యత్తు గురించి ంచి
(07:01) ఆలోచించండి మీకు అంత పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చక్కగా మీ తల్లిదండ్రులకు చెప్పండి సంబంధాలు చూస్తారు చేస్తారు లేదంటే ఏ అమ్మాయి అయినా దొరికిందని అంటే పెళ్లి చేసుకోండి అంతేగన రిలేషన్షిప్లు పెట్టేసుకొని అవసరం ఉన్నాళ్ళు వాడేసుకొని మళ్ళీ నువ్వు నచ్చలేదని వదిలేయడం ఇక్కడ పద్ధతులన్నీ తెలిసిన వాళ్ళు అయఉండి అక్కడికి వెళ్లి ఇలాంటి వేషాలు వేస్తానుఅంటే ఏ అమ్మాయి ఊరుకుంటుంది చెప్పండి చక్కగా మీరు చదువుకోవడానికి వెళ్లి కొంచెం డబ్బు సంపాదించుకుందాం అని అనుకున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టండి మీకు అక్కడ ఉండడం నచ్చలేదు అనుకోండి
(07:26) పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఇండియాకి వచ్చి శుభ్రంగా పెళ్లి చేసుకొని మీ పనులు మీరు చేసుకోండి అంతేగాన ఏ ఆడపిల్ల వెనకాల ఇలా పడడం అసభ్యకరంగా మాట్లాడడం మీ అక్కో మీ చెల్లో లేతే మీ ఇంట్లో మీ బంధువులు ఆడపిల్లలో ఎవరో ఒకరో అక్కడ అమెరికాలో ఉన్నారు అనుకోండి వాళ్ళక కూడా ఇదే పరిస్థితి జరిగింది అనుకోండి అప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లో ఆడపిల్లలు అయితే ఒకలాగా వేరే ఇంట్లో ఆడపిల్లని అయితే ఒకలాగా చూస్తారా అలాగే తల్లిదండ్రులు కూడా మొగపిల్లలకి జాగ్రత్తలు చెప్పండి అమ్మాయిల జోలికి వెళ్ళడం పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఇలాంటివి మాత్రం ఎవరూ చేయొద్దని ఎవ్వరి
(07:55) పిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులు భయం చెప్పుకోండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ మరొక ఒక మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం.

No comments:

Post a Comment