Tuesday, May 12, 2026

పెళ్లి వద్దనుకుంటున్నారా? అయితే ఇలా చెయ్యండి Marriage may be Meaningless, but Life is

పెళ్లి వద్దనుకుంటున్నారా? అయితే ఇలా చెయ్యండి Marriage may be Meaningless, but Life is

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H2GSHtjn5eE



Transcript:
(00:01) ఈ మధ్య వివాహాల మీద దృష్టి సారించానండి. చాలా మంది పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను చాలా విషయాలు కూడా తెలుస్తున్నాయి ఇందాక కూడాను ఒక కాల్ వచ్చింది. నిశ్చితార్థం కూడా అయింది దాని తర్వాత కొన్ని విషయాలు బయటపడ్డాయి. సరే నాకు ఏదో ఫోన్ చేశను నేనుేదో చెప్పాను అనుకోండి అది వేరు ఇప్పుడున్న సమాజంలో ఈ వివాహాల విషయంలో పరిస్థితి చూస్తుంటే ఎట్లా ఉందంటే అంటే చాలా మంది మగపిల్లలు ఓరి నాయన పెళ్లి చేసుకోవాలా చేసుకుంటే ఎలా ఉంటుందో భవిష్యత్తు అన్న ఒక నిరాశన స్పృహ కనిపిస్తుందండి ఎక్కువ మందిలో ఎక్కువ మందిలో అంటే చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు అయిష్టంగా
(00:43) ఉన్నారు అనుమానంగా ఉన్నారు భయం గుప్పిట్లో కూడా ఉంటున్నారండి కారణాలు వాళ్ళు చెప్పేవి ఎలా ఉన్నాయి అంటే నా జాబితో వచ్చే శాలరీతో నేను వైవాహిక జీవితాన్ని సంతృప్తిగా గడపగలనా మొదటి నుంచే పరిచయం లేకుండా ఒక అరగంటలోనో ఆరు నెలల్లోనో పరిచయమైన అమ్మాయి నిజంగా నా జీవితంలోకి ప్రవేశిస్తే ఆ తర్వాత మౌలిక విషయాల్లో ఆమె విభేదిస్తే అది నా అస్తిత్వానికే ప్రమాదం కథ అనుకుంటున్నారండి అలాగే కొంతమంది వాళ్ళ మిత్రుల గురించి బంధువుల గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి వివాహాలు అయిన తర్వాత వాళ్ళు పడుతున్న వేదన బాధ అసంతృప్తులు
(01:29) చూసి అసలు వీళ్ళకి మతిపోతున్నదండి మతిపోతున్నది వాళ్ళని చూపెట్టి వీళ్ళు అనే మాట ఒకటే ఏమనండి పెళ్లి అంటే ఏమ అంత అవసరమా అని అనిపిస్తున్నదండి అని అంటున్నారండి మొన్న నా మొహం మీదే అనేసారు వాళ్ళు నేనేం మాట్లాడలేదు అనుకోండి ఎందుకంటే నాకు కావాల్సింది వాళ్ళ నుంచి స్థిరమైన ఇదమిద్ధమైన సమాచారం మధ్య నా నోటీస్ కి ఒకటి వచ్చిందండి అదేంటంటే ఇద్దరు చిన్న పిల్లల తల్లి దూరంగా ఆఫీస్ లో పని చేసుకుంటున్న భర్తకి ఫోన్ చేసింది ఏమనింటే [గొంతు సవరించుకోవడం] చిన్న పాప నెంబర్ టూ కి వెళ్ళింది కొంచెం పర్మిషన్ తీసుకొని వచ్చేసి పాపని
(02:15) క్లీన్ చేసి వెళ్ళిపోవాలి. నేను నిజంగా చెప్తున్నానండి మీరు నమ్మాలి కూడా ఎందుకంటే నేను విన్నాను కాబట్టి ఈ విషయం నేను మా పిల్లలకి చెప్పాను అనుకోండి ఏంటి సార్ ఇది అని అంటారు కదా కాబట్టి ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానుండి అట్లాగే ఇంకొక అబ్బాయి అన్నాడు నా తల్లిదండ్రులు నాకు చాలా ముఖ్యం సార్ వాళ్ళ దగ్గర నేను ఉన్నా లేకపోతే దూరంగా కాపురం పెట్టిన కూడాను వాళ్ళకి అమర్యాద కలిగితే మరకు నేను తట్టుకోలేనండి.
(02:50) మా అమ్మ చాలా దైవభక్తి పర్రాలు సున్నితమైన మనసు కలది. జీవితమంతా ముగ్గురు ఆడపిల్లల కోసం ఒక్క మొగపిల్లాడైనా నా కోసం ఇచ్చిందండి చివరికి ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంది. ఆమెకి కించిత్త మర్యాద కలిగిన అలాగే మా నాన్నగారికి కూడా నేను తట్టుకోలేనండి. అది నా బలహీనత అంతే అని చెప్పాడండి. అట్లాగే నా ఉద్యోగ భద్రత ఎలా ఉంటుందో నాకే తెలియదు ఎందుకంటే మా ఆఫీస్ లో ఈ మధ్య మూడు నెలల నోటీస్ ఇచ్చారు స్ట్రాటరీ నోటీస్ వేరే ఉద్యోగాలు చూసుకోమని నాకఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు ఒ రెండు నెలల తర్వాత నాకు కూడా ఇవ్వచ్చేమో అన్న భయం నాకు ఇప్పటి నుంచే పట్టుకుందండి
(03:31) అన్నాడండి అలా అంటున్నప్పుడు ఆ పిల్లవాడి మొహంలో నిజంగా అసలు ఎంత కంగారు ఉందో అయితే కొంతమంది మిత్రులు అసలు నేను పెళ్లి చేసుకోను అని అంటున్నారు సార్ విచిత్రం ఏంటంటే వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు నేను ఆ నిర్ణయం తీసుకొని నిజంగా హ్యాపీగా ఉండగలనా అని చెప్పి నా మీద నాకే అనుమానం కలుగుతున్నది అని అన్నాడండి ఒక కుర్రాడు ఇంకో కుర్రాడు అయితే నిజంగా అతన్ని నేను చాలా మెచ్చుకున్నాను కూడా అనండి నాకు చాలా ముచ్చటేసింది ఆ కుర్రాడిని చూస్తే అతను ఏమంటున్నాడఅంటే నేను పెళ్లి [గొంతు సవరించుకోవడం] చేసుకునే నా కుటుంబం నుంచి గనక బయటికి వెళ్ళిపోతే
(04:11) నా చెల్లి పెళ్లి కావడం చాలా కష్టం సార్ అలాగే నా తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు ఆ ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు నిజంగా ధైర్యం చాలట్లేదండి అని అన్నాడండి ఒక కుర్రాడు సో ఇంకా చాలా ఉన్నాయి లేండి సో అక్కడక్కడ వినిపిస్తున్న యువకుల యొక్క అంతరంగ ఘోష అండి ఇది ఒక విధంగా చెప్పాలంటే గోస కూడా అసలు ఇటువంటి యువకులని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయాలని నిర్ణయం యించుకున్నాను మరి వాళ్ళకి ఏం చెప్పాలి అన్నది కూడా నేను ఆలోచించి ఒక ఏదన్న నిర్ణయానికి కూడా వచ్చానండి అంటే సూటిగా చెప్పాలి అంటే నేను ఒక ఆల్టర్నేటివ్ ని సజెస్ట్ చేయాలనుకుంటున్నానుండి
(04:53) సింపుల్ గా చెప్పాలంటే ఈ వ్యక్తిగత జీవితానికి ఈ సామాజిక అర్థాన్ని ఎలా ఇవ్వాలి అంటే మీరు అనుకోవచ్చు ఇది విచిత్రమైన ఆలోచన అని నిజానికి అంటే సమాజంలో పెరుగుతున్న ఒంటరితనము వివాహ భయము ఆర్థిక అస్థిరత వీటన్నిటికీ అతీతంగా ఒక బాధ్యతాయుతమైన మానవత దృక్పదాన్ని యువకులు ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అంతేనండి అంటే నేను ఏమంటానంటే వ్యక్తిగా మీరు స్వేచ్ఛను అనుభవించండి అదే సమయంలో సామాజిక బాధ్యతను కూడాను గుర్తుంచుకోండి
(05:37) ఇంతకంటే ముఖ్యంగా విలువలు గల సామాజిక వారసత్వం కోసం ప్రయత్నించండి. అదేంటి సార్ వారసత్వం అంటారు ఏంటి సార్ అని మీరు అనొచ్చు [నవ్వు] నేరుగా చెప్పండి కరణ గారు అని చెప్పొచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు కొంచెం మెల్లగా చెబితేనే బాగుంటుందండి. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మీరు తప్పైతే క్షమించాలి. పెళ్లి చేసుకోవద్దు కానీ అనాధలు ఎంతో మంది ఉన్న ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అట్లాగే అతి చిన్న వయసులోనే లైంగిక అత్యాచారులకు కూడా బలైతున్న ఆడపిల్లలు ఉన్న ఈ వ్యవస్థలో పరోక్షంగా ఒక అనాధని ఎన్నుకొని ఆ అనాధకి జీవితాన్ని ఎందుకు ఇవ్వకూడదు
(06:22) ఇవ్వమనే చెప్తున్నానండి నేను ఇవ్వమనే చెప్తున్నాను ఎందుకంటే ఇటువంటి అనాధలను చేరదీసి వాళ్ళ ఆలన పాలన చూస్తూ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తూ వృత్తి విద్యలు నేర్పిస్తూ ఒక స్థాయికి పెట్టుకొచ్చి వాళ్ళకి జీవనోపాధిని కలిగిస్తున్న జాతీయ అంతర్జాతీయ అలాగే ఎన్నో ఎన్జీఓ సంస్థలు కూడా ఉన్నాయండి మొన్న నిన్న నట్లో వెతికితే చాలా ఆశ్చర్యం వేసింది.
(06:49) పెద్ద పెద్ద మల్టీనేషన్ కంపెనీస్ ఇంక్లూడింగ్ టాటా వాళ్ళు కూడా ఇటువంటి వ్యవస్థను పెట్టి అనాధల్ని చదివిస్తూ వాళ్ళక ఒక జీవితాన్ని ఏర్పరుస్తున్నారండి కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అయితే వాళ్ళే పెంచి వాళ్ళే పెద్దది చేసి వాళ్ళే ఉద్యోగాలు ఇస్తున్నారు కూడా మా పిల్లలకి నేనేమంటానంటే ఇలా పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్న యువతకి నేను ఒకటే చెప్తున్నాను అటువంటి వ్యవస్థలని మీరు విజిట్ చేయండి.
(07:15) అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి అవసరమైతే మీ బర్త్ డే ఆ వ్యవస్థలో జరుపుకోండి అప్పుడు ఆ వ్యవస్థ ఏమిటో మీకు తెలుస్తుంది అక్కడ పిల్లలు ఎవరో మీకు తెలుస్తారు. అలా రెండేళ్ల పాటు మీరు వెళ్ళగలిగితే అటువంటి వ్యవస్థలకు మీరు బాగా కనెక్ట్ అయితారండి అప్పుడు మీరు ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఒక బిడ్డని ఎంచుకోండి. మీరేమి దగ్గరికి తీసుకొని మీరేమి ఆ బిడ్డ కాలన పాలన చూడక్కర్లేదు అది వ్యవస్థలు చూసుకుంటాయి సంవత్సరానికి ఎంతనో లేకపోతే నెలక ఎంతనో ఏదో ఉంటుంది.
(07:47) అది చాలా చిన్న ఏమో ఉంటాయి 14000లో 15000లో 20,000 అయితే మహా ఎక్కువ అండి అట్లా మీరు పరోక్షంగా సహాయం చేయండి. కానీ ఒకటే ఒక మాట చెప్తున్నానండి మీ బిడ్డే అన్న భావనని బలపరుచుకోండి. ఆలోచించండి నేనేదో ఆవేశంగా చెప్పట్లేదండి బాగా ఆలోచించే నేను మాట్లాడుతున్నాను. సో ఇదండి నా ఆలోచన. ఇది అమ్మాయిలకు కూడా అంటే వివాహం అంటే భయపడే అమ్మాయిలకు కూడాను వర్తిస్తుంది.
(08:19) ఈ ఆలోచన నాకు ఎందుకు కలిగింది అన్న దానికి కారణాలను కూడాను నేను ఇంకొకసారి సమప్ చేస్తానండి. ఆర్థిక ఒత్తిడి విడాకుల భయం సంబంధాల మీద నమ్మకాలు దిగిపోవడం వ్యక్తిగత స్వేచ్ఛని కోల్పోతామఅనే భావన ఇతరుల యొక్క విఫలమైన వివాహాలను చూసి కలిగిన వ్యాకులత వెరసి అసలు నేను వివాహానికి అర్హుడునా అన్న అంతర్మదనం చాలా మంది యువకుల్లో ఉందండి.
(08:53) సో ఇన్ని కారణాల వల్ల చాలామంది పెళ్లిని వాయిదా వేస్తున్నారు ఆ మాటక వస్తే పూర్తిగా తిరస్కరించేస్తున్నారు లేదా మనందరికీ తెలుసు కదా ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్స్ ని వాళ్ళు ఎన్నుకుంటున్నారండి నేను ఒకటే చెప్తున్నానండి ఇటువంటి వాళ్ళకి నేను ఒకటే మాట సూటిగా చెప్తున్నాను. మీరు నిజంగా పెళ్లి చేసుకోలేనంత పిరికివాళ్ళా మీరు పిరికివాళ్ళు కాదు పైపెచ్చు ఆదర్శ భావాలు ఉన్నవాళ్ళు సో ఒక జీవితానికి ఆధారం ఇవ్వండి ఆధారం ఇవ్వండి కనీసం అలాగేనైనా సంతృప్తిని పొందండి.
(09:32) అంటే యస్ సింపుల్ యస్ దట్ అండి దట్స్ ఆల్ అంటే ఒక సామాజిక దిశా నిర్దేశంలో మీరు భాగస్వాములు కాండి సాధారణంగా ఏం జరుగుతుందంటే నా పిల్లలు నా కుటుంబం నా వారసత్వం అనే పురాతన భావం ఉంది కదా మనందరికీ తెలుసు కదా ఇప్పుడు ఈ భావం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అదండి నేను చెప్పేది కాబట్టి రక్త సంబంధం లేకపోయినా ఒక జీవితాన్ని నిలబెట్టండి.
(10:01) ఇక్కడ ఒక మంచి వాక్యం గుర్తుకొస్తుందండి చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా ప్రయత్నించి ఒక చిన్న దీపాన్నైనా వెలిగించండి రేపు అది అఖండ దీపమై మానవాళ్ళకి వెలుగునివ్వచ్చుని ఈ భావనే వసుదైక కుటుంబకం ఈ భావనే పరోపకారార్థ మిధన్ శరీరం భగవంతుడు మనకు శరీరాన్ని ఇచ్చింది ఇతరులకు సహాయం చేయమని అంటే నేను ఏమన్నానఅంటే మీ వండర్ద దినాన్ని మీరు సేవగా మార్చుకోండి.
(10:33) తద్వారా మీ జీవితంలో ఉత్సాహాన్ని నింపుకోండి. దయచేసి పిరికివాళ్ళుగా మిగిలిపోకండి. మీరు అనుకోవచ్చు నేను ఇలాగ డబ్బులు ఇస్తున్నాను ఒక అమ్మాయికో లేకపోతే ఒక అబ్బాయికో ఎంత గొప్ప దానం చేస్తున్నానేమో చేస్తున్నాను కదా మీరు అనుకోవచ్చుండి తప్పండి అది దానం కానే కాదు ఒక సామాజిక బాధ్యతను మీరు భుజాలక ఎత్తుకుంటున్నారు ఆ మాటక వస్తే ధార్మికతని మీరు చూపెడుతున్నారు.
(11:04) గాడి తప్పిన జీవితాన్ని మీరు ఒక ట్రాక్ మీద పెడుతున్నారండి ఇంతకు మించిన పుణ్యకార్యం లేదండి. ఇది నూటికి నూరు పళ్ళు పెంపకంతో సమానం చివరిగా ఒక సున్నితమైన విషయం అండి అదేంటంటే చాలామంది అనుకుంటారు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి భయపడి కొంతమంది పెళ్లికి దూరంగా వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు నేను చెప్తున్నది పెళ్లికి ప్రత్యయమనాయం కాదండోయ్ ఇట్స్ నాట్ అ ఆల్టర్నేటివ్ ఎందుకంటే వివాహం అనేది ఒక భావోద్వేగ సామాజిక ఆధ్యాత్మిక వ్యవస్థ మళ్ళీ చెప్తున్నానండి వివాహం అనేది ఒక భావోద్వేగ సామాజిక ఆధ్యాత్మిక వ్యవస్థ కానీ ఒక అనాధకి సేవ చేయడం చూసారా బాధ్యతతో
(11:50) అది ఒక గొప్ప సేవా వ్యవస్థలో ఒక భాగంండి అంతే ఎందుకంటే ఇటువంటి సేవ చేసే వ్యవస్థలు ఉన్నాయి కదా మీరు కూడా భాగస్వాములు కాండిని అందుకే చెప్పాను నేను అంటే ఆధ్యాత్మికత ద్వారానే కాదండోయ్ సేవ ద్వారా కూడాను మనం మన జీవితాన్ని పునీతం చేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు చాలా వీడియోలో చెప్తున్న కొటేషన్ ఏంటంటే ద వరల్డ్స్ మోస్ట్ అర్జెంట్ క్వశన్ ఈస్ వాట్ ఆర్ యు డూయింగ్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ది గాడ్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ది హ్యూమానిటీ మీరు ఏం చేస్తున్నారు కొంచెం స్పిరిచువల్ యాంగిల్ దగ్గరికి వద్దాంండి ప్రతి ఒక్కరికి కూడా జీవితం ఒకే విధంగా ఉండవలసిన అవసరం లేదండి
(12:36) మీ జీవితం ఇలాగే ఎందుకు ఉండాలి అన్న ప్రశ్న గనక వేసుకుంటే ఇలా ఉండాలి కాబట్టే మీకు ఆలోచనలు వస్తున్నాయి అన్నదే సమాధానం అండి దీనికి మనం కట్టుబడి ఉండాలండి చాలా మందికి రాని ఆలోచన మీకు వస్తున్నది కదా లేదు ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా దానికి మీరు కనెక్ట్ కావచ్చు కదా ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ కూడా నువ్వు విశ్వనుంచి నా ద్వారా వస్తున్న మాటలేనండి.
(13:06) కాకపోతే ఏంటంటే కనెక్ట్ కావడానికి టైం పడుతుంది కదా అసిమిలేట్ చేసుకోవడానికి టైం పడుతుంది. టైం తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఒక సంవత్సరం తీసుకోండి ఇలా గనుక గడిపేసి ఒక బిడ్డని అనాధ బిడ్డని ఆదుకుంటే నాకు ఇంతకంటే ఏం కావాలి అన్న ఒక నిర్ణయానికి రాండి ఇబ్బంది ఏం లేదండి అంటే ఒకటండి మీరు సహాయం చేస్తున్నారు అన్నా సేవ చేస్తున్నా అన్నా కూడాను ఒకళ్ళని రేపు పొద్దున ఆధారపడేలాగా చేయడం కాదండి వారిని స్వతంత్రంగా నిలబెట్టే ప్రయత్నం చేయడం ఇంతకుమించిన గొప్ప పుణ్యకార్యం లేదండి ఎందుకు చెప్తున్నాను అంటే మన జీవితం కేవలం మన కోసం కాదు కదండి కొద్దో గొప్పో ఉద్యోగం ద్వారా మనం నాలుగు
(13:51) రాళ్ళు సంపాదించుకుంటున్నాం అలా కలిగిన మనం నలిగిన వాళ్ళని ఎందుకు ఆకోకూడదు ఆలోచించండి. పెళ్లి చేసుకోవడం తప్పు కాదండి చేసుకోకపోవడం తప్పు కాదండి. ఎవరికీ ఉపయోగపడకుండా జీవించడం మటకు ఎట్టి పరిస్థితిలో కూడాను సమర్ధనీయం కాదు. నేను మళ్ళీ చెప్తానండి పెళ్లి చేసుకోకపోవడం తప్పు కాదు కానీ ఎవరికీ ఉపయోగపడకుండా జీవించడం మటుకు సమర్ధనీయం కాదు.
(14:17) ప్రతి మనిషి తండ్రి కావాల్సిన అవసరం లేదండి కానీ ఎవరో ఒకరి భవిష్యత్తుకి మటుకు మనం కారణం కావాలి. గుర్తుపెట్టుకోండి మనందరం చూస్తూనే ఉన్నాం కదా రక్త సంబంధాలు ఎలా కలుషితం అయిపోతున్నాయో కాబట్టి రక్త సంబంధం కంటే బాధ్యతతో నిలిచే సంబంధమే చాలా గొప్పదండి చాలా గొప్పది ఒక పిల్ల లేదా పిల్లవాడి జీవితాన్ని నిర్మించడం అంటే ఒక కుటుంబాన్ని నిర్మించడం అండి ఒక కుటుంబాన్ని నిర్మించడం అయితే పెళ్లి చేసుకోకుండా చాలామంది సమాజాన్నే కాదు దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడాను అద్భుతంగా ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారండి నేను కొంతమంది పేర్లు చెప్తాను.
(15:02) ఆదిశంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగ స్వామి వివేకానంద రమణ మహర్షి వినోబబాబా బావే ఏపిజే అబ్దుల్ కలాము అలాగే రతన్ టాట ఈ అర్థశాస్త్రకర్త కౌటిల్యుడు అంటే చాణిక్యుడు సిస్టర్ నివేదిత ఆనందమయి మా మనందరం చూస్తూనే ఉన్నాం కదా అట్లాగే ఫారనర్స్ ని గనుక చూసుకుంటే సర్ ఐసాక్ న్యూటన్ లియోనార్డడ్ డామిన్సీ ఫ్లోరెన్స్ నైటింగే మదర్ తెెరసా వీళ్ళందరూ జీవితాల్ని ఒక అద్భుతమైన ప్రయోజనానికి పణంగా పెట్టారండి సో చివరిగా ఒకటే మాట అండి నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా అన్నది కాదండి ఎంత చైతన్యంతో ధర్మంతో పరమార్థంతో జీవించావు అన్నదే ముఖ్యంఅండి
(15:51) అంటే నువ్వు వంశాన్ని కొనసాగించకపోయినా పర్వాలేదు జీవితపు చరమాంకల్లో నీ పెదివల మీద ఓ గొప్ప విలువకి నిలబడ్డాను కదా అన్న సంతృప్తి కలగాలి సంతృప్తి కలగాలి ఈ విషయమే ఆలోచించండి అంతేగన పెళ్లికి భయపడి ఒంటరిగా నిరాశ నిస్పృహలో కూరుకుపోవద్దండి ఇంతకుమించిన ఆల్టర్నేటివ్ లేదు నాకు ఎందుకో సీరియస్ గా ఆలోచిస్తూఉంటే దీని మీద వీడియో ఎందుకు చేయకూడదు అనిపించిందండి అందుకని నేను ఈ వీడియో చేశనండి.
(16:25) చూడండి చాలా మందికి పని ఉంటాయి ఇది వైరల్ అయితే మటుకు కొంతమంది ధైర్యంగా నిలబడి ఆలోచిస్తారండి సమాజానికి కూడా ఉపయోగపడతారు ఎక్కడో ఒక చిన్న బిడ్డ అనాధ బిడ్డ బాగుపడే అవకాశం కూడా ఉంటుందండి ఇంతేనండి వీడియోలో ఉన్న సంగతి చాలా మంది నా ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ ఇంటి పేరు పోరూర అండి YouTube లోకి వెళ్లి ఎంఆర్టహ్ఐ అని టైప్ చేసిక స్పేస్ ఇచ్చి కఐఆర్ఏ అని టైప్ చేస్తే పిఓఆర్ యుఆర్ అని చెప్పేసి నా YouTube ఛానల్ ఓపెన్ అవుతుందండి నాది ఒకటే ఒక రిక్వెస్ట్ అండి చాలా మందికి వైరల్ చేయండి సబ్స్క్రిప్షన్ అంటారా మీ
(17:01) ఇష్టం కాకపోతే మంచి మెసేజ్ని కామెంట్ బాక్స్ లో పెట్టండి. మీ మెసేజ్లే నాకు తల బలాన్ని ఇచ్చేయండి. ఉంటానండి నమస్కారం.

No comments:

Post a Comment