Good Touch Bad Touch నుంచి POCSO వరకు | ప్రతి Parent తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు | Riyaz
Author Name:3tv Network
Youtube Channel Url:https://www.youtube.com/@3tvnetwork
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eIWb5GuBFoE
Transcript:
(00:00) ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం [సంగీతం] కష్టమైంది. కానీ ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఊహించుకోండి మీ కళ్ళ ముందు పెరిగే ఒక చిన్నారికి [సంగీతం] ఏదైనా ఆపద వస్తే ఆ పసి మనసు గాయపడితే మనం ఏం చేయగలం మన దేశంలో పిల్లల రక్షణ కోసం ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంది. అదే పోక్సో చట్టం.
(00:19) చాలా మందికి ఈ పేరు తెలుసు గానీ అసలు ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే శిక్షలు ఎలా ఉంటాయి? పోలీసులు పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఈ వీడియోలో పోక్సో గురించి మీకు ఏ డౌట్ లేకుండా పక్కగా విడమిర్చి చెబుతాను. ఇది కేవలం వీడియో మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత. చివరి వరకు ఈ వీడియోని చూడండి. ముందుగా అసలు పేరు తెలుసుకుందాం.
(00:41) పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ అన్నమాట. దీనిని మన భారత ప్రభుత్వం 2012 లో అమల్లోకి తీసుకొచ్చింది. దీనికంటే ముందు పిల్లల మీద జరిగే అన్యాయాలకు సరైన చట్టాలు లేవు. అప్పట్లో చిన్న పిల్లల మీద ఏదైనా అటాక్ జరిగితే కూడా పెద్దవాళ్ళకు వర్తించే శిక్షలనే వాడేవాళ్ళు. దానివల్ల నేరస్తులు తప్పించుకునే ఛాన్స్ కూడా ఉండేది.
(01:01) కానీ ఫోక్సో చట్టం వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ఇది కేవలం పిల్లల కోసం వాళ్ళ రక్షణ కోసమే పుట్టిన చట్టం ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ చట్టం పరిధిలోకే వస్తారు. అవును కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిల మీద కూడా జరిగే అన్యాయాలకు కూడా పోక్సో వర్తిస్తుంది.
(01:21) 25 మే గుజరాత్లో ఒక 13 ఏళ్ల మేల్ స్టూడెంట్ ను అబ్యూస్ చేసినందుకు 23 ఏళ్ల లేడీ టీచర్ ను ఫోక్సో యక్ట్ కింద అరెస్ట్ చేశారు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. కేవలం ఫిజికల్ అటాక్ జరిగితేనే ఫోక్సో వర్తిస్తుందని కానీ అది తప్పు. ఈ చట్టం చాలా లోతుగా ఉంటుంది. ఎవరైనా పిల్లలను తప్పుగా తాకడం లేదా వారి శరీరాన్ని తాకమని బలవంతం చేయడం.
(01:44) పిల్లల ముందు అసభ్యకరమైన వీడియోలు చూపించడం లేదా వాళ్ళను చూసి అసభ్యంగా ప్రవర్తించడం పిల్లలతో అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు తీయడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇది చాలా సీరియస్ క్రైమ్ ఇప్పుడున్న కాలంలో ఆన్లైన్ లో పిల్లలకు అసభ్య మెసేజ్లు పంపించడం కూడా ఈ చట్టం కింద నేరమే. గుర్తుంచుకోండి ఇక్కడ కన్సెంట్ అంటే సమ్మతి అని మాటకే చోటు లేదు.
(02:06) 18 ఏళ్ల పిల్లలు ఓకే అన్నా సరే అది నేరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకు ఏది మంచిదో ఏది చెడో నిర్ణయించుకునే మెచూరిటీ ఉండదని చట్టం నమ్ముతుంది. పోక్సో ఎందుకు అంత పవర్ఫుల్లో తెలుసా పోక్సో చట్టం నేరస్తుల పాలిట యము లాంటిది. ఇందులో కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. సాధారణంగా ఏ కేసులోనైనా పోలీసులు నిరూపించే వరకు ఎదుటి వ్యక్తి నిర్దోషి కానీ పోక్సోలో రివర్స్ ఒకసారి కేసు ఫైల్ అయితే ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తే తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి లేదంటే చట్టం అతన్ని నిరస్తుడిగానే చూస్తుంది.
(02:38) ఈ కేసుల విచారణ కోసం స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. నేరం జరిగిన ఏడాదిలోపే విచారణ పూర్తి చేసి తీర్పుఇవ్వాలి. పిల్లలు చెప్పే స్టేట్మెంట్ కి చాలా విలువ ఉంటుంది. ఇక శిక్షలు ఎలా ఉంటాయో చూద్దాం. నేరం తీవ్రతను బట్టి సెక్షన్లను బట్టి ఫోక్సోలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఏ సెక్షన్ దేని గురించి చెబుతోంది అనేది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.
(02:57) ఈ చట్టంలో ఉన్న ప్రతి క్లాజ్ నేరస్తుడికి ఒక హెచ్చరిక లాంటిది. ఒక్కోదాన్ని క్లియర్ గా చూద్దాం. ఇక సెక్షన్ వన్ దీని పేరు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ సెక్షువల్ అఫెన్స్ పోక్సో యక్ట్ 2012 ఇది మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది. గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కు కొన్ని మినహాయింపులు ఉండేవి కానీ ఇప్పుడు దేశం మొత్తం ఒకటే చట్టం మీరు ఇండియాలో ఎక్కడున్నా ఏ మారుమూల గ్రామంలో ఉన్న ఈ చట్టం మీ పిల్లలకు [సంగీతం] రక్షణ కలిగిస్తుంది.
(03:24) ఇక సెక్షన్ట డెఫినేషన్స్ అసలు గందరగోళంగా అంతా ఇక్కడే మొదలవుతుంది. పిల్లలు అంటే ఎవరు తప్పు అంటే ఏంటి అనే దానికి ఈ సెక్షన్ పక్కా డెఫినేషన్ ఇస్తుంది. పోక్సో ప్రకారం 18 ఏళ్ల వయసు నిండని ఎవరైనా సరే పిల్లలే ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అనేది తేడా ఉండదు. ఈ కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఉంటాయని వాటి అర్థం ఏంటో ఇక్కడ వివరిస్తారు.
(03:45) అసలు ఒక తాకిడిని నేరంగా ఎప్పుడు చూడాలి ఆ వ్యక్తి ఆలోచనలో లైంగిక వాంచ ఉంటే దాన్ని నేరం అంటారు. అదేంటి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తారు. ఐపీసి లో ఉన్న కొన్ని డెఫినేషన్స్ ను కూడా ఇక్కడ రిఫరెన్స్ గా తీసుకుంటారు. ఇక సెక్షన్ త్రీ అండ్ ఫోర్ అత్యంత కఠినమైన శిక్ష. ఒక చిన్న పిల్లవాడిని లేదా చిన్న పిల్లని శారీరకంగా హింసించడం లేదా లైంగికంగా దాడి చేయాలని ప్రయత్నించడం ఈ సెక్షన్ కిందకు వస్తుంది.
(04:10) ఈ సెక్షన్ ప్రకారం నిందితుడికి కనీసం 10ఏళ్ల జైలు శిక్ష నుండి జీవిత ఖైదు వరకు పడొచ్చు. నేరం తీవ్రతను బట్టి జరిమాన కూడా విధిస్తారు. ఇక సెక్షన్ 5 అండ్సిక్స్ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఇది చాలా ముఖ్యమైనది పిల్లలను కాపాడాల్సిన వారే అంటే పోలీసులు డాక్టర్లు టీచర్లు లేదా రక్త సంబంధీకులు ఈ దారుణానికి పాల్పడితే ఈ సెక్షన్ వర్తిస్తుంది.
(04:31) వీరికి శిక్ష ఇంకా కఠినంగా ఉంటుంది. కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణ శిక్ష వరకు విధించే అవకాశం ఉంటుంది. నమ్మిన వారే మోసం చేస్తే చట్టం అస్సలు కనికరించదు. ఇక సెక్షన్ సెవెన్ అండ్ ఎయిట్ అసభ్యంగా తాకడం లైంగిక ఉద్దేశంతో పిల్లల శరీర భాగాలను తాకడం ఈ క్లాస్ కింద నేరం చాలా మంది ఏదో పొరపాటున తాకాను అని తప్పించుకోవాలని చూస్తారు కానీ ఫోక్సోలో అది కుదరదు ఇలా చేస్తే కనీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
(04:58) ఇక సెక్షన్ 9 అండ్ 10 బాధ్యతాయుత పదవుల్లో ఉండి తప్పు చేస్తే పైన చెప్పుకున్నట్లుగా రక్షణ కల్పించాల్సిన వ్యక్తులు అధికారులు పిల్లలను అసభ్యంగా తాగినా లేక లేదా వేధించిన ఈ శిక్ష ఈ సెక్షన్ కింద బుక్ చేస్తారు. కనీసం ఐదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇక సెక్షన్ 11 అండ్ 12 మాటలతో వేధించడం శారీరకంగా తాకకపోయినా మాటలతో భయపెట్టడం, అసభ్య సంజ్ఞాలు చేయడం, పిల్లలకు డర్టీ మెసేజ్లు పంపించడం లేదా వారిని వెంటపడడం దీని కిందకు వస్తాయి.
(05:25) ఈ సెక్షన్ కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అంటే నేను తాకలేదు కదా అని ఎవరు తప్పించుకోలేరు. ఇక సెక్షన్ 13, 14 అండ్ 15 చైల్డ్ పోర్నోగ్రఫీ పిల్లలతో అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు తీయడం వాటిని చూడడం దాచుకోవడం లేదా ఇతరులకు పంపడం ఈ సెక్షన్ కింద నేరం. ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఫోన్లో అడల్ట్ కంటెంట్ లో పిల్లలు వీడియోలు ఉన్నాయని తెలిస్తే వెంటనే డిలీట్ చేయాలి.
(05:49) ఎవరికైనా షేర్ చేస్తే ఈ సెక్షన్ కింద జైలు వెళ్ళడం కాయం. శిక్షఐదు నుంచి ఏడేళ్ల వరకు ఉంటుంది. పోక్సో లో ఉన్న మరో మూడు పవర్ఫుల్ క్లాజులు కూడా ఉన్నాయి. అవి సెక్షన్ 19 మీ కళ్ళ ముందే నేరం జరుగుతున్నా లేదా ఎవరో తప్పు చేస్తున్నారని మీకు తెలిసినా వెంటనే పోలీసులకు చెప్పాలి. ఒకవేళ తెలిసి కూడా దాచి పెడితే మీకు కూడా ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడొచ్చు.
(06:08) నాకెందుకులే అని వదిలేయడానికి వీలు లేదు. ఇక సెక్షన్ 21 కేస్ రిపోర్ట్ చేసిన పోలీసులు పట్టించుకోకపోయినా లేదా కేసు నమోదు చేయకపోయినా ఆ అధికారులకు కూడా శిక్ష పడుతుంది. ఇక సెక్షన్ 24 బాధితుల రక్షణ పోలీసులు ఎప్పుడూ సివిల్ డ్రెస్ లోనే రావాలి విచారణ సమయంలో పిల్లల తల్లిదండ్రులు లేదా వారు నమ్మే వ్యక్తి పక్కనే ఉండాలి.
(06:30) నిందితుడిని బాధితురాలని ఎక్కడ ఎదురెదురుగా నిలబెట్టకూడదు. ఇదంతా తెలిసినా సరే ఇంతకీ మనం ఏం చేయాలి అనే ప్రశ్న మీకు కూడా వచ్చింటుంది. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి. కేవలం చట్టాలు ఉంటే సరిపోదు మన పిల్లలకి మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేర్పించాలి. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు తిట్టకుండా ప్రశాంతంగా వినండి.
(06:51) ఎవరైనా మిమ్మల్ని తప్పుగా తాకితే నో చెప్పండిఅని పిల్లలకి నేర్పించండి. మీ బాడీ మీ ఆస్తి ఎవరికీ దాన్ని తాకే హక్కు లేదు అని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పండి. ఇక డిజిటల్ విలన్స్ ఉంటారు కాలం మారుతోంది ఒకప్పుడు నేరస్తులు అడ్రెస్ అడిగే నెపంతోనో చాక్లెట్లు ఇచ్చో పిల్లల దగ్గర చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు మీ పిల్లల మొబైల్ స్క్రీన్ల ద్వారా ఇంట్లోకి చొరబడుతున్నారు.
(07:11) ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫ్రెండ్స్ లా పరిచయం అయి ఆ తర్వాత పిల్లల ప్రైవేట్ ఫోటోలు అడగడం బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. ఇది సెక్షన్ 11 కింద డిజిటల్ హరాస్మెంట్. నిందితుడు డైరెక్ట్ గా తాకకపోయినా ఫోన్లో డర్టీ మెసేజ్ పంపిన జైలు శిక్ష తప్పదు. మీ పిల్లలు ఆన్లైన్ లో ఎవరితో మాట్లాడుతున్నారు ఎలాంటి యప్స్ వాడుతున్నారు అనేది ఒక కన్నేసి ఉంచండి.
(07:31) సైబర్ సేఫ్టీ నేర్పించడం కూడా ఇప్పుడు ఒక బాధ్యత అయిపోయింది. ఇక రెండోది రివెంజ్ కోసం చట్టాన్ని వాడొద్దు. ప్రతి నాణానికి రెండో వైపు ఉంటుంది. ఫోక్స్ చట్టం చాలా పవర్ఫుల్ కానీ దీనిని కొందరు వ్యక్తిగత కక్షల కోసం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం కోసం వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరైనా కావాలని తప్పుడు ఫిర్యాదు చేస్తే చట్టం వారిని వదిలిపెట్టదు.
(07:52) సెక్షన్ 22 ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చి అమాయకులను ఇరికించాలని చూస్తే ఆ ఫిర్యాదు చేసిన వారికే శిక్ష పడుతుంది. చట్టం అనేది పసిపిల్లల రక్షణ కోసం ఉన్న ఆయుధం. దానిని సొంత పగలు తీర్చుకోవడానికి వాడి ఆ వ్యవస్థను పక్కదారి పట్టించకూడదు. ఇక మూడోది సాకులు చెప్పడానికి వీలు లేదు. కోర్టులో నేరస్తులు తరుచుగా చెప్పే సాకులు ఏంటో తెలుసా నేను తాగిన మైకంలో ఉన్నాను నాకు ఏం చేస్తున్నానో నాకు తెలియడం లేదు.
(08:16) లేదా నేను కావాలని చేయలేదు పొరపాటున జరిగింది ఇలాంటివి ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఫోక్చలో ఇలాంటి పప్పులుఏవి ఉడకవు. దీనిని చట్టపరంగా స్ట్రిక్ట్ లయబిలిటీ అంటారు. అంటే తప్పు జరిగిందా దానిని బాధ్యుడు నువ్వేనా అయితే శిక్ష పడాల్సిందే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది కోర్టుకి అవసరం లేదు. నిందితుడే తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలి.
(08:38) అప్పటివరకు అతడు నేరస్తుడే. ఇక నాలుగోది ఎమర్జెన్సీ ఆయుధాలు. కేవలం వీడియో చూసి వదిలేయడం కాదు ఏదైనా ఆపద వస్తే ఏం చేయాలో కూడా మీకు తెలిసిఉండాలి. 1098 చైల్డ్ లైన్ ఇది పిల్లల కోసం ఉన్న 24/7 హెల్ప్ లైన్ ఒక్క ఫోన్ కాల్ ఒక చిన్నారి జీవితాన్ని కాపాడుతుంది. తెలంగాణలో షీ టీమ్స్ ఏపీ లో దిశా యప్ వంటివి ఇన్స్టాల్ చేసుకోండి. మీరు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేకపోతే ఆన్లైన్ లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వెబ్సైట్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు.
(09:07) మీ వివరాలు గోప్యంగా ఉంచుతారు. చూశారు కదా ఫోక్స్ చట్టం అనేది కేవలం పేపర్ మీద ఉన్న అక్షరాలు కాదు మన పిల్లల ప్రాణాలను కాపాడే ఒక రక్షణ కవచం మన చుట్టూ ఉన్న నిశబ్దాన్ని విడదాం ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే గొంతు ఎత్తుదాం. ఎందుకంటే మనకెందుకులే అని మనం వదిలేసిన చిన్న నిర్లక్ష్యం ఒక చిన్నారి భవిష్యత్తును చీకట్లోకి నెట్టేయొచ్చు.
(09:28) చివరిగా నేను చెప్పేది ఒకటే ఇలాంటి విషయాలు మాట్లాడడానికి మోహమాట పడకండి. మన పిల్లల భవిష్యత్తు కంటే మర్యాదలు ఏమీ ఎక్కువ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలి అందుకే ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. అవగాహనే [సంగీతం] అసలైన రక్షణ. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం అప్పటివరకు సెలవు బీ సేఫ్ బీ అవేర్ దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్ [సంగీతం]
No comments:
Post a Comment