*_ఏది సుఖం? ఎంతవరకు వాస్తవం?_*
*_చాలినంత డబ్బు, భూముల్లాంటి స్థిరాస్తులు ఉన్నట్లయితే సుఖజీవనం గడపవచ్చని, సంతోషంగా ఉండవచ్చని అనుకుంటాం._*
*_నిరుపేదల బతుకులు దుఃఖభరితాలని అనుకోవడమూ సహజమే. కానీ ఈ అభిప్రాయాలు ఎంతవరకు వాస్తవం?_*
*_ప్రముఖ తత్వవేత్త దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి 'నేను చాలా కష్టాల్లో ఉన్నాను. సుఖజీవనాన్నిచ్చే మంత్రోపదేశం చేయండి' అని అడిగాడు._*
*_తత్వవేత్త నవ్వి అలాంటి మంత్రమేదీ తన దగ్గర లేదన్నాడు. అప్పుడా వ్యక్తి- 'నన్ను నిరాశపరచకండి. చాలా దూరంనుంచి వచ్చాను' అని ప్రాధేయపడ్డాడు._*
*_ఇతడికి మాటల్లో చెబితే అర్థమయ్యేలా లేదనుకున్న తత్వవేత్త 'మంత్రం చెబుతాను గానీ, సుఖంగా జీవిస్తున్నవారు ధరించిన పట్టువస్త్రాన్ని ఒకదాన్ని తీసుకురా' అని చెప్పాడు._*
*_ఒక చెట్టు కింద కూర్చున్న ఫకీరును చూసి మహాత్మా! మీరెంతో సుఖంగా కనిపిస్తున్నారు అన్నాడు. ఫకీరు నవ్వుతూ_* *_నిజమే, దొరికిందేదో తిని, పరమాత్ముని భజన చేస్తూ బతకడాన్ని మించిన సుఖమేముంది' అన్నాడు. అయితే మీ పట్టుపంచె ఒకటి ఇవ్వండి' అడిగాడా వ్యక్తి._*
*_‘నా దగ్గర ఈ అంగవస్త్రం తప్ప ఇంకేంలేదు. సంతోషంగా జీవించడానికి సంపదలేమీ అక్కర్లేదనే రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనే తత్వవేత్త నిన్ను పట్టువస్త్రం తెమ్మన్నాడు' చెప్పాడు ఫకీరు._*
*_కోరికలకూ, ఆశలకూ లొంగక ఉన్నంతలో తృప్తిగా జీవించడమే సుఖజీవన రహస్యం. ఏదైనా కోరిక అంటూ పుడితే, దాన్ని తీర్చుకోవడానికి మనిషి పరుగులు తీస్తాడు._*
*_లేనిదానికి అర్రులు చాస్తూ ఉన్న వాటిని ఆస్వాదించడం మర్చిపోతాడు. సుఖంగా, సంతోషంగా జీవించడానికి కావాల్సింది సంపద కాదు, తృప్తి... అని గ్రహించడమే వివేకం._*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🦚🌹 🪭🙇🪭 🌹🦚🌹
No comments:
Post a Comment