*“మనలోని స్వార్థం, సంకుచితత్వమే కారణం.
*ప్రతి చిన్న కష్టానికి దేవుడి దయ లేదంటూ మన అజ్ఞానాన్ని చాటుకుంటాం.
*మన వేలుకో, కాలుకో వచ్చిన చిన్న బాధను గుర్తిస్తున్నామే గానీ మిగిలిన శరీరమంతా బాగుందన్న సత్యం గ్రహించలేకపోతున్నాం.
*దైవానుగ్రహం నిరంతరంగా, మనపైన ఈసృష్టి అంతట వ్యాపించి ఉన్నా గుర్తించలేకపోతున్నాం.
*శరీరధర్మాలకు, మనసు పోకడలకు భిన్నంగా ఉండటం ఎంతో కష్టం.
*సుఖదుఃఖాలు, కష్టనష్టాలు అర్థం చేసుకుని జీవించడం ద్వారా సమదృష్టి ఏర్పడుతుంది.
*మనలో స్థిరాస్తిగా ఉన్న దైవం, ఈ మనోదేహాలచే చరాస్తులుగా మారటం, ప్రకృతిలోని అంతర్భాగమే !
*సైన్స్ మాటల్లో చెప్పాలంటే స్థితిశక్తిగా ఉన్న ఆత్మ, ఈశరీరం, మనసుచేసే పనుల కోసం గతిశక్తిగా మారుతోంది!”
No comments:
Post a Comment