తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లల చేతుల్లో ఆధారపడటం…బలహీనత కాదు.
అది ఒక జీవితకాల ప్రేమ.
తండ్రి తన చిన్న పిల్లలకు స్నానం చేయిస్తే…
ఇద్దరూ నవ్వుతారు...ఎందుకంటే....
అది ప్రేమలో మునిగిపోయిన బాల్యం..ఇంకా
ఆ చేతుల్లో రక్షణ ఉంటుంది…ఆ నీటిలో ఆనందం ఉంటుంది…ఆ క్షణాల్లో బాధ అనే మాటే ఉండదు.
*కానీ…*అదే తండ్రికి కొడుకు స్నానం చేయించే రోజు వస్తే ఇద్దరి కళ్లలోనూ నీళ్లు నిలుస్తాయి
ఎందుకంటే…అది కేవలం శరీరాన్ని శుభ్రం చేసే క్షణం కాదు…కాలం చేసిన ప్రయాణాన్ని చూపించే క్షణం....
ఒకప్పుడు చేతి వేళ్లు పట్టుకుని నడిపించిన తండ్రి…ఈరోజు తన కొడుకు భుజం పట్టుకుని నిలబడాల్సి వస్తుంది.ఒకప్పుడు ‘నాన్న’ అని పరుగెత్తిన బిడ్డ…ఈరోజు తన తండ్రిని చిన్నపిల్లాడిలా చూసుకోవాల్సి వస్తుంది.
అక్కడ నవ్వుల స్థానంలో జ్ఞాపకాలు నిలుస్తాయి…మాటల స్థానంలో మౌనం మాట్లాడుతుంది…ఎందుకంటే..... ప్రేమ తన పరిపూర్ణ రూపాన్ని అక్కడే చూపిస్తుంది.
తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లల చేతుల్లో ఆధారపడటం…బలహీనత కాదు.
అది ఒక జీవితకాల ప్రేమ తిరిగి వారికే చేరిన క్షణం. అందుకే…చిన్నప్పుడు మన కోసం నిద్రలేని రాత్రులు గడిపిన వాళ్లను,
వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేయొద్దు.
ఎందుకంటే…జీవితంలో నిజమైన విజయాలు
డబ్బు, స్థాయి, పేరులో కాదు…
మన చేతుల్లో తల్లిదండ్రులు చివరి వరకు భద్రంగా ఉన్నారనే ప్రశాంతతలో ఉంటాయి.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment