Dr Malavika Explains Gynaecology Problems and Solutions | Teenmaar Chandravva | V6 News
Author Name:V6 News Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@V6NewsTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=biVFJIKziMQ
Transcript:
(00:00) అమ్మ నీ ముక్కు కూడా సక్కగా ఉన్నది దేవుడు ఇచ్చారు కానీ ఇట్లా ముక్కు మూతి అమ్మ [నవ్వు] మూతి కూడా దేవుడి దయవల్లే వచ్చింది అంటే మనం గైనకాలజీ అన్న వెంటనే డెలివరీలు అనుకుంటాం కాస్మెటిక్ గైనకాలజీ నా స్పెషాలిటీ ఇలాగ ఒక రింగ్ లాగా ఫామ్ అవుతాయి మన నెక్లెస్ లాగా హ్యూమన్ పాపిలోమా వైరస్ దానివల్ల క్యాన్సర్ వస్తుంది హావింగ్ ఏ గుడ్ సెక్షువల్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ ఒక మ్యారేజ్ ని కూడా ఉంచటానికి కానీ అది వాళ్ళఇద్దరికీ తెలియాలి.
(00:25) ఫస్ట్ లైఫ్ స్టైల్ అయితే టిప్ టాప్ ఉండాలి. ఏమట అంటే డిం డింక్ అంటానమ్మా నేను కూడా ఫస్ట్ టైం వింటునే [నవ్వు] అందరికీ శనార్థులు మంచిగా ఉన్నారా చంద్రబోయి ఏడన పోయి ముద్దుగా అంత సోఫలో గిపలో కూర్చున్నది మంచిగా ఉన్నది అనుకుంటున్నారులే నేను ఒక దావకానికి వచ్చిన ఈ అమ్మ పేరు డాక్టర్ మాళవిక ఈ అమ్మ గైనకాలజిస్ట్ గైనకాలజిస్ట్ అనంగానే అమ్మ దొరికింది మాకు ఆడపిల్లలకు గైనకాలజిస్ట్‌లకు ఆడపిల్లలకు అని ఏమంటారు ఇట్లా అవినాభావ సంబంధం అంటారు కదా అగో అట్లా ఉంటది ఆ అమ్మ గైనకాలజిస్ట్ మల్ల ఇంకొకటి ఉన్నది ఆ అమ్మకు కాస్మటాలజిస్ట్ అంటే కాస్మటాలజీ అనంగానే ఇక నాకు నెత్తిలో
(01:00) బుగ్గలు ఇట్లా చెక్కు చెక్కు మనని వెలిగినాయి మొదలుపోయి ఆ అమ్మని వలకరి ఇచ్చేసి వత్తమ అంటున్నా వచ్చిన అమ్మతోటి మాట్లాడదామండి అమ్మ నమస్తే శనార్తులు నమస్తే చంద్రవ్వ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నాను అమ్మ కాస్మటాలజీ గైనకాలజీ డాక్టర్ అమ్మ అంటే నేను ఎంత పెద్ద మనిషో ఎంత గొనమ చదువుకున్నదా అంటే అనుకున్నా నువ్వేమో చిన్న పిల్లవు అది మంచిదే చిన్న పిల్లలాగా ఉండటం మంచిదే తొందరగా పెద్దగా అవ్వాలని కూడా లేదు తొందరగా పెద్దగా కావాలని ఏమ లేదు అమ్మ ఎట్లున్నారు సార్ ఎట్లున్నాడు నీ పిల్లలు ఎట్లున్నారు అంత మంచిది ఎన్న పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు ఇద్దరు బాగున్నా
(01:32) ఇద్దరు పిల్లలు తల్లి అంటే ఈ అమ్మ చూడండి ఇద్దరు పిల్లలు బాగున్నారు చదువుకుంటారు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఇంట్లోనే ఉండి నా బ్రెయిన్ కూడా తింటా ఉంటారు. ఎప్పుడు స్కూల్ కి పోయేటప్పుడు స్కూల్ కే పోయిరి హాలిడేస్ లల్ల నాన్న పూరలు ఆడుక వద్దా పాపం మా అమ్మ డ్యూటీ కి పోయింది మా నాయన డ్యూటీ పోయిండ అనుకోకుండా సార్ ఏం చేస్తాడఅమ్మ సర్ కూడా డాక్టరే ఓ ఇద్దరు డాక్టర్లే పిల్లలని ఇట్లా డాక్టర్లనే చేస్తారా ఇంక ఇప్పుడు ఇద్దరం డాక్టర్లు అయ్యాం కదా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏది అవ్వాలనుకుంటే అది బలవంతం చేయకుండి వాళ్ళ ఇష్టంగా అంతే వాళ్ళ ఇష్టం
(02:00) సిరిదేవి మేడం అంట సినిమాటక్టర్ సిరిదేవి మేడం ముక్కు సర్జరీ చేసుకున్నది 16 ఏళ్ల వయసు సినిమాలో ఆమె ముక్కు వేరేగా ఉంటది జగదే కవీడు అతిలోక సుందర్‌ల వేరేగా ఉంటది అమ్మ ముక్కు సర్జర చేసుకుంది అంటాను అమ్మ నీ ముక్కు కూడా సక్కగా ఉన్నది. నువ్వు కూడా చేసుకున్నావ్ సార్ యాక్చుల్లీ దేవుడు ఇచ్చారు కానీ ఇట్లా ముక్కు అటు ఇటు ఉంటే చేసుకునేదాన్ని ఇప్పుడు అదేదో నాచురల్ గా వచ్చేసింది కానీ కొంచెం అటు ఇటు ఉన్నా గాన నేను కూడా ముందుకవెళ్లి చేసుకునేదాన్నేమో ఓ అమ్మ సర్జరీలు సర్జరీలు కాస్మెటాలజీ అంటే ఏమేమ చదువుకున్నావ్ వాళ్ళ నువ్వు ఏమేమ ఏమేమ సర్జరీ చేయొచ్చు ముక్కు ఈ
(02:35) నడుముకాలంలో మూతి మూతి కూడా సర్జరీ చేపించుకుంటున్నారంట ఇట్లా చదువుతాం కదా మా పేపర్ల హీరోయిన్ లా అంటే ఇట్లా వి షేప్ చేపించుకుంటున్నారంట అడ దౌడలన్నకం దూరమే ఉంటాయి కదమ్మ ఇప్పుడు ఇట్లా అంతా సోకు అంటున్నారు. ఇట్లా నియంగా చేయించుకుంటారా అమ్మ కాస్మెటిక్ సర్జరీస్ అంటే ఎప్పటి నుంచో మీరు చెప్పారు కదా శ్రీదేవి ఆ అప్పటి నుంచే చేయించుకుంటున్నారు చాలా ముందు నుంచి ఉన్నాయి ఇవేం కొత్తగా వచ్చినవి కూడా కాదు ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ ఎప్పటి నుంచో ప్లాస్టిక్ సర్జన్స్ కూడా చాలా బాగా చేయటానికి వాళ్ళు పేరు మూసినవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓ
(03:07) సో ఈ క్లినిక్ లో నా పార్ట్నర్ కూడా డాక్టర్ దీప్తి అని తను కూడా ప్లాస్టిక్ సర్జనే సో ఇద్దరం కలిసి కంటిన్యూస్ గా ఎస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీస్ ఇవన్నీే చేస్తా ఉంటాం ఇక్కడ ఇప్పుడు నువ్వు మంచిగా నువ్వు నీకు ముక్కు మాత్రం చక్కగా వచ్చేసింది మంచిగా దేవుని దయ్య అమ్మ నాయన లెక్క వచ్చేసింది మూతి అమ్మ మూతి కూడా దేవుడి దయ వల్లే [నవ్వు] వచ్చింది.
(03:28) అంతా సో నువ్వు ఏం చేపించుకోలేదు మరి ఇంత మంచిగా ఉన్నావ ఏందమ్మా నువ్వు అదేమో మరి ఇంకా అది మా డాడీ మమ్మీ వాళ్ళను మా జీన్స్ అనాలి జెనెటిక్ అనాలి ఎందుకంటే నేను చేయించుకున్నది కాదుగా అలా వచ్చింది అంటే ఇ తరతరాలుగా నాయన ఏం చేస్తుండే అమ్మ ఏం చేస్తుండే మా మమ్మీ హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు మా డాడీ ఏమో బిజినెస్ కన్స్ట్రక్షన్స్ చేస్తారు.
(03:49) ఆ నాయన పేరు రవి కుమార్ రవన్న మీ బిడ్డ మంచిగా ఉన్నది బంగారం అమ్మ నేను నాలుగైదు ముచ్చట్లు తెలుసుకుందాం అంట వచ్చిన ఈ కాస్మెటాలజీ అంటే ఏం చదువుకున్నావ్ అమ్మ నువ్వు అంటే ఏమేమి చేస్తారు ఏమేమ ఉంటాయి సో ఇది ముందు అందరూ చదివినట్టే ఫస్ట్ ఎంబిబిఎస్ చేస్తాము. ఎంబిబిఎస్ అయిన తర్వాత ఎంఎస్ గైనకాలజీ మాస్టర్స్ ఇన్ సర్జరీస్ గైనకాలజీ చేస్తాను.
(04:14) అది అయిన తర్వాత లాప్రోస్కోపీ చేశాను డిప్లమా ఇన్ కాస్మెటిక్ ఫంక్షనల్ గైనకాలజీ సో ఇదేంటంటే కాస్మెటిక్ ఫంక్షనల్ సెక్షువల్ గైనకాలజీ మొత్తం పేరు అంటే కాస్మెటిక్ అంటే మనం పేరు విన్నట్టే అందంగా కనిపియటం కానీ అది గైనిక్ పార్ట్ కాబట్టి గైనిక్ పార్ట్ బయట వల్వా అంటాము అది అందంగా కనిపించేటట్టు చేయటం కాస్మెటిక్ సర్జరీ ఫంక్షనల్ గైనకాలజీ అంటే ఇంకా గైనిక్ కి సంబంధించినట్టు డ్రైగా వెజైనా ఉండటము లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ రావటము లేకపోతే యూరిన్ లీకేజ్ అవ్వటం డెలివరీ తర్వాత యూరిన్ లీకేజ్‌లు అవుతాయి కదా ఇవన్నీ ఫంక్షనల్ గైనకాలజీ కింద వస్తాయి ఇదే కాక మెనోపాజ్ మెనోపాజ్ అంటే పీరియడ్స్
(04:55) ఆగిపోయిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అవన్నీ ఫంక్షనల్ గైనకాలజీ కింద వస్తాయి ఇవన్నీ చూస్తావా అమ్మ నువ్వు అన్నీ చూస్తాం సో ఇవన్నీ గైనకాలజీ కిందనే వస్తాయి కానీ కొంచెం సైడ్ ట్రాక్ అన్నట్టు అంటే మనం గైనకాలజీ అన్న వెంటనే డెలివరీలు అనుకుంటాం డెలివరీలు పో పోనీ గర్భసంచి ఆపరేషన్ ఇవే అనుకుంటాం. సో నేను ఇవన్నీ చేస్తాను ఈ మధ్యన డెలివరీలు ఆపేసాను సో డెలివరీలు చేయను లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తాను.
(05:20) ఇది కాకుండా అమ్మ డెలివరీ అంటే డెలివరీ చేసేస్తారు లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఇట్లా మూడు రంద్రాలు కొట్టి అలకేంచి గడ్డలను తీసేసడు అవన్నీ చేస్తున్నారంట అవి చేస్తావా అవన్నీ కూడా చేస్తా లాప్రోస్కోపీస్ అన్ని సర్జరీస్ చేస్తాను. అది కాక కాస్మెటిక్ గైనకాలజీ నా స్పెషాలిటీ సో కాస్మెటిక్ గైనకాలజీలో చాలా వెజైనల్ ఎండ్ సర్జరీస్ అంటే కింద నుంచి చేసే సర్జరీస్ నాన్ సర్జరీస్ కూడా ఉంటాయి.
(05:46) కొన్ని కొన్ని జబ్బులకో కొన్ని కష్టాలకి మనం సర్జరీ చేయన అవసరం లేదు. నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినయి అంటే మనం కొత్త కొత్తవి ఇన్వెంట్ అయి కొత్త కొత్తవి రావటం వల్ల మనకు కొత్తగా వెజైనల్ లేజర్ మెషిన్ అని వచ్చింది ఇంకొకటి ఎంసెల్లా మెషిన్ అని వచ్చింది కింద కీల ఎక్సర్సైజ్ చేపిస్తుంది ఇవన్నీ నాన్ సర్జికల్ అమ్మ నేను అన్నేమో గాని ఈ యూరిన్ బ్యాగ్ లీకేజ్ అన్నావు కదా ఈ ప్రాబ్లమ పెద్దోళ్ళది కాదమ్మ చిన్న చిన్న పిల్లలు కాస్తున్నది ఎందుకమ్మా ఇప్పుడు మా పోరలు చెప్తుంటారు ఇట్లా దగ్గు వచ్చింది తుమ్మ వచ్చింది ఆ యూరిన లీక్ అయితుంది చంద్రవ్వ
(06:20) అని చెప్తుంటారు పోరలు ఇప్పుడు ఇంకా పెండ్లీలు కాకపాయే పిల్లలు కాకపాయే ముసలోళ్లు కాకపోయే అప్పుడే వేస్తుంటే ప్రాబ్లంలు ఉన్నాయి అంటే పోరలకు సిగ్గుపడతారు కదా అమ్మా చిన్న పిల్లలాయే అంటే ఇది లేట్ గా పెళ్లిళ్లు అవ్వటం లేట్ గా అంటే ముందు ఏమయ్యేది తొందరగా పెళ్లిళ్లు అయిపోయేవి తొందరగా డెలివరీలు అయిపోయేవి సో అండ్ ఎంతో కొంత గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమవుతాంది మనకు కొంచెం సెడంట్రీ లైఫ్ స్టైల్ అంటాం అంటే కొంచెం వర్కింగ్ చేయటం తక్కువ అయినట్టు సో అందుకే లైఫ్ స్టైల్ లో మనం ఎక్సర్సైజ్లు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటాం. అది కూడా 20
(06:52) ఏళ్లకి ఇంకా ముందే మొదలు పెట్టేసేయాలి. అలా ముందే మొదలు పెట్టేసి మనం ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అవన్నీ నార్మల్ ఎక్సర్సైజెస్ లో కలిపేసుకుంటే యాక్చువల్లీ ఇది రాకుండా ఆపేయొచ్చు. సో కానీ ఆపాలంటే ముందే మొదలు పెట్టాలి. ఇప్పుడు అంతా అయి నెమ్మదిగా 30 కి 35 కి అట్లా డెలివరీలు అయితే మళ్ళ డెలివరీ అయినప్పుడు కింద పెల్విక్ ఫ్లోర్ కూడా లూస్ అయిపోతుంది మనం ఏమి ఎక్సర్సైజ్ చేయకపోతే ఇంకా నీరసపడుతుంది.
(07:16) డెలివరీల తర్వాత ఆబవియస్లీ మజల్ కి ఇంజురీ ఉంటుంది కదా అది మనం మళ్ళీ రిపేర్ చేయలేం అంటే ఎక్సర్సైజ్ చేసేట్ రిపేర్ చేస్తే యూరిన్ లీక్ అవుతుంది. అయ్యో రామచంద్ర ఈ కష్టం అనేది ఆడపిల్లలకి నేను ఈ ముచ్చట చెప్తున్నా ఎక్సర్సైజ్ చేయనోళ్ళకి ఉంటదా ఎక్సర్సైజ్ చేసేటోళ్లకి ఉంటదా అనేది నాకు తెలవదు కానీ ఎవలని అడిగినా ఇట్లా అయితున్నది అని అన్నం అనుకో పుసుకున్న మన సుట్టాలతోటి ఇట్లా అయితున్నది చెల్లే ఇట్లా అయితున్నది అక్క అను ఊకో అక్క నాకు అప్పటి నుండి అయితున్నది అంటారు నీకు ఇప్పుడు అయితున్నది నాకు అప్పటి నుండి అయితుంది అంటారు ఎవ్వరిని వలకరించి వేసుంటే కష్టమే చెప్తారమ్మ ఇదొకటి
(07:47) గర్భసంచి ఒకటి ఆ పూరలక ఏందమ్మ పూరలు ఇవ్వలని చూసిన మంచిగా ఒకప్పుడు పూరల పెంలి గాని పూరలు అనగానే ఇట్లా నీళ్లు ఎక్కువ ఉందురు సన్నగా ఇప్పుడు పూరలందరూ నా లెక్కనే ఉంటారు పెండ్లి కాకముందు గుండ్రగా అది ఏమదో పూరలు మళ్ళీ వాళ్ళని ముట్టుకొని ఏంది బెట బాగున్నావా అనంగానే ఏం బాగున్నామే పీసివాడి ప్రాబ్లం అంటా నాకు అంటారు అరే లడ్డుగ అయినవ ఏందే బుజ్జి అనంగానే పీసివాడి ప్రాబ్లం అంటానే అంటారు ఈ పీసోడి ఏడికం చచ్చిందమ్మ మనకు మోదాలు ఉండకపోతుండేనా చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన రోగమా ఇదేమనా కరోనా లెక్క ఇది కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే
(08:20) వచ్చింది అంటారు అంటే ఎలా అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచే ఎక్సర్సైజులు చేసుకుంటా షుగర్లు తక్కువ తింటా పిజ్జాలు బర్గర్లు తినకుండా కో ఇట్లాంటి స్ప్రైట్ డ్రింక్స్ తాగకుండా స్వీట్లు తినకుండా చాక్లెట్లు ఎక్కువ తినకుండా ఊకొమ్మ పోరలు తినకుంటూ ఉంటారా కొట్టనే కొడతారు ఏమ లేదండి చంద్రవ్వ నువ్వు గిదా అనే చెప్పుకొచ్చే తిన స్వీట్లు తినొద్దు పోరలు చాక్లెట్లు తినకపోతే ఏమని కోసం చేస్తాడు ఆడు మనం తింటామా అమ్మ చాక్లెట్లు తినొచ్చావు చంద్రవ్వ కానీ కొంచెం తినాలి సో ఏదో కొంచెం చాక్లెట్ వారానికి లాస్ట్ కి సాటర్డే తిన్నానా లేకపోతే ఏదో బర్త్‌డే
(08:52) పార్టీలో కొంచెం తిన్నానా అన్నట్టు తెలిసి తెలిసి కాన్షియస్ గా కొంచెం తిని మళ్ళా తిన్నామని చెప్పి మళ్ళీ ఏదో స్పోర్ట్ లోనో ఎక్సర్సైజ్ చక్కగా చేసి అలా లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ లో పెట్టుకుంటే అవ్వదు. పిసిఓడి రాకుండా ఉండాల అంటే పూరలు చాక్లెట్లు బందు కూల్ డ్రింకులు బందు పిజ్జాలు బర్గర్లు బందు ఆ పిసిఓడి నువ్వు అనుకుంటావ్ ఏముంది చిన్న పిసిఓడి అనుకుంటావ్ కానీ చిన్నప్పుడే వచ్చేస్తుంది పిసిఓడి టీనేజ్ లోనే వచ్చే 13 14 వచ్చేసే పోరలకు చిన్నప్పుడే వచ్చి ఇంకా అలా ఉండిపోతుంది వాళ్ళతో పాటు వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్ది ఆ పిసిఓడి కూడా ఉండిపోతుంది సో
(09:29) తెలిసిన వాళ్ళు ముందే ఓహో నాకు ఇప్పుడు పిసిఎస్ వచ్చేటట్టు ఉంది నాకు కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ముందే డైట్రీ చేంజ్ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మొదలుపెడితే దాన్ని చెక్ లో పెట్టుకోవచ్చు లేదంటే ఈ పిసిఓడి తర్వాత వెళ్లి పిల్లలు పుట్టడంలో కష్టం ఇన్ఫర్టిలిటీ వస్తుంది దాని తర్వాత డయాబెటీస్ వస్తుంది ప్రెగ్నెన్సీ టైం లో కూడా డయాబెటీస్ వస్తుంది తర్వాత కూడా డయాబెటీస్ వస్తుంది ఇప్పుడు మొదలు పెళ్లికి కన్నా ముందు పీసి బాడీ ఉన్నదా అంటే డెలివరీలో షుగర్ వచ్చే అవకాశం ఉంటది ఉంటుంది రామచంద్ర తెలవకపోయే మనకు ఆ అందుకనే ముందే గుర్తు సరే సరే వచ్చిందంటే
(10:04) వచ్చేసింది కానీ ముందుగా గుర్తుపట్టేస్తే వెంటనే సర్లే ఇప్పుడు ఇది ఉంది కదా మనం ఇలా డైట్రీ చేంజెస్ చేసుకుందాము ఇట్లా ఎక్సర్సైజ్ చేద్దాము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి ఇట్లా ఫిట్ గా ఉంటే అది రివర్స్ కూడా అయిపోతుంది. ఎంతో సో తేలిగ్గా రివర్స్ కూడా అయిపోతుంది అలా ఉన్నప్పుడు తెలుసుకోవడం ఇంపార్టెంట్ తెలుసుకుని దాన్ని రివర్స్ చేసుకుంటే అది బెటర్ అలా చేసుకొని అలా ఉండిపోవాలి మళ్ళీ సరే ఇప్పుడు రెండేళ్ళు కష్టపడ్డారు ఎక్సర్సైజులు చేశారు సరే ఇప్పుడు అయిపోయింది పిసిఓఎస్ పోయింది అని మళ్ళీ అన్నీ వదిలేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఆ
(10:33) షుగర్ రోగం లెక్కన అంతే ఏది పాడైంది ఇది పూరలు జాగ్రత్తగా ఉండురా అమ్మ [గొంతు సవరించుకోవడం] ఈ నడుమకాలంలో ఏ ఎక్కువ నీ దగ్గరికి వచ్చే పేషెంట్లు ఉంటారు కదమ్మా ఎసొంటి పేషెంట్లు వస్తారు పెళ్లి గాని పిల్లలు ఇట్లా వస్తారా అంటే పెళ్లి గాని పిల్లలు ఇలాంటి కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్ ఈ పిసిఎస్ ఉన్నావాళ్ళు కూడా నాకు కింద ఏరియా నల్లగా ఉంది పిగ్మెంటేషన్ ఉంది అని వస్తారు చాలా మంది సో అది ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ అంటాం వాళ్ళకి యాక్చువల్ గా పిసిఎస్ ఉన్నా వాళ్ళకి ఇక్కడ మెడల్ కూడా కొంచెం డార్క్ గా అవుతాయి వాళ్ళకి ఇంటిమేట్ ఏరియా పిగ్మెంట్ అవుతుంది చంకలు కొంచెం డార్క్
(11:09) అవుతాయి కింద ఏరియా డార్క్ అవుతుంది హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది నార్మల్ కంటే జుట్టు కొంచెం పలసపడుతుంది కానీ మిగిలిన చోట్ల పెరుగుతుంది. ఎక్కడ పెరగకూడదు అక్కడ పెరిగి పెరగాల్సిన చోట తగ్గిపోతుంది. అయ్యో సో అలా ఉంటాయి సో ఈ ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ బికాజ్ నేను కాస్మెటిక్ గైనకాలజీ కదా సో ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ కోసం వస్తారు అమ్మ కాస్మెటిక్ అంటే ఇప్పుడు ముక్కులు చక్కగా చేసుడు చెంపలు సక్కగా చేసుడు మూతలు చక్కగా చేసుడే కాకుండా ఈ నలగైన భాగాలను కూడా తెలగ చేస్తారా అవును కాస్మెటిక్ అంటేనే చూడటానికి అందంగా ఉండటం అది డర్మటాలజీలో ఉండొచ్చు
(11:42) కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీలో ఉండొచ్చు అంటే సర్జరీస్ అన్నీ చేయటం గైనకాలజీలోనేమో కింద ఇంటిమేట్ ఏరియా కొంతమంది లేబియా ప్లాస్టిక్ సర్జరీ కని వస్తారు అక్కడ కింద లిప్స్ ఉంటాయి లేబియా అని అవి ఎక్కువ తక్కువ ఉండొచ్చు పెద్దగా ఉండొచ్చు చాలా మందికి ఉంటాయి వాళ్ళు చాలా ఇబ్బంది కూడా పడతా ఉంటారు. పెద్దగా ఉండటమే కాదు దానివల్ల డిస్చార్జ్ వెజైనల్ డిస్చార్జ్ అనేది దాంట్లో ఇరుక్కుపోయి వాళ్ళకి దుర్దలు రావటం ఇన్ఫెక్షన్లు రావటం వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు.
(12:11) ఎప్పుడైనా ఇట్లా జిమ్ బట్టలు టైట్ గా ఉంటాయి అవి వేసుకున్నప్పుడు వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. సో అట్లా వాళ్ళు ఇబ్బంది ఫీల్ అయి ఆ సర్జరీ కోసం వస్తారు. సో అట్లా కొన్ని విషయాలు ఉన్నాయి అది మనం రొటీన్ గా గైనిక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అయి యాక్చువల్ గా నేను చేసింది కూడా ఎందుకంటే నేను నార్మల్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక పేషెంట్ వచ్చి అడిగింది నన్ను మేడం నా లేబియా ఇలా ఉన్నాయి మీరు చేస్తారా అంటే నాకు తెలియదు అప్పుడు ఎలా చేయాలో బికాజ్ మేము గైనిక్ లో రొటీన్ గా నేర్చుకునేది గర్భసంచి గర్భసంచిలు తీయటం ఓవరీలు ఇది ఇవే నేర్చుకుంటాం.
(12:39) ఇలా ప్లాస్టిక్ సర్జరీ రిలేటెడ్ గైనిక్వి ప్రొసీజర్స్ మేము నేర్చుకోలేదు. సో అప్పుడు ఆవిడ అడగటం వల్ల ఓహో నాకు తెలియంది కూడా ఒకటి ఉంది అని మళ్ళీ నేను వెళ్లి అది మళ్ళీ నేర్చుకొని వచ్చి దాని మీద కాసేపు బ్రెయిన్ పెట్టి ఏమేం చేయొచ్చు అన్న ఆలోచించి నెమ్మదిగా పెట్టిన క్లినిక్ ఇది. ఆ మంచిగా ఉన్నదమ్మ కానీ ఇట్లా ఏమంటారు ఇట్లా హాస్పిటల్ కి వచ్చినట్టు అనిపించలేదు నాకు అలానే ఉండాలని వచ్చాం బికాజ్ నాకు వచ్చే పేషెంట్స్ ఎవ్వర అంత నాకు జ్వరం వచ్చిందని రావట్లేదు అట్లా ఏమి కష్టంతో రావట్లేదు అన్ని కాస్మెటిక్ యాంగిల్ తో వస్తున్నారు సో వాళ్ళకి మనం చేసేవి సర్జరీస్ అయినా
(13:14) కానీ కొంచెం ఈజీగా ఉండాలి ప్లీజింగ్ గా ఉండాలి మేము కూడా కాన్ఫిడెంట్ గా ప్రెసెంట్ చేసుకోవాలని చెప్పేసి కొంచెం క్లినిక్ కూడా ప్రెసెంటబుల్ గా పెట్టాం. ఎందుకంటే నేను దావకానికి వచ్చినట్టు నాకు కూడా అనిపియలేదు. అందుకనే అంటున్నా పెళ్లి గాని పిల్లలు అనుకో అమ్మ స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకుంటున్నారు. మన పిల్లలు అందరూ వేసుకుంటున్నారు ఈ రోజులలో వెనుకటిక అంటే గసుంటి బట్టలు వేసుకుంటారా అందరు.
(13:37) ఇప్పుడు మనం పోర్లకి చెప్పేటట్టు ఉన్నదా వేసుకో నువ్వు వేసుకో నిన్ను వద్దన్న అంటారు ఏమన్నా అంటే వచ్చి నీ పాడ పెళ్లి చేసుకో అంటే నువ్వు చేసుకోవే మల్ల అంటారు నన్ను ఆ పాడగా నేనుఎందుకు పెళ్లి చేసుకొని పాడైతా గివ్ వసుకు మల్ల పోరల నువ్వు 30 ఏళ్లకు వస్తుంటారఅమ్మ వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు మొగపోరల అంటే అంటామా అమ్మ ఊర్లల్ల వీడు పెళ్లి చేసుకుంటారు వీనికి ఏమనా ప్రాబ్లం ఉండొచ్చునా అంటారు ముసలవాళ్ళు ఊకుంటారా అంటారు ఆడపిల్లలని కూడా అంటున్నారు ఈ పొద్దు రేపు ఎందుకంటే ఆడపిల్లలు కూడా 30 ఏళ్ల దాకా పెళ్లీలు అయితలేవు వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం
(14:06) లేకప పెన్లు చేసుకుంటలేరా మొగడ అంటే భయమై పేలు చేసుకుంటలేరా తల్లిదండ్రులను విడిచిపెట్టి పోవాలనన్న భయంతోటి పేలు చేసుకుంటలేరా ఇప్పుడు ఒకటి అంటున్నారా అమ్మ చెప్త పాదం పాడై నాకు యాదికి రాదు ఎందుకంటే ఇంట్లో ఇంగ్లీష్లు ఉంటాయి కదా ఏమద అంటే డింకు డింగ్ అని గుర్తుపెట్టుకున్నా డింక దాని పేరు డింక అంటాను అమ్మ ఇద్దరు మొగడి పైన అమ్మ సంపాదిస్తారంట పిల్లలు లేవు వద్దంట కానీ వాళ్ళ వాళ్ళు దీనిించి నిమలంగా ఉంటారంట డిం అంట ఇప్పుడు సృష్టి అంటేనే ఈ డింక్ అన్న పేరు కూడా నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా ఆ డ్యూయల్ ఇన్కమ ్ నో చిల్డ్రెన్ నో కిడ్స్
(14:42) ఓ ఓకే ఓకే ఇద్దరు మొగడి పెంలం సంపాదించుకుంటారంట మంచిగా పిల్లలు మాత్రం వద్దంట నీ సంపదన నువ్వు తిని నా సంపదన నీ పెండ్లి ఎందుకు వేసుకున్నావ్ పిల్లలే వద్దు అనుకున్నప్పుడు కదా అంటే నా ఆలోచన నేను చిన్న చిన్న బుర్రనయ్యా నాది నాకేం ఆలోచన ఉంటది పెండ్లి అంటే పెండ్లి వేసిన తర్వాత ఒక తరము ఇప్పుడు మా ఇంటి పేరు ఉన్నది మా ఇంటి పేరుని నా పిల్లలు ముందుకు తీసుకపోవాలిని అనుకుంటాం.
(15:05) ఇక నీకు పిల్లలే వద్దు అనుకున్నప్పుడు నీ ఇంటి పేరు ఎవడుమోయ్యా కాదమ్మ అవునా కాదా పిల్లలే వద్దు అనుకుంటే ఇంటి పేరు ఇ పిల్లలే వద్దు పిల్లలే వద్దు అంటే రేపటి జమానకు పొరలు ఎవడు నీకు తల కోరుకు పెట్టేటోడు ఎవడు కానీ ఒక విషయం చంద్రవ్వ నువ్వు ఆలోచించు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్డ్ ఉండారు పిల్లలకి సో వాళ్ళకి పిల్లలు పుట్టారనుకో నువ్వు వినే ఉంటావు పిల్లలు పుట్టిన తర్వాత డిప్రెషన్లు కూడా వస్తాయి కొంతమంది తల్లులకి పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు దాన్ని సో మనం మెంటల్లీ రెడీగా ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి అంటారు.
(15:37) సో ముందు ఏమవుతుందంటే మనకి మన పెద్దోళ్ళు ఉండేవాళ్ళు బ్యాకింగ్ సో ఇప్పుడు పిల్లలు పుట్టిన వెంటనే మనం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడ ఒక ఆరు నెలలు ఉంటాను తర్వాత మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొంచం సేపు ఉంటాము కొంచెం బిడ్డ ఒక సంవత్సరం అయ్యే వరకు వాళ్ళు అలా సపోర్ట్ ఉంటారు తర్వాత కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మనం పనికి వెళ్ళాలనుకో వెనకాల సపోర్ట్ లేకపోతే ఎట్లా ఇప్పుడు వెనకాల సపోర్ట్ ఉంటే మనం కొంచెం వర్క్ చేయొచ్చు అవన్నీ చేయొచ్చు ఇప్పుడు అందరూ వర్కింగ్ మోడల్ లోకి వెళ్ళిపోయారు ఇంజనీరింగో ఏదనా కాలేజీ అయిపోయిన వెంటనే జాబ్ జాబ్ వచ్చేస్తుంది మనం వర్కింగ్ కి
(16:08) వెళ్తున్నాము దాంట్లో ప్రమోషన్స్ ఈ లేడీస్ కూడా యంబిషియస్ అయిపోతున్నారు. సో అలా అయిపోతే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం మధ్యలో డెలివరీలు అనుకున్నామ అనుకోండి అప్పుడు వెనకాల మరి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. సో పేరెంట్స్ అందరూ ఒకే ఊర్లో ఉంటా అప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళక కొంచెం మెంటలీ స్ట్రాంగ్ అనిపించి వెళ్తారు కొంతమందికి వేరే ఊర్లో ఉంటారు పేరెంట్స్ ఒక ఊర్లో జాబ్ వేరే ఊర్లో అప్పుడు వాళ్ళకి అట్లా అర్థం కాలేదు మీద కొంతమందిఏమో మళ్ళీ జాబ్ మానేసి పిల్లల్ని పెంచుతా అంటే వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ లాగా వస్తుంది బేబీ వచ్చాక అలా అయిపోయిందని అదేదో
(16:40) స్టార్టింగ్ ఒక ఐదేళ్ళ అట్లా బానే ఉంటుంది బేబీ కూడా చిన్న పిల్లలుగా ఉంటారు వాళ్ళని చూసుకోవడం అవుతుంది వాళ్ళు కొంచెం పెద్దగా అయిపోతే వాళ్ళంతా వాళ్ళు అయిపోతారు అప్పుడు మనం మనం ఖాళీ అయిపోతాం ఏం చేయాల అనుకుంటాం సో అందుకని ఐ థింక్ లేడీస్ అందరూ కొంచెం ఆ బ్యాలెన్స్ ఏదో నేర్చుకోవాలి సో ఇప్పుడు నా దాంట్లో కూడా ఇప్పుడు నేను చాలా రోజులు ప్రాక్టీస్ ని స్లో డౌన్ చేశను ఈ కిడ్స్ అప్పుడు పిల్లలప్పుడు వాళ్ళు చిన్నగా ఉంటారు కదా మధ్యలో కోవిడ్ వచ్చింది కోవిడ్ అప్పుడు కూడా అత్తమ్మళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా పాపని అత్తమ్మల దగ్గర వదిలేసి కోవిడ్ అంటే మళ్ళీ నేను ఆ పేషెంట్
(17:11) ని చూసి వచ్చాక కోవిడ్ పేషెంట్ సిజేరియన్ చేసాక మళ్ళీ ఇంటికి ఎలా వచ్చి బేబీతో ఉండాలి ఉండలేను నేను కొంచెం దూరంగా ఉండాలి సో అట్లా కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే చేయొచ్చు లేకపోతే అది కష్టం అవుతుంది సో అది కొంచెం మెంటల్లీ కొంచెం స్ట్రెస్ ఫుల్ే బికాజ్ వరల్డ్ ఏమో చాలా అడ్వాన్స్ అయిపోతా వెళ్ళిపోతుంది మనం ఎముక పడిపోతాం మనం కొంచెం సపోర్ట్ లేకపోతే లేడీస్ అన్నది ఈ కిడ్స్ విషయంలో గాని పెళ్లి విషయంలో గాని కొంచెం ఆలోచిస్తున్నారు అందరూ ఆలోచిస్తున్నారు ఏం చేయాలి మరి ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి సో మెంటల్లీ ఫిట్ గా ఉన్నప్పుడే బేబీని చేసుకోవటం బెటర్
(17:45) లేకపోతే అదర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్స్ వచ్చినయి వయసులో ఉన్నప్పుడు అంట ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారంట వాళ్ళు కనాల అనుకున్నప్పుడు డెలివరీకి పోతారంట ప్రెగ్నెన్సీ కి పోతారంట ఏమన్నా వింటున్నామా అమ్మాయి ఈ ముచ్చట్లు నాకైతే బిడ్డూరము ఒకప్పుడు కడుపుతోటి ఉన్నది అనంగానే డబ్బున చెప్పకపోదురుకు మాట్లాడుకుందురు మా బిడ్డ కడుపుతోటి ఉన్నది నీళ్లు పోసుకున్నది అంటే జల్దీ చెప్పకపోదుర అమ్మ ఐదు నెలలు వచ్చిందాక కడుపు కనబడుతుంటే ఏమదే ఏమడదే అనిఅంటే అప్పుడే నీళ్లు పోసుకున్నది కాదక్క ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలలు అందరు ఆ
(18:22) అనుకుంటుంటుం మేము అకట్లా రహస్యంగా ఉంటుంటారమ్మ ఇప్పుడేమో అన్ని చెప్తున్నారు పూరలు పెద్దయనా చెప్తున్నారు ఇంకొక ముచ్చట చెప్పాలినమ్మ ఇగో స్కూల్ కి పోతే నీకు ఒకవేళ గిట్ల అనిపిస్తే నీకు ఇట్లా అనబడితే నువ్వు వచ్చి టీచర్ కన్నా చెప్పాలి లేకుంటే అమ్మకన్నా చెప్పాలని ఇప్పుడు చెప్పేస్తున్నారు కదా పిల్లలకు పెద్దోళ్ళు అయితున్నారు అంటే వాళ్ళకి తెలవాలని చెప్పేసేస్తున్నారు.
(18:46) అట్లా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నది ఏమనా కష్టం ఉన్నది వాళ్ళకు వాళ్ళక మీరు అన్నట్టు ఇట్లా నల్లగా ఉన్నది తెల్లగా ఉన్నది ఇంకేదో ఉన్నది నాకు ఇట్లా ఇదేందో ఇట్లా అనిపిస్తున్నది మంచిగా లేదు నాకు ఇట్లా అనిపిస్తే నిజంగా పిల్లలని తీసుకొని తల్లిదండ్రులు వస్తున్నారా ఈ నడుమకాలంలో గైనిక్ హెల్త్ అన్నది పిల్లలకి చిన్నప్పుడే చెప్పాలని మేము కూడా అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం మదర్స్ కి ఎందుకంటే ఇప్పుడు పీరియడ్స్ కూడా తొందరగా వచ్చేస్తున్నాయి ముందేమో 15 16 ఏళ్లకు వచ్చేవి తర్వాత 14 ఏళ్లకు వచ్చేవి ఇప్పుడు 12 అనుకుంటే ఇంకా ఇంకా తగ్గిపోతున్నాయి 11 ఏండ్లు తిరిగి 11ల వాడంగానే వీళ్ళేమో
(19:23) లడ్డులు లెక్క బర్గర్లు తిని బర్గర్ల లెక్క 11 ఏళ్లకు వచ్చేస్తున్నాయి అందుకే మదర్స్ అందరికీ చెప్తున్నాము పీరియడ్ వచ్చేస్తే ముందుగానే సైన్స్ వస్తాయి అంతే ఫస్ట్ బ్రెస్ట్ డెవలప్మెంట్ కొంచెం అవుతుంది ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ అవుతుంది నెమ్మదిగా హైట్ పెరుగుతారు తర్వాత పీరియడ్స్ వస్తాయి సో పీరియడ్స్ వచ్చే వన్ ఇయర్ ముందే మనకి చిన్న చిన్న సైన్స్ కనిపిస్తా ఉంటాయి అవి ఫస్ట్ ఫస్ట్ తల్లులకి తెలియాలి.
(19:46) తల్లులకి తెలిసి అప్పుడు వాళ్ళు ఓకే ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత పీరియడ్ వచ్చే టైం అనుకుంటే కొంచెం చిన్నప్పటి నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి షుగర్ అంతా ఆపేయటము ఎక్సర్‌సైజులో పెట్టేయటము వాళ్ళ మీద కొంచెం కాన్షియస్ గా వాళ్ళు ఉంటే పీరియడ్స్ తొందరగా రాకుండా తల్లులే ఆపాలి. ఏమన్నా వస్తే కూడా వెంటనే చూసి యక్టివిటీలో పెట్టాలి మనం కరెక్ట్ గా ఫిట్ గా ఉంటే నెమ్మదిగానే పీరియడ్స్ వస్తాయి 11 ఇయర్స్ కో 12 ఇయర్స్ గానో వస్తాయి.
(20:11) కొంచెం చబ్బీగా అయిపోయి సెడెంట్రీ లైఫ్ స్టైల్ ఉండి ఎక్కువ ఈస్ట్రోజన్ ఉంటుంది వాళ్ళ బాడీలో ఫ్యాట్ లో దాని వల్ల తొందరగా యాక్టివేట్ అయిపోతుంది సైకిల్ యాక్టివేట్ అయిపోయి పీరియడ్స్ వస్తుంది వాళ్ళు దానికి మెంటలీ ప్రిపేర్ ఉండరు చిన్న పిల్లలు కదా మెంటల్లీ ప్రిపేర్డ్ ఉండరు ఎమోషన్స్ వాళ్ళకి అర్థం కాదు ఏం చెప్పాలో చిన్నబోతారు తొందరగా అండ్ అందుకనే తల్లులు ముందుగానే చూసుకోవాలి ముందుగానే ఎడ్యుకేట్ చేయాలి పిల్లలకి ఇది స్కూల్లోనే మొదలు పెట్టేయాలి అండ్ మదర్స్ కూడా ఒకసారి 10 11 ఇయర్స్ తర్వాత ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర వాళ్ళ పాపని కూడా తీసుకొని రావాలి.
(20:44) అప్పుడు ఏమవుతుంది మేమ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఇవన్నీ నార్మల్ అని తెలుస్తాయి వాళ్ళకి అంత చిన్న పోవాల్సిందని అనుకోరు ఏమన్నా ఇబ్బంది ఉంటే పీరియడ్స్ అప్పుడు నొప్పు ఉంటే అంత తట్టుకొని అవసరం లేదు అది ఏదో తేడా ఉంది ఒకసారి మమ్మీకి చెప్దాం అనుకుంటారు ఇంకేమన్నా ఉంటే కూడా అలా అలా వాళ్ళలో వాళ్ళు పెట్టుకోరు.
(21:03) వాళ్ళు కొంచెం డిస్కషన్ చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ పక్కన గర్ల్స్ ఉంటారు కదా మిగిలిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతా ఉంటే వీళ్ళకి బానే ఉండొచ్చు పోనీ పక్కన ఇంకో అమ్మాయి ఎవరికన్నా బాలేదంటే తను ఓహో ఇది ఏదో నాది ప్రాబ్లం ఉందనుకుంటా నార్మల్ కాదని తెలుస్తుంది. సో అట్లా మెన్స్ట్రేషన్ గురించి గైనిక్ హెల్త్ గురించి మదర్స్ే చిన్న పిల్లలకు కొంచెం అలవాటు చేసి యంగ్ ఏజ్ లోనే ఒక గైనకాలజిస్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు మాట్లాడుకోవడం కూడా నార్మలైజ్ చేయాలి అదేమో పెద్ద సీక్రెట్ లాగా ఉంచన అవసరం లేదు మరి నేను ఇంకొకటి అడుగుదాం అనుకున్నాన అమ్మ ఇప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు
(21:35) పెద్దగా అయ్యి గర్భసంచి తీసేయడం అనే ముచ్చట మాట్లాడుకున్నాం కదమ్మా మనము గర్భసంచి తీసేయడానికి కారణము 45 ఏళడ్లు రావడము వాళ్ళకు ఇట్లా ఏమంటారు ఏమంటారు మెనోపాజ్ మెనోపాజ్ బాగానే పదాలు నేర్చుకున్నా కానీ దబ వస్తలేవు నాకు పాడై మెనోపాజ్ టైం లో కొన్ని కష్టమైతది ఓవర్ బ్లీడింగ్ కరెక్ట్ ఆ ఓవర్ బ్లీడింగ్ వల్ల ఒక్కోసారి గర్భసంచి తీసేయాల్సి వస్తది అంటారు అది ఒక లింక కానీ చిన్న చిన్న పిల్లలకి కూడా కడుపులో చిట్టి చిట్టి గడ్డలు వస్తున్నాయి అంటమ్మ అవి కొన్ని కొన్నిసార్లు అంటారు ఇవి ఫైబ్రాయిడ్స్ అని కొన్నిసార్లు అంటారు శిష్టులు అని కొన్నిసార్లు అంటారు చిన్న
(22:14) చిన్న నీటి బుడగలు అని కొన్నిసార్లు అంటారు ఈ బుడ్డపూర్లకి ఇట్లా రానికి కారణం ఏంది అదేంటంటే మన బుడ్డపూరలు అంటే వయసుకవచ్చిన పిల్లలే కానీ పెళ్లి గాని పిల్లలు నా ఉద్దేశం అదే సో అదేంటంటే ముందు అంటే మన మన బాడీ ఎలా తయారు చేశారంటే గర్భసంచి అనేది ఇక డెలివరీలక అన్నట్టు తయారు చేశారు దాంట్లో ఒక చిన్న కండ ఉంటుంది మయోమెట్రియం అంటాము అది గర్భసంచిలో ఉండే కండ సో ఇప్పుడు ఇది ఇది గర్భసంచి ఇదేమో వెజైనా ఇవేమో ఓవరీస్ ఇవేమో అమ్మ ఓవరీస్ అంటే గివ్వే అమ్మ గుడ్లు అయ్యేటివి అవును ఇవి గుడ్లు అయితాయి బూడిది రంగు దాంట్లోనేమో గుడ్లు అయితాయి అది ఓవరీ
(22:52) అవును ఓవ ఓవరీ లెఫ్ట్ ఓవరీ అంటారు కదా రెండు ఉంటాయి ఇది అటు ఇటు ఉంటుంది ఉంటుంది ఇది ఓన్లీ ఏదో పేషెంట్ కి చూపియడానికి ఇట్లా ఉన్నాయి రెండు ఓవరీస్ ఉంటాయి ప్రతి నెల ఒక నెల ఈ ఓవరీ ఓవిలేట్ అవుతుంది ఇంకో నెల ఈ ఓవరీ ఓవిలేట్ అవుతుంది. అంటే ఒక నెల ఇంలకించి గుర్తు ఇంకో నెల ఇందులో నుంచి వస్తుంది సో అట్లా రెండు ఆల్టర్నేటింగ్ గా అవుతాయి.
(23:14) అయ్యే ట్యూబ్ లో నుంచి వచ్చి ఇక్కడ ప్రెగ్నెన్సీ అంటుకుంటుంది. ఆ గర్భస అమ్మ మరి ఇట్లా సిస్టులు గిష్టులు అన్ని వస్తాయి అవి ఏడ ఆగుతాయి సిస్ట్ులు అంటే ఓవరీలో వస్తాయి సిస్ట్ులు చిన్న చిన్న సిస్ట్ులు వస్తాయి ఇక్కడ యూట్రస్ లో వచ్చాయి ఫైబ్రాయిడ్స్ అంటాం. ఫైబ్రాయిడ్స్ అంటే ఇట్లా గడ్డల్లాగా వచ్చి ఇది మంచిది మసల్ ఇది యూట్రస్ లో మసల్ అంటాం ఈ మసలే బేబీని పట్టుకుంటుంది ఇట్లా పెద్దగా అయ్యి మళ్ళీ చిన్నగా అవుతుంది ఇదంతా ఈ మసలు ఈ మసల్ లోనే చిన్న చిన్న లంప్స్ ఇట్లా మసిలే రౌండ్ రౌండ్ గా చుట్టుకుని అట్లా గడ్డ ఇట్లా కొవ్వు కొవ్వు అంటారు కదమ్మా మా
(23:48) సంగరెడ్డిలా ఒక అక్కు ఉంటుండే ఇంత దొడ్డుగా ఉంటుండేనమ్మ ఇంత పెద్దగా ఉంటుందో అక్క పాపం కొంచెం ఏది తింటుండే ప్రతి సంవత్సరం ఆమెకు ఇట్లా సూది ఉచ్చి కొవ్వు తీస్తుంటారమ్మ ఆ కొవ్వు తీయడం అనేది అది వేరే విషయం అంట్లా తీయరు ఎప్పటికప్పుడు దాన్ని లైపోసక్షన్ అంటాం అది ప్లాస్టిక్ సర్జరీ కింద వస్తుంది. దాంట్లో ఏమవుతుందంటే కొంతమంది ఫ్యాట్ తీయటానికి లైపోసక్షన్ సర్జరీలు చేసుకుంటారు.
(24:11) మనం కొంతమంది చాలా మంది హీరోయిన్స్ అంటే యాక్టర్స్ కూడా చేసుకుంటారు నాన్ యాక్టర్స్ కూడా మిగిలినవాళ్ళు కూడా చేసుకుంటారు. అది అందుకే లైపోసక్షన్ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎంతవరకు ఫ్యాట్ తీయాలి ఎప్పుడు ఆపాలి అనస్థటిస్ట్ బాగున్నారా సర్జన్ బాగున్నారా ఇవన్నీ చూసుకోవడం చాలా ముఖ్యం. అండ్ లైపోసక్షన్ అందరిలో చేయడం కాదు ఫస్ట్ వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వటానికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము.
(24:34) సో వాళ్ళ వాళ్ళకి వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ లో ఉండాలి డైట్ అన్ని చెప్తాం బికాజ్ మనం ఒకసారి ఫ్యాట్ తీస్తాము వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ లో వాళ్ళు ఉన్నారు పెద్దఏమి ఎక్సర్సైజ్ చేయలేరు మళ్ళీ లావ అయిపోతారు సో అట్లానే ఎన్ని సార్లు చేసుకుంటారు లైపోసక్షన్ సో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి కొంచెం వాళ్ళంతటి వాళ్ళు వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ డైట్ ఫాలో అయ్యి ఒక కొన్ని మూడు నెలల నుంచి ఆరు నెలలు ఫాలో అయి వాళ్ళు ఒక షేప్ కి వచ్చాక అన్ని చోట్ల తగ్గరు కొన్ని చోట్ల అది ఉండిపోతుంది ఏమి చేసినా పోదు ఆ ఫ్యాట్ ప్రతి ఒక్క కొంతమందికి పొట్టలో ఉంటుంది కొంతమంది చేతుల్లో ఉంటుంది
(25:03) కొంతమందికి తొడల్లో ఉంటుంది అది మిగిలిన పార్ట్ అంతా సన్నగా అవుతారు అక్కడ అవ్వరు. సో అట్లా స్టబర్న్ ఫ్యాట్ ని తీయడానికి లైపోసక్షన్ చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు చేయడం కాదు అది ఒక పద్ధతిగా దానికి ఒక ప్రొటోకాల్ ఉంటుంది అంటే అది కొవ్వు తీయడం అంటే లైపోసెక్షన్ చేయడమా అమ్మ నేను ఏదైనా మాట్లాడుతుంటే ఇట్లా పక్కక పోయిందంటే అటే పోతా అది మర్చిపోయిందమ్మ అమ్మ ఇప్పుడు నీటి బుడగలు ఏడ వస్తాయి ఫైబ్రాయిడ్స్ అంటే ఏడవస్తాయి సిస్టులు అంటే ఏమ గవి మూడు చెప్పవా ఈ నీటి బుడగలు సిస్టులు అవి రెండు సేమ్
(25:36) సిస్టే నీటి బుడగ సిస్ట్ అంటేనే నీటి బుడగ పిసిఓఎస్ అంటాం కదా పిసిఓఎస్ అంటే ఈ ఓవరీలో పాలిసిస్టిక్ అంటే అంటే పాలిీ అంటే ఎక్కువ మెనీ సిస్ట్ అన్నట్టు అప్పుడు ఎక్కువ సిస్ట్లు లాగా ఒక రింగ్ లాగా ఫామ్ అవుతాయి మన నెక్లెస్ లాగా పర్ల్ నెక్లెస్ లాగా అి ఫామ్ అవుతాయి. దాన్ని పిసిఎస్ అంటాం అంటే ప్రతి నెల దాంట్లో ఒక అండం పెద్దగా అయి విడుదల అవ్వాలి అలా అవ్వకుండా ప్రతిసారి ఇంచి చిన్న బుడగలు ఇలానే ఉండిపోతున్నాయి ఒక్కటి కూడా పెద్దది అవ్వట్లేదు.
(26:02) అప్పుడు ఇ పీరియడ్ రాదు పీరియడ్ రాదు సో పెద్దగా అయి రిలీజ్ అయితేనే పీరియడ్ వస్తుంది అది కొంతమంది మనం కరెక్ట్ గా 28 రోజులకి నెల వచ్చేయాలంటే 14వ రోజుకి విడుదల అవ్వాలి కొంత ఫస్ట్ ఏమవుతుంది ఫస్ట్ 14 రోజులు కాస్త 20 రోజులు అవుతుంది 25 రోజులు అవుతుంది అప్పుడు విడుదల అయినప్పటి నుంచి ఇంకో 14 రోజులు యాడ్ చేసుకోవాలి సో పీరియడ్ కస్తే 28 రోజులు ఫస్ట్ 35 రోజులు అవుతుంది 40 రోజులు అవుతుంది 45 రోజులు అవుతుంది రెండు నెలలు మూడు నెలలు తర్వాత ఇంకా రాదు మందులు తీసుకుంటే గాని రాదు అలా నెమ్మదిగా పెరుగుతుంది మనం గుర్తుపట్టేయొచ్చు దానికంటే ముందే ఓహో ఇది ఇలా అవుతోంది ఏదో
(26:36) చేంజ్ వచ్చింది అనొచ్చు సో ఇది స్ట్రెస్ వల్ల వేరే ఫాక్టర్స్ కూడా ఉంటాయి బట్ ఏదన్నా ఉంటే ఐడెంటిఫై చేస్తే మనం దానికి ట్రీట్మెంట్ చూసుకోవాలి. ఫైబ్రాయిడ్స్ వచ్చేటప్పటికి మీరు అన్నారు కదా చాలా పెళ్లి గాని వాళ్ళకి వస్తున్నాయ అని అవునమ్మ సో ఈ గర్భసంచి ఎలా అంటే దీని రోల్ కొంచెం ఓన్లీ డెలివరీ ఇప్పుడు రీప్రొడక్టివ్ సిస్టం ఎట్లాగా మనం పెద్ద మనిషి ఎవరనా అమ్మాయి అయింది అంటే తన రీప్రొడక్టివ్ సిస్టం హెల్దీగా ఉందని లెక్క అప్పట్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కదా అవును అలాగా బాడీ అంతా బాగుంది రీప్రొడక్టివ్ సిస్టం బాగుంది అని ఇప్పుడు యూట్రస్ ది
(27:08) ఏంటి కొంతమంది ఇదివరకు కూడా డెలివరీలు అయిపోయాయా ఇంకేంటి గర్భసంచి తీసేయండి ఏం ప్రాబ్లం లేకుండా అనేవారు ఓల్డెన్ డేస్ లో చాలా మంది నేను ఊరులో వినేదాన్ని అయిపోయింది డెలివరీలు అయిపోయినాయి ఇంక దీనికి ఏమన్నా కొంచెం బ్లీడింగ్ అవ్వక తవ్వక కొంచెం అటు ఇటు అయితే కూడా ఇప్పుడు మొందులు ఎందుకండి తీసి పడేయండి డెలివరీలు అయిపోయినాయి కదా అదేమన్నా ఇదే అమ్మ కొమ్మన ఇర్ష పడేస్తే అక్కడ ఎండిపోయింది అలానే ఉండేవారు సో ఇప్పుడు ఇప్పుడు అప్పటి నుంచే రూల్స్ ఉన్నాయి.
(27:37) కానీ ఇప్పుడు మనం కంటిన్యూస్ గా చెప్తున్నాం 40 ఏళ్ల ముందు గర్భసంచి తీయటం అనేది వెరీ బ్యాడ్ ఏదన్నా చాలా సివియర్ గా అయితేనో క్యాన్సర్ అయితేనో అట్లా ఏమన్నా అయితేనే ఆలోచించండి లేకపోతే 40 ఏళ్ల వరకు మీకు ఏది ఏమైనా గాని నెమ్మదిగా మెడిసిన్స్ తోనే డీల్ చేయండి 40 ఏళ్ళ తర్వాత ఇంకా కొంతమందికి బ్లీడింగ్ ఎంత అవుతుందంటే ప్రతి నెల బ్లీడింగ్ అయ్యి వాళ్ళకి బ్లడ్ తగ్గిపోయి మళ్ళీ బ్లడ్ ఎక్కించుకుంటారు ఇంజెక్షన్లని అలా అలా పెద్ద పెద్ద కాసెస్ ఉంటే వాళ్ళు 40 ఏళ్ల తర్వాత దే కెన్ గో ఈ గర్భసంచి తీయటం అలా సర్జరీలకి వెళ్ళొచ్చు కానీ దాని ముందు వరకు ఇంకా వేరే ఆప్షన్స్
(28:09) చూసుకోవటమే గర్భసంచి తీసేస్తే నెమ్మదిగా ఓవరీస్ కూడా చచ్చిపోతాయి. అయ్యో అంటే ఒక ఐదేళ్ళు 10 ఏళ్ళ ఆ టైంలో అయిపోతుంది మెనోపాజ్ 50 కంటే ముందే వచ్చేస్తుంది వాళ్ళకి ఇంకా సో అందుకనే జాగ్రత్తగా తీయాలి. ఈ కంతలు కూడా ఎవరైతే లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో 30 తర్వాత ప్లాన్ చేసుకుంటారో అట్లాగా వాళ్ళు స్కాన్ చేస్తే వాళ్ళకి ఇట్లా ఫైబ్రాయిడ్స్ కనిపిస్తాయి.
(28:32) అలాని అన్ని ఫైబ్రాయిడ్స్ తీయన అవసరం లేదు 4 సెంటమీటర్ కంటే ఎక్కువ ఉంటేనే ఫైబ్రాయిడ్ అండ్ మనక ఏమన్నా ఈ దీంట్లో ఇబ్బంది దీని దగ్గరికి వస్తుంది ప్రెగ్నెన్సీ ఉండటంలో ఇబ్బంది వస్తుంది పీరియడ్స్ హెవీ అవుతున్నాయి అట్లాంటి ఫైబ్రాయిడ్స్ తీస్తారు లేకపోతే దాన్నంతా వెంటనే ఇంటర్వెన్షన్ ఏం చేయనవసరం లేదు. ఇవి ఫైబ్రాయిడ్లు షిస్ట్లు ఇవి ముచ్చట అమ్మ ఇంకొక ముచ్చట ఏందంటే ఈనాడు మా ఆడవిల్లలకు సర్వికల్ క్యాన్సర్ అని అంటున్నారు కదమ్మా మరి సర్వికల్ ఏడు ఉన్నది క్యాన్సర్ ఏడు వస్తది సో దీన్ని యూట్రస్ అంటాము యూట్రస్ నోరు మౌత్ ఆఫ్ ద యూట్రస్ ని సర్విక్స్ అంటాము.
(29:06) సో ఈ సర్విక్స్ అన్నది ఇక్కడ యోనిలో కనిపిస్తుంది మీకు సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనం సర్వైకల్ క్యాన్సర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ హెచ్పివ వైరస్ అంటాం హ్యూమన్ పాపిలోమా వైరస్ దానివల్ల క్యాన్సర్ వస్తుంది సో అందుకనే ఇది ఆల్మోస్ట్ 15 ఏళ్ల లోపల పిల్లలకయితే రెండు వ్యాక్సిన్లు వేసేసేయండి అందరికీ అని ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిేస్తున్నారంట ఇది తిరిగేస్తున్నారంట పోలకపోయి ఆడిపిల్ల అమ్మాయిలకే కాదు అబ్బాయిలక కూడా వేసుకోవాలి ఇద్దరూ వేసుకోవాలి వాళ్ళకి కూడా ఏమన్నా పినాయిల్ క్యాన్సర్స్ దాని నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఎందుకంటే
(29:41) సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ వైరస్ కాజింగ్ క్యాన్సర్ వైరస్ కి వ్యాక్సిన్ ఉంది. సో మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. అందుకని అందరికీ వేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది వ్యాక్సిన్ వేసుకోకుండా పిల్లలు అన్ని అయిపోయి పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఏంటంటే రొటీన్ గా పాప్‌స్మియర్ అని ఒక టెస్ట్ చేస్తాం. ప్రతి రెండేళ్ళకి ఒక పాప్ స్మియర్ టెస్ట్ చేసి బానే ఉందో చూస్తాము.
(30:04) సో దట్ ఏమన్నా కొంచెం కూడా తేడా ఉంటే వెంటనే ఐడెంటిఫై చేసేయొచ్చు. ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ చిన్నగా ఉంటుంది తొందరగా అమ్మ కానీ ఆడవిల్ల ముచ్చట అనేసరికి నాకు వ్యాధికి వచ్చింది ఈ సర్వైకల్ క్యాన్సర్ చాలా మందికి వస్తున్నది అంట అమ్మ మన ఇండియా లీడింగ్ ఇన్ సర్వైకల్ క్యాన్సర్ అయ్యో రామచంద్ర చాలా కారణాలు ఉంటాయి తొందరగా పెళ్లిలు అయిపోవటము తొందరగా సెక్షువల్ యాక్టివిటీ మొదలు పెట్టేయటము మల్టిపుల్ పార్ట్నర్స్ స్మోకింగ్ అట్లాంటి అడిక్షన్స్ ఉండటం లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఏదన్నా గైనిక్ క్యాన్సర్స్ ఉండటం ఈ మధ్యన క్యాన్సర్స్ కూడా ఎక్కువ వింటున్నాం కదా ఈ
(30:42) సర్వైకల్ క్యాన్సర్ే కాదు ఎనీ క్యాన్సర్ కూడా మనం ముందు వినేదానికంటే ఇప్పుడు ఎక్కువ వింటున్నాం కదా అంటే క్యాన్సర్ అన్నట్టుంది అది అదంతా ఎందుకంటే చాలా ఎన్విరన్మెంట్ లో పొల్యూటెంట్స్ ఎక్కువ అయిపోయి కార్ పొల్యూషన్ దగ్గర నుంచి మనం మొక్కలు పెస్టిసైడ్స్ వాటర్ పొల్యూషన్ మొక్కలక వేసే వాటర్ మంచిగా ఉండదు సో యస్ సచ్ మనం మంచి ఫ్రెష్ క్యారెట్ తింటున్నాం అనుకుంటాం బట్ దానికి మొత్తం పెస్టిసైడ్ వేసి పెంచ స్తే అదన్నీ మనకి వెళ్తాయి మళ్ళీ లోపలికి ఫ్రూట్స్ కూడా మంచిగా ఫ్రూట్స్ తింటున్నామ అనుకుంటాం.
(31:11) బట్ అవన్నీ పెస్టిసైడ్స్ అవన్నీ ఉంటాయి వాటర్ అంత బాగుండదు ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నుంచి తాగుతాము అది మంచిది కాదు సో మెనీ థింగ్స్ శనిటరీ నాప్కిన్స్ అన్ని ప్లాస్టిక్ వి సో అట్లా ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గించేసేయాలి అట్లా అన్ని క్యాన్సర్ కాజంగ్ వి చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల గాలిలో నీరులో తిండే తిండిలో సో అందుకే ఇంక బాడీకి ఇట్లాంటివి వస్తున్నాయి.
(31:35) అమ్మ ఇప్పుడు పిల్లలక అంటే ఈ ముచ్చట్లు పెద్దోళ్ళు ఉంటారు పెండ్లయి ఒక పిల్ల పుట్టింది ఇద్దరు పిల్లలు పుట్టినరు అయిపోయా ఇద్దరు పిల్లలు పుట్టిందాక మంచిగా ఉంటారు మొగడి పెళ్ళం ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈయనకేమో రోగం వచ్చి ఆమెకేమో రోగం వచ్చి ఇక విడిపోతున్నారు. ఈనాడు కాలంలో పిల్లలు పుట్టినక విడిపోతున్నారు.
(31:57) పిల్లలు పుట్టిన తర్వాత వద్దు అనుకుంటున్నారు భార్య వద్దు డివోర్స్ భర్త వద్దు డివోర్స్ నాకు ఇష్టం లేదు ఈమె నాకు ఈమె నచ్చుతలేదు ఆయన నచ్చుతలేడు ఇట్లాంటి ముచ్చట్లన్నీ వస్తున్నాయ అమ్మ ఈ సుంటలు కూడా వస్తారా నీ దగ్గరికి అబ్బో ఇదేంటి చంద్రవ్వ నా దగ్గర చాలా మంది వస్తారు ఈ ప్రాబ్లం తో ఎట్లా అనంటే కొంతమంది ఓన్లీ ఓన్లీ లేడీస్ వస్తారు. వాళ్ళు ఏమంటారంటే అమ్మ నాకు ఇప్పటికి మూడు నాలుగు పిల్లలు ఉన్నారు.
(32:24) ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మా ఆయనకి వేరే అఫైర్ ఉందంటారు కొంతమంది సో వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు అండ్ పిల్లలు కూడా ఇప్పుడు పెద్దగా అవుతున్నారు. పెద్దగా అవుతుంటే దాని గురించి మాట్లాడతా అంటే కోపాలని తెచ్చుకుంటున్నారు అలాని లేడీస్ చాలామంది ఎలా ఉంటున్నారు వాళ్ళ మైండ్‌సెట్ అంటే వాళ్ళు హౌస్ వైఫ్స్ అని అట్లా ఇంట్లో ఉంటున్నారు అంత ఫైనాన్షియల్లీ స్టేబుల్ లేరు ఫస్ట్ టైం ఇలా అయినప్పుడు నేను చెప్తే బాగా గొడవ అయింది అమ్మ సో అందుకని ఇప్పుడు మళ్ళీ నేను చెప్పలేదు తెలిసినా చెప్పలేదు అన్నారు ఆవిడ ఆ నాకేమైనా వెజైనాల్ టైటనింగ్ చేస్తారా నా వెజైనా
(32:56) లూస్ గా ఉందేమో అందుకనే మా ఆయన నన్ను వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు నీతో అసలు చేయాలనిపియట్లేదు టైటనింగ్ చేస్తారా అని అడుగుతున్నారు. అప్పుడు ఆవిడకి నేను కౌన్సిల్ చేయాల్సి వచ్చింది ఇది మీ వెజైనాలు చాలా మంది నాకు మ్యారీడ్ కపుల్స్ కూడా వస్తారు భార్యా భర్తలు ఇద్దరు కూడా వస్తారు. సపోజ చూడండి 18 ఇయర్స్ కే పెళ్లి అయిపోయింది అనుకోండి అప్పుడే ఇద్దరు పుల్లెలు పుడతారు.
(33:18) సో ఆవిడ వాళ్ళు నాకు 30 ఇయర్స్ 35 ఇయర్స్ కి వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలు ఆల్రెడీ 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఉంటారు. సో కానీ వాళ్ళు ఇంకా 35 ఇయర్స్ దే ఆర్ వెరీ యంగ్ వాళ్ళకి 50 ఇయర్స్ కదా మెనోపాజ్ వచ్చేది. సో అప్పుడు లూస్ వెజైనా ఉంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి వస్తారు మళ్ళీ మేడం వెజైనా ఇట్లా లూస్ గా అనిపిస్తుంది మీరు టైటన్ చేయగలుగుతారా వెజైనల్ టైట్నింగ్ సర్జరీ ఆ మనం టైటన్ చేయొచ్చు అండ్ అది ఏముంది నార్మల్ నాచురల్ డెలివరీలు అయినప్పుడు వెజైనా టూ ఫింగర్ ఉండాల్సిన వెజైనా ఫోర్ ఫింగర్ అయిపోతుంది లూస్ అయిపోతుంది.
(33:48) సో ఆబవియస్లీ వాళ్ళకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ రానప్పుడు వాళ్ళఇద్దరు అలా ఫీల్ అయి నా ముందు వచ్చి ఓపెన్ గా అలా చెప్పినప్పుడు మనం వెజైనల్ టైటనింగ్ సర్జరీస్ ఉన్నాయి. సో మేము మొత్తం వెజైనా దాన్ని వెజైనో ప్లాస్టీ అంటాం అట్లా చేస్తాం. సో అది హెల్దీ వే సో ఆ అమ్మాయి తను ఒక్కతే వచ్చి మా హస్బెండ్ కి ఇట్లా ఉంది చేయాలి అంటే నేను సర్జరీ చేస్తానమ్మ దాంట్లో ఏముంది చేస్తే వెజైనా టైట్ అయిపోతుంది.
(34:09) బట్ అలా అని నేనేమి ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్ నాపలేదు అది మైండ్ సెట్ కదా అదేమి ఇలా సంబంధించింది కాదు. సో అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ వీళ్ళు కూడా వస్తారు ఒకళ్ళయితే ఒక లేడీ ఫైవ్ కిడ్స్ అబ్బా ఫైవ్ కిడ్స్ ఇప్పుడు హస్బెండ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని ఫైవ్ కిడ్స్ తర్వాత ఆ చాలా నా ముందు వచ్చి బ్రేక్ డౌన్ అయిపోవటము ఇట్లా చాలా మంది మహిళల్ని చూస్తా ఉంటా కపుల్స్ వస్తారు సింగిల్ గా లేడీస్ కూడా వస్తారు.
(34:36) అయ్యో సో ఆ రెండు విషయాల్లోనూ వస్తారు చాలా మంది వస్తారు సో యాక్చువల్ గా హావింగ్ ఏ గుడ్ సెక్షువల్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ ఒక మ్యారేజ్ ని కూడా ఉంచటానికి కానీ అది వాళ్ళఇద్దరికీ తెలియాలి. హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉండి ఒక డెసిషన్ తీసుకొని కపుల్ గా వచ్చి చేయాలి. కొంత మైండ్‌సెట్ సరిగ్గా లేకపోతే ఇంకా అది వాళ్ళు మనం ఏం చేయలేం దానికి నేను వచ్చి ఇటిటి ఏవేవో ముచ్చట్లు మాట్లాడేసినా ఇప్పుడు ఏమేమ సర్జరీలు చేస్తున్నావ అమ్మ నువ్వు నేను సర్జరీలు వచ్చేటప్పటికి చాలా లేబియా ప్లాస్టీస్ అని చేస్తా లేబియా ప్లాస్టీ అంటే ఇది వెజైనా వెజైనా బయట లేబియా అని
(35:10) ఉంటుంది. సో ఈ లేబియా ప్లాస్టి సర్జరీ ఏంటంటే అది ఎవరికన్నా అటు ఇటు అనిపిస్తే ఆ లేబియా ప్లాస్టిక్ కరెక్షన్ చేస్తాం క్లైటోరల్ హుడ్ కరెక్షన్ చేస్తాం. వెజైనా ప్లాస్టి సర్జరీస్ హైమెనోప్లాస్టీ సర్జరీస్ ఇట్లాంటివన్నీ కూడా చేస్తాం. నాన్ సర్జికల్ వి కూడా చాలా ఉంటాయి. పిగ్మెంటేషన్ ఇష్యూస్ కొన్ని పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాంగా మనం బ్లడ్ తీసి జుట్టుక ఇస్తారు కదా పెరగడానికి ఇస్తారు కదా అట్లా మేము కింద వెజైనా ఎండ్‌లో కూడా ఇస్తాం.
(35:38) ఆ అది ఫేస్ లో కూడా తీసుకుంటారు పిఆర్పి ఇంజెక్షన్స్ ఫేస్ బ్రైటన్ అవ్వటానికి స్కిన్ హెల్దీగా ఉండటానికి తీసుకుంటాం గా అలానే వెజైనాలో కూడా ఇస్తాము. ఓయమ్మ కాదమ్మ ఇట్లా కాస్మెటిక్ సర్జరీలు చేసుకుంటే ఇట్లా ఏమంటారు బెడ్డు కొట్టుడు దాని వల్ల ఏమన్నా నష్టాలు సైడ్ ఎఫెక్ట్లు అంటున్నారు కదమ్మా అట్లా సైడ్ ఎఫెక్ట్లు గడ్డు ఎఫెక్ట్లు ఏం రావా అమ్మ సో ఫస్ట్ ఎవలక వస్తాయి ఒకవేళ వస్తే ఎవలకి వస్తాయి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అందరికీ నా క్లినిక్ లో ఎవరు వచ్చినా అందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అయితే టిప్ టాప్ ఉండాలి. అంటే కరెక్ట్ గా
(36:12) న్యూట్రిషన్ తీసుకున్నామా ఎక్సర్సైజ్ కరెక్ట్ గా చేసామా మీరు చేసే ఎక్సర్సైజ్ లో మనం అన్నీ ఎక్సర్సైజ్ అంటే డంబుల్స్ అవన్నీ చేస్తాం కానీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయం పెల్విక్ ఫ్లోర్ అంటే గైనిక్ కి సంబంధించిన కింద ఒక మసిల్ ఉంటుంది అది గర్భసంచిని యూరిన్ లీక్ కాకుండా దాన్ని పెల్విక్ ఫ్లోర్ కీగల్ ఎక్సర్సైజ్లు అంటాం.
(36:31) సో ఇలా చిన్నప్పటి నుంచే ఎక్సర్సైజులు స్టార్ట్ చేయండి స్లీప్ బాగుండాలి స్లీప్ బాగుంటే ఏముంటుందంటే మన హార్మోన్స్ అన్ని బ్రెయిన్ నుంచి డెవలప్ అవుతాయి కదా హార్మోన్స్ అన్ని బాగుండి సైకిల్స్ బాగుంటాయి పీరియడ్స్ బాగుంటాయి స్ట్రెస్ తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మాోడిఫికేషన్ చేయాలి. అది చేసిన తర్వాత కూడా ఇప్పుడు చాలా మంది ఎక్సర్సైజులు చేశక నార్మల్ డెలివరీలు అయినా సిజేరియన్లు అయినా కూడా వాళ్ళ కింద టైట్ గానే ఉంటుంది.
(36:53) ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజులు చేస్తున్నారు. మీరు ఫారనర్స్ ని చూస్తారు వాళ్ళు మనమైతే రెండు పిల్లలు అట్లా అనుకుంటాం వాళ్ళయితే మూడు పిల్లలు నలుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు అట్లా చాలా మంది పిల్లల్ని కంటారు. సో కన్నా గాని వాళ్ళు వెంటనే ఎక్సర్సైజులు స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు డెలివరీ అవుతుందా మన దగ్గర చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా ఇప్పుడు జాబ్స్ వల్ల చాలా ఫారనర్స్ కూడా వస్తున్నారు.
(37:18) సో ఇప్పుడు డెలివరీ అవుతుందా నార్మల్ డెలివరీ అయితే రెండు రోజుల్లో బయట జాగింగ్ చేసుకుంటా కనిపిస్తారు. ఆ రామచంద్ర మనం బయటికే రానియం అసలు వాళ్ళక అంత అవేర్నెస్ అవును పచ్చిబాలు ఎంత బయటికి రానిస్తే మంచి ఇష్యూ తలుగుతది అయ్యో తాలి గాలి వస్తది చెవులలో దూది పెట్టుకోండి అవును కానీ వాళ్ళు ఎక్సర్సైజ్లు అలా స్టార్ట్ చేసేస్తారు. సో అవేర్నెస్ అంత అవేర్నెస్ ఉంది వాళ్ళకి మనకు కూడా ఇప్పుడు అవేర్నెస్ పెరిగి యంటీనేటల్ ఎక్సర్సైజస్ అని ప్రెగ్నెన్సీలోనే యంటీనేటల్ యోగా అంటాం కదా యోగా వాళ్ళు చెప్తారు కింద నార్మల్ డెలివరీ అవ్వాలంటే మజల్స్ ఎట్లా రిలాక్స్ చేసుకోవాలి అవన్నీ యోగా
(37:48) బ్రీదింగ్ ఎట్లా చేయాలి అలా ప్రెగ్నెన్సీలో యోగా చేసి డెలివరీ తర్వాత ఎలా యోగా చేయాలో కూడా నేర్పిస్తారు. సో అట్లా యక్టివ్ గా లైఫ్ స్టైల్ పెట్టుకుంటే చాలా మటుకు అవాయిడ్ చేసేయొచ్చు అసలు అవసరం ఏమ ఉండదు. అండ్ మన బాడీతో హ్యాపీగా ఉన్నంతవరకు అసలు మాతో పనేమ ఉండదు. బికాజ్ నావన్నీ ఫస్ట్ మెయిన్ స్టే సర్జరీస్ కాదు ఇప్పుడు సపోజ పెద్ద కంతు ఉంది అది నేను తీయాలి ప్రెగ్నెన్సీ దానివల్ల దానివల్ల ప్రెగ్నెన్సీలు రావట్లేదు వస్తదమ్మా ఒకసారి అది ఫైబ్రాయిడే ఆ ఇట్లా ఇలా వస్తుంది ఇవి పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ లాగా ఓ ఏమని ఈ నడుమ కాలంలో ఇంతకాంతి ఇంతకాంతి
(38:23) కోడగుడ్డ అంత కాంతి కొబ్బరి బోండమంత కాంతి వచ్చేటవాళ్ళు కూడా ఉన్నారమ్మా అది మనం నెమ్మదిగా డెలివరీలు కాలేదుఅనుకోండి మన ఏజ్ పెరుగుతున్న కొద్ది ముందే ఉన్నది అలా పెరి తిరిగిపోతా ఉంటుంది. మనకి తెలిీదు అది ఎందుకంటే మనం స్కాన్ చేయించుకోంగా ఎవరనా పొరపాటున స్కాన్ చేయించుకుంటే కనిపిస్తుంది. అలా అని ఎక్కువ స్కాన్ చేపించుకున్నామ అనుకోండి ఉత్తినే స్కాన్ చేపించుకుంటే చిన్న కంతు ఉన్న నాకేదో ఉంది నాకేదో ఉంది చూడండి చూడండి అని ఆ సో అలా అవసరం లేదు కొన్ని ఉంటే కూడా వదిలేయొచ్చు.
(38:54) కొన్నేమో కనిపియవ అసలు అలా పెద్దగా అయ్యే వరకు చూడట్లేదు. సో ఈ అతివృష్టి అనావృష్టి అయినట్టు మరీ ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు. అమ్మ ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ మీడియా అని జోరుగా నడుస్తున్నాయి. ఈ సోషల్ మీడియాల ఈ ముచ్చట గురించి ఇంత చెప్తారు ఆ ముచ్చట గురించి అంత చెప్తారు. అట్లా కొంచెం కొంచెం తెలుసుకొని కొంచెం కొంచెం తెలుసుకొని ఆగమాగం చేసుకుంటున్నారా బతుకులు అట్లా తెలుసుకోకుంటూ ఉండాలిఅంటే పబ్లిక్ ఏం చెప్తూ మనం ఎట్లా అంటే కొన్ని జస్ట్ మనం ఇస్టా సోషల్ మీడియాలో రీల్స్ చూసాను చిన్న చిన్నవి చూసాను అట్లా కాకుండా ప్రాపర్ గా రీసెర్చ్ చేస్తే కూడా ప్రాపర్ రీసర్చ్ చేయొచ్చు. సో కొంచెం
(39:28) రీసర్చ్ చేసి వాళ్ళకు నాలెడ్జ్ తెచ్చుకొని డాక్టర్ ని కూడా ఒపీనియన్ అడగొచ్చు అంత ఒపీనియన్ అడిగి ఏముంది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చిన్నప్పుడే స్టార్ట్ చేయొచ్చు ఇంకేమన్నా వేరేవి హెల్త్ ఇష్యూస్ అవ్వాలంటే పక్కన ఫ్రెండ్స్ తెలిసినవాళ్ళని తెలియనోళ్ళని అట్లా అడగటం కంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం ఆల్వేస్ బెటర్ సో ఏదన్నా ఎక్స్పర్ట్ డాక్టర్ ఎవరు మీరు చూడండి ఈ మధ్యన అనుకు అంటే నాకు ఒకటి వ్యాధికి వచ్చింది ఏమనా కావాలంటే Google చెయ అంటారు మా పోరలు కూడా ఇది ఏంది దీని అర్థం ఏంది టగల్ చెయ అంటారు వచ్చి నీ పోడుగ చేసాడు సలగుండా అని అలా చూస్తే నేను
(40:01) అడిగిన దానికి ఇప్పుడుగ అనుకు ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పినావు కదమ్మా షిస్ట అని కొడతా వాట్ ఇస్ షిష్టు అని కొడితే ఈ షిష్టు కి సంబంధించి 130 వస్తాయి అమ్మ నాకు కావాల్సింది కాకుండా అవసరం లేని ఈ చాన వస్తాయి. సో అది ఎత్తుకున్నడు కూడా కష్టమేనమ్మా వస్తదగలో అట్లా వెతకరు సపోజ్ మనకి సిస్ట్ అనుకోండి సిస్ట్ ఏ బాడీలో ఎక్కడ వచ్చింది సిస్ట్ మీరు ఎట్లా స్కాన్ చేస్తే పోనీ గర్భ సంచిలో సిస్ట్ ఉందనుకోండి సో గైనకాలజిస్ట్ ని వెతకాలి సిస్ట్ అని వెతకరు అందులో వెతికేటప్పుడు కూడా కరెక్ట్ గా వెతకాలి అప్పుడేగగు ఆన్సర్ ఇయగలుగుతుంది మనం ఏది పడితే అది
(40:35) రాండమ గా రాసేస్తే అవ్వదు. సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా కూర చేసుకోవాలని ఉందనుకో నాకు పలానా కూర వేపుడు కావాలి లేకపోతే పలానా కూర కర్రీ కావాలి అట్లా ఏదో ఒకటి మనం స్పెసిఫిక్ గా అడిగితే అది మంచిగా రెసిపీ ఇస్తుంది. మనం ఏదో రాండమ గా పొట్లకాయి అట్ల ఏదో అన్నామంటే అది కూడా ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ ఇస్తుంది. వెతుకో అందుకని మంచిగా ఎప్పుడు మెడికల్ ఫీల్డ్ లో వచ్చేటప్పుడు మనకు మనం డెసిషన్ తీసుకోకుండా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది.
(41:02) ఈ సుంటి ఏమన్నా చేయించుకోవాలి కాస్మెటిక్ సర్జరీలు ఏమన్నా చేయించుకోవాలి అంటే చానపీరం ఉంటది అంటారు కదమ్మ ఇప్పుడు సినిమాలో అంటే చేపించుకుంటారు వాళ్ళకంటే పైసలు ఎక్కువ ఉంటే చేయించుకుంటారు. ఇప్పుడు మామూలోళ్ళు సగటు సాధారణమైన జీవితము ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుకొని బతక వెళ్ళిపోతాము రేషన్ కార్డు పట్టుకొని బియ్యం కి వెళ్ళిపోతాము మా సుట్టి పేదోలకి ఇసుటి సర్జరీ ఏమనా చేపించుకోవాల్సిన అవసరం వచ్చింది.
(41:24) రావద్దు దేవుని దయ వల్ల రావద్దు కానీ అవసరం అయ్యింది. ఇప్పుడు ఏదైనా పెద్ద ప్రాబ్లం అయింది ఏమనా యక్సిడెంట్ అయింది ఏదైనా జరిగింది ఏదైనా ప్రాబ్లం అయింది సచ్చినట్టు చేపించుకోవాల్సి వస్తుంది అంటే మేము భరించగలుగుతామా ఫీజులు అసలు ఫస్ట్ అఫ్ ఆల్ ప్లాస్టిక్ సర్జరీ మీరు అన్నట్టు ట్రౌమా ఏదైనా యక్సిడెంట్ అయ్యి దాని వల్ల అవ్వటమ అవన్నీ ఇన్సూరెన్స్ కింద కవర్డ్ ఎందుకంటే దో అది ప్లాస్టిక్ సర్జరీ అయినా కానీ అది యక్సిడెంట్ వల్ల అయింది కదా సో యక్సిడెంట్ వల్ల అయిపోని ఇంకోదేనో వల్ల అయితే దానికన్నిటికి దానికి దానికి ప్లాస్టిక్ సర్జరీ కింద కావా అవన్నీ
(41:59) దానికి ప్రాపర్ పేర్లు ఉంటాయి అవన్నీ ఇన్సూరెన్స్ కింద కవర్డ్ అయి ఉంటాయి. కొంచెం వరకు ప్లాస్టిక్ సర్జరీ కింద వస్తే అవేమ అంత మరీ ఎక్స్పెన్సివ్ ఉండవు. ఇంకా అది కూడా చాలా మంది ఎక్కువ చేంజ్ చేసుకుంటా ఉంటారు ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చాలా చేంజ్ చేసుకుంటా అది ఒక ఎడిక్షన్ లాగా కూడా అయిపోతుంది అప్పుడప్పుడు ఎంతని కరెక్ట్ ఎక్కడ ఆగాలో తెలియక ఎడిక్షన్ లాగా కూడా అయిపోతుంది.
(42:21) సో అట్లా మల్టిపుల్ వి చేసుకుంటే అవుతుందేమో కానీ ఒక్క సర్జరీకి ఎందుకు అట్లా అవుతుంది ఏమీ కాదు. భరించగలుగుతారు అంతే నార్మల్ ఎనీ సర్జరీ లాగానే ఉంటుంది. ఆ అమ్మ ఏ వయసోళ్ళు ఇసుటి సర్జరీ చేసుకోనికే అర్హులతారు. ఇట్లా రాండమ గా మొత్తం మనం చెప్పలేము సపోజ్ దేనికి వస్తున్నారు వాళ్ళు ఏమన్నా బ్రెస్ట్ సర్జరీ కి వస్తున్నారా పోనీ ఏమన్నా ఇప్పుడు వెజైనా నా వెజైనో ప్లాస్టిక్ వచ్చే వాళ్ళందరూ పెళ్లయ్యి పిల్లలు ఉండి అది కూడా నార్మల్ డెలివరీలు అయ్యి వాళ్ళకి వెజైనా లూస్ అయి వస్తారు సో ఆబవియస్లీ అందరూ ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ వాళ్ళే వస్తారు నా దగ్గరికి నోస్ సర్జరీ
(42:55) అంటే ఎవరన్నా రావచ్చు ఫస్ట్ జనరల్ గా నోస్ సర్జరీ ఎవరు చేయించుకుంటారు అంటే వాళ్ళకి లోపల వేరే ప్రాబ్లం కూడా ఉంటుంది బ్రీదింగ్ ఇష్యూస్ ఉంటాయి ఆబవియస్ గా నో షేప్ అటు ఇటు ఉందంటే బ్రీదింగ్ ఇష్యూ డెఫినెట్ గా ఉంటుంది వాళ్ళకి సో కరెక్షన్ సర్జరీతో పాటు వేరేది ఏమనా చేయించుకుంటే చిన్న రైనోప్లాస్ట్ లాగా చేయించుకుంటారు కానీ ఫస్ట్ వాళ్ళక కరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి చాలా మటుకు సో అట్లా ఏ పార్ట్ కి సంబంధించినవి వేరే వేరే టైముల్లో విడివిడిగా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి.
(43:23) అమ్మ ఈనాడు మా పూరూల కుమడ అంత నల్లగా ఇటు చూడు నల్లగా ఇటు చూడు నల్లగా నేను అనుకుంటాను ఇట్లా పూస్త వెళ్తే వాళ్ళు వేసుకుంటాం మనం గొలుసులు వేసుకుంటాము ఇవన్నీ వేసుకున్నట్ల నల్లగా అయితుంది బంగారం వేసుకున్న కూడా నల్లగానే అయితుంది అమ్మ ఈ నడుమ ఈ పూర ఇప్పుడు నేను అనుకో నేను గొలుసు వేసుకున్నా నాకు మెడ నల్లగా అయింది అంటే ఓకే పుసలతాడు ఉన్నది నలపూసలు ఉన్నాయి అప్పుడప్పుడు అవి వేసుకుంటా గుండ్లు వేసుకుంటా దారాలు వేసుకుంటా వచ్చింది అనుకోవచ్చు చిన్నపూర్లకి ఎందుకమ్మా మెడ నల్లగా అవుతున్నది ఆ ఈ మెడ నల్లగా అవ్వటాన్ని దీనికి కూడా కాస్మెటిక్ సర్జరిత నాకు అనుమానం
(43:57) దేనికైనా చేయొచ్చు కానీ మనం ప్రతిదానికి ఫస్ట్ ఎందుకు వచ్చిందో ఐడెంటిఫై చేయాలి ఎందుకు వచ్చిందో తెలిసి ఫస్ట్ దానికి కదా ట్రీట్మెంట్ చేసుకోవాలి దాని తర్వాత కూడా ఇంకా ఉంటే అప్పుడు దానికి ఏమన్నా లేజర్ గాని అట్లా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ అది దాన్ని ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం దానికి ఒక పేరు ఉంది. ఏం పేరు అమ్మా [నవ్వు] [ఆశ్చర్యం] అది ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం.
(44:20) సో అది పిసిఓఎస్ లో వస్తుంది చిన్న అమ్మాయిల్లోనే వచ్చేస్తుంది అంటాం కదా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయినప్పుడు అలా పిగ్మెంటేషన్ అండ్ స్కిన్ కూడా కొంచెం వెల్వెటీ టెక్స్చర్ వస్తుంది పల్సగా ఉండదు స్కిన్ అక్కడ స్కిన్ కూడా కొంచెం థిక్ గా ఉంటుంది. అదే కాక మనం ఇట్లా చిన్న చిన్న స్కిన్ వాట్స్ వచ్చినట్టు కూడా వస్తాయి.
(44:41) చిలిచి పులుపుతులు అవును అవి కూడా చంకల్లోన ఎక్కడనా స్కిన్ ఫోల్డ్స్ లో వస్తాయి మెడలోనూ రావచ్చు చంకల్లో రావచ్చు స్కిన్ ఫోల్డ్స్ అవన్నీ వచ్చినయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు లెక్క ఇన్సులిన్ వాళ్ళ ఎక్సర్సైజులు చేసి కొంచెం షుగర్లు తగ్గించి ఇవన్నీ చేసి మళ్ళీ కొంచెం ఫిట్ గా అయితే ఇవి తీసేయొచ్చు అవేముందో చిన్న క్వాట్రీ చేసి ఆ పులిపిన్లు తీసేయొచ్చు మళ్ళీ వచ్చేస్తాయి గా కానీ మళ్ళీ రాకుండా మనం లైఫ్ స్టైల్ మాోడిఫికేషన్ చేసుకోవచ్చు కానీ చిన్నప్పుడు ఏమవుతుంది మదర్స్ కాదు ఇది నిజంగానే నేను చైన్ వేసా అందుకు వచ్చింద అని సున్ని పిండి వేసి రుద్దటం
(45:12) ఇవన్నీ చేస్తారు కానీ దోముడు దోమినా గాని పూరలకు తెలిసింది అలాగ అయితేనే పోతనే లేదు అదే ఎంత రుద్దు నువ్వు సున్నిపిండి వేసి రుద్దు ఈ నడుమ సోడా ఉంటది కదమ్మా తినే సోడా తినే సోడాలు అదేసి ఇది వేసి అల్లం వేసి బెల్లం వేసి అంతా కలిపి వేసి రుద్దు బాసన్లు తోమినట్టు దోమిన పూరల మెడలు నలగనే ఉంటున్నాయి కానీ తెలివైతది.
(45:31) అవును అదేంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అది అలా వదిలేస్తే పెరుగుతా ఉంటుంది అదే కాక వేరే చోట్ల ఇప్పుడు ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ ఇవన్నీ పిసిఓఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి వస్తుంది అది సో అది వచ్చినప్పుడే అనుకోవాలి లోపల వేరేది ఉంది సో మనం కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికన్నా గైనకాలజిస్ట్ దగ్గరికన్నా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ దేనికన్నా గాని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయకపోతే ఏ పని చేయదు.
(45:57) ఏది వేసినా గాని షుగర్స్ తగ్గియండి అంటున్నది మేడం మేడం షుగర్ తినకపోతే అన్నం తినంగానే ఇంత ఏం లేకపోతే బెల్లమన నోట్లు వేసుకుంటా నేను ఫస్ట్ నేనే నాకు షుగర్ ఏం లేదు కానీ అన్నం తినంగానే నాకు స్వీట్ తినాలి ఏదో ఒకటి నేను ఏం చెప్పాలంటే గిరి నడుములుతున్నట్టే నములుతా కానీ మనం ఇంట్లో చేసినవి చక్కగా చేసుకుని తిన్నవి అవన్నీ పర్వాలేదు బయట నుంచి బాగా మైదా ఉన్నది రిఫైన్డ్ షుగర్స్ ఉన్నవి హై ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటాం బాగా ఫ్యాట్ చేస్తారు బేకరీ స్టఫ్ ఇట్లాంటివి ఎక్కువ తింటే ఇవన్నీ మళ్ళీ ఆపలేము మనం కానీ ఇంట్లో కొంచెం పాయసం చేసుకొని పుట్టిన
(46:35) రోజుక తిన్నానా తర్వాత ఇంకేదో మనం ఏదనా పండగక వస్తే కొన్ని ఆబవియస్లీ పలహారాలు చేసుకుంటాము అవన్నీ పర్వాలేదు అంత అంత మరీ టిప్ టాప్ గా ఉండన అవసరం లేదు కానీ ఇక ప్రతిరోజు కొంచెం యక్టివిటీ చేసి ఒక స్పోర్ట్ చేసి కుస్తి తిని టైం కి తిన్నామా లేకపోతే టైం కాకుండా ఇష్టం వచ్చినట్టు కదిపేస్తే మళ్ళీ బాగుండదు ఆమెను రోజుకని ఎంతసేపు వర్కవుట్ చేస్తావఅమ్మ ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదా అందుకనే స్విమ్మింగ్ చేస్తున్నాం.
(47:03) నా మా పాపతో పాటు నేను కూడా వెళ్తున్నాను. బట్ లేకపోతే నాకు యోగా అంటే చాలా ఇష్టం. సో యోగా దాంతో పాటు బ్రీదింగ్ ఎక్సర్సైజులు ఒక గంట రోజు కాప ఎవ్రీ ప్రతిరోజు వారంలో చేయకపోయినా నాలుగైదు రోజులన్నా చేస్తాను వారంలో. ఆ అమ్మ స్విమ్మింగ్ చేస్తున్నదా అంట ఒక గంట కచ్చితంగా వర్కవుట్ చేస్తదంట యోగ చేస్తదంట అందుకనే ఆమె అట్లు ఉన్నది. మనం ఏం చేయం మనం ఇట్లా ఉన్నాం.
(47:25) అంతే నడుస్తే పాట అమ్మాయిగా రేపటి నుండి నేను నడుస్తా అంటే నేను నడుస్తానే ఉంటా కదా అటు తిరుగుడు ఇటు తిరుగుడు గుట్టలు ఎక్కుడు పుట్టలెక్కుడు అన్నట్టుగానే ఉంటది గుడ్లక పోవుడు అటు నడుచుడు ఇటు నడుచుడు ఉంటది కదా మనక ఏమైతది పాట అనుకున్నా కానీ ఇక నువ్వు చెప్పిన సందేమో నడవాలే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనిపిస్తుంది. ఇంకొకటి షుగర్స్ తక్కువ వేయాలి అన్నావు కదా ఇ అది ఒక్కటి మాత్రం షుగర్ తిన్నా దొడ్డుగా కాకుంటే ఉండాలి అంటే ఏం చేయాలనో చెప్పు నేనేమో గుండ్ర ఉంటా ఏమ లేదు అంత చక్కగా ఉన్నారు.
(47:51) ఆ చక్కగానే ఉంటానఅమ్మ కాకపోతే దొడ్డుకుంటా అందుకని నడవాలి అంతే అంటే నడవటం ఏం లేదు మీరు ఆ కొంచెం షుగర్ అది అందరూ తింటారు అదేంటి బెల్లం అన్నాడు కొంచెం తిన్న తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ అది ఎంత బెల్లం ముక్క పెద్ద ఎట్లా తింటామ కొంచెం పెద్దగా అది సైజ్ కొంచెం తగ్గించుకుంటే చాలు పోయేస్తా మళ్ళీ ఒకసారి కలుపుకుతాం కానీ కూర్లని తీసుకొస్తే ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే నీ దగ్గర తీసుకొస్తా తప్పకుండా జర ప్లీజ్ తక్కువ పోయ్ తప్పకుండా [నవ్వు] పోయేస్తానమ్మ ఓకే ఓకే చెప్దాం ఇగో ఇది ఈ రోజు డాక్టర్ డాక్టర్ మాలవికమ్మ తోటి ముచ్చట మస్త ముచ్చట్లు తెలుసుకున్న
(48:24) నేను కూడా ఈరోజు ఆమెతోటి మాట్లాడుకుంటా ఏమో అనుకున్నా గానీ ఇచ్చరపు ముచ్చట్లన్నీ తెలుసుకున్నది. మల్లమతోటి మల్ల కలుద్దామండి ఇళ్ల బుక్కెడు తీనుండి మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు కాలం మారింది అటు ఎండకాలం పోతుంది ఇటు వానకాలం రానున్నది పొరలకు సర్దులు జ్వరాలు దగ్గులు గిసుటి అన్నీ వస్తుంటాయి పైలం జర ఉడుకు నీళ్లు దాగిపోయండి ఆ
No comments:
Post a Comment