Friday, June 26, 2026

ఎవ్వరూ మంచివాళ్లు కారు ఇదే పచ్చి నిజం | This Is The Dark Truth Of Human Nature | Satyagrahi

ఎవ్వరూ మంచివాళ్లు కారు ఇదే పచ్చి నిజం | This Is The Dark Truth Of Human Nature | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jkj-bLd6MFM



Transcript:
(00:02) [సంగీతం] ఈ ప్రపంచంలో ఎవ్వరూ మంచివాళ్ళు లేరు అలాగే ఎవరూ చెడ్డవాళ్ళు కూడా లేరు. ఇదంతా ఒక భ్రమ. మనం నమ్ముతున్న అతి పెద్ద భ్రమ. వినడానికి కొంచెం షాకింగ్ ఉందా కానీ ఇదే నిజం. నిజం ఎప్పుడూ ఇలాగే పచ్చిగా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి ఒకరిని మంచివాడని ఇంకొకరిని చెడ్డవాడని చెప్పేసి వాళ్ళ మీద ముద్రలు వేస్తూనే ఉన్నాం.
(00:27) కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక అద్భుతమైన మాట చెప్పారు మనిషి అనేవాడు ఒక తయారు కాని మట్టి పాత్ర లాంటివాడు అని పరిస్థితులు సమయం ఈ రెండు శక్తులు ఆ పాత్రని ఎలా పడితే అలా మారుస్తుంటాయి అని ఇక్కడ ఎవరి క్యారెక్టర్ పర్ఫెక్ట్ కాదు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు ఎదురయ్యే సమయాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి మాత్రమే నడుచుకుంటారు.
(00:51) మీరు ఒకరిని చాలా మంచివాడని చెప్పేసి నెత్తిని పెట్టుకుంటారు. కట్ చేస్తే రేపు పొద్దున్న వాళ్లే మీకు వెండిపోడు పొడుస్తారు. [సంగీతం] ఎందుకు వాళ్ళు మారిపోయారా లేదు వాళ్ళ సమయం మారింది వాళ్ళ అవసరం మారింది అంతే తప్ప అక్కడ మంచితనం చెడ్డతనం ఏమీ లేదు మనం మనుషులని అర్థం చేసుకోవడంలోనే అసలైన సమస్య ఉంది. మనం ఒకరిని మనకి నచ్చిన రంగుల్లో చూస్తాం.
(01:13) ఆ రంగు వెలిసిపోగానే వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటాం. ఇది ఎదుటివారి తప్పు కాదు మీ అంచనాల తప్పు. మీకు తెలుసో లేదో మనం చాలాసార్లు మనల్ని మనం కూడా తప్పుగా అర్థం చేసుకుంటాం. ఈరోజు మీరు ఒక నీతి కథ చెప్పొచ్చు లంచం తీసుకోవడం పాపం అని చెప్పేసి లెక్చర్ లో దంచవచ్చు కానీ రేపు పొద్దున్న మీ ఇంట్లో వాళ్ళకు ఒంట్లు బాగోలేనప్పుడు చేతిలో రూపాయి లేనప్పుడు ఎవడో వచ్చి లక్ష రూపాయలు ఆఫర్ చేస్తే మీరు కాదంటారా తీసుకుంటారు కదా కచ్చితంగా తీసుకుంటారు.
(01:40) అప్పుడు మీరు చెడ్డవాళ్ళు అయిపోయినట్లా కాదు మీ సమయం మిమ్మల్ని అలా ఆడించింది. నిజం ఏంటంటే ఇక్కడ ఎవరి నీతి అయినా వాళ్ళ కడుపు నిండుగా ఉన్నంతవరకే బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన జీవితంలో ఎంతోమంది వ్యాపారస్తులని రాజకీయ నాయకులని చూశారు. ఆయన గమనించిన ఒక పచ్చి నిజం ఏంటంటే మనుషుల సూత్రాల కంటే ప్రయోజనాలకి ఎక్కువ విలువనిస్తారు. మీతో ఒకడు చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు అంటే వాడు మంచోడు కాదు.
(02:07) అక్కడ వాడికి ఏదో ఒక లాభం ఉంది అని అర్థం. ఒకడు మీతో గొడవ పడుతున్నాడు అంటే వాడు చెడ్డవాడు కాదు. అక్కడ వాడి అహం దెబ్బ తింది లేదా వాడి సమయం బాగోలేదు అని మనం సింపుల్ లాజిక్ వదిలేసి మనుషులకి సర్టిఫికేట్లు ఇచ్చేస్తుంటాం. ఆయన దేవుడండి కానీ ఈయన రాక్షసుడండి అంటూ ఓవరాక్షన్ చేస్తాం. ఈ ప్రపంచంలో దేవుళ్ళు లేరు రాక్షసులు లేరు. ఉన్నదల్లా కేవలం తమని తాము కాపాడుకోవాలని చూసే స్వార్థపు జీవులు మాత్రమే.
(02:33) ఈ భ్రమలోనే యువత చాలా మంది మోసపోతున్నారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే లేదా ఒక ఫ్రెండ్ మోసం చేయగానే ప్రపంచం పాడైపోయింది అందరూ మోసగాలే అంటూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అసలు సమస్య ప్రపంచంలో లేదు మీ మైండ్ సెట్ లోనే ఉంది. ఎందుకంటే మీరు అవతలి వాడి వల్ల ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో మీ వల్ల ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
(02:56) ఆ విషయం మీకు తెలియదు. ఎందుకు మనం మనుషులను మంచి చెడు అని చెప్పేసి విభజిస్తాం ఎందుకంటే అది చాలా సులభం కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక ముద్ర వేసేయడం పక్కన పడేయడం కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు. మనిషికి అహంకారం ఉండొచ్చు కానీ అహంకారం కూడా ఒక సందర్భం కోసం పని చేస్తుంది అని మనం ఏమనుకుంటాం నేను చాలా మంచివాడిని నాకు ఎవరికీ హాని చేయాలని లేదు.
(03:22) ఇలా మీ గురించి మీరు అనుకుంటారు ఇంతవరకు బానే ఉంది కానీ మీ సమయం మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు ఏం చేస్తారు పక్కవాడిని తొక్కేసి [సంగీతం] అయినా మీరు పైకి రావాలని ప్రయత్నిస్తారు. అప్పుడు మీ మంచితనం ఏమైంది మీలోని స్వార్థం బయటికి వచ్చింది. ఆ టైంలో అవతలి వాడి సమయం బాగుందనుకోండి వాడు మిమ్మల్ని చూసి జాలిపడతాడు సహాయం చేస్తాడు. అప్పుడు వాడు మంచివాడు అనిపిస్తాడు.
(03:44) నిజం ఏంటంటే మంచితనం అనేది ఒక ఖరీద అనే వస్తువు. అందరూ దాన్ని భరించలేరు. మీ జీవితంలో గొడవలు ఎందుకు వస్తాయి ఒకరి అంచనాలు ఇంకొకరి దగ్గర తలకిందు లేనప్పుడు మాత్రమే వస్తాయి. మీరు ఒకరి దగ్గర నుంచి ఏదో ఆశించారు వాడు అది ఇవ్వలేదు అంతే వాడి మీద మీకు కోపం వచ్చేస్తుంది. వాడు చెడ్డవాడని చెప్పేసి ముద్ర వేసేస్తారు.
(04:04) కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాడికి మీరు అనుకున్నది ఇచ్చేంత బలం ఉందా? లేదా వాడి పరిస్థితులు వాడిని అడ్డుకుంటున్నాయా? మనం ఎదుటి వాడి షూస్ వేసుకుని ఎప్పుడు నడవం కదా కేవలం మన కాళ్ళతో వాడిని జడ్జ్ చేస్తాం. ఇది మీరు చేసే అతి పెద్ద తప్పు ఫ్రాంక్లిన్ గారు జీవితంలో గెలవటం అంటే తనని తాను సరిదిద్దుకున్నప్పుడే అంటారు. ఎదుటి వారిని మార్చాలని చూసినప్పుడు కాదు అంటారు.
(04:28) కానీ మీరు ఏం చేస్తున్నారు ఎదుటివాడు ఎందుకు అలా అన్నాడో అర్థం చేసుకోవడానికి బదులుగా వాడిని ఎలా మార్చాల అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అసలు వాడిని మార్చాల్సిన అవసరం మీకుఎందుకు ఎందుకంటే వాడు మారితే మీ లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మీ స్వార్థం ఉంది. మరి మీ స్వార్థం ఉంటే మీరు మంచి వాళ్ళా చెప్పండి ఒక్క క్షణం నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించండి.
(04:50) మీకు తెలుసో లేదో మనుషులను నడిపించేది వాళ్ళ నీతి కాదు వాళ్ళ మెదడులో ఉండే కెమికల్స్ వాళ్ళ జీన్స్ ఇంకా వాళ్లకున్న ఆకలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక అద్భుతమైన పరిశీలన చేశారు. ఆయన ఏమన్నాడంటే ఖాళీ సంచి నిటారుగా నిలబడలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు చేతిలో పైసా లేనప్పుడు మనిషి తన నైతికతని కోల్పోతాడు.
(05:14) నిటారుగా నిలబడలేడు వంగిపోతాడు. [సంగీతం] సమయం సరిగ్గా లేనప్పుడు ఆకలి, అవసరం మనిషి చేత ఎలాంటి పనులనైనా చేస్తాయి. మనం సమాజంలో చూసే నేరాలు, ద్రోహాలు, వెన్నిపోట్లు ఇవన్నీ కేవలం ఆయా వ్యక్తుల అవసరాలను బట్టి పుట్టినవే. ఒక వ్యక్తి క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే వాడు పుట్టుకతోనే రాక్షసుడు కాదు. వాడి అనుభవాలు వాడికి ఎదురైన దారుణమైన సంఘటనలు వాడిని అలా మార్చాయి.
(05:40) మనం కేవలం వాడు చేసిన తప్పును చూస్తాం కానీ ఆ తప్పు వెనుకున్న కాలాన్ని చూడలేం. ఇలా ప్రతి ఒక్కరు తమ సొంత సమయానికి తమ చుట్టూ ఉన్న పరిస్థితులకి దాసోహం అవుతారు. కానీ మనం ఏం ఆశిస్తాం మనం అందరినీ పర్ఫెక్ట్ గా ఉండమంటాం. సినిమాల్లో హీరోలాగా పుస్తకాల్లో క్యారెక్టర్ లాగా ప్రవర్తించమంటాం. నిజ జీవితంలో అలా ఉండటం ఇంపాజబుల్.
(06:03) ఎందుకంటే లైఫ్ అనేది ఒక లాబరేటరీ. ఇక్కడ ప్రతి ఒక్కడు ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. తప్పులు [సంగీతం] చేస్తూనే ఉంటాడు. ఆ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలి తప్ప ఒకరినొకరు నిందించుకుంటూ కూర్చుంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలాగా ఈ మనుషుల డ్రామాలని ఈ కాలం ఆటలని ఎలా తట్టుకోవాలి దీనికి ఒకటే మార్గం మనుషుల మీద అతిగా ఆధారపడటం మానేయాలి.
(06:26) ఎవరైతే వేరే వాళ్ళ ఆశల మీద బ్రతుకుతారో వాళ్ళు ఆకలితో చావడానికి సిద్ధంగా ఉండాలి. మనం మన ఆనందాన్ని మన భవిష్యత్తుని ఎదుటి వాడి చేతుల్లో పెట్టి వాడు మనల్ని బాగా చూసుకోవాలని కోరుకుంటాం. వాడి సమయం బాగున్నంత సేపు వాడు మిమ్మల్ని నెత్తిని పెట్టుకుంటాడు. అంతవరకు ఓకే కానీ వాడికి కష్టం రాగానే వాడు ముందు తనని తాను కాపాడుకోవడానికి చూస్తాడు.
(06:50) అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాడు. దాన్ని మీరు మోసం అనుకుంటారు. కానీ అది మోసం కాదు. అది కేవలం హ్యూమన్ సర్వైవల్ ఇన్స్టింట్ తనని తాను బతికించుకునే ప్రయత్నం అది. దీన్ని అధిగమించాలంటే మొదట మీ ఎమోషనల్ అటాచ్మెంట్స్ కి ఒక బ్రేక్ వేయాలి. ఎదుటివాడు ఎప్పుడూ ఒకేలా ఉండాలనే భ్రమ నుంచి బయటకి రావాలి. నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.
(07:13) ఈరోజు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి రేపు పొద్దున మిమ్మల్ని ముఖం చూడటానికి కూడా ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే ఇది మనందరం మన జీవితంలో చూసే ఉంటాం చూస్తున్నాం కూడా అందులోనూ దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. ఎవరైనా మారినప్పుడు ఏడవడం కాదు ఓకే వాడి సమయం వాడిని అలా నడిపిస్తుంది అని లైట్ తీసుకోవడం నేర్చుకోవాలి.
(07:34) అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీనే మీ బలం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన జీవితంలో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ఎంతో మందితో కలిసి పని చేశారు. ఆయన గమనించింది ఏంటంటే మనుషులని వాళ్ళ మాటలను బట్టి కాకుండా వాళ్ళ ప్రయోజనాలను బట్టి అంచనా వేయాలి. ఒక వ్యక్తి మీతో ఎందుకు ఉన్నాడు? వాడికి మీ వల్ల ఏం ఉపయోగం ఉంది? ఇది క్రూరంగా చాలా సెల్ఫిష్ గా అనిపించొచ్చు కానీ ఇదే రియాలిటీ ఈ రియాలిటీని మీరు ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత తక్కువగా మోసపోతారు.
(08:03) మనుషుల బిహేవియర్ ని పర్సనల్ గా తీసుకోవడం మానేయండి. వాళ్ళు మీతో బాగా ఉండి ఎంజాయ్ చేయండి. దూరం పెడితే మీ పని మీరు చూసుకోండి. ఎవరి కోసం మీ జీవితాన్ని ఆపకండి. మీకు తెలుసో లేదో చాలా మందికి తమ ఒంటరితనాన్ని ఎలా భరించాలో తెలియదు. అందుకే దొరికిన ప్రతి ఒక్కరిని నమ్మేస్తుంటారు. ప్రతి ఒక్కరిని తమ జీవితంలోకి రాణిస్తూఉంటారు. ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని చెప్తూ ఉంటారు.
(08:27) ఆ తర్వాత వాళ్ళు నచ్చినట్లు ప్రవర్తించకపోతే కుంగిపోతుంటారు. అనవసరంగా వీడికి నా జీవితంలో చోటఇచ్చాను. అనవసరంగా వీడికి నా విషయాలన్నీ చెప్పుకున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. మీరు వేరే వాళ్ళతో స్నేహం చేసేటప్పుడు చాలా నెమ్మదిగా ముందడుగు వేయండి. కానీ ఒక్కసారి స్నేహం కుదిరాక దాన్ని నిలబెట్టుకోవడంలో స్థిరంగా ఉండండి.
(08:50) దీని అర్థం ఏంటో తెలుసా మనుషులని మీ జీవితంలోనికి రానిచ్చే [సంగీతం] ముందు వాళ్ళని సరిగ్గా గమనించండి. వాళ్ళ అలవాట్లు ఏంటి వాళ్ళ ఆలోచన విధానం ఎలాంటిది వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు ఇవన్నీ గమనించకుండా కేవలం రెండు రోజులు ముచ్చటగా మాట్లాడగానే మీరు మంత్ర ముగ్దులైపోయి మీ సీక్రెట్స్ అన్ని వాళ్ళకి చెప్పేయకండి. నిజం ఏంటంటే ఈరోజు మీతో నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కడు మీ మంచిని కోరుకునే వాళ్ళు కాకపోవచ్చు.
(09:17) వాడు కేవలం తన సమయాన్ని గడపడానికి మిమ్మల్ని వాడుకొని కూడా ఉండవచ్చు. అందుకే మనుషులతో ఒక హెల్తీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఎవరికీ మీ జీవితాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే హక్కు ఇవ్వకండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ తప్పులని ఒప్పుకోవడం నేర్చుకోండి. చాలా మంది తమ సమయం బాలేనప్పుడు పక్కవాడి మీద ఆ నెపాన్ని తోసేస్తుంటారు. వాడు నన్ను మోసం చేశాడు.
(09:39) అందుకే నా లైఫ్ నాశనం అయిపోయింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. కానీ నిజానికి వాడిని నమ్మింది ఎవరు మీరే కదా ఆ నమ్మకం వెనుక మీ అజాగ్రత్త కూడా ఉంది కదా మీ అత్యాస కూడా ఉంది కదా దాన్ని ఒప్పుకోండి ఫ్రాంక్లిన్ ఎప్పుడో ఒక మాట అనేవారు తప్పు చేయడం మానవ సహజం కానీ దాన్ని సమర్ధించుకోవడం మూర్ఖత్వం. మిమ్మల్ని ఎవరైనా వాడుకున్నారంటే మీరు వాళ్ళకి వాడుకునే అవకాశం ఇచ్చారని అర్థం.
(10:02) ఆ బ్లైండ్ స్పాట్ ని గుర్తించి నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకోవడం అసలైన మెచూరిటీ. ఇదంతా విన్నాక మీకు ఒక విషయం అర్థం కావాలి మనుషులు ఎవరు పర్ఫెక్ట్ కాదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరి ఇలాంటి ప్రపంచంలో మన జీవితాన్ని మనం ఎలా బెటర్ చేసుకోవాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక సింపుల్ ఫార్ములా వాడారు.
(10:26) ఆయన ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తనని తాను ఒక ప్రశ్న అడిగేవారు. ఈరోజు నేను ఏ మంచి పని చేయగలను అలాగే రాత్రి పడుకునే ముందు ఈరోజు నేను ఏ మంచి పని చేశాను అని చెప్పేసి లెక్కలు వేసుకునేవాళ్ళు. ఇక్కడ మంచి పని అంటే సమాజ సేవ చేయడం కాదు మీ జీవితాన్ని మీ వ్యక్తిత్వాన్ని ఒక మెట్టు పైకి ఎక్కించే పని ఒకే ఒక మెట్టు మనం మన టైం ని ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో తెలుసా పక్కవాడి క్యారెక్టర్ గురించి డిస్కషన్ పెట్టడంలో వాడు మంచివాడా వీడు చెడ్డవాడా అని చెప్పేసి జడ్జిమెంట్లు ఇవ్వడంలో వేస్ట్ చేస్తున్నాం.
(10:57) నిజం ఏంటంటే అవతలి వాడు ఎలా ఉంటే మీకెందుకు వాడి సమయం వాడిని నడిపిస్తుంది. మరి మీ సమయాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు? ఫ్రాంక్లిన్ ఒక పవర్ఫుల్ మాట చెప్పారు టైం వేస్ట్ చేయడకండి ఎందుకంటే జీవితం ఆ టైం తోనే తయారవుతుంది. మీరు వేరే వాళ్ళ మీద కోపంతో బాధతో గడిపే ప్రతి నిమిషం మీ జీవితంలో నుంచి అమూల్యమైన సమయాన్ని కోల్పోతున్నట్లే మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ డిపెండెన్సీ మీరు ఆర్థికంగా మానసికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి.
(11:27) మీకు ఆకలేస్తే అన్నం పెట్టడానికి మీకు బాధేస్తే ఓతర్చడానికి ఒకరు రావాలి అనుకుంటే మీరు ఎప్పటికీ బలహీనుడిగానే మిగిలిపోతారు. ఎప్పుడైతే మీరు ఎవరి నుంచి ఏమి ఆశించరో అప్పుడు మిమ్మల్ని ఎవరూ బాధించలేరు. ఒకవేళ ఎవరైనా మీకు సహాయం చేస్తే దాన్ని ఒక బోనస్ లా ఫీల్ అవ్వండి. అంతే తప్ప దాన్ని మీ హక్కుగా భావించకండి. ఈ మైండ్ సెట్ మీలో వస్తే మీ చుట్టూ ఉన్న మనుషులు మారినా, కాలం తలకిందులైనా, మీ ప్రశాంతత ఎక్కడికి పోదు.
(11:56) మీకు తెలుసో లేదో చాలా మంది గతాన్ని పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటారు. ఆ రోజు వాడు నాకు అన్యాయం చేయకపోతే నేను ఎక్కడో ఉండేవాడిని అని చెప్పేసి సాకులు చెబుతూ ఉంటారు. ఇదంతా మీ బద్ధకాన్ని దాచుకోవడానికి మీరు చెప్పుకునే కట్టు కథలు మాత్రమే. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక అద్భుతమైన మాట చెప్తారు సాకులు చెప్పడంలో దిట్టైన వాడు మరి ఇతర పనిలోనూ రాణించలేడు అని. గతంలో ఎవడో మిమ్మల్ని వాడుకున్నాడు.
(12:17) ఎందుకంటే అప్పుడు వాడి సమయం అలా ఉంది మీ బుద్ధి అలా ఏడ్చింది కాబట్టి దాన్ని అక్కడితోనే వదిలేయండి. [సంగీతం] ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ క్షణాన్ని మీరు ఏం చేస్తున్నారు అది ముఖ్యం. నిజం ఏంటంటే ఈ ప్రపంచం ఓ పెద్ద మార్కెట్ లాంటిది. ఇక్కడ ప్రతి ఒక్కరు తమ వ్యాల్యూని అమ్ముకోవడానికి చూస్తున్నారు. మీకు వాల్యూ ఉంటేనే ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది.
(12:37) మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టి మనుషుల మంచితనం కోసం వెతకడం మానేసి మీ స్కిల్స్ పెంచుకోండి. మీ నాలెడ్జ్ పెంచుకోండి. చివరిగా నేను చెప్పుకొచ్చేది ఒకటే. ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు లేరు ఎవరు చెడ్డవాళ్ళు లేరు. ఎవరి సమయానికి తగ్గట్లు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఈ రియాలిటీని ఒప్పుకోండి.
(13:00) ఎదుటి వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోవడం బాధపడటం మానేయండి. మీ జీవితానికి మీరే బాధ్యులు. ఈరోజే మీ భ్రమల మూసుకు తొలగించేయండి. మీ సమయాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. మిమ్మల్ని మీరు ఒక పవర్ ఫుల్ పర్సన్ గా మార్చుకోండి. అప్పుడు ఈ ప్రపంచమే మీ వెనక నడుస్తుంది. ఆలోచించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
(13:22) బాయ్ [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment