Friday, May 15, 2026

మీ మైండ్ మీతో ఆడుతున్న ఆట ఇదే This is where your mind is bluffing you

మీ మైండ్ మీతో ఆడుతున్న ఆట ఇదే This is where your mind is bluffing you

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rDK4IAZS5bE



Transcript:
(00:01) ఒత్తిరిలో ఉన్నావా మెడిటేషన్ చెయ్ కష్టాల్లో ఉన్నావా మెడిటేషన్ చెయ్ ప్రశాంతతది లేదా అయితే మెడిటేషన్ చెయ్ లేదు సార్ కోపంతో బాగా రగిలిపోతున్నానండి ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను. ఇతే మెడిటేషన్ చేయాలయ్యా అని అందరూ అంటూనే ఉంటారు కదండీ చివరికి మఠాధిపతులు సైకాలజిస్ట్ులు కౌన్సిలర్లు కూడా అంటూనే ఉంటారు కదా మనం చూస్తూనే ఉన్నాం కదా సో మెడిటేషన్ మెడిటేషన్ మెడిటేషన్ మన జీవితంలో ఈ వత్తిడి ప్రపంచంలో చాలాసార్లు వినపడుతున్నది కదా ఎలా చేయాలి అనే దాని మీద చాలా ప్రక్రియలు ఉన్నాయి వాడికి సంబంధించిన ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కానీ ఎంతమంది
(00:45) ఈ మెడిటేషన్ అంటే చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తున్నారు లేండి సో ఎంతమంది ఈ మెడిటేషన్ ని చేసేవాళ్ళు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్న తర్వాత కొనసాగిస్తున్నారు. ఆ మాటక వస్తే ఎంతమందికి వత్తిడి దూరం అయింది కష్టాలు తీరాయి దీనికి ఎక్కడ కూడాను ఇదమిద్ధమైన జవాబు లేదండి లేదు కిరణ్ గారు మీరేమన్నా కొత్త కోణంలో చెప్తున్నారా అని మీరు అడగొచ్చు అసలు అందుకేనండి ఈ వీడియో చేస్తున్నది పాయింట్ కి నేను వచ్చేస్తాను మనిషి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడండి ఏంటా ఏం చేస్తున్నావు అంటే ఏదో ఆలోచిస్తున్నానండి అంటాడు నిజానికి అతను
(01:30) తక్కువగా అంటే అతి తక్కువగా ఆలోచిస్తాడండి అది అతనికి తెలియదు కానీ జరుగుతున్నది ఏంటంటే విపరీతంగా ఊహల్లో తిరుగుతూ ఉంటాడు అన్నమాట అంటే ఇమాజినేషన్ లో ఉంటూ ఉంటాడు. ఇది తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది జీవితంలో అందరి జీవితాల్లో జరిగిపోతూనే ఉంటుంది. ఈ ఆలోచించడం ఊహల్లో ఉండటం అనేది చాలా లోతైన విషయం అండి మనస్తత్వ శాస్త్రము యోగశాస్త్రము చివరికి ఉపనిషత్తులు బౌద్ధం కూడాను ఇవే చెబుతున్నాయి ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు అయితే యోగః చిత్తవృత్తి నిరోధః అని చెప్తున్నది కదా దాని మీద పుంకాలు పుంకాలుగా చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు ఎన్నో వ్యాసాలు వచ్చాయి కూడాను
(02:14) అయితే అసలు ఆలోచన ఏంటి ఏంటి అన్న దాని [గొంతు సవరించుకోవడం] మీద నేను కాసేపు చెప్తానండి అసలు నిజమైన ఆలోచనకి మూడు లక్షణాలు ఉంటాయి. ఒకటి స్పష్టత ఉంటుంది అంటే క్లారిటీ ఉంటుంది రెండు అది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది అంటే ఇట్స్ క్లోస్ టు రియాలిటీ మూడో లక్షణం ఏంటంటే ఒక సమస్యని అది సమస్యగానే చూస్తుంది ఆలోచన అంటే ఇట్ విల్ స ది రియాలిటీ యస్ ఏ రియాలిటీ అంతే దానినుంచి పక్కకి తప్పుకోదు అన్నమాట పక్కకి తప్పుకోదు మంచి ఉదాహరణ ఇస్తానండి నేను ఈ పనిని ఎలా మెరుగుపరుచుకోవాలి ఇది ఆలోచన వాళ్ళు నన్ను ఇలా అనుకుంటున్నారేమో
(02:58) ్ ఒకరోజు నిజంగా నేను అందరికంటే చాలా గొప్పవాడిని అయిపోతాను. ఇదంతా కాదు గానీ అసలు అలా జరిగిఉంటే బాగుండేది. ఇది ఇమాజినేషన్ అండి మనం ఎక్కువ భాగం మన జీవితంలో ఈ ఇమాజినేషన్ దగ్గర స్ట్రక్ అయిపోతున్నాము. ఒరిజినల్ థింకింగ్ దాకా వెళ్ళటం లేదు. అంటే వాస్తవానికి వర్తమానానికి దూరంగా ఉంటున్నాము ఇక్కడే పొరపాటు జరుగుతున్నది కాలయాపన కూడా జరుగుతున్నది అన్నమాట.
(03:28) ఇంకో విధంగా చెప్పాలంటే మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వేస్ట్ అయిపోతున్నది. పతాక స్థాయి ఏంటంటే దుఃఖాన్ని ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇంక మెడిటేషన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఉండదు కదా సింపుల్ అండి ఇప్పుడు థింకింగ్ కి ఇమాజినేషన్ కి తేడా చూద్దాం మనం థింకింగ్ ఎప్పుడూ కూడాను వాస్తవం మీద ఆధారపడుతుంది. ఇమాజినేషన్ ఎప్పుడు భవోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది.
(03:58) అలాగే థింకింగ్ మనక ఒక క్లారిటీ ఇస్తుంది. కానీ ఈ ఇమాజినేషన్ ఉంది చూసారా ఇది మనల్ని గందరగోళంలో పడేస్తుంది అన్నమాట. ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటే అంటే నిజంగా ఆలోచిస్తూ ఉంటే చాలా తక్కువ శక్తి ఖర్చు అవుతుందండి అవి కానీ ఇమాజినేషన్ కి హద్దు ఉండదు ఎటు పోతుందో తెలియదు అందువల్ల ఎక్కువ శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట థింకింగ్ వీలైనంత వరకు సొల్యూషన్ ఓరియెంటెడ్ గా ఉంటుంది.
(04:25) కానీ ఈ ఇమాజినేషన్ ఉంది చూశరా ఇది మనల్ని ఒక ఎండ్లెస్ లూప్ లో పడేస్తుందండి దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం అన్నమాట అట్లాగే సిన్సియర్ గా థింకింగ్ చేస్తూ ఉంటే ఒక విషయం గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉంటే మనం ప్రెజెంట్ లోనే ఉంటామండి కానీ ఇమాజినేషన్ ఉంది చూసారా అది [గొంతు సవరించుకోవడం] పాస్ట్ ఫ్యూచర్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట అసలు పాయింట్ కి వద్దాంండి ఈ మెడిటేషన్ అంటే ఏదో ఒక కొత్త కొత్త అనుభవాన్ని లేకపోతే వింత అనుభవాన్ని సృష్టించడం కాదండి ఈ మనసు కొన్ని అన్నెసెసరీ మూమెంట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కదా వాటిని ఆపటం అన్నమాట అంతకంటే ఏం లేదు.
(05:05) [ఆశ్చర్యం] అంటే ఎప్పుడైతే ఈ ఊహల ప్రభావం తగ్గిందో మనసు మొట్టమొదటిసారిగా రియాలిటీని చూస్తుందండి అందుకనే చూడండి ఎన్ని చెప్పినా ఒకడు వినడు చివరికి ఎవడో చెబితే వింటాడు అప్పుడు మనం ఏమంటామఅండి అమ్మయ్యా వీడు వాస్తవంలోకి వచ్చాడురా బాబు అంటుంటామా లేదా అంటే వాడు ఇమాజినేషన్ ని పక్కన పెట్టేసి ఎవడన్నా వాస్తవం చెబితే అది కాదురా నాన్న ఇదిరా అని చెబితే అప్పుడు వాడు ఆలోచనలో పడి నిజమే అన్నాడు అనుకోండి అంటే వాడు వాస్తవానికి కనెక్ట్ అయినట్టు అన్నమాట అంటే [నవ్వు] సరైన ఆలోచనలో ఉన్నట్టు ఇలా గనుక ఉండగలిగితే ఇదే మెడిటేషన్ యొక్క మొట్టమొదటి డోర్ అండి ఇక్కడే మొట్టమొదటి
(05:47) డోర్ ఓపెన్ అవుతుంది అన్నమాట చాలామంది అనుకుంటూ ఉంటారు నా బాధలకు ప్రపంచమే కారణం అని కాదు మీరు పుట్టక ముందు నుంచే ప్రపంచం ఇక్కడే ఉంది. మీరు పోయిన తర్వాత కూడా ఉంటుంది. అసలు మనిషి బాధకి కారణం ప్రపంచం కాదండోయ్ అతను క్రియేట్ చేసుకున్న ఈ మెంటల్ ఇమేజెస్ే అవే ఎక్కువ వాదిస్తాయి మనిషిని ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒక మనిషి మనల్ని చూసి ఒక విషపు నవ్వు నవ్వాడు అనుకోండి ఓ 10 సెకండ్లు పడుతుంది కదా దానికి కానీ ఈ 10 సెకండ్లే మనకి 10 రోజులు బాధ అయిపోతూ ఉంటుందండి అసలు అప్పుడే ఇమాజినేషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మనకి
(06:25) ఎటెటో పోతూ ఉంటుంది మనసు వాడు ఎందుకు అన్నాడు అప్పుడు ఎప్పుడో జరిగిన సంఘటన ఉంది కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడా లేదు నేను రేపు పొద్దున ఇలా చేయబోతున్నాను కాబట్టి అది కూడా ఫెయిల్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాడు ఏమన్నా అన్నాడా అంటే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఈ ఇమాజినేషన్ వల్ల మనసు అనే తెర మీద మాటమాటికి అనేక విషయాలు రీప్లే చేసుకుంటూ ఉంటామండి.
(06:48) ఇక్కడే ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. రివెన్యూ సీన్ కూడాను ఇక్కడే క్రియేట్ అవుతూ ఉంటుంది అంటే మన బాధలో పెద్ద భాగం అంటే సింహ భాగం వచ్చేసి రియాలిటీ వల్ల కాదండి ఇమాజినేషన్ వల్ల అందుకనే చూడండి అనుకున్నది కాదు జీవితం అనుభవించేది జీవితం అని ఏదో వాక్యం నాకు ఇప్పుడు గుర్తుకవస్తున్నది అది ఎంత నిజం అండి [నవ్వు] [నిట్టూర్పులు][ఆశ్చర్యం] ఈ మనసుకి ఒక విచిత్రమైన లక్షణం ఉందండి జరిగిన దాన్ని పట్టుకుంటుంది.
(07:19) జరగన జరగరాని దానికి మటుకు భయపడుతూ ఉంటుంది అన్నమాట అంటే ఎప్పుడైతే ఇమాజినేషన్ లో ఉన్నామో మనసు భయపడటం ప్రారంభిస్తూ ఉంటుంది. అలా ఈ రెండిటి మధ్య మనిషి జీవితం నడుస్తూ ఉంటుందండి. అందుకనే బౌద్ధులు ఏమంటారంటే యు జస్ట్ అబ్సర్వ్ డోంట్ ఇమాజిన్ అని అంటారండి ఇది మనం పట్టుకోవాల్సిన విషయం ఒకటి కొన్ని సార్లు మనం ఇది అనుకుంటూ ఉండాల్సింది అవసరమైతే ఒ మంచి కాయితం మీద రాసుకొని ఒక రెండు మూడు చోట్లు ఇంట్లో అతికించుకొని దాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి.
(07:48) జస్ట్ అబ్సర్వ్ డోంట్ ఇమాజిన్ అని చెప్పేసి ఆదిశంకరాచార్యుల వారు ఓచోట ఇలా సెలవిస్తారండి. మనసు యొక్క అసలు స్వరూపం ఆలోచన కాదు ఊహలు కాదు భావోద్వేగాలు అంతకన్నా కావు వాస్తవానికి సాక్షీభూతంగా ఉండటమే మనకి ఇక్కడ కూడా డౌట్ వచ్చేస్తూ ఉంటుంది అదేంటండీ మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉంటాయి అలా నిమిత్తమాత్రులుగా అలా ఉండమంటారా అలా సాక్షిభూతంగా ఉండమంటారా అని మనకు మళ్ళనే మనమే ప్రశ్న వేసుకొని చిరాగ పడిపోతూ ఉంటాం.
(08:23) అసలు అన్నిటికీ సాక్షిభూతంగా ఎలా ఉండగలవండి అని మన మనసు మళ్ళీ పదే పదే మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఒకటేనండి చిత్తశుద్ధితో ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయి లేకతే పని చెయి ఫలితం అనేది అనుకున్నట్లు రావచ్చు అనుకున్నట్లు రాకపోవచ్చు అది నీ చేతిలో లేదు కాబట్టి రిజల్ట్ ఏదైనా సరే దానికి సాక్షిపూతంగా ఉండవు. ఆకాశం లాగా ఆకాశంలో మేఘాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆకాశం వాటిని అలా గమనిస్తూ ఉంటుందండి అన్టచ్డ్ గా ఉంటూ ఉంటుంది.
(08:58) అంటే మెడిటేషన్ అంటే సాక్షీభూతంగా ఉన్న ఆ ప్రశాంతమైన సాక్షిని గుర్తించటం మళ్ళీ చెప్తానండి మెడిటేషన్ అంటే సాక్షీభూతంగా ఉన్న ఆ సాక్షిని గుర్తించటం అంటే నిన్ను నీవు తెలుసుకొని రావణ మహర్షి గారు అంటారు కదా దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదండి అప్పుడు జరిగే అద్భుతం ఏంటంటే మొట్టమొదటిసారిగా మనం మనతో ఉంటాంండి జీవితకాలంలో దాదాపు 90% ఎప్పుడ కూడా మనం మనతో ఉండము ఎప్పుడైతే మనం మనతో ఉండటం ప్రారంభించామో ఇందాక నేను చెప్పినట్టుగా మెడిటేషన్ కి మొట్టమొదటి తలుపు తెలుసుకుంటుంది.
(09:38) అయితే మెడిటేషన్ అంటే ఇంకో కోణం ఉందండి అదేంటంటే వచ్చే థాట్స్ ని బలవంతంగా చంపడం కాదండి అయి ఇమాజినేషన్ తో ఫైట్ చేయడం అంతకన్నా కూడా కాదు జాగ్రత్తగా గమనించండి కాకపోతే ఏంటంటే ఇది ఇమాజినేషన్ే ఆలోచన కాదు అని చెప్పి తెలుసుకోవడం అండి ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని తెలుసుకున్నామో అప్పుడు తెలియకుండా ఒక నిశశబ్దం పుడుతుంది. ఆ నిశశబ్దంలో అనే క్లారిటీ వస్తుంది పీస్ వస్తుంది ఒక స్పిరిచువల్ ఇన్సైట్ కలుగుతుంది.
(10:19) తెలియకుండా ఇన్నర్ ఫ్రీడమ వచ్చేస్తుందండి ఇవన్నీ కూడాను నెమ్మదిగా వికసిస్తూ ఉంటాయి కాబట్టి స్టాప్ ఇమేజింగ్ అంతే ఎక్కువగా ఊహించుకోమాక చెప్పాను కదండీ మనం నిజంగా ఆలోచించడం లేదు ఊహల్లో బతికేస్తున్నాము కథలు అల్లుతున్నాము కాగమ కథలు చెబుతున్నాము అదే జీవితం అనుకుంటున్నాం. ఇక్కడే పొరపాటు జరుగుతున్నదండి ఇక్కడే పొరపాటు జరుగుతున్నది.
(10:47) ఎక్కడో చదివాను ఊహకు మించిన శక్తి లేదు అని చెప్పేసి నిజమే ఊహకు మించిన శక్తి లేదు నిజమే ఎప్పుడు దానికి అద్భుతమైన శక్తి వస్తుంది వాస్తవం తెలుసుకున్నప్పుడు దాని మీద క్రియేటివిటీగా పని చేయి అసలు వాస్తవమే లేనప్పుడు నువ్వు నిలబడ్డ భూమే గట్టిగా లేదు పోనీ నిచ్చనం వేద్దామా అంటే లోపల కూరుకుపోతున్నది నువ్వు ఆకాశానికి ఎగరగలవు కాబట్టి ఊహ గొప్పదే కానీ ఎప్పుడ ఎప్పుడైతే వాస్తవం బలంగా ఉంటుందో ఊహ కూడా అప్పుడు బలంగా ఉంటుందన్నమాట మళ్ళీ అక్కడ రిజల్ట్స్ రావచ్చు రాకపోవచ్చు కదా సో ఇది కొంచెం స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయం అండి ఎందుకో
(11:28) నాకు [గొంతు సవరించుకోవడం] కొంత పరిశోధన చేద్దాం అనిపించి ఈ వీడియో చేశనండి ఆలోచించండి ఆలోచించండి మన ఆలోచనలో ఎక్కువ భాగం నిజమైన ఆలోచనలా లేకపోతే మనం ఇమాజినేషన్ లో బతుకుతున్నామా ఆలోచించండి. ప్రతి ఆలోచనని మీరు ఆ విధంగా గనక డిసైడ్ చేసుకుంటూ పోతే అరేరర ఎంత టైం వేస్ట్ అయిపోతుందిరా మన జీవితంలో ఊహలో బతికేస్తున్నాం ఏంటి వర్తమానాన్ని మర్చిపోయి వాస్తవాన్ని మర్చిపోయి అని అనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడైతే మీరు వాస్తవాన్ని పట్టుకున్నారో మీ మనసు ఏకీకృతం అవుతుందండి ఏ పని చేసినా కూడాను మెడిటేటివ్ మైండ్ తో చేస్తారు మీరు అప్పుడు అనుకున్నది సాధించే అవకాశం
(12:05) ఎక్కువగా ఉంటుందండి. సో ఇదండి ఈ వీడియోలోని సంగతి వినంత కృతజ్ఞతలు ఎక్కువ మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలనుకుంటే అలాగే నాతో మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ మీరు YouTube లోకి వెళ్లి ఎంఆర్ యుటహఐ స్పేస్ హచ్కఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పోరూరి అని యాడ్ అయితూ నా YouTube ఛానల్ వచ్చేస్తుందండి. రెండే రెండు రిక్వెస్ట్లు అండి అదేంటంటే నా వీడియో నచ్చితే మీరు ఇటు సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఇంతకంటే ముఖ్యంగా నలుగురికి పంచండి నలుగురికి పంచండి ఇంకోటి ఏంటంటే మంచి మెసేజ్ ని కామెంట్ బాక్స్ లో పెట్టండి. మీ అభిప్రాయాలు కూడా పెడితే
(12:47) మీరు నాతో చర్చించినట్టు అవుతుంది నేను కూడా కొత్త విషయాలు తెలుసుకుంటాను అన్నమాట. ఈ రెండు పనులు చేయండి. నమస్కారం.

No comments:

Post a Comment