*సాధన అంటే ఏమిటి??*
భగవదనుగ్రహము వల్లనే నీ జీవితము నడుస్తున్నది,
భగవదన్వేషణయే సాధన అనుకుంటున్నాము.
అది కాదు, అంతటా వ్యాపించి యున్న పరమాత్మను వెదకుట ఎందుకు? సాధనచేయవలసినదేమంటే నీలో ఉన్న అజ్ఞానాన్ని దూరంచేసుకోవాలి, అంతా దైవ నిర్ణయం తోనే జరుగుతున్న దన్న విశ్వాసము పెంచుకోవాలి...!
అశాశ్వతమైన దానిని వదిలి పెడితే, శాశ్వత మైనది దక్కుతుంది.
కానీ ఈనాటి మానవుని మోహం ఎట్లున్నదంటే -- అన్నిటినీ అనుభవించాలని భావిస్తున్నాడు, అది చాలా వెఱ్ఱితనము.
కొన్ని అనుభవించాలి, కొన్ని విసర్జించాలి.
తృప్తిలేక ఇంకా పోగు చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటున్నారు.
మంచి జాతి మామిడి పండ్లను నీవు డబ్బిచ్చి కొన్నావు, డబ్బు నీదే, కొన్నవాడవు నీవే ...
కానీ నా డబ్బుతో కొన్నాను కదా అని విత్తనము కూడా నాదే, అని తింటున్నావా? లేదు.
విత్తనము విసర్జించాలి, 'జూస్' నే స్వీకరించాలి, అలాగే అశాశ్వతమైన వాటిని, అతిగా కోరకూడదు.
మనస్సు లో విలువను దైవానికే ఇవ్వాలి, చేతిలో జపమాల పట్టుకొని కొడుకులు, కూతుళ్ల గురించి ధ్యానాలుచేస్తారు, అదికాదు సాధన అంటే పవిత్ర మైన చింతన చేయాలి.
" విశ్వం విష్ణు మయం" ఈజగత్తంతా భగవంతుని స్వరూపమే, ఆభావము తో నీవు పనిచేస్తే, ఆనందాన్ని అనుభవిస్తావు, అదే నిజమైన సాధన.
*_🪷శుభమస్తు🪷_*
No comments:
Post a Comment