Friday, June 12, 2026

 *పురాణేతిహాసాలలో* 
*18 విశిష్టత*
          🚩🌳🚩

*మానవ దేహం  18 గుణ విశేషాలు కలిగి వున్నది. కర్మేంద్రియాలు  జ్ఞాన ఇంద్రియాలు, అరిషడ్వర్గాలు మొదలైనవన్నిటితో కలిపి మానవదేహం నడుస్తున్నది.*

*ఈశానోపనిషత్తులో వున్న  మంత్రాలు 18.*
*ఆదిత్య హృదయంలోని  శ్లోకాలు 18.*

*వేదవ్యాసుడు వ్రాసిన పురాణాల సంఖ్య 18* -- అవి :
బ్రహ్మపురాణం,
పద్మపురాణం,
విష్ణుపురాణం
శివపురాణం, 
భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం,
అగ్ని పురాణం, భవిష్యత్ పురాణం,
బ్రహ్మ వైవర్త పురాణం,
లింగపురాణం
వరాహపురాణం, 
కంద పురాణం, 
వామనపురాణం, కూర్మపురాణం
మత్యపురాణం, గరుడ పురాణం.
బ్రహ్మాండపురాణం 
ఇవి కాకుండా 18
ఉప పురాణాలు,
18 ధర్మ శాస్త్రాలు (స్మృతులు) వున్నవి.

పంచమవేదంగా చెప్పబడే  మహాభారత కావ్యంలో 18పర్వాలు..
1.ఆదిపర్వం 
2. సభాపర్వం
3.అరణ్యపర్వం 4.విరాటపర్వం 5.ఉద్యోగ పర్వం 6.భీష్మ పర్వం
7. ద్రోణ పర్వం
8.కర్ణ పర్వం 
9.శల్య పర్వం 
10.శౌప్తిక పర్వం
11.స్త్రీ పర్వం 
12.శాంతి పర్వం 
13 .అను శాసన పర్వం 14.అశ్వమేధయాగ పర్వం 
15.ఆశ్రమవాస పర్వం 16.మౌసలపర్వం 17.మహాప్రస్ధానికా
పర్వం
18.స్వర్గారోహణ పర్వం.

మహాభారతం లో మరో ముఖ్యమైన భాగం భగవద్గీత.
కృష్ణుడు
అర్జునుని కి బోధించిన ఉపదేశ సారాంశం.
భగవద్గీత లోని అధ్యాయాలు 18.
1వ అధ్యాయము నుండి 6 దాకా కర్మయోగం.
ఒక వ్యక్తి తన బాధ్యతలను ఏవిధంగా
నిర్వర్తించాలో వివరిస్తుంది.

అధ్యాయం 7 నుండి 12 దాకా వున్న
6అధ్యాయాలు 
రెండవ భాగంగా భక్తి యోగం పేరిట పిలువబడుతున్నది. అధ్యాయం 13 నుండి 18 వరకు వున్న మూడవ భాగం జ్ఞాన యోగం అని పిలువబడుతున్నది.

ఈవిధంగా  మన భారతీయ సంస్కృతిలో 18 వ సంఖ్య ఎంతో విశిష్టతను కలిగివుంది.    *ఆధ్యాత్మిక కుటుంబం*                       

No comments:

Post a Comment